Brahmamudi September 8th Episode: రేవతి ముసుగు తీసేసిన రుద్రాణి.. గుట్టురట్టయిన కావ్య, రాజ్ నాటకం

Photo Courtesy: JioHotstar

భార్య గర్బం దాల్చడంతో రాజ్ సంబరపడిపోయాడు. కావ్య దగ్గరికి వచ్చి పాలు తాగమని ఇస్తాడు. పాలు తేడాగా ఉన్నాయని కావ్య అడగ్గా.. నాకు పుట్టబోయే కూతురు ఎర్రగా, బుర్రగా పుట్టాలని మీ అమ్మ కుంకుమ పువ్వు ఇచ్చిందని చెబుతాడు. దానిని నేను ఎక్కువగా కలిపానని చెబుతాడు రాజ్. ఆడపిల్లే పుడుతుందని ఫిక్స్ అయిపోయారా? అని కావ్య అడగ్గా.. అవును అని అంటాడు రాజ్. ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఆడపిల్లలు పుట్టరని చెబుతాడు.

వినాయక చవితి కావడంతో ప్రకాశం, సుభాష్‌లు పనులన్నీ చేసి చేసి అలిసిపోతారు. ఇంకా చాలా పనులు ఉన్నాయని అపర్ణ, ధాన్యలక్ష్మీలు చెప్పడంతో అన్నదమ్ములిద్దరూ నిరుత్సాహపడిపోతారు. రోజు రోజుకు నేను పనివాడిలాగే మిగిలిపోతానని రుద్రాణితో రాహుల్ అంటాడు. దాంతో ఈ ఇంటికి నీ కూతురే వారసురాలు అవుతుంది అని కొడుకుతో అంటుంది. అప్పూ, కావ్యలకు డెలివరీ అయితే వాళ్లకు కూడా పిల్లలు పుడుతారు కదా.. అప్పుడు రాజ్ కొడుకే ఈ ఇంటికి వారసుడు అవుతాడు కదా అని రాహుల్ అంటాడు. అలా పుట్టుకుండా చేసే ఐడియా నా వద్ద ఉంది అని రుద్రాణి తన కుట్ర చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్ 820లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial September 8th 2025 Episode 820 Here is Today s full story

నీతో సావాసం చేస్తే జీవితాలు కూలిపోతాయి.. అలాంటి నీ పెంపకంలో పెరిగితే.. ఎదుటి వాడిని ముంచేవాడే అవుతారు కానీ.. నిలబెట్టే వారు అవుతారా? తల్లి అంటూ రుద్రాణిని ప్రకాశం ప్రశ్నించాడు. ఈ మాట కరెక్ట్‌గా చెప్పావురా ప్రకాశం అంటూ తల్లి కామెంట్ చేసింది. దాంతో అమ్మా నీవు కూడానా అంటూ రుద్రాణి ప్రశ్నిస్తే.. అమ్మను కాబట్టి నేను చెప్పాను అని తల్లి బదులిచ్చింది. సరే పంతులు గారు పూజకు టైమ్ అయింది. మీరు అన్నీ సిద్దం చేయండి అంటూ కావ్య అనడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఒక్క నిమిషం అంటూ కావ్యను ఆపి.. అక్క రేవతికి కాల్ చేశాడు రాజ్. దాంతో ఇంటి బయటే ఉన్నాను అంటే.. లోనికి రా అంటే.. నాకు భయం వేస్తుందని రాజ్‌కు సమాధానం చెప్పింది. దాంతో రాజ్, కావ్య మధ్య పెళ్లి గురించి వాదన జరిగింది.

