Brahmamudi September 9th Episode: విషం కలిపి రుద్రాణి కుట్ర.. స్వరాజ్, కనకానికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికి..!
Photo Courtesy: JioHotstar
ముసుగుతో వచ్చిన రేవతిని చూసి.. ఎవరు ఈవిడ అని రుద్రాణి ప్రశ్నించింది. దాంతో మీరే కనుక్కోండి అంటూ రాజ్ అంటే.. ఆమె ఏమైనా క్విజ్ ప్రోగ్రాం నుంచి వచ్చింది అంటూ అరిచింది. దాంతో ఈమె ఎవరంటే.. స్వరాజ్ వాళ్ల అమ్మ అంటూ రాజ్ తడబడ్డాడు. దాంతో అందరూ అనుమానంగా చూశారు. మీతో కలువాలని అందరూ అనుకొన్నాం. ఓసారి ఫోన్‌లో మాట్లాడాం. మీ వాడికి మా వాడి పోలికలు వచ్చాయి. స్వరాజ్ మా వాడి లక్షణాలే ఉన్నాయి అని పిన్ని చెప్పింది. అయితే ఈ ముసుగు ఏమిటి? అంటే.. వాళ్ల ఆచారం.. భర్తకు, వాళ్ల పిల్లలకు తప్పా వేరే వాళ్లకు చూపించారు అని రాజ్ వివరణ ఇస్తే.. ఇలాంటి ఆచారం ఎక్కడా చూడలేదు అని రుద్రాణి అంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ 821లో ఇంకా ఏం జరిగిందంటే?

నువ్వు పండక్కి ఇంటికి వచ్చినట్టు ఎవరికీ తెలియకుండా నేను చూసుకొంటాను అని రేవతితో రాజ్ చెబుతుంటే.. ఈ విషయం రుద్రాణికి తెలిస్తే ఎలా అని ఫ్యామిలీ మెంబర్ అనుమానం వ్యక్తం చేయగా.. ఆమె ఇల్లు పీకి పందిరి వేస్తుంది అని అమ్మమ్మ అంటూ.. ఈ కంగారులో నాకు ఏవేవో అనుమానాలు వస్తున్నాయి అంది. అంతలోనే వీళ్లను వెతుక్కొంటూ వచ్చిన.. ఏం అనుమానాలు అని అడిగింది. అప్పటికే రేవతి ముఖంపై ముసుగు తీసి ఉండటంతో దానిని కవర్ చేయడానికి కావ్య, రాజ్ తంటాలు పడ్డారు. అయితే అపర్ణను లోనికి రానివ్వకుండా ఏవో పిచ్చి ప్రశ్నలు వేస్తూ అమ్మమ్మ శతవిధాల ప్రయత్నించింది. దాంతో మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అపర్ణ అడిగితే.. దొరికిపోతామని రాజ్ అమ్మమ్మ మాట జారింది. దాంతో దొరికిపోవడం ఏమిటి? అని ప్రశ్నిస్తే.. పండగ వేడుకల్లో ఏదైనా తప్పు చేసి తాతయ్యకు దొరికిపోతామో అని కంగారులో ఉన్నాం అని కావ్య కవరింగ్ ఇచ్చింది. ఏంటో అందరూ ఈ రోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అంటూ అపర్ణ డైలామాలో పడింది.
అయితే ముసుగు వేసుకొన్న రేవతిని రాధా అంటూ పిలిస్తే.. తనను కాదని పలకలేదు. దాంతో కావ్య కాలు తొక్కి మాట్లాడమని సైగ చేసింది. అయితే రాధా అని పిలిచావా? మాకు రావా అని వినిపిచింది. రాధా అని పిలవడం ఎందుకు.. ఆమెనే నిన్ను అమ్మ పిలుస్తుంది. అంటీ అని ఎందుకు.. నేను తనని అక్కగా భావిస్తున్నాను.. కాబట్టి ఆమె నిన్ను అమ్మ అంటుంది అని తల్లి అపర్ణకు రాజ్ కవరింగ్ ఇవ్వబోయాడు. ఇంతకు నా ఫ్రెండ్ స్వరాజ్ ఎక్కడున్నాడు.. అంటే.. ఇక్కడే ఎక్కడో ఉంటాడు.. నేను వెతికి పంపిస్తాను అంటూ అందరూ అక్కడిని వెళ్లిపోయారు. అపర్ణ అలా వెతుకుతుంటే.. స్వరాజ్ కనిపించాడు. ఏంటి ఇంటికి గెస్టులు వస్తే.. కేర్‌ఫుల్‌గా చూసుకోవా? అంటూ అపర్ణపై చిటికెలు వేశాడు. వెళ్లి నాకు జ్యూస్ తీసుకు రా అని ఆర్డర్ వేస్తే.. నేనేమన్నా పనిమనిషినా? నువ్వేమైనా మైసూర్ మహారాజ్‌వా? అని ప్రశ్నించింది. జ్యూస్ తేవాలంటే పనిమనిషి కావాలా? వెళ్లి జ్యూస్ తీసుకురా. ఈ ఇంటికి వారసుడినే నేను అని అన్నాడు. ఫ్రెండ్ అంటే.. వారసుడనని అనుకొంటున్నావా? అని అపర్ణ ప్రశ్నించింది. కాదు.. ఫ్రెండ్ కాదు.. ఈ ఇంటికి నేనే వారసుడిని అని దబాయించాడు. దాంతో స్వరాజ్ మాటలపై అపర్ణకు అనుమానం పెరిగింది. ఇంత కచ్చితంగా అంటున్నాడంటే.. ఏదో తిరకాసు ఉంది. వెతకపోయిన తీగ కాలికి తగిలింది. వీడు ఎవడో కనిపెట్టాల్సిందే అని అపర్ణ అనుమానంతో ఆలోచనల్లో పడింది. ఆ తర్వాత ఇంట్లోని అందరిని పిలిచింది.
