Brahmamudi September 26th Episode: తల్లిదండ్రులకు నిజం చెప్పిన రాజ్.. బిడ్డ కోసం చావుకి సిద్ధమైన కావ్య
Photo Courtesy: JioHotstar
కావ్యకు తెలియకుండా అబార్షన్ చేయించమని డాక్టర్‌ను బతిమలాడతాడు రాజ్. అలా చేయడం చట్ట విరుద్ధమని, రేపు మీ భార్య కోర్టుకు వెళితే నా ప్రాక్టీస్‌తో పాటు ఈ హాస్పిటల్‌ను కూడా బ్యాన్ చేస్తారని చెబుతుంది డాక్టర్. ఏ ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటానని, కావాలంటే మరో ఆసుపత్రి కట్టిస్తానని చెప్పినా వినిపించుకోదు. కావ్యకి అసలు విషయం చెబితే తను అబార్షన్‌కు ఒప్పుకోదని ప్రాణాలు ఇచ్చి అయినా సరే బిడ్డను కాపాడుకోవాలని చూస్తుందని చెబుతాడు రాజ్. కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటానని రాజ్ వెళ్లబోతుండగా కావ్య ఇదంతా చూసి షాక్ అవుతుంది.
నా బిడ్డ ప్రాణాలు తీయడానికి నేను ఒప్పుకోనని ఆసుపత్రి నుంచి కోపంగా ఇంటికి వచ్చేస్తుంది. కావ్య- రాజ్‌లు గొడవ పడటంతో ఏం జరిగిందోనని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వస్తారు. మీ అబ్బాయి నా కడుపులోని బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నాడని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. భర్తగా నా నిర్ణయాన్ని నువ్వు గౌరవించేట్లయితే రేపటికల్లా నువ్వు అబార్షన్ చేయించుకోవాలని తేల్చిచెబుతాడు రాజ్. రాజ్‌ను చెడ్డవాడిగా చూపించి ఆస్తి కొట్టేయాలని అనుకుంటారు రాహుల్- రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 26వ తేదీ ఎపిసోడ్ 836లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఒంటరిగా బాధపడుతున్న రాజ్ దగ్గరికి వచ్చిన కళ్యాణ్.. కుటుంబం దృష్టిలో చెడ్డ కావొద్దని ఆ రోజే వదినకి నిజం చెప్పమని అన్నానని అంటాడు. నువ్వు నా మాట వినకపోవడం వల్ల పెద్ద గొడవ కావడంతో పాటు వదిన దృష్టిలో నువ్వు మోసగాడివి అయిపోయావని చెబుతాడు కళ్యాణ్. అందరూ నిన్ను అలా నిందిస్తుంటే మాకు నిజం తెలిసినా ఏం చేయలేకపోతున్నామని బాధగా ఉందని అంటాడు. ఇప్పటికైనా వదినకు నిజం చెప్పమని చెబుతాడు కళ్యాణ్. నిజం చెప్పి మీ వదినని దూరం చేసుకోలేనని రాజ్ తేల్చిచెబుతాడు. కనీసం ఇంట్లో అమ్మనాన్నలకి అయినా చెప్పమని అంటాడు కళ్యాణ్. పెద్దమ్మ నిన్ను అర్ధం చేసుకుని నీకు తోడుగా నిలుస్తుందని సలహా ఇస్తాడు.
కావ్యకి అబార్షన్ చేయించాలని అనుకున్న రాజ్ నిర్ణయాన్ని తలచుకుని బాధపడతారు అపర్ణ - సుభాష్. అన్ని విషయాల్లోనూ ఎంతో మెచ్యూర్డ్‌గా ఉండే రాజ్.. ఈ విషయంలో ఎందుకంత ఫూలీష్‌గా ఆలోచించాడో అర్ధం కావడం లేదని అంటాడు. వాడికి గతం గుర్తొచ్చినప్పుడే ఏదో జరిగిందని, లేదంటే నా కొడుకు ఇలా బిహేవ్ చేయడని అంటుంది అపర్ణ. వాడు మాట్లాడే విధానం చూస్తే అసలు వాడు మన రాజేనా అన్న డౌట్ వస్తుందని చెబుతుంది. మనతో ఒక్క మాటైనా చెప్పకుండా కావ్యకి అబార్షన్ చేయించడానికి తీసుకెళ్లడం ఏంటీ? అని అపర్ణ అడుగుతుంది. వాడు ఇంకా మనకి చెప్పలేదని అంటున్నావ్? కానీ కావ్యకి చెప్పలేదు కదా అని అంటాడు సుభాష్.