రాజ్, కావ్య ఇద్దరు బయటకు వచ్చి చూస్తే.. ఎవరూ లేకపోవడంతో రేవతి ఎక్కడ అని ప్రశ్నించింది. దాంతో కావ్యను టెస్ట్ చేయడానికి చిన్నగా సరదాగా ఓ ప్లాన్ వేసింది. నీ కోపం తెచ్చుకోనంటే.. వచ్చింది రేవతి కాదు.. చిన్నప్పుడు నాతో స్కూల్‌లో చదివిన చిన్న అమ్మాయి.. ఇప్పుడు పెద్ద అమ్మాయి మన ఇంటికి వచ్చింది అని రాజ్ అనగానే. దాంతో మీ అందరికి పిచ్చి పిచ్చిగా ఉందా? యామిని చెల్లెలు వచ్చిందా? ఎక్కడా? ఎక్కడా? అంటూ కావ్య గట్టిగా అరిచింది. ఎదురుగా ఉన్న ముసుగు వేసుకొన్న మహిళను చూడకుండా ముసుగును తీసేసింది. తీరా ముసుగు తీయగానే రేవతి కనిపించగానే.. సారీ అంటూ కావ్య చెప్పింది. ఎవరైనా గుర్తు పడుతారా? అని ఈ డ్రామా ఆడాను అంటూ కావ్యతో రాజ్ అన్నాడు.

అమ్మను నమ్మించడానికి ఈ ముసుగు నాటకం ఆడుతున్నాను. వారి ఆచారం అని చెప్పి ముసుగు తీయకుండా చేద్దాం అని రాజ్ అంటే.. అమ్మకు అనుమానం వస్తే.. ముసుగు తీసేస్తుంది. అప్పుడు లేనిపోని సమస్య వస్తుంది అని రేవతి అంటే.. నీకు అమ్మకు దగ్గరగా అవ్వాలని లేదా? మళ్లీ అమ్మను కలువాలని లేదా అని రాజ్ అంటే.. సరే అని ముసుగు వేసుకొని వినాయకుడి పూజలో పాల్గొనడానికి ఇంట్లోకి వెళ్లింది.పండు ఇంట్లోకి వెళ్లి హ్యాపీ వినాయక చవితి అంటూ.. పండుగ రోజు భలేగా వచ్చావు అంటూ అందరూ అప్యాయంగా పలకరించారు. దాంతో రేవతి కంటతడి పెట్టేసింది. దాంతో వద్దు వదినా.. నీవు ఏడిస్తే.. ఇంట్లో వాళ్లు గుర్తు పడుతారు అంటూ.. ఇలాంటి సన్నివేశం చేసి ఏడుపు వచ్చింది. నా బిడ్డను నా తల్లిదండ్రులు ముద్దు పెడుతారని అనుకోలేదు అని ఆవేదన చెందింది.

ముసుగుతో వచ్చిన రేవతిని చూసి.. ఎవరు ఈవిడ అని రుద్రాణి ప్రశ్నించింది. దాంతో మీరే కనుక్కోండి అంటూ రాజ్ అంటే.. ఆమె ఏమైనా క్విజ్ ప్రోగ్రాం నుంచి వచ్చింది అంటూ అరిచింది. దాంతో ఈమె ఎవరంటే.. స్వరాజ్ వాళ్ల అమ్మ అంటూ రాజ్ తడబడ్డాడు. దాంతో అందరూ అనుమానంగా చూశారు. మీతో కలువాలని అందరూ అనుకొన్నాం. ఓసారి ఫోన్‌లో మాట్లాడాం. మీ వాడికి మా వాడి పోలికలు వచ్చాయి. స్వరాజ్ మా వాడి లక్షణాలే ఉన్నాయి అని పిన్ని చెప్పింది. అయితే ఈ ముసుగు ఏమిటి? అంటే.. వాళ్ల ఆచారం.. భర్తకు, వాళ్ల పిల్లలకు తప్పా వేరే వాళ్లకు చూపించారు అని రాజ్ వివరణ ఇస్తే.. ఇలాంటి ఆచారం ఎక్కడా చూడలేదు అని రుద్రాణి అంది.

