Brahmamudi September 25th Episode: రాజ్ మోసంతో షాక్‌లో కావ్య.. బిడ్డను తలచుకుని కంటతడి
Photo Courtesy: JioHotstar
కావ్యకు అబార్షన్ చేయించాలని అనుకున్న రాజ్.. ఆమెకు విషయం చెప్పకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని అనుకుంటాడు. నిద్రపోతున్న భార్య దగ్గరికి వెళ్లి, ఆమె కడుపును నిమురుతూ బాధపడతాడు. ఇంతలో కావ్య లేచి నాకు బిడ్డ కన్నా మీరే ఎక్కువ అని చెబుతుంది. బిడ్డకు ఏమైనా అవుతుందని భయంగా ఉందని రాజ్ అనగా.. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే బిడ్డను కాపాడుకుంటానని చెబుతుంది కావ్య. భార్య మాటలకు ఎమోషనలైన రాజ్.. నేను ఏ తప్పు చేసినా వదిలి వెళ్లొద్దని ఆమెను అడుగుతాడు.
రాహుల్‌ను సీఈవో ఛైర్‌లో కూర్చోబెట్టాలని ఇంట్లో వాళ్లతో రుద్రాణి గొడవ పడుతుంది. దాంతో రాహుల్‌కు అందుకు అర్హత లేదని అంతా అంటారు. ఉదయాన్నే కావ్యని తీసుకుని రాజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తుండగా హారతి ఆరిపోతుంది. దాంతో ఏదో అపశకునం జరగబోతోందని అపర్ణ భయపడుతుంది. కావ్యకు చెప్పకుండా అబార్షన్ చేయిస్తుండటంతో కళ్యాణ్‌పై అప్పూ కోప్పడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్లిన రాజ్ ఆమెకు క్షమాపణలు చెప్పి.. కావ్యకు తెలియకుండా అబార్షన్ చేయమని అడుగుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 25వ తేదీ ఎపిసోడ్ 835లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మీతో ఆరోజున చాలా దురుసుగా ప్రవర్తించినందుకు డాక్టర్‌కు సారీ చెబుతాడు రాజ్. నేను మిమ్మల్ని అర్ధం చేసుకున్నానని, కానీ వాస్తవాల్ని గుర్తించి మాట్లాడాలని చెబుతుంది డాక్టర్. మనసు ఒప్పుకోకపోయినా మీరు చెప్పినట్లు చేయడానికి నిర్ణయించుకున్నానని అంటాడు రాజ్. మీ వైఫ్ ఎక్కడ? అని డాక్టర్ అడగ్గా.. తనని బయట కూర్చోబెట్టానని, ఆపరేషన్‌కి అన్ని రెడీ చేశారా? అని అడుగుతాడు రాజ్. మొత్తం సిద్ధం చేశామని, కాకపోతే ఆపరేషన్ కంటే ముందు పేషెంట్‌తో మాట్లాడాలి, తనను మెంటల్‌గా ప్రీపేర్ చేయాలని చెబుతుంది డాక్టర్. దీని గురించే నేను మాట్లాడటానికి వచ్చానని అంటాడు రాజ్.
తనకు అబార్షన్ చేస్తున్నట్లుగా నేను చెప్పలేదని అంటాడు రాజ్. ఆ మాటలతో డాక్టర్ సీరియస్ అవుతుంది. ఇంకా చెప్పలేదా? నేను తనకి ప్రాబ్లమ్ మొత్తం అర్ధమయ్యేలా చెబుతానని అంటుంది డాక్టర్. ఈ విషయం కావ్యకి చెప్పొద్దని బతిమలాడతాడు రాజ్. తనకి ఆపరేషన్ చేయబోతూ, ఆ విషయం తనకే చెప్పొద్దా అని డాక్టర్ మండిపడుతుంది. తనలో ఇలాంటి ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే.. తను ఈ అబార్షన్‌కు ఒప్పుకోదని చెబుతాడు రాజ్. తన బిడ్డను చంపుకోవడానికి ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదని అంటాడు. ఒప్పుకోకపోతే మనం ఒప్పించాలని, అంతేకానీ చెప్పకుండా ఆపరేషన్ ఎలా చేస్తామని ప్రశ్నిస్తుంది డాక్టర్.
