Brahmamudi September 30th Episode: కావ్య జ్యూస్‌లో టాబ్లెట్లు కలిపిన రాజ్.. నిజం తెలుసుకున్న కళ్యాణ్

Photo Courtesy: JioHotstar

వదినకు, ఇంట్లో వాళ్లకు త్వరగా నిజం చెప్పమని రాజ్‌తో చెబుతాడు కళ్యాణ్. రాజ్ ససేమీరా అనడంతో కళ్యాణ్ మరింత ఒత్తిడి తీసుకొస్తాడు. చివరికి ఏం చేయాలో తెలియక కళ్యాణ్‌ను ఓ మెడికల్ షాపుకు తీసుకెళ్తాడు రాజ్. ఇది మా ఫ్రెండ్ షాపు అని ఇక్కడి నుంచి ఏం కావాలన్నా తీసుకోవచ్చని అంటాడు. డాక్టర్ పేరు చెప్పి అబార్షన్ ట్యాబ్లెట్స్ తీసుకురమ్మని చెబుతాడు. షాపు అతను డాక్టర్ పేరు కాదు.. నేరుగా డాక్టర్ చెబితేనే టాబ్లెబ్స్ ఇస్తానని చెప్పడంతో రాజ్‌తో ఫోన్ చేయిస్తాడు కళ్యాణ్. దాంతో భయపడ్డ షాప్ ఓనర్.. నిజంగానే డాక్టర్ గారు ఫోన్ చేశారని అనుకుని అబార్షన్ టాబ్లెట్స్ ఇస్తాడు. రాజ్‌ నుంచి నిజం రాబట్టాలని అనుకుని ప్లాన్ చేస్తుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ 839లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar

Brahmamudi Serial September 30th 2025 Episode 839 Here is Today s full story

మీ మనవడు నాకెందుకు అబార్షన్ చేయించాడో తెలుసుకోవాలంటే ఇల్లంతా పిల్లల పోస్టర్లు అంటిస్తే ఆటోమేటిక్‌గా అన్నీ బయటకు వస్తాయని ఇందిరతో చెబుతుంది కావ్య. నువ్వు ఏమైనా చేయ్.. ముందు వాడు ఎందుకలా చేస్తున్నాడో తెలుసుకోమ్మని చెబుతుంది ఇందిర. కళ్యాణ్, రాజ్‌లు వచ్చేసరికి ఇంటి నిండా బాబు, పాపల పొస్టర్లు అంటిస్తూ ఉన్న కావ్యని చూసి మరింత ఎమోషనల్ అవుతారు. ఇదంతా ఏంటీ. ఇక్కడెందుకు అంటిస్తున్నావని అడుగుతాడు రాజ్. కొంతమంది ఇచ్చిన మాటల్ని మరిచిపోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని, కనీసం వీడిని చూస్తే అయినా గుర్తొస్తుందని చిన్న ఆశ అని అంటుంది కావ్య.

కడుపుతో ఉన్నాను, కళ్లు కింద పెట్టకుండా చూసుకునే మనిషి వస్తాడని అనుకున్నానని కానీ చెప్పకుండానే హాస్పిటల్‌కు తీసుకెళ్లి అబార్షన్ చేయించేవాడు దొరికాడని నానామాటలు అంటుంది కావ్య. ఆయనే అలా ఉంటున్నారా? మీరు కూడా అలాగే ఉంటున్నారా అని కళ్యాణ్‌పై మండిపడుతుంది కావ్య. 6 నెలలు సావాసం చేస్తే వాళ్లు, వీళ్లు అవుతారు అన్నట్లు మీ అన్నయ్యతో ఈ మధ్య బాగా తిరుగుతున్నారు కదా? ఆయన బుద్ధలు వచ్చి మా చెల్లిల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారేమోనని చిన్న డౌట్ వచ్చి అడిగానని అంటుంది కావ్య. మీ అన్నయ్య గారిని ఆదర్శంగా తీసుకుని అలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెబుతుంది.

రత్తాల్ని పిలిచి నాకు జ్యూస్ ఎందుకు ఇవ్వలేదని మండిపడుతుంది కావ్య. పోస్టర్లు చూసిన రాజ్ ఎమోషనలై అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో కావ్య ఫీల్ అవుతుంది. పనిమనిషి దగ్గరికి వెళ్లిన రాజ్.. జ్యూస్ నేను తీసుకుని వెళ్లానని చెబుతాడు. ఆ మాటలతో షాకైన పనిమనిషి.. మీరు ఈపని చేశారని తెలిస్తే కావ్య అమ్మగారు నా తుక్కు రేగ్గొడతారని అంటుంది. అయినా మీకు కిచెన్‌లో ఉప్పు ఏదో, చక్కెర ఏదో తెలియదని రాజ్‌పై సెటైర్లు వేస్తుంది రత్తాలు.

పనిమనిషి పక్కకి వెళ్లగానే.. రాజ్ చేతిలోకి టాబ్లెట్ తీసుకుని బాధపడతాడు. ఏ తండ్రైనా బడ్డ పుట్టకపోతే కన్నీళ్లు పెట్టుకుంటాడు, కానీ నేను బిడ్డ పుట్టకూడదని కన్నీళ్లు పెట్టుకుంటున్నానని అనుకుంటాడు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటే కళావతిని కాపాడుకోవడం.. బిడ్డ పుట్టాలని, బిడ్డతో నాన్న అని పిలిపించుకోవాలని అనుకున్నాను. నా కూతురిని లాలించి, పాలించి, బుజ్జగించి నిద్రపుచ్చాలని అనుకున్నానని .. కానీ నీ కడుపులో ఉన్నప్పుడే నా బిడ్డని కళ్లె తెరవనంత నిద్ర పుచ్చుతానని బాధపడతాడు. నా బిడ్డను నేనే నా చేతులతో చంపాల్సి వస్తుందని అనుకోలేదు, నీకు తర్వాత నిజం తెలిస్తే నన్ను క్షమించవని నాకు తెలుసు. నన్ను ఎప్పటికీ నీ బిడ్డను చంపిన హంతకుడిలాగే చూస్తావని తెలుసు.. కానీ నువ్వు ప్రాణాలతో బయటపడితే అంతేచాలు.. వీలైతే నన్ను క్షమించమని టాబ్లెట్‌ను జ్యూస్‌లో వేయబోతుండగా కళ్యాణ్ ఆపుతాడు.