పండుగ పూట ఈ అరుపులు ఏమిటి? అంటూ రాజ్ అమ్మమ్మ అరిచింది. మా అత్తకు పండుగ రోజు మూడ్ స్పాయిల్ చేయడం అలవాటే కదా అంటే.. అది కాదు.. ఓ నిప్పులాంటి నిజాన్ని తెలియజేయడానికి అందర్నీ పిలిచాను అంటూ అపర్ణ సమాధానం ఇచ్చింది. దాంతో రేవతి, కావ్య, రాజ్ కంగారు పడ్డారు. ఏంటా నిజమని ప్రశ్నిస్తే.. వీడు ఎవడా ఇన్నాళ్లు బుర్ర బద్దలు కొట్టుకొన్నాను. ఈ ఇంటికి, వీడికి ఉన్న సంబంధం ఏమిటో వీడే చెప్పాడు అంటూ స్వరాజ్‌ను అపర్ణ చూపించింది. వీడికి ఇంటికి ఉన్న సంబంధం ఏమిటి? అని కనకం ప్రశ్నిస్తే.. అపర్ణ చెప్పబోయే జవాబు అందర్ని కంగారు పెట్టింది. ఇంతకు వీడు ఎవడో తెలుసా? ఇంటికి వారసుడు అని అపర్ణ చెప్పగానే.. అందరి ముఖాల్లో ఆందోళన కనిపించింది. స్వరాజ్ మన ఇంటి వారసుడు ఏంటి? రుద్రాణి అంటే.. వాడే చెప్పాడు.. అందుకే నేను చెప్పాను. చిన్న పిల్లాడు ఏది చెబితే అది నమ్మేస్తావా? అని రాజ్ అంటే.. ఈ ఇంటి వారసుడు కావడానికి రాజ్, కావ్య, అప్పు, రాహుల్, స్వప్న పిల్లలకే అధికారం ఉంటుంది. వీరికి కాకుండా రేవతికి పుట్టే పిల్లలకు ఉంటుంది అని బాంబు పేల్చింది. దాంతో అందరి ముఖాల్లో ఓ రకమైన భయం కనిపించింది. దాంతో స్వరాజ్ రేవతి కొడుకా? అని అపర్ణ అన్నయ్య ప్రశ్నిస్తే.. అవును అన్నయ్య అంటూ రుద్రాణి సమాధానం ఇచ్చింది. దాంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. వాడి తల్లి ఇక్కడే ఉంది అని రాజ్ అమ్మమ్మ అంటే.. ముసుగులో వచ్చిన అమ్మాయి రేవతి కాదనే గ్యారెంటీ ఏమిటి? అని రుద్రాణి అనుమానం వ్యక్తం చేసింది.
