Brahmamudi September 24th Episode: భార్య కోసం రాజ్ సాహసం.. అబార్షన్ గురించి తెలుసుకున్న కావ్య

Photo Courtesy: JioHotstar

ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తికి రాజ్ క్లాస్ పీకుతాడు. పిల్లల్ని కనలేనప్పుడు నీ భార్యకు కడుపు ఎందుకు చేశావ్? అసలు నీలాంటి వాళ్లు జైళ్లో ఉండాలని రాజ్ అతనితో గొడవ పడతాడు. ఇదంతా చూసిన కళ్యాణ్.. రాజ్‌కి నచ్చజెప్పి ఆ వ్యక్తికి సారీ చెబుతాడు. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావని రాజ్‌కి కళ్యాణ్ చీవాట్లు పెడతాడు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే వదిన కూడా దక్కదని.. కనీసం వదిననైనా బతికించు అంటాడు కళ్యాణ్.

ఆఫీస్ పనుల్ని రాజ్ పక్కనపెట్టడంతో నేను కంపెనీ బాధ్యతలు తీసుకుంటానని రాజ్‌ని అడుగుతాడు రాహుల్. దాంతో అతనికి చీవాట్లు పెట్టి పంపిస్తాడు రాజ్. భార్యను ఎలాగైనా బతికించుకోవాలని అనుకున్న రాజ్.. కావ్యకి తెలియకుండా అబార్షన్ చేయించాలని అనుకుంటాడు. హాయిగా నిద్రపోతున్న భార్య దగ్గరికి వెళ్లి ఆమె కడుపు తడుముతూ బాధపడతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 24వ తేదీ ఎపిసోడ్ 834లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial September 24th 2025 Episode 833 Here is Today s full story

భార్యకు అబార్షన్ చేయించి ప్రాణాలు కాపాడాలని ఆవేదనలో ఉన్న రాజ్‌తో కావ్య మాట్లాడుతూ.. నీ ప్రేమంత బిడ్డకు చూపించినా.. నా ప్రేమ అంతా మా ఆయన గారికే ఇస్తాను అని అంది. అయితే బాధలో ఉన్న రాజ్.. ఇంకా ప్రాణం పోసుకొని బిడ్డపై అంతగా ప్రేమను పెంచుకోవడం ఎందుకు? అని అన్నాడు. దాంతో ఏమండి.. సరదాగా నేను ఆట పట్టించాలనుకొంటే.. మీరేంటి అలా మాట్లాడుతున్నారు? మీరైనా, నేనైనా ఎదురు చూస్తున్నది ఈ బిడ్డ కోసమే కదా అని కావ్య అంటే.. ఎదురు చూడటం తప్పులేదు. కానీ నెలతప్పిన వాళ్లకు ఈ మధ్య మిస్ క్యారీ అవుతున్నారు. అందుకే చెబుతున్నా. ఆ బిడ్డమీద అటాచ్‌మెంట్ పెంచుకోవడం కరెక్ట్ కాదు అని రాజ్ అన్నాడు. దాంతో అంతా మంచి జరుగుతుంటే.. మీరు అపశకునం మాట్లాడుతున్నారు. నా బిడ్డకు ఏం కాదు. నా ప్రాణం పెట్టి అయినా సరే.. నా గర్బాన్ని నేను కాపాడుకొంటాను. లాస్ట్ టైమ్ హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు.. డాక్టర్ అంతా మంచే జరుగుతుందని అన్నారు అని కావ్య బదులిచ్చింది.

కావ్య మాటలకు ఎమోషనల్ అయిన రాజ్.. నీవు నాకు ఓ మాట ఇవ్వాలి. చాలాసార్లు నిన్ను బాధపెట్టాను. మూర్ఘంగా వ్యవహరించాను. నీకు దూరంగా వెళ్లిపోయాను అని అంటే.. సంతోషంగా ఉన్న సమయంలో మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటూ కావ్య ప్రశ్నిస్తే.. నన్ను మాట్లాడనివ్వూ.. మున్ముందు ఎలాంటి అపార్ధాలు వస్తే..నన్ను విడిచిపెట్టి వెళ్లవు కదా.. అని అంటే.. నేను ఎందుకు వెళ్లిపోతాను అని కావ్య సమాధానం చెప్పింది. నేను తప్పే చేస్తే నన్ను వదిలేసి వెళ్లవు కదా అని అంటే.. తెలిసి తెలిసి ఎందుకు తప్పు చేస్తారు అని రాజ్ మాటలకు కావ్య సరిదిద్దే ప్రయత్నం చేసింది. నీవు ఏం తప్పు చేసిన అర్ధం చేసుకొంటాను అని కావ్య అంది.. నీవు అర్ధం చేసుకొనంతగా నేను తప్పు చేస్తే.. పట్టరానంతగా కోపంవ వస్తే.. నన్ను వదిలేసి వెళ్తావా? అని రాజ్ అంటే.. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు చాలా సార్లు నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పినా.. నేను వదిలేసి వెళ్లలేదు. ఇప్పుడు నేను ఎందుకు నిన్ను వదిలేసి వెళ్తాను. ఈ రోజు విచిత్రంగా మాట్లాడుతున్నారు అని కావ్య ప్రశ్నిస్తే.. పరిస్థితులు అలా ఉన్నాయి అని రాజ్ బాధగా అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను వదిలేసి ఎలా వెళ్తాను. నాకు వేరే ప్రపంచం ఏమున్నది అని రాజ్ మాటలకు కావ్య అడ్డుపడే ప్రయత్నం చేసింది.