నువ్వు చేస్తున్నది చాలా తప్పని, ఇంకోసారి ఆలోచించమని అంటాడు కళ్యాణ్. నాకు వేరే ఆప్షన్ లేదని, అందుకే ఈ ఆప్షన్ ఎంచుకున్నానని చెబుతాడు రాజ్. కడుపులో ఉన్న బిడ్డని కన్నతండ్రే చంపడం చాలా పాపమని అంటాడు కళ్యాణ్. నాకిప్పుడు కావాల్సింది ఒక్కటే మీ వదిన బతకడం అని చెబుతాడు రాజ్. నువ్వు చేస్తున్న ఈ త్యాగానికి అర్ధం లేకుండా పోతుందని, వదినకు కనుక ఈ నిజం తెలిస్తే నిన్ను జన్మలో క్షమించదని హెచ్చరిస్తాడు కళ్యాణ్. తొందరపడకుండా ఇంకోసారి ఆలోచించమని చెబుతాడు. మీ వదిన బతకాలని, నీకూ ఉంటే పక్కకి తప్పుకోమని రాజ్ చెప్పడంతో కళ్యాణ్ అలా నిలబడిపోతాడు.

బెడ్‌రూంలోకి వెళ్లి కావ్యకి జ్యూస్ ఇస్తాడు. నేను అడిగింది పనిమనిషిని కదా? మీరెందుకు తీసుకొచ్చారని కావ్య అడుగుతుంది. నేను జ్యూస్ ఇవ్వకూడదా అని రాజ్ ప్రశ్నించడంతో కావ్య పోస్టర్‌ వైపు చూస్తుంది. మీ నాన్నకి నువ్వొద్దు.. నా మీద మాత్రం కేర్ తీసుకుంటాడట అంటూ పోస్టర్‌కు చెప్పుకుంటుంది. నిన్ను వద్దంటున్న మీ నాన్న తెచ్చిన ఆ జ్యూస్‌ని నేను తాగాలా వద్దా అనేది నువ్వే చెప్పమని పోస్టర్‌ను అడుగుతుంది కావ్య. ఆ కోపం మనసులోనే దాచుకుని నా కోసం జ్యూస్ తీసుకొచ్చాడు కాబట్టి నేను తాగేస్తానని అంటుంది కావ్య. జ్యూస్ తాగబోతుండగా కావ్యకి అనుమానం వచ్చి ఆగిపోతుంది. నాకెందుకో డౌట్ కొడుతుందని కావ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.

ఇన్నిరోజులు బిడ్డ కోసం నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడంతో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను, నేను ఎంతో అదృష్టవంతురాలిని అనుకున్నానని చెబుతుంది కావ్య. కానీ ఇప్పుడు మీకు బిడ్డే వద్దు అంటున్నారు కదా అంటుంది. అబార్షన్ చేయించుకోవడానికి నేను ఒప్పుకోవడం లేదని మీరు ఏమైనా కలిపారా? అని ప్రశ్నిస్తుంది కావ్య. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. బిడ్డను చంపడానికి జ్యూస్‌లో టాబ్లెట్స్ కలిపానని రాజ్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. నీకు తాగడం ఇష్టం లేకపోతే ఆ జ్యూస్ ఇచ్చేయమని అనడంతో కావ్య తాగుతానని అంటుంది. ఆ బిడ్డను మీ చేతులతోనే చంపేసేంత చెడ్డవారు కాదని కావ్య చెప్పడంతో రాజ్ ఎమోషనల్ అవుతుంది.

కావ్య జ్యూస్ తాగబోతుండగా ఆర్డర్ పార్శిల్ రావడంతో అది తీసుకెళ్లడానికి బయటికి వెళ్తుంది. కావ్య వచ్చిన తర్వాత ఆమెకు జ్యూస్ ఇస్తాడు రాజ్. అన్నయ్య ఇలా చేస్తున్నాడేంటీ? అని కళ్యాణ్ బాధపడతాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదని, వదినకి విషయం తెలిస్తే అన్నయ్యకి శాశ్వతంగా దూరమైపోతుందని దీనిని ఆపాలని పరిగెత్తుకుంటూ వెళ్తాడు కళ్యాణ్. కానీ అప్పటికే కావ్య జ్యూస్ తాగుతూ ఉండటంతో కళ్యాణ్ షాకై గట్టిగా అరుస్తాడు. ఆ వెంటనే రాజ్‌ను తీసుకుని బయటికి తీసుకొస్తాడు. వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేస్తానని ఫోన్ చేస్తుండగా రాజ్ అక్కర్లేదని, అసలు ఆ జ్యూస్‌లో టాబ్లెట్ కలపలేదని రాజ్ చెప్పడంతో కళ్యాణ్ ఊపిరి పీల్చుకుంటాడు. దాంతో అన్నయ్యని హగ్ చేసుకుంటాడు కళ్యాణ్. ఇంతలో రాజ్ కిచెన్‌లో టాబ్లెట్ కలిపిన జ్యూస్ గ్లాస్‌ని కావ్య చూస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X