అయితే రుద్రాణిని రాజ్ బాబాయ్ ప్రశ్నిస్తూ.. నీవు ఎన్ని దేశాలు తిరిగావు అని అంటే.. అలిగితే అరుణాచల్ ప్రదేశ్,, ఏడిస్తే.. ఏడుకొండల వాడికి తీసుకెళ్లాడు అంటూ రుద్రాణి అంటే.. మరి నీవేదో దేశాలు తిరిగి అక్కడి ఆచారాలు తెలిసిన దానిలా మాట్లాడుతున్నావు అంటూ భర్త కామెంట్ చేయగానే.. సరే అంటూ సర్ది చెప్పుకొన్నది. దాంతో ఇంతకు నీ పేరు ఏమిటి అని రుద్రాణి అంటే.. రాజ్ అని సమాధానం చెప్పాడు. ఇంతకు నీ భర్త పేరు ఏమిటి అంటే.. కృష్ణ అని రాజ్ జవాబు చెబితే.. నేను అడిగితే.. నీవు సమాధానాలు చెప్పడం ఏమిటి? అంటే.. ఎవరు చెబితే ఏమిటి.. పేరు తెలిస్తే చాలు కదా అనే విధంగా రుద్రాణి భర్త సమాధానం ఇవ్వడంతో.. ఇలానే సింక్‌లో ఉండు.. నేను మేనేజ్ చేస్తాను అని రాజ్ అన్నాడు. దాంతో మేనేజ్ ఏంటి? అంటూ రుద్రాణి అనుమానం వ్యక్తం చేస్తే.. పండగ వేడుకలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మేనేజ్ చేస్తానని రాజ్ కవరింగ్ ఇచ్చాడు. దాంతో వినాయకుడిని ప్రతిష్టించాలి.. ప్రసాదాల సంగతి చూడండి అంటూ పూజారి అనగానే.. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రేవతి ముసుగు తీయడానికి రుద్రాణి ప్రయత్నించగానే.. చచ్చిపోతావు అంటూ భర్త అనగానే.. భయపడి వెంటనే ఆ ప్రయత్నం మానుకొన్నది.

తల్లి రుద్రాణిని కొడుకు పక్కను తీసుకెళ్లి అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. స్వరాజ్ పరిచయమై ఎక్కువ రోజులు కాలేదు. ఆమె గొంతు కూడా ఎక్కడో విన్నట్టు ఉంది అని అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ విషయంలో టైమ్ చూసి ఏదో ఒకటి చేయాలి అని రుద్రాణి మరో ప్లాన్ వేసింది.తాత, అమ్మమ్మ వద్దకు రేవతిని తీసుకొచ్చారు రాజ్.. కావ్య. దాంతో ఎవరీ అమ్మాయి అని తాత అడిగితే.. నా మునిమనవడికి తల్లిగా పరిచయం చేశారు. ఎందుకు ఈ నాటకం అంటూ అమ్మమ్మ ప్రశ్నించింది. అసలు విషయం బయపడితే పరిస్థితి ఏమిటో ఊహించారా అని అంది. అది కాదు.. రేవతి కొడుకు స్వరాజ్ అని అపర్ణకు తెలిసిన రోజు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో అది కాదు అమ్మమ్మ.. అప్పుడు కూడా తల్లి అనే చెబుతాం. తిను కూడా నీ మనవరాలే కాబట్టి అంటూ కావ్య అసలు విషయం బయటపెట్టింది. దాంతో కంగారుపడిన అమ్మమ్మ.. ఏం చేశావురా.. ఒక్కసారి రేవతిని తీసుకొచ్చినందుకే అపర్ణ శివతాండవ చేసింది.. మళ్లీ ముసుగేసి తీసుకొస్తావా? ఈసారి ఏం గొడవ చేయడానికి వచ్చావా? లేదా నన్ను చంపడానికి తీసుకొచ్చావా? అమ్మమ్మ అంటే.. కలుపడానికి తీసుకొచ్చాం అని కావ్య చెప్పింది.

