Brahmamudi weekly roundup: కావ్యని కాపాడిన కనకం.. తాగుబోతుగా మారిన రాజ్, యామిని కొత్త ప్లాన్
Photo Courtesy: JioHotstar
వరలక్ష్మీ వ్రతం రోజున కావ్యపై రాజ్ చేతుల మీదుగా అక్షింతలు పడేలా మాయ చేస్తుంది కనకం. రాజ్ మరోసారి తనను పెళ్లి చేసుకోమ్మని అడగ్గా.. కావ్య రిజెక్ట్ చేస్తుంది. రుద్రాణి మార్చిన టాబ్లెట్ వేసుకున్న అప్పూ కిందపడిపోవడంతో .. ఎక్స్‌పైర్ అయిన టాబ్లెట్ వల్లే ఇలా జరిగిందని డాక్టర్ చెబుతుంది. దానిని కావ్యే అప్పూకి ఇచ్చిందని రుద్రాణి చెప్పడంతో ధాన్యలక్ష్మీ నానామాటలు అంటుంది. దాంతో కావ్య ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని బయటపెడుతుంది కనకం.
కావ్యని దారిలోకి తెచ్చుకోవడానికి అమెరికా వెళ్తున్నట్లు నాటకమాడతాడు రాజ్. అతనిని ఆపడానికి దుగ్గిరాల ఫ్యామిలీ ఎంతో ప్రయత్నిస్తుంది. రుద్రాణి- యామినిలు ప్లాన్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని రాజ్‌కు తెలిసేలా చేస్తారు. కావ్య కూడా తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో రాజ్ మనసు ముక్కలవుతుంది. యామినిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని రాజ్ తేల్చి చెబుతాడు. పదే పదే కావ్య జ్ఞాపకాలు గుర్తు రావడంతో బాధ నుంచి బయటపడటానికి రాజ్‌కి మందు అలవాటు చేస్తుంది యామిని. పీకలదాకా తాగి రోడ్డుపై పడిపోయిన రాజ్‌ని చూసి కావ్య బాధపడుతుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి ఆగస్ట్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 23వ తేదీ వరకు .. 803వ ఎపిసోడ్ నుంచి 808 వరకు ఏం జరిగిందంటే?
ఆగస్ట్ 18వ తేదీ 803వ ఎపిసోడ్‌లో ..
కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని స్వరాజ్ ద్వారా బయటపెట్టాలని ప్లాన్ చేస్తుంది రుద్రాణి. వెంటనే పిల్లాడి దగ్గరికి వెళ్లి నీతో ఆడుకోవడానికి మీ ఆంటీ బుల్లి బాబుని కనబోతుందని ఆమెకు కంగ్రాట్స్ చెప్పమని అంటుంది. దాంతో పిల్లాడు వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా అని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ, రాజ్ ఉలిక్కిపడతారు. నా కూతురు ప్రెగ్నెంట్ అని నీకు ఎవరు చెప్పారని పిల్లాడిని కనకం అడగ్గా.. రుద్రాణి వైపు చూపెడతాడు. నేను అప్పూ గురించి చెబితే బాబు పొరపాటున కావ్యకి కంగ్రాట్స్ చెప్పాడని అబద్ధం చెబుతుంది రుద్రాణి. వరలక్ష్మీ వ్రతం ముగిసిన తర్వాత రాజ్ చేతుల్లో ఉన్న అక్షింతలు కావ్యపై పడేలా కనకం మాయ చేస్తుంది. తనను పెళ్లి చేసుకోమని కావ్యను మరోసారి అడుగుతాడు రాజ్.
ఆగస్ట్ 19వ తేదీ 804వ ఎపిసోడ్‌లో ..
భర్త ప్రాణాల గురించి బాధపడుతున్న కావ్య.. వెంటనే రాజ్ ప్రపోజల్‌ను మరోసారి తిరస్కరిస్తుంది. ఆ మాటలతో రాజ్ మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రుద్రాణి - రాహుల్‌లు ఇచ్చిన టాబ్లెట్ కారణంగా అప్పూ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. గడువు ముగిసిన టాబ్లెట్ వేసుకోవడం వల్లే అప్పూ పడిపోయిందని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. ఆ టాబ్లెట్‌ను కావ్యే ఇచ్చిందని రుద్రాణి చెప్పడంతో ధాన్యలక్ష్మీ నానా మాటలతో కావ్యను బాధపడుతుంది. తన కూతురిని ధాన్యలక్ష్మీ అన్ని మాటలు అనడంతో రగిలిపోయిన కనకం.. నా కూతురు ప్రెగ్నెంట్ అని చెబుతుంది. ఈ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

Photo Courtesy: JioHotstar
ఆగస్ట్ 20వ తేదీ 805వ ఎపిసోడ్‌లో ..