తన ప్రాణాల్ని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది కానీ, బిడ్డను చంపుకోవడానికి ఒప్పుకోదని అది తన వ్యక్తిత్వమని చెబుతాడు రాజ్. మీరు ఏం చెప్పినా సరే.. నేను మాత్రం తనకు చెప్పకుండా ఆపరేషన్ చేయనని తేల్చేస్తుంది డాక్టర్. ఇది చట్ట వ్యతిరేకమని, ఇలాంటి పరిస్ధితుల్లో తేడా వస్తే పేషెంట్ ప్రాణానికే ప్రమాదమని చెబుతుంది. రేపు ఆవిడ మాకు చెప్పకుండా నా బిడ్డను ఎందుకు చంపేశారని అడిగితే మా పరిస్ధితి ఏంటీ? అని ప్రశ్నిస్తుంది. ఆవిడ కనుక కోర్టుకు వెళితే.. నా ప్రాక్టీస్‌తో పాటు ఈ హాస్పిటల్ కూడా మూసుకోవాల్సి వస్తుందని అంత రిస్క్ చేయనని చెబుతుంది డాక్టర్.
దాంతో రాజ్ తనకు సాయం చేయాలని, మీరు అనుకుంటే చాలా ఈజీగా ఈ పనిచేస్తారని అంటాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చూసుకుంటానని, కావాలంటే ఇలాంటి హాస్పిటల్ ఇంకోకటి కట్టిస్తానని చెబుతాడు రాజ్. తనకి నిజం తెలిసేలోపు ఈ అబార్షన్ అయిపోవాలి, కావాలంటే నేను మీ కాళ్లు పట్టుకుంటానని వెళ్తుండగా కావ్య రావడంతో ఆమెను చూసి షాక్ అవుతాడు. మీరు ఇక్కడికి తీసుకొచ్చింది నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డను చంపేయడానికా? అని మండిపడుతుంది కావ్య. నాకు చెప్పకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి టెస్టుల పేరుతో నమ్మించి డాక్టర్‌తో లెక్కలు మాట్లాడుతున్నారా అని నిలదీస్తుంది.
ఇన్ని రోజులు నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుని, సడెన్‌గా మీలో ఎందుకింత మార్పు వచ్చింది? ఇలాంటి దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారని నిలదీస్తుంది కావ్య. నా బిడ్డ చేసిన పాపం ఏంటీ? అసలు ఏం ఆలోచించి ఇదంతా చేస్తున్నారు? అని కావ్య మండిపడుతుంది. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటాడు రాజ్. నువ్వు నన్ను నమ్ముతున్నావా? నన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నావా? లేదా? అని అడగటంతో నమ్ముతున్నానని చెబుతుంది కావ్య. అయితే నేను చెప్పినట్లు చేయమని అంటాడు రాజ్. నువ్వు నెల తప్పలేదని అనుకుంటావో? లేక అసలు ప్రెగ్నెంట్ అవ్వలేదని అనుకుంటావో నీ ఇష్టం.. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్లు చేయమని అంటాడు రాజ్. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది.
అసలు ఎందుకు చేయాలి? మీ మాట అసలు నేనెందుకు వినాలని నిలదీస్తుంది కావ్య. మీరు చెప్పినదానికి నేను ఒప్పుకోనని కావ్య అనగా.. ఒప్పుకోని తీరాలని అంటాడు రాజ్. నా ప్రాణమైనా వదులుకుంటాను కానీ, ఈ బిడ్డను మాత్రం చంపుకోనని తేల్చేస్తుంది కావ్య. నేను చెబితే మీరు వినలేదు కదా.. చూశారా ఏమైందోనని అంటాడు రాజ్. భర్త తీరుతో కావ్య కోపంగా హాస్పిటల్ నుంచి ఆటో ఎక్కి వెళ్లిపోతుండగా రాజ్ ఫాలో అవుతాడు. ఇంట్లో భార్యాభర్తలిద్దరూ అబార్షన్ కోసం కష్టపడుతుండటంతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు.
