Brahmamudi weekly roundup: కావ్య గర్భవతి అని తెలుసుకున్న రుద్రాణి.. ప్రమాదంలో అప్పూ ప్రెగ్నెన్సీ

Photo Courtesy: JioHotstar

హాస్పిటల్‌కు వెళ్లిన కావ్యను వెంటాడిన రాజ్.. ఆమె ఆంకాలజీ డాక్టర్‌ను కలవడంతో క్యాన్సర్ అని డౌట్ పడతాడు. కళావతి గారికి క్యాన్సర్ అని అందుకే నా ప్రేమను తిరస్కరించారని చెప్పడంతో ఇందిర, అపర్ణలు షాక్ అవుతారు. దాంతో కావ్య డాక్టర్‌కు ఫోన్ చేసి జరిగిందేంటో చెప్పిస్తుంది. అప్పూ తల్లి కాబోతుందని తెలిసి దుగ్గిరాల కుటుంబం సంతోషిస్తుంది. కోడలిని దగ్గరికి పిలిచి ఆమెకు తన 7 వారాల నగలు ఇస్తుంది ధాన్యలక్ష్మీ. రాజ్ ప్రేమను ఎందుకు తిరస్కరించావని కనకం అడగ్గా.. నా జీవితం నా ఇష్టమని కావ్య తేల్చి చెబుతుంది. కావ్య తల్లి కాబోతుందని అపర్ణ, ఇందిరలు చెప్పడంతో కనకం కూతురిని హత్తుకుని బాధపడుతుంది. కావ్య వేసుకునే టాబ్లెట్స్ గుట్టు తెలుసుకున్న రుద్రాణికి ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. వెంటనే ఈ విషయాన్ని యామినికి చెబుతుంది రుద్రాణి.. ఆపై ఇద్దరూ కలిసి కొత్త ప్లాన్ వేస్తారు. వరలక్ష్మీ వ్రతం చేయించి రాజ్ చేత కావ్యకి అక్షింతలు వేయించాలని ఇందిర, అపర్ణలు ప్లాన్ చేస్తారు. అప్పూ వేసుకునే టాబ్లెట్స్‌ని రుద్రాణి మార్చేస్తారు.

Brahmamudi Telugu Serial Weekly roundup August 11th to August 16th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి ఆగస్ట్ 11వ తేదీ నుంచి ఆగస్ట్ 16వ తేదీ వరకు .. 797వ ఎపిసోడ్ నుంచి 802 వరకు ఏం జరిగిందంటే?

ఆగస్ట్ 11వ తేదీ 797వ ఎపిసోడ్‌లో ..
తన ప్రెగ్నెన్సీ, కడుపులో బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు కావ్య ఆసుపత్రికి వెళ్తుండగా రాజ్ చూసి ఆమెను ఫాలో అవుతాడు. హాస్పిటల్‌లో గైనకాలజీ డాక్టర్.. ఆంకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఉండటంతో కావ్య అక్కడికి వెళ్తుంది. ఇది చూసిన రాజ్.. కావ్యకు క్యాన్సర్ అనుకుని షాక్ అవుతాడు. ఆమె బయటికి రాగానే.. నేను బాగుండాలని మీకు క్యాన్సర్ అన్న నిజాన్ని దాచి పెట్టారని అంటాడు. కావ్య తనకు క్యాన్సర్ లేదని చెబుతున్నా పట్టించుకోకుండా ఏదేదో చెబుతాడు. ఇంటి దగ్గర కావ్య కోసం అపర్ణ ఎదురుచూస్తుండగా కళావతిని ఫాలో అవుతూ రాజ్ వస్తాడు. కళావతికి క్యాన్సర్ అని, ఆ నిజం నాకు తెలిస్తే తట్టుకోలేనని మనసు చంపుకుందని చెబుతాడు రాజ్. ఆ మాటలతో ఇందిర, అపర్ణలు షాక్ అవుతారు. దీంతో ఆ డాక్టర్‌కు ఫోన్ చేసి జరిగిందేంటో చెప్పిస్తుంది కావ్య.

ఆగస్ట్ 12వ తేదీ 798వ ఎపిసోడ్‌లో ..
కావ్యకి క్యాన్సర్ లేదని తెలియడంతో రాజ్ సంతోషిస్తాడు. కానీ కావ్య ఎందుకు నా ప్రేమను తిరస్కరించిందో తెలుసుకుని తీరతానని అనుకుంటాడు. తాను తల్లి కాబోతున్నట్లు కళ్యాణ్‌కి అప్పూ చెబుతుంది. దాంతో కళ్యాణ్ ఈ విషయాన్ని దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తానికి చెప్పడంతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ సంతోషాన్ని చూసి ఓర్చుకోలేని రుద్రాణి.. ఇంటికి పెద్ద కోడలైన కావ్య మాత్రం ఇంకా ప్రెగ్నెంట్ కాలేదని నానామాటలు అంటుంది. రుద్రాణి అన్న మాటలకు కావ్య బాధపడుతుండటంతో అపర్ణ, ఇందిరలు ఓదారుస్తారు. ఒంటరిగా బాధపడుతున్న కావ్య దగ్గరికి అప్పూ వచ్చి మామిడికాయ ముక్కలు ఇస్తుంది. ఇంతలో రుద్రాణి వచ్చి .. నువ్వు గర్భవతివి కాబట్టి ఒకే, మరి కావ్య ఎందుకు తింటుందని ప్రశ్నించడంతో అక్కాచెల్లెళ్లు షాక్ అవుతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup August 11th to August 16th episode Story