మనకే ఇలా ఉంటే హాస్పిటల్‌లో చెకప్ కోసం వెళ్లిన కావ్య పరిస్ధితి ఎలా ఉంటుందో ఆలోచించు.. నిన్నటి వరకు బిడ్డే ప్రాణమని అనుకున్న రాజ్, ఈ రోజు ఆ బిడ్డ ప్రాణాలే తీయడానికి తీసుకెళ్లడంటే కావ్య పరిస్ధితి ఏంటీ అని సుభాష్ బాధపడతాడు. అసలు రాజ్ బ్రెయిన్ పనిచేయడం లేదని, వాడి సంగతి తేల్చి వస్తానని అపర్ణ బయల్దేరుతుండగా రాజ్ ఎదురొస్తాడు. అసలు ఏమైంది రా నీకు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్? పిచ్చేమైనా పట్టిందా? అని అపర్ణ మండిపడుతుంది. నాకు ఏ పిచ్చి పట్టలేదు, నేను బాగానే ఉన్నానని అంటాడు రాజ్. మరి నీ బిడ్డను ఎందుకు చంపాలని చూశావ్? అని రాజ్ కాలర్ పట్టుకుంటుంది.
ఆ బిడ్డను తీయించకపోతే కళావతి చచ్చిపోతుందని రాజ్ చెప్పడంతో అపర్ణ, సుభాష్‌లు షాక్ అవుతారు. దాంతో రాజ్ జరిగినదంతా తల్లిదండ్రులకు చెబుతాడు. బిడ్డను కంటే చనిపోతుందని కావ్యకి చెబితే తను ఒప్పుకోదని, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నాకు బిడ్డే కావాలని అంటుందని అందుకే ఆ నిజం కళావతికి చెప్పలేక, నా బిడ్డను చంపుకోలేక ఇన్నిరోజులు నాలో నేను నరకం అనుభవించానని, తనని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశానని అంటాడు రాజ్. మనం బాగా ఇష్టపడింది జీవితంలో దక్కదని అంటారని అది నిజమేనని చెబుతాడు రాజ్. నాకు బిడ్డ పుట్టాలని ఎంతో ఆశపడ్డానని, కానీ ఆ దేవుడు నా ఆశలు ఆవిరి చేశాడని బాధపడతాడు.
బిడ్డ కోసం చూస్తే తల్లి చనిపోతుంది.. తల్లి కోసం చూస్తే బిడ్డ చనిపోతుందని, అందుకే కళావతిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నానని .. ఆ బిడ్డను తీయించడానికి తీసుకెళ్లానని అంటాడు రాజ్. నేను చేసింది తప్పా? నా స్థానంలో మీరే ఉంటే ఏం చేస్తారో చెప్పమని అడుగుతాడు. దాంతో కొడుకుని హత్తుకుని బాధపడుతుంది అపర్ణ. ఇన్నాళ్లూ ఈ నిజం ఎలా దాచావ్? కనీసం మాకైనా ఈ నిజం చెప్పుంటే కావ్యని మేం ఒప్పించే వాళ్లమని అంటుంది అపర్ణ. తను ఒప్పుకోదని తేల్చి చెబుతాడు రాజ్. అడిగి చూస్తేనే కదా తెలిసేదని సుభాష్ అంటాడు. ప్రాణం పోసే తల్లికి, ఒక ప్రాణం తీయడం అంటే కష్టమేనని ఆ పనికి ఒప్పుకోదని .. బిడ్డ కోసం కాకపోయినా, తన భర్త కోసం ఒప్పుకునే ఛాన్స్ ఉందని అంటుంది అపర్ణ.
కావ్యకి నిజం చెబుదామని అపర్ణ వెళ్తుండగా రాజ్ అడ్డుకుంటాడు. కావ్యకి నిజం తెలియాల్సిందేనని, ఎంత కష్టమైనా దానిని ఒప్పిద్దామని చెబుతుంది అపర్ణ. రాజ్ చేసిన పనినే తలచుకుని కావ్య బాధపడుతుంది. నన్ను అంతలా మోసం చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లి అబార్షన్ చేయించాలని ప్లాన్ చేశారని ఇందిరతో అంటుంది. నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను అని నిలదీస్తుంది కావ్య. వాడు ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా మేం చూసుకుంటామని చెబుతుంది ఇందిర. ఇంతలో అపర్ణ వచ్చి కావ్యకి నిజం చెప్పబోతుండగా రాజ్ ఆపుతాడు.