ఏమైందని ఇంట్లో వాళ్లంతా వాళ్లిద్దరినీ అడుగుతారు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపాలని మీ మనవడు అనుకుంటున్నాడని కావ్య చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. మాయమాటలతో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాలని చూశాడని చెబుతుంది. పుట్టబోయే బిడ్డను బాగా చూసుకుంటానని, వాడే ఈ ఇంటి వారసుడని గొప్పలు చెప్పావు కదా అని మండిపడుతుంది ఇందిర. దాంతో కోప్పడిన రాజ్.. నా బిడ్డను చంపేయడానికే ఆసుపత్రికి తీసుకెళ్లాలని తేల్చిచెబుతాడు రాజ్. ఇప్పుడిప్పుడే ఇంట్లో అంతా సవ్యంగా జరుగుతుందని అనుకుంటుంటే సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని నిలదీస్తుంది అపర్ణ.
నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావని, నిన్న నా మీద అరవడానికి కూడా కారణం ఇదేనా అని సుభాష్ మండిపడతాడు. ఏ తండ్రయినా తన బిడ్డను బాగా చూసుకోవాలని అనుకుంటాడని, కానీ ఇలా కడుపులోనే చిదిమేయాలని అనుకోడని ఫైర్ అవుతాడు సుభాష్. మీరంతా నన్ను ఏమనుకున్నా సరే, నా నిర్ణయాన్ని మార్చుకోనని తేల్చిచెబుతాడు రాజ్. అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటీ? అని అందరూ అడగ్గా.. మీకెవ్వరికీ కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదని అంటాడు రాజ్. కానీ నాకు చెప్పి తీరాలని కావ్య అడగ్గా.. కారణం చెప్పనని రాజ్ తేల్చేస్తాడు.
దీని కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇంకా ప్రాణమే పోసుకోలేదని, నువ్వు నీ నిర్ణయం మార్చుకోకపోతే మేం నీతో మాట్లాడమని చెబుతుంది అపర్ణ. కానీ రాజ్ ఎవ్వరూ చెప్పినా వినిపించుకోడు.. నువ్వే నీ నిర్ణయం తీసుకుంటావో? లేక ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి వస్తావో నీ ఇష్టం, కానీ రేపటి లోగా నువ్వు అబార్షన్ చేయించుకోవాలని కావ్యకి డెడ్‌లైన్ పెడతాడు రాజ్. బట్టలు సర్దుకుంటూ కనిపించిన రుద్రాణి దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతాడు రాహుల్. నేను ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోతానని చెబుతుంది రుద్రాణి. రోజు రోజుకు ఆ రాజ్‌గాడు ఇచ్చే ట్విస్ట్‌లకి బుర్ర అస్సలు పనిచేయడం లేదని అంటుంది. నిన్నటి వరకు ఈ ఇంటికి నిన్ను వారసుడిని ఎలా చేయాలా? కంపెనీకి ఎండీని ఎలా చేయాలా? అని ఆలోచించానని చెబుతుంది.
అలా జరగాలంటే రాజ్‌కి బిడ్డ పుట్టకూడదు. ఇక నువ్వే వారసుడివని కలలు కన్నా, వాటిని నిజం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాను, తిట్లు కూడా భరించానని చెబుతుంది రుద్రాణి. నిన్న సుభాష్ అన్నయ్య మీద సీరియస్ అయ్యాడు, ఈరోజు ఏకంగా కావ్యకి అబార్షన్ చేయించడాదనికి రెడీ అయిపోయాడు. నేను చేయాల్సిన పనులన్నీ ఆ రాజ్‌గాడు చేస్తుంటే నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఏముందని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇక నేను ఈ ఇంట్లో ఉండనని అంటుంది. అయితే వెళ్లాల్సింది మనం కాదని ఆ రాజ్, కావ్య అంటాడు రాహుల్. కావ్యని, తన కడుపులోని బిడ్డను అంతలా ప్రేమించిన రాజ్.. సడెన్‌గా ఇంతలా ద్వేషించడానికి కారణం ఏంటో మనకి తెలియదని అంటాడు. ఆ రాజ్ కారణంగా ఈ ఇంటికి అధిపతులం కావడానికి రోజూ అవకాశాలు వస్తూనే ఉన్నాయని చెబుతాడు
ఇకపై రాజ్‌ని ఇంట్లో అందరి ముందు చెడ్డవాడిగా చూపిస్తే మనం మంచివాళ్లుగా కనిపిస్తామని అంటాడు రాహుల్. ఇంత ఆస్తిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానని అంటుంది రుద్రాణి. ప్రళయం వచ్చినా సరే ఆస్తి పట్టుకునే చచ్చిపోతానని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