కావ్య ప్రెగ్నెంట్ అని తెలియక ఆమెను బాధపెట్టానని ధాన్యలక్ష్మీ బాధపడుతుంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెబుతుంది. మీ కోడలిపై చూపించే ప్రేమని తనపైనా చూపించాలని అడుగుతుంది కావ్య. పదే పదే కళావతి తన ప్రేమను ఎందుకు అంగీకరించడం లేదని భావించిన రాజ్ ఆ కారణం తెలుసుకోవడానికి కొత్త ప్లాన్ వేస్తాడు. అమెరికాకు వెళ్లిపోతున్నట్లుగా నాటకమాడతాడు. ఈ విషయం తెలుసుకున్న రుద్రాణి వెంటనే ఈ విషయాన్ని అందరికీ చెబుతుంది. కావ్య వల్ల రాజ్ ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నాడని అంటుంది. ఏదో ఒకటి చేసి వాడిని ఆపమని కావ్యని దుగ్గిరాల ఫ్యామిలీ వేడుకుంటుంది. ఏం చెప్పి ఆయనను ఆపగలను, నిజం చెప్పి ఆయన ప్రాణాలతో ఆడుకోవడం కంటే ఆయన ఎక్కడున్నా సంతోషంగా చాలని అంటుంది కావ్య.
ఆగస్ట్ 21వ తేదీ 806వ ఎపిసోడ్‌లో ..
కావ్య తన మాట వినకపోవడంతో రాజ్‌ను ఆపడానికి యామిని ఇంటికి వెళ్తారు ఇందిర, అపర్ణ. తనను ఎంతో ప్రేమిస్తే కళావతి మా బావ జీవితంతో ఆడుకుందని.. తన కోసం ఎందుకు ఆగాలని యామిని నానామాటలు అంటుంది. అపర్ణ, ఇందిరలు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరతాడు. రాజ్ అమెరికా వెళ్లిపోతుండటంతో ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని యామిని భావిస్తుంది. ఆ వెంటనే కావ్యకి ఫోన్ చేసి మా బావని నాకు దగ్గర చేస్తున్నందుకు థ్యాంక్స్ చెబుతుంది. నేను కూడా బావతో పాటే అమెరికా వెళ్లి.. అతని మనసు మార్చి పెళ్లి చేసుకుని, పిల్లల్ని కంటానని అంటుంది యామిని. ఆ తర్వాత రుద్రాణికి ఫోన్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అన్న నిజాన్ని చెప్పమని అంటుంది రుద్రాణి. అటు కావ్య కూడా నిజం చెప్పేయాలని డిసైడ్ అయి ఇద్దరు ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు.

Photo Courtesy: JioHotstar
ఆగస్ట్ 22వ తేదీ 807వ ఎపిసోడ్‌లో ..
రాజ్‌ను రుద్రాణి కలిసి కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో కళావతి రావడంతో నువ్వు గర్భవతివా అని నిలదీస్తాడు రాజ్.. తను ఔనని సమాధానం చెప్పడంతో షాక్ అవుతాడు. నన్ను అమెరికాకు వెళ్లకుండా ఆపడానికి మీరిద్దరూ ప్లాన్ చేస్తున్నారా అని నవ్వుకుంటాడు రాజ్. నేను చెబుతున్నది నిజమని కావ్య అనడంతో రాజ్ షాక్ అవుతాడు. వెంటనే అపర్ణ, ఇందిరలను కలిసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. మీరు నన్ను మోసం చేశారంటూ బాధపడి వెళ్లిపోతాడు. కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని రాజ్‌కు ఎందుకు చెప్పావని రుద్రాణికి దుగ్గిరాల ఫ్యామిలీ క్లాస్ తీసుకుంటుంది. రాజ్‌కి దగ్గరవ్వడానికి ఇదే మంచి సమయమని భావించిన యామిని కొత్త ప్లాన్ వేస్తుంది.
ఆగస్ట్ 23వ తేదీ 808వ ఎపిసోడ్‌లో ..
రాజ్‌ని తన తల్లిదండ్రులతో బుజ్జగించేలా చేసి పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తుంది యామిని. అయితే మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని రాజ్ తేల్చిచెబుతాడు. కావ్య చేసిన మోసంతో రాజ ఎప్పటికీ ఇంటికి తిరిగి రాడని రాహుల్, రుద్రాణిలు సంతోషిస్తారు. రాజ్ తనను నానామాటలు అనడంతో కావ్య బాధపడుతుంటుంది.. కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినమని అపర్ణ, ఇందిరలు ఆమెను బుజ్జగిస్తారు. ఒంటరిగా బాధపడుతున్న రాజ్‌కి మందు బాటిల్ ఇచ్చి తాగమని చెబుతుంది యామిని. రాజ్ తాగుతూ రోడ్డుపై పడిపోతాడు. ఉదయాన్ని కారులో వెళ్తూ రాజ్‌ని చూసిన కావ్య అతనిని ఇంటి దగ్గర వదిలిపెడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