మీ అబ్బాయి మాటలకు కరిగిపోయి నన్ను ఒప్పించడానికి వచ్చారా? అని కావ్య నిలదీస్తుంది. వాడి నిర్ణయం సరైనదేనని అపర్ణ అంటుంది. ఆ మాటలతో ఇంట్లో వాళ్లు అపర్ణ- సుభాష్‌లపై మండిపడతారు. ఇప్పుడు నాకు బిడ్డ పుడితే ఎవరికి ఏ కష్టం వచ్చింది? ఎవరి ప్రాణాలు పోతాయని ఇలా మాట్లాడుతున్నారు? అని కావ్య నిలదీస్తుంది. దాంతో మండిపడ్డ అపర్ణ.. నీ ప్రాణాలే పోతాయని అంటుంది. అపర్ణ మాటలతో కావ్యతో పాటు ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వు ప్రాణం పోస్తే.. నీ ప్రాణాలే పోతాయని చెబుతుంది అపర్ణ.
ఉదయం నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడే వాడిని చంపేయాలి అన్నంత కోపం వచ్చిందని, కానీ నిజం తెలిశాక నీ కోసం వాడంత పెద్ద నిర్ణయం తీసుకోవడమే కరెక్ట్ అనిపిస్తోందని అంటుంది అపర్ణ. ఆ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెబుతుంది ఇందిర. నాకు తెలిసిన డాక్టర్లను దీని గురించి అడిగానని, కానీ ఏ అవకాశం లేకపోవడం వల్లే నా బిడ్డను చంపుకోవాలని అనుకున్నానని అంటాడు రాజ్. ఆ మాటలతో షాకైనా కావ్య.. నా బిడ్డ నా ప్రాణాలే ఎందుకు తీస్తుంది, నా బిడ్డ గురించి నేను ఎన్నో కలలు కన్నానని, ఈ ఇంటికి వారసుడిని ఇవ్వాలని అనుకున్నానని చెబుతుంది కావ్య.
మీరు మనసులో ఇంకేదో దాచుకున్నారని, ఇదంతా అబద్ధమని రాజ్ కాలర్ పట్టుకుని నిలదీస్తుంది కావ్య. మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారని, నా బిడ్డ నాకు దక్కకూడదని ఇదంతా చేస్తున్నారు కదా అని మండిపడుతుంది. ఇదంతా విన్న రాజ్.. ఆ బిడ్డకు ప్రాణం పోస్తే నువ్వు చచ్చిపోతావని తేల్చిచెబుతాడు. ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత నీకు పిల్లలు పుట్టరని, నాకు వారసుడే ఉండడని తెలిసిన తర్వాత నాకు నువ్వే కావాలని ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతాడు రాజ్. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదని తేల్చేస్తాడు. కానీ నాకు మాత్రం నా బిడ్డే కావాలని, నా ప్రాణాలు పోతున్నాసరే... నేను ఈ బిడ్డకు జన్మనిస్తానని తేల్చిచెబుతుంది కావ్య. నవమోసాలు మోసైనా సరే నా బిడ్డకు ప్రాణం పోస్తానని ఎవరు అడ్డొచ్చినా ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది కావ్య.
ఇంకా ఊపిరి పోసుకుని బిడ్డ కోసం నీ ప్రాణాలు తీసుకుంటావా? అని మండిపడుతుంది అపర్ణ. నా ప్రాణమే వాడి ప్రాణం అయినప్పుడు, నాది వదలుకోవడంలో తప్పులేదని అంటుంది. కానీ నిన్ను చంపుకోవడం మాకు ఇష్టం లేదని దుగ్గిరాల ఫ్యామిలీ చెబుతుంది. అసలు వారసుడే వద్దని నా మనవడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడని వాడి కోసమైనా నీ నిర్ణయం మార్చుకోమని చెబుతారు. ఎవరు ఎంత చెబుతున్నా వినిపించుకోని కావ్య నా వల్ల కాదని తేల్చిచెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