దాంతో థ్యాంక్యూ కళావతి.. నాకు చాలా ధైర్యం వచ్చింది అని రాజ్ అన్నాడు. ఎందుకు ఇలా అడుగుతున్నారో తెలియదు. కానీ ఇలా అడుగుతుంటే నాకు చాలా బాగుంది. ఒకప్పుడు నాకు దూరమవుతారనే భయం ఉంటేది. ఇలా అడుగుతుంటే.. ఆ ఫీల్ చాలా బాగుంది. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అర్ధమైంది అంటూ కావ్య సంతోషపడింది. దాంతో నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే.. నీ కడుపులో బిడ్డను చంపేసేంతగా అని తనలో తాను అనుకొంటుంటే.. ఏం ఆలోచిస్తున్నావు? అని ప్రశ్నించింది. దాంతో మనం చెకప్‌కు వెళ్లాలని చెప్పాడు. దాంతో ఇప్పుడు చెకప్‌కు అవసరం ఏముంది? అని కావ్య అంటే.. తండ్రిగా నాకు రెస్పాన్స్‌బిలిటి ఉంది అని రాజ్ సమాధానం చెప్పాడు. దాంతో రేపు వెళ్దాం అని కావ్య అన్నాడు.
దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్‌కు రుద్రాణికి మధ్య కంపెనీలో అధికారంపై గొడవ జరిగింది. నా కొడుకు కంపెనీ బాధ్యతలను తీసుకొంటానని చెప్పినా.. మీరు వాడికి ఇవ్వడం లేదు. నా కొడుకును చిన్న చూపు చూస్తున్నారు అని రుద్రాణి అంటే.. దానికి ఓ అర్హత ఉండాలనే విధంగా కుటుంబ సభ్యులు తమ వాదనను వినిపించారు. చివరకు కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి నాకు అర్హత లేదు. నాకు అధికారం అప్పగించాలనే విషయంలో తల్లిగా స్వార్ధం ఉండటంలో తప్పేమీ లేదు అంటూ రాహుల్ అన్నాడు. దాంతో రాహుల్ నిజమే చెప్పారనే విషయానికి వచ్చారు.

రాజ్, కావ్య బయటకు వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నారు అని తండ్రి అడిగితే.. కావ్యను చెకప్‌కు తీసుకెళ్లేందుకు వెళ్తున్నాను అని రాజ్ సమాధానం చెప్పాడు. దాంతో మొన్ననే కదా చెకప్‌లు చేయించావు అని తండ్రి బదులిచ్చాడు. బిడ్డ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే.. అంత మంచిందని మరోసారి టెస్టులు చేయించాలని అనుకొంటున్నాను అని రాజ్ చెప్పాడు. బానే జాగ్రత్త పడుతున్నావు అని అపర్ణ అంటే.. తండ్రి అంటే.. బిడ్డపైన భయం, ప్రేమ ఉండదా? తండ్రి ప్రేమ కొలమానం లేనంత అని తండ్రి అన్నాడు. అయితే హారతి తీసుకొని వచ్చిన అపర్ణ.. హారతీ తీసుకొమని అడిగితే.. కావ్య చేతులు చాపగానే.. హారతి ఆరిపోయింది. దాంతో ఏదో అపశకునం. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని రాజ్, కావ్యకు అపర్ణ చెప్పింది. దాంతో గాలికి ఆరిపోయింది. దానికి తప్పుగా అర్ధం చేసుకొంటారేంటి? అని అంది. దాంతో స్పెషలిస్టులు వస్తున్నారని అపాయింట్‌మెంట్ తీసుకొన్నాను. బిడ్డ విషయంలో రేపు ఏదైనా జరిగితే బాధపడాల్సి వస్తుంది అని రాజ్ అంటే.. నీ బిడ్డకు ఏం కాదు.. గుమ్మడి పండులాంటి కొడుకు పుడుతాడు అంటూ అపర్ణ చెప్పింది.