Photo Courtesy: JioHotstar

ఆగస్ట్ 13వ తేదీ 799వ ఎపిసోడ్‌లో ..
కావ్య ప్రెగ్నెంట్ అని తెలియకుండా అప్పూ డ్రామా ఆడుతుంది. రుద్రాణి చేత మామిడికాయలు తినిపించి షాకిస్తుంది. అప్పూ ప్రెగ్నెంట్ అని కనకానికి ఫోన్ చేసి చెబుతుంది స్వప్న. ఉదయాన్నే అప్పూని పిలిచి తన 7 వారాల నగలు ఇచ్చేస్తుంది ధాన్యలక్ష్మీ. అది చూసి రుద్రాణి కుళ్లుకుంటుంది. నువ్వు పూర్తిగా మారిపోయావంటూ ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది. ఇంతలో కనకం వచ్చి అప్పూని హత్తుకుని రాజ్ ప్రేమను తిరస్కరించినందుకు కావ్యకి క్లాస్ పీకుతుంది. నా జీవితం నా ఇష్టమని కావ్య తేల్చిచెబుతుంది. కూతురి మాటలకు బాధపడుతున్న కనకాన్ని ఇందిర, అపర్ణలు బయటికి తీసుకెళ్లి కావ్య ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని చెబుతారు. దాంతో కావ్య దగ్గరికి వెళ్లి ఆమెను హత్తుకుని ఏడుస్తుంది కనకం.

ఆగస్ట్ 14వ తేదీ 800వ ఎపిసోడ్‌లో ..
అప్పూ ప్రెగ్నెంట్ కావడంతో కళ్యాణ్ ఆమెను కాళ్లు కింద పెట్టకుండా చూసుకుంటాడు. వారిద్దరి అనుబంధాన్ని చూసిన కావ్య ఈ సమయంలో రాజ్ తన పక్కన లేనందుకు బాధపడుతుంది. ఆమెను చూసిన ఇందిర, అపర్ణలు ఓదారుస్తారు. కావ్య ప్రెగ్నెంట్ కావడంతో కిచెన్‌లో ఏ పని చేయొద్దని కోడలికి ఆర్డర్స్ వేస్తుంది అపర్ణ. అనంతరం కావ్య ఇకపై ఇంట్లో ఏ పని చేయదని అపర్ణ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. అపర్ణ మాటలతో రుద్రాణికి అనుమానం వచ్చి ఉన్నపళంగా అలాంటి నిర్ణయం ఎందుకని అడుగుతుంది. అపర్ణ, ఇందిరల ప్రవర్తనపై అనుమానం రావడంతో అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. కావ్య వేసుకునే టాబ్లెబ్‌ని ఫోటో తీసి ఆన్‌లైన్‌లో చెక్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసుకుని షాక్ అవుతుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup August 11th to August 16th episode Story

Photo Courtesy: JioHotstar

ఆగస్ట్ 15వ తేదీ 801వ ఎపిసోడ్‌లో ..
స్వరాజ్ అన్నం తినకపోవడంతో అపర్ణకి ఫోన్ చేస్తుంది రేవతి. పిల్లాడి సాయంతో రాజ్‌ను ఇంటికి తీసుకొచ్చి కావ్య చేత వరలక్ష్మీ వ్రతం చేయించాలని ఇందిర, అపర్ణ ప్లాన్ చేస్తారు. కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుసుకున్న రుద్రాణి వెంటనే ఈ విషయాన్ని యామినికి చెబుతుంది. కావ్య నోటితోనే తాను ప్రెగ్నెంట్ అని ఒప్పుకునేలా చేసి.. రాజ్‌కు దూరం చేయాలని ప్లాన్ చేస్తారు. అటు యామిని కూడా రాజ్‌ మనసును మార్చాలని చూస్తుంది. కావ్య కిచెన్‌లో వంట చేస్తుండగా అపర్ణ, ఇందిరలు మండిపడి వ్రతం కోసం రెడీ అవ్వమని చెబుతారు. అప్పూ వంట చేస్తుండగా ధాన్యలక్ష్మీని తీసుకుని వెళ్లి ఆమెను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. కావ్యకి నాకు గొడవలు పెట్టాలని చూడొద్దని, నేను నీ బుట్టలో పడనని చెబుతుంది రుద్రాణికి షాకిస్తుంది ధాన్యలక్ష్మీ

ఆగస్ట్ 16వ తేదీ 802వ ఎపిసోడ్‌లో ..
స్వరాజ్‌ను తీసుకుని దుగ్గిరాల వారింటికి వస్తాడు రాజ్. వరలక్ష్మీ వ్రతానికి రెడీ అయిన కావ్యకి కాంప్లిమెంట్ ఇస్తాడు రాజ్. కావ్య చేత వ్రతం చేయించి రాజ్ చేత అక్షింతలు వేయించాలని అపర్ణ ప్లాన్‌ను చెడగొట్టాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. తన దగ్గర టాబ్లెట్స్ అయిపోయాయని నీ దగ్గర ఉంటే ఇవ్వమని తీసుకుంటుంది అప్పూ. అది చూసిన రుద్రాణి.. అప్పూ టాబ్లెట్స్‌ను మార్చమని కొడుకుతో చెబుతుంది. అప్పూని కళ్యాణ్ బాగా చూసుకుంటున్నాడని నాకు ఆ అదృష్టం లేదని కనకంతో కావ్య చెబుతుండగా ఆ మాటలను ధాన్యలక్ష్మీకి వినిపిస్తుంది రుద్రాణి. అప్పూకి ధాన్యలక్ష్మీ టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేస్తుంది. వ్రతం కోసం పట్టుబట్టలు కట్టుకున్న రాజ్‌ను చూసి సంతోషించి పెళ్లయిన కొత్తలో భర్తతో కలిసి వరలక్ష్మీ వ్రతం చేసుకున్న రోజును గుర్తు చేసుకుంటుంది కావ్య. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X