Brahmamudi weekly roundup: గతం చెప్పిన అపర్ణ.. రాజ్- కావ్యల కలయిక, యామిని ఆటకట్టు
Photo Courtesy: JioHotstar
తన ప్రేమను కావ్య తిరస్కరించడంతోపాటు పెళ్లికాకుండానే తల్లి కావడంతో రాజ్ పీకల దాకా మందు తాగుతూ రోడ్లుపై పడిపోతాడు. అతనిని చూసిన కావ్య.. యామిని ఇంట్లో దించుతుంది. రాజ్‌ను పూర్తిగా తన వాడిని చేసుకోవాలనుకున్న యామిని.. కావ్యని పెళ్లి చేసుకుని తన కడుపులో బిడ్డకి తండ్రిగా మారమని అలాగే ఆ కడుపుకు కారణం ఎవరో కనుక్కోమని చెబుతుంది. యామిని మాటలతో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన రాజ్.. దుగ్గిరాల వారింటికి వెళ్లి కావ్యని నానామాటలు అంటాడు. దాంతో అపర్ణ రాజ్ చెంప పగులగొట్టి అతనికి గతాన్ని గుర్తుచేస్తుంది. ఆ మాటలతో రాజ్ స్పృహ తప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్తాడు. హాస్పిటల్‌లో కోలుకున్న రాజ్ గతం గుర్తు తెచ్చుకుని ఇంటికి వస్తాడు. కావ్య ఏడుస్తూ పైకి వెళ్లడంతో ఏం జరిగిందని అడగ్గా.. అపర్ణ జరిగినదంతా గుర్తుచేస్తుంది. గదిలో ఏడుస్తున్న కావ్యని రాజ్ ఓదారుస్తాడు.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఆగస్ట్ 30వ తేదీ వరకు .. 809వ ఎపిసోడ్ నుంచి 813 వరకు ఏం జరిగిందంటే?
ఆగస్ట్ 25వ తేదీ 809వ ఎపిసోడ్‌లో ..
రోడ్డుపై తాగిపడిపోయిన రాజ్‌ని యామిని ఇంటికి తీసుకొస్తుంది కావ్య. బావకి నేనే మందు అలవాటు చేశానని అతనికి దగ్గరై నా వాడిని చేసుకుంటానని చెప్పడంతో కావ్య లాగి కొడుతుంది. పరాయి మొగుడిని ఆశించిన శూర్పణక లాగే నీ జీవితం కూడా ముగుస్తుందని వార్నింగ్ ఇస్తుంది. కావ్య వైపు ధర్మం ఉందని ఆమె మీద నువ్వు గెలవలేవని యామినితో అంటాడు తండ్రి. ఏడుస్తూ ఇంటికొచ్చిన కావ్యను చూసి అపర్ణ, ఇందిరలు ఏం జరిగిందని అడుగుతారు. దాంతో కావ్య జరిగినదంతా చెప్పడంతో ఇద్దరూ బాధపడతారు. దాంతో అపర్ణ, ఇందిరలు యామిని ఇంటికి వెళ్లి అతనిని నిలదీస్తారు. మా కుటుంబానికి, నా కోడలిని ఏడిపించినంతుకు నువ్వు అనుభవిస్తావని యామినికి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ.
ఆగస్ట్ 26వ తేదీ 810వ ఎపిసోడ్‌లో ..
రాజ్‌ని ఇలాగే వదిలేస్తే పూర్తిగా తాగుడికి బానిసైపోతాడని అప్పుడు ఎవరి మాటా వినడని త్వరగా ఆ యామిని దగ్గరి నుంచి తీసుకొచ్చేయాలని కుటుంబ సభ్యులతో అంటుంది అపర్ణ. అవసరమైతే రాజ్‌కి గతాన్ని చెప్పేస్తానని అంటుంది. రాజ్‌కి గతం గుర్తుచేస్తే తమ పని ఔట్ అని రాహుల్, రుద్రాణిలు షాక్ అవుతారు. కావ్యపై రాజ్ మనసులో విషం నింపి బావని తన వాడిని చేసుకోవాలని యామిని ప్లాన్ చేస్తుంది. రాజ్ దగ్గరికి వెళ్లి కావ్య చేసిన తప్పుని క్షమించి ఆమెను పెళ్లి చేసుకుని, తన బిడ్డకు తండ్రి స్థానంలో ఉండమని చెబుతుంది యామిని. ఇదంతా చేయాలంటే ముందు ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమని కావ్యని నిలదీయమని అంటుంది యామిని. యామిని మాటలు నమ్మిన రాజ్.. దుగ్గిరాల వారింటికి వెళ్లి ఆమె చెప్పినట్లుగానే మాట్లాడతాడు.

Photo Courtesy: JioHotstar
ఆగస్ట్ 28వ తేదీ 811వ ఎపిసోడ్‌లో ..
నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, కానీ నాకు రెండు విషయాలు చెప్పమని అడుగుతాడు రాజ్. నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? అని నిలదీస్తాడు. ఎంత అడిగినా కావ్య మౌనంగా ఉండటంతో యామిని ఎంట్రీ ఇచ్చి ఆమెను నిలదీస్తుంది. కావ్య ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుందని, తను బజారు మనిషని నోరుజారడంతో అపర్ణ లాగిపెట్టి కొడుతుంది. నా కోడలిని అనేంత దానివా? పరాయి మొగుడిని లాక్కోవాలని చూసిన నువ్వు చిల్లర మనిషివని మండిపడుతుంది. నా ఇంటి గడపను కూడా నీలాంటి దానిని తొక్కనివ్వనని అంటుంది. యామిని అనడం కాదు.. నాది కూడా అదే ప్రశ్న అని రాజ్ చెప్పడంతో అపర్ణ లాగికొట్టి.. కావ్య నువ్వు తాళి కట్టిన భార్య అని గతం గుర్తుచేస్తుంది. దాంతో రాజ్ కుప్పకూలిపోతాడు.
ఆగస్ట్ 29వ తేదీ 812వ ఎపిసోడ్‌లో ..
తన వల్లే రాజ్‌కి ఈ పరిస్ధితి వచ్చిందని కావ్యను క్షమాపణలు అడుగుతుంది అపర్ణ. ఇంతలో యామిని వచ్చి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నేను బావని కంటికి రెప్పలా కాపాడుకుంటే మీరు అతని ప్రాణాలతో చెలగాటం ఆడారని మండిపడుతుంది. నా కాళ్లు కడిగి మీరంతా ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవాలని నానా మాటలు అంటుంది. ఆమె మాటలతో రగిలిపోయిన కావ్య లాగి కొడుతుంది. మా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తావా? నా మొగుడిని సొంతం చేసుకోవాలని అడ్డమైన ప్లాన్లు వేశావని కావ్య ఫైర్ అవుతుంది. ఆయనని రెచ్చగొట్టి పంపించింది నువ్వేనని, సమయానికి ఆయనకి గతం గుర్తురాకుంటే ఏమయ్యేదోనని రగిలిపోతుంది. యామిని అక్కడే ఉంటే అంతా కలిసి కుమ్మేస్తారని భయపడిన రుద్రాణి .. వెంటనే యామినిని బయటికి తీసుకెళ్లిపోయి కొన్నాళ్లు సైలెంట్‌గా ఉండమని అంటుంది. ఇంతలో రాజ్ స్పృహలోకి వచ్చి కళావతి ఎక్కడ? ఆమె బాగానే ఉంది కదా? అని అపర్ణని అడుగుతాడు. ఇదంతా దూరం నుంచి చూసిన యామినికి రాజ్‌కి గతం గుర్తొచ్చినట్లు తెలుస్తుంది.

Photo Courtesy: JioHotstar
ఆగస్ట్ 30వ తేదీ 813వ ఎపిసోడ్‌లో ..
ఎన్ని ప్లాన్లు వేసినా కావ్య మీద గెలవలేకపోవడం, రాజ్ దక్కకపోవడంతో యామిని రగిలిపోతూ ఇంట్లోని సామాగ్రిని పగులగొడుతుంది. దాంతో ఆమె తండ్రి రఘునందన్.. యామినిపై మండిపడతాడు. రాజ్- కావ్యలది ఎన్ని జన్మలైనా విడిపోని తాళి బంధమని, ఇకనైనా కొత్త జీవితం మొదలుపెట్టమని చెప్పి వెళ్లిపోతాడు. రాజ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని, మరోసారి ఇలాంటి పరిస్ధితి వస్తే రోగిని కాపాడలేమని దుగ్గిరాల ఫ్యామిలీకి వార్నింగ్ ఇస్తాడు. రాజ్‌ను ఇంటికి తీసుకురాగా.. కావ్య ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. కళావతి ఎందుకలా వెళ్లిపోయిందని రాజ్ అడుగుతాడు. కట్టుకున్న భర్తే నిందిస్తే ఏ భార్య అయినా అంతే ఏడుస్తుందని ధాన్యలక్ష్మీ చెబుతుంది. ఆ వెంటనే రాజ్‌కి జరిగిన యాక్సిడెంట్, గతం మరిచిపోవడం, కావ్యతో ప్రేమలో పడటం, ఆమె గర్భవతి అయిన విషయాలను చెబుతుంది అపర్ణ. దాంతో తన గదిలో ఒంటరిగా ఏడుస్తోన్న కావ్య దగ్గరికి వెళ్లి ఆమెను హత్తుకుంటాడు రాజ్. నేను నీకేం చేయలేదని, కానీ నువ్వు మాత్రం నన్ను గుండెల్లో పెట్టుకున్నావని ఎమోషనల్ అవుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