రాజ్, కావ్య విషయంలో జరుగుతున్న డ్రామాపై కల్యాణ్‌ను అప్పు నిలదీసింది. కావ్య అక్కకు అసలు విషయం తెలిసిందా? తను ఎందుకు అంత ఆనందంగా ఉంది. ఇంతకు అక్కకు నిజం చెప్పారా? అని ప్రశ్నిస్తే.. ఇంకా వదినకు నిజం చెప్పలేదు. తాను చెకప్ అనుకొంటున్నది. కానీ అబార్షన్ చేయిస్తారని అనుకోవడం లేదు. వదినకు అసలు విషయం తెలిస్తే.. ప్రాణాలకు సిద్దపడైనా బిడ్డను కావాలనుకొంటుంది. అందుకే చెప్పకుండా అబార్షన్ చేయించాలని అనుకొంటున్నాం కల్యాణ్ జవాబిచ్చాడు. దాంతో అప్పు షాక్ తిని.. అబద్దం చెప్పాలని ప్రయత్నిస్తే.. నిజం ఆగుతుందా? అసలు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? ఇది చిన్న పిల్లల ఆట అనుకొంటున్నారా? మీకు పిచ్చి పట్టిందా? ఒక ప్రాణానికి, ప్రేమకు సంబంధించిన విషయం. బిడ్డ ప్రాణాలు తీసి.. తాను ప్రాణాలతో ఉండాలని ఏ తల్లి కోరుకోదు. నిజం చెప్పకుండా మోసం చేస్తారా? అక్కకు నిజం తెలిస్తే.. ఆమె పరిస్థితి ఏంటో ఆలోచించారా? హాస్పిటల్ అక్కకు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత అక్క గొడవ చేస్తుంది. ఓ సమస్యను సాల్వ్ చేయమంటే.. మరో గొడవను క్రియేట్ చేశారు అని అప్పు ఆవేశంతో ఊగిపోయింది.

హాస్పిట‌ల్‌కు వెళ్లిన తర్వాత నీవు ఇక్కడ కూర్చో.. నేను డాక్టర్‌తో మాట్లాడి వస్తాను అంటే.. గర్బవతిని నేనా? నువ్వా? అని కావ్య ప్రశ్నించింది. అయితే దాంతో అదేంటి? అని రాజ్ అంటే.. ప్రెగ్నెంట్‌తో కాకుండా డాక్టర్లు భర్తతో మాట్లాడుతున్నారా? అని సెటైర్ వేసింది. నాకు చెప్పని విషయాలు ఏముంటాయని అనుమానం వ్యక్తం చేసి.. ఏదైనా ఉంటే నా ముందే మాట్లాడిలి కదా అని కావ్య సందేహం వ్యక్తం చేసింది. దాంతో పేషెంట్‌ ముందు అన్ని విషయాలు మాట్లాడరు అని రాజ్ అంటే.. నేను పేషెంట్‌ను కాదు. ప్రెగ్నెంట్‌ను అంటే.. అవును.. నీవు కాస్త ఇక్కడే ఉండు.. నేను వెళ్లి డాక్టర్‌తో మాట్లాడి వస్తాను అంటూ రాజ్ అంటే.. నేను కూడా మాట్లాడుతాను అని అంది. దాంతో ప్రతీ విషయానికి నీవు చిన్న పిల్లాలా మారాం చేస్తున్నావు అంటే.. నా కడుపులో చిన్న బిడ్డ పెరుగుతుంది కదా.. అందుకే నేను చిన్న పిల్లాలా మారిపోయాను. నాకంటే నీకే ఎక్కువ బాధ్యతగా ఫీలవుతున్నావు. వెళ్లి మాట్లాడి రండి అని కావ్య అనగానే.. ఎమోషనల్ అయి కావ్య తలపై ముద్దుపెట్టాడు. దాంతో ఆమెకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఆ తర్వాత డాక్టర్ గదిలోకి వెళ్లిన రాజ్‌చూసి.. రండి అంటూ ఆహ్వానించింది. నిన్ను మీతో చాలా రూడ్‌గా బిహేవ్ గా చేశాను అంటూ సారీ చెప్పాడు.

తదుపరి ఎపిసోడ్ ప్రోమోలో తనకు అబార్షన్ చేయిస్తున్నారనే విషయం కావ్యకు తెలిసిపోయింది. డాక్టర్‌తో రాజ్ మాట్లాడుతూ.. తనకు అబార్షన్ విషయం చెప్పవద్దు అంటే.. అలా చెప్పకుండా ఎలా చేస్తాం. అది తప్పు అంటే.. ఎలాగైనా కావ్యకు తెలియకుండా చేయాలి. కావాలంటే.. నేను మీ కాళ్లు పట్టుకొంటాను. అబార్షన్ చేయించండి అంటూ ప్రాధేయపడుతుండగా.. కావ్య అక్కడికి వచ్చి అంతా చూసేసి షాక్ గురైంది. రాజ్ కూడా ఆమెను చూసి షాక్ అయ్యాడు. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం

Photo Courtesy: JioHotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X