రుద్రాణి మాటలకు అడ్డుపడుతూ.. రేవతి ముసుగులో రావాల్సిన ఖర్మ పట్టిందా? ఆమెను దొంగ చాటుగా తీసుకు రావడానికి మాకేం పని అంటూ కావ్య అంది. అయితే తను ఎవరో ఇప్పుడే బయటపెడుతా అంటూ రుద్రాణి అని.. రేవతి ముసుగు తీయడానికి ప్రయత్నిచింది. దాంతో అందరి ముఖంలో భయం కనిపించింది. రేవతి ముసుగు తీయబోతుండగా.. రుద్రాణి అంటూ అపర్ణ గట్టిగా అరిచింది. అయితే నువ్వు ఈ ఇంటికి వారసుడివి అని ఎవరు చెప్పారు అని అపర్ణ అడిగితే.. నీవే కదా.. గతంలో ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇల్లు నీదే అని చెప్పావుగా.. అందుకే ఈ ఇల్లు నాది అయినప్పుడు.. నేనే కదా ఈ ఇంటికి వారసుడిని అంటూ స్వరాజ్ సమాధానం ఇచ్చాడు. దాంతో అందరూ ఊపిరిపిల్చుకొన్నాడు. పండక్కి ఇంటికి వచ్చిన స్వరాజ్ తల్లిని అనుమానించి అవమానించేందుకు ప్రయత్నించావు.. సారీ చెప్పు అంటూ రుద్రాణికి అపర్ణ ఆర్డర్ వేసింది. దాంతో రుద్రాణి సారీ చెప్పింది. ఆ తర్వాత అపర్ణ ఈ ఇంటికి నీవే వారసుడివి అంటూ ప్రేమగా స్వరాజ్‌తో అంది. దాంతో ఇంటి సభ్యులందరూ హ్యాపీగా ఫీలయ్యారు.అయితే నేను వారసుడిని అని చెబుతున్నారు? కానీ ఆ ఆంటీ నాకు జ్యూస్ ఇవ్వడం లేదు అంటూ రుద్రాణిపై స్వరాజ్ కంప్లైంట్ ఇస్తే.. ప్రతీ వాడు ఈ ఇంటికి వారసుడేనా? అంటూ రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆ తర్వాత స్వరాజ్‌ను పక్కకు తీసుకెళ్లి.. నాకు నోటి దురుసు ఉంది.. దానిని మించి మాట్లాడుతున్నావు.. ఇంటి వారసుడినని తొడగొడుతున్నావు.. అని రాజ్ అంటే.. నేను తొడగొట్టలేదుగా అంటే.. అలాంటి పనులు అన్నీ చేశావు అంటూ స్వరాజ్‌ను రాజ్ పక్కకు తీసుకెళ్లి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ముసుగులో వచ్చింది రేవతి అని చెప్పేసేలా ఉన్నావే అని అనుకొంటుంటే.. కావ్య తల్లి కనకం విని.. ఇంటికి వచ్చింది రేవతా? అప్పట్లో రేవతి ఇంటికి వస్తే.. మీ అమ్మ ఎంత గొడవ చేసిందో తెలుసు కదా.. అని కనకం కంగారు పడింది. ఆ తర్వాత ఏదో నచ్చచెప్పగా.. స్వరాజ్, కనకం డార్లింగ్.. డార్లింగ్ అంటూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక ముందు జాగ్రత్తగా మాట్లాడు.. నోరు జారకు అని రాజ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఇంట్లో ఒకరు నచ్చలేదు.. ఆమె పేరు రుబ్బు రోలు.. ఏదో పేరు ఉంది అంటే.. ఆమె పేరు రుబ్బు రోలు కాదు.. రుద్రాణి అని కనకం అంటే.. నా తల్లిని చాలా వేధించింది. ఆమె పని చెబుతా అంటూ వారిద్దరూ అనుకొన్నారు.
ఇదిలా ఉండగా.. మీరు పిల్లల్ని కని ఇంటికి వారసుల్ని తెస్తారా? ఈ పౌడర్ తాగితే... ఈ కడుపులో పెరిగే వారసులు కళ్లు తెరవకుండానే పరలోకానికి వెళ్లిపోతారు అంటూ చేతిలో విషాన్ని పట్టుకొని డైలాగ్స్ కొట్టింది. సో.. ఇంటికి వారసురాలు.. నా మనవడే అవుతాడు అని రుద్రాణి ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత పూజ చేయడానికి సిద్దంగా ఉన్న పూజారిని అక్కడి నుంచి పంపించేసి.. తీర్థంలో విషం కలిపేందుకు ప్లాన్ వేసింది. అయితే మీరు త్వరగా విగ్రహాన్ని తీసుకు రండి అంటూ రుద్రాణికి పూజారి ఆర్డర్ వేయడంతో చేసేది ఏమీ లేక.. మరో ప్లాన్ వేసింది. పూజారికి ఫోన్ చేసింది. అతడు ఫోన్ ఎత్తి హలో హలో అంటే.. ఇక్కడ సిగ్నల్ రాదు అని అతడిని బయటకు పంపించి.. తీర్థంలో పౌడర్ కలిపేసింది. ఆ తర్వాత వెనక్కి చూడగా.. తన వెనుకే కనకం, స్వరాజ్ సీరియస్‌గా చూస్తూ ఉండిపోవడంతో.. పౌడర్ కలపడం వీరు చూశారా? అని మనసులో కంగారు పడిపోయింది. తర్వాత ఎపిసోడ్‌లో తీర్థం తాగుతారా? లేదా అని రుద్రాణి చూస్తుండగా.. ట్విస్ట్ ఇచ్చారు. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Photo Courtesy: JioHotstar


Click it and Unblock the Notifications










