Brahmamudi September 2nd Episode: చీరకట్టుకున్న రాజ్.. బయటపడ్డ ప్రకాశం అక్రమ సంబంధం
Photo Courtesy: JioHotstar
కావ్య తన కోసం చేసిన దానికి రాజ్ కుమిలిపోతాడు. నీకోసం నేను ఏం చేయను అని అడగ్గా.. జన్మలో నా చేయి వదలొద్దని అడుగుతుంది కావ్య. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు హత్తుకుని ఆనందిస్తారు. రాజ్‌కి గతం గుర్తు రావడం, కావ్యతో కలిసిపోవడంతో రుద్రాణి రగిలిపోతుంది. వీరిద్దరిని ఎలాగైనా విడదీయాలని కుట్రలు చేస్తుంది. ఇంతలో రాహుల్ వచ్చి అడుక్కునేవాడిలా గెటప్ వేస్తాడు. ఇక మనిద్దరికీ బొచ్చె కరెక్ట్ అని రాహుల్ అనగా.. ఎప్పటికీ అలా జరగనివ్వనని, నువ్వు ఈ దుగ్గిరాల వారింటికి వారసుడివని అంటుంది.
మెట్లు ఎక్కబోతున్న కావ్యని రాజ్ అడ్డుకుని తన చేతులతో మోసుకుంటూ పైకి తీసుకెళ్తాడు. అది చూసిన అప్పూ.. తనని కూడా అలాగే తీసుకెళ్లాలని అడగటంతో కళ్యాణ్ అలాగే చేస్తాడు. ఇలా ప్రతిరోజూ వాళ్లిద్దరిని మోయలేమని భావించిన కళ్యాణ్, రాజ్‌లు తమ పేరెంట్స్‌ని పైన గదిలోకి మార్చేయాలని ప్లాన్ చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 2వ తేదీ ఎపిసోడ్ 815లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తల్లిదండ్రులను పై అంతస్తులోకి షిఫ్ట్ చేస్తుండటంతో మా నిర్ణయం రైటా, రాంగా అని చెప్పమని ఇందిరని అడుగుతారు కళ్యాణ్, రాజ్. మధ్యలో మనం ఇరుక్కుపోతామని భయపడ్డ ఇందిర.. పిల్లలకే సపోర్ట్ చేస్తున్నట్లు తప్పించుకుంటుంది. మీరు రూమ్స్ మార్చుకోవడం తప్పించి మరో మాట లేదని తేల్చిచెబుతాడు రాజ్. పెళ్లాల కోసం కన్నతల్లిదండ్రుల్ని కష్టపెడతారా? మీ పని చెబుతానని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. నన్ను 9 నెలలు మోసి కష్టపడ్డావ్.. నా బిడ్డ కోసం ఇంకో 9 నెలలు కష్టపడలేవా? అని ప్రశ్నిస్తాడు రాజ్. దాంతో చేసేదేం లేక అపర్ణ- సుభాష్, ప్రకాష్- ధాన్యలక్ష్మీలు వాళ్ల కొడుకుల రూమ్స్‌లోకి మారిపోతారు.
నన్ను రోజు ఎత్తుకోకుండా పర్మినెంట్ సొల్యూషన్ ఎలా ఆలోచిస్తావని అడిగావ్ కదా? చూశావా? జస్ట్ గంటలో మొత్తం మార్చేశానని కావ్యతో అంటాడు రాజ్. అవ్వా కావాలి? బువ్వా కావాలి? అంటే కుదరదని, నీ కష్టాన్ని తీర్చడానికి వాళ్లని పైకి పంపించానని అంటాడు. వాళ్లు నా కారణంగా ఇబ్బంది పడటం నేను చూడలేనని బాధపడుతుంది కావ్య. మనం జ్వరం తగ్గడానికి వేసుకునే టాబ్లెట్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అలా అని వేసుకోవడం మానేస్తామా? అని రాజ్ ప్రశ్నిస్తాడు. మంచి జరగాలంటే ఎంతో కొంత నష్టం జరగాల్సిందేనని అంటాడు రాజ్.
మంచినీరు తాగడానికి వెళ్తున్న కావ్యని అడ్డుకుని నువ్వు ఎక్కడికి వెళ్లొద్దని నువ్వు డెలవరీ అయ్యే వరకు నీకు అన్ని పనులు నేనే చేసిపెడతానని, అలా కాదని నువ్వు ఏదైనా పనిచేసినా, కాలు కిందపెట్టినా బాగోదని కావ్యకి వార్నింగ్ ఇస్తాడు రాజ్. నా కష్టాలు తీర్చినందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతుంది కావ్య, రేపు వినాయక చవితి పర్వదినం కాబట్టి నీ విగ్రహాన్ని నిలబెట్టి ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేలా చేసుకుంటానని అనుకుంటుంది. ఉదయాన్నే అపర్ణ- ధాన్యలక్ష్మీలు మాట్లాడుకుంటూ నిద్రపట్టలేదని బాధపడతారు. ఇంతలో ఇందిర వచ్చి నేను హాయిగా నిద్రపోయానని అంటుంది. టైంకి మమ్మల్ని ఇరికించేసి మీరు జారుకున్నారు కదా.. బాగా నిద్రపడుతుందని మండిపడుతుంది అపర్ణ.