గతంలో నీకు మెమొరీ సరిగా లేకపోవడం వల్ల తీసుకొచ్చావని అనుకొన్నాం. ఇప్పుడేమైంది. ఇప్పుడు ముసుగేసుకొని తీసుకొస్తావా? అంటూ.. నీకు ఏమైంది.. నీ అమ్మను ఒప్పించి ఇంట్లోకి తీసుకొస్తామని అనుకొన్నాం కదా.. నీకు ఇంత తొందరెందుకు అని ప్రశ్నించింది. అయితే నేను వద్దు అని చెప్పినా.. ఇద్దరు నన్ను తీసుకొచ్చారు అని రేవతి చెప్పింది. అయితే నీ ప్లాన్ ఏమిటిరా? అంటే.. పండుగ రోజు రేవతి ఇంట్లో ఉండాలని తీసుకొచ్చాను అంటూ రాజ్ సమాధానం చెప్పారు. నేను ఎవరి మాట పడనివ్వకుండా ప్లాన్ చేశాను. అయినా వాళ్లందరూ ఇక్కడే ఉంటే.. అనాథగా అక్క ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం లేదు అని రాజ్ అంటే.. మీ అమ్మ చూస్తే.. వారిద్దరూ శాశ్వతంగా దూరమవుతారేమో అని అమ్మమ్మ చెప్పింది. దాంతో రాజ్ చూసుకొంటానని చెప్పాడుగా దాని గురించి వదిలేయ్ అంటూ రాజ్ తాతయ్య అన్నాడు. ఎన్నాళ్లు అయిందిరా.. నిన్ను చూసి.. పేరుకు తాతయ్యనైనా ఇలా దొంగచాటుగా చూడాల్సి వచ్చిందా? నీ బాగోగులు చూసే బాధ్యత లేదా? నీకు డబ్బు పంపిస్తే.. ఎందుకు తీసుకోవడం లేదు? అని తాతయ్య అంటే.. నాకు ఆ అర్హత లేదు అంటూ కామెంట్ చేసింది. నేను చేసిన తప్పు వల్ల అమ్మ, నాన్నలను బాధపెట్టాను. ఏ రోజైతే వారు మనస్పూర్తిగా ఆదరిస్తారో.. అప్పుడే నేను వాటిని స్వీకరిస్తాను. అమ్మ, నాన్న కోపాన్ని పొగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. నా కొడుకును వాళ్లు ఆదరించిన రోజే.. ఈ ఇంటికి బిడ్డను అవుతాను అని రేవతి ఆవేదన చెందింది. అలా చేసే బాధ్యత నాది అని రేవతి, కావ్య అంటే.. మాది కూడా అని ఇతర ఇంటి సభ్యులు మద్దతు పలికారు. ఈ పండగకు నీవు అమ్మకు దొరకకుండా నేను చూసుకొంటాను అని రాజ్ అన్నాడు.

బాబు ఎక్కడ ఉన్నాడు.. అని అపర్ణ అడిగితే.. మహేష్ బాబా? కల్యాణ్ బాబా? పవన్ కల్యాణ్ అయితే రాజకీయాల్లో బిజిగా ఉన్నారు అంటూ కామెడీ చేయబోయింది. అదే నా ఫ్రెండ్ స్వరాజ్ ఎక్కడ అంటే.. ఎక్కడో ఒక చోట ఇంట్లో ఉంటాడు అని సమాధానం చెప్పింది.

స్వరాజ్ సోఫాలో కూర్చొని ఉండగా.. ఇంటి సభ్యులందరూ చుట్టూ ఉండగా.. రుద్రాణి ఆవేశంగా.. ఇన్ని రోజులు వీడు ఎవడు అని బుర్ర బద్దలు కొట్టుకొన్నా తెలియలేదు. కానీ ఈ రోజు వాడే వాడి నోటితో చెప్పాడు అంది. దాంతో ఏం చెప్పాడు అంటూ రాజ్ అమ్మమ్మ అంటే.. వీడికి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? అంటే.. నా ఫ్రెండ్ అంటూ అపర్ణ సమాధానం చెప్పింది. కానీ వారసుడు. రేవతి కొడుకు అంటూ అని రుద్రాణి బాంబు పేల్చింది. దాంతో రేవతి, రాజ్, కావ్య, అపర్ణ, ఇతర ఇంటి సభ్యులందరూ షాక్ గురయ్యారు. ముసుగులో వచ్చిన రేవతిని రుద్రాణి, అపర్ణ గుర్తుపట్టిన తర్వాత ఏం జరిగింది? వినాయకచవితి వేడుకలు ఎలా జరిగాయి అనే విషయం గురించి తదుపరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Photo Courtesy: JioHotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X