నేనేం జారుకోలేదని, తప్పించుకున్నానని దానినే సమయస్పూర్తి అంటారని చెబుతుంది ఇందిర. వాడు గతం మరిచిపోయినప్పుడు చేసినదానితో పోలిస్తే ఇదెంత అని అడుగుతుంది. వీళ్ల ప్రెగ్నెన్సీలు మా ప్రాణాల మీదకి వచ్చేలా ఉన్నాయని అంటుంది అపర్ణ. ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవని, అలవాటైపోతాయని ఇందిర సెటైర్లు వేస్తుంది. మా పరిస్ధితి మీకు కామెడీగా ఉందా అని మండిపడుతుంది అపర్ణ. వారసులు కావాలి? వారసులు కావాలి? అని గోల చేసింది మీరే కదా అని అంటుంది ఇందిర.
ఉదయాన్నే కావ్య వచ్చి మీకు నా మీద ప్రేమే లేదని, మీ మాటలన్నీ ఒట్టి మాటలేనని నాకు అర్ధమైందని రాజ్‌తో అంటుంది. నీ కాలికి మట్టి అంటనివ్వను, నీ కంట్లో నలక పడనివ్వనని చెప్పారు కదా అని అంటుంది. నీ కడుపులో బిడ్డ అడుగు పెట్టే వరకు కాళ్లు కింద పెట్టొద్దని చెప్పారు, కానీ మీరేం చేశారు నాకు ఇంత వరకు కాఫీ కూడా ఇవ్వలేదని మండిపడుతుంది కావ్య. దాంతో మీ మాటను మీరే వెనక్కి తీసుకోండి, నా పనులు నేనే చేసుకుంటానని అంటుంది కావ్య. దాంతో రాజ్ మండిపడుతూ.. నువ్వు అలా చేస్తే నా పరువు ఏం కావాలని నిలదీస్తాడు. కావ్యని రెస్ట్ తీసుకోమని చెప్పినప్పటి నుంచి ఈ ఇంట్లో కాఫీ, టీలు ఇచ్చే దిక్కులేదని బాధపడుతుంది ధాన్యలక్ష్మీ.
ఇక నుంచి మన పనుల్ని మనమే చేసుకుందామని, ఈ పని మన భర్తలకి ఇస్తే ఎలా ఉంటుందని అడుగుతుంది అపర్ణ. వాళ్లు వంటింట్లోకి రారని, అది జరిగే పని కాదని బాధపడుతుంది ధాన్యం. కావ్య కోసం కాఫీ పెట్టడానికి బయటికొచ్చిన రాజ్.. తల్లిని, పిన్నిని చూసి భయపడతాడు. వాళ్లకి దొరికితే నన్ను మోసేస్తారని సైలెంట్‌గా కిచెన్‌లోకి వెళ్తాడు. ఎవరికీ దొరక్కూడదనే ఉద్దేశంతో చీర కట్టుకుంటాడు. ఇంతలో ప్రకాశం బయటి నుంచి వచ్చి నాకు కాఫీ కావాలని అడుగుతాడు. మీరే నాక్కూడా కాఫీ పెట్టి తీసుకురమ్మని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ప్రకాశం నా వల్ల కాదని చెప్పడంతో ధాన్యం, అపర్ణలు క్లాస్ పీకుతారు. ఈ దెబ్బకి వంటగదిలోకి పరుగులు తీసి అక్కడ చీరలో ఉన్న రాజ్‌ని చూసి తన గర్ల్‌ఫ్రెండ్ శైలజ అనుకుని వెనుక నుంచి వెళ్లి వాటేసుకుంటాడు.
దాంతో రాజ్ షాక్ అవుతాడు. నువ్వే కదా శైలజా.. నాకు హాయ్ చెబుతానని చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నేనే నీ దగ్గరికి వచ్చేశానని అంటాడు ప్రకాశం. నీలో ఈ కళాపోషణలు కూడా ఉన్నాయా? అని రాజ్ నవ్వుకుంటాడు. ఇంతలో వారిద్దరిని ధాన్యలక్ష్మీ చూసి షాక్ అవుతుంది. నువ్వేందుకు రా చీర కట్టుకున్నావని ధాన్యం, ప్రకాశంలు రాజ్‌ని నిలదీస్తారు. మనం ఆలోచించాల్సింది చీర గురించి కాదు.. పేరు గురించి అంటాడు రాజ్. ఆ శైలజ ఎవరని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. నువ్వు చీర కట్టుకున్న విషయాన్ని కవర్ చేయడానికి నన్ను ఇరికించొద్దని మండిపడతాడు ప్రకాశం.
రాత్రుళ్లు చాటింగ్ చేసేది దానితోనే కదా? అని ధాన్యం నిలదీయగా.. నేను అమాయకుడినని అంటాడు ప్రకాశం. మీరెంతో అమాయకులో ఇందాక వాటేసుకున్నాక చూశానని చెబుతుంది. ఎన్నాళ్ల నుంచి జరుగుతుంది ఈ బాగోతం అంటూ రగిలిపోతుంది ధాన్యలక్ష్మీ. తర్వాత కాఫీ తీసుకెళ్లి కావ్యకి ఇస్తాడు. కాఫీ ఇంత కంగారుగా, భయం భయంగా ఎందుకు తీసుకొచ్చారని కావ్య నిలదీయగా.. నీకు కాఫీ ఇచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదని అలా చేశానని అంటాడు. అంటే భార్యకి సేవలు చేయడం మీకు చిన్నతనంగా ఉంటుందా? అంటూ కావ్య కూడా క్లాస్ తీసుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











