Brahmamudi weekly roundup: రాజ్‌ని నిలదీసిన కావ్య... నిజం బయటపెట్టిన అప్పూ, కళ్యాణ్
Photo Courtesy: JioHotstar
రాజ్‌ని మార్చడానికి నా దగ్గర ప్లాన్ ఉందని దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని తన ఇంటికి రప్పిస్తుంది కనకం. కావ్య కడుపుని పొగొట్టి.. దానిని రాజ్‌పై వేసి వారిద్దరిని విడిపోయేలా చేయడానికి రాహుల్ - రుద్రాణిలు కొత్త కుట్ర పన్నుతారు. రసాయనాలు కలిపిన క్రాకర్స్‌ని అసలు క్రాకర్స్‌లో కలిపి కావ్య వాటిని కాల్చేలా చేయాలని అనుకుంటారు. కానీ అప్పూ వాటిని కాల్చి స్పృహ తప్పుతుంది. క్రాకర్స్‌లో విష పదార్ధాలు ఉన్నాయని ఇంకొంచెం అయితే అప్పూ ప్రెగ్నెన్సీ పోయేదని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. క్రాకర్స్ తీసుకొచ్చింది నువ్వే కదా? కావ్య కడుపుని పొగొట్టాలని అనుకున్నావా? అని రుద్రాణి ఇరికిస్తుంది. దాంతో కావ్య భర్తని నిలదీస్తుంది. అలా చేయకపోతే నువ్వు చచ్చిపోతావని రాజ్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అప్పూ, కళ్యాణ్‌లు కూడా అదే నిజమని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఏడుస్తుంది. కావ్యని అబార్షన్ చేయించుకోమని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా ఆమె పట్టించుకోదు. కళ్లు తిరిగి పడిపోవడంతో ఇదే సమయంలో అబార్షన్ చేయమని డాక్టర్‌ను దుగ్గిరాల ఫ్యామిలీ అడుగుతుంది. రిపోర్ట్స్ చూసి కావ్య గర్భసంచిలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పడంతో అందరూ సంతోషిస్తారు.
బ్రహ్మముడి అక్టోబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు .. 856వ ఎపిసోడ్ నుంచి 861 వరకు ఏం జరిగిందంటే?
అక్టోబర్ 20వ తేదీ 856వ ఎపిసోడ్‌లో..
తన కోసం అన్ని సుఖాల్ని, ఇంద్రభవనం లాంటి ఇంటిని వదలుకుని వచ్చిన భర్తను చూసి కావ్య కరిగిపోతుంది. ఆయనకు అన్నం పెట్టమని తండ్రికి ప్లేట్ ఇచ్చి పంపిస్తుంది. రాజ్‌ను నిద్రలేపిన కృష్ణమూర్తి... ఎవ్వరూ చూడటం లేదని భోజనం చేయమని చెబుతాడు. మామగారికి థ్యాంక్స్ చెప్పిన రాజ్.. ఆకలి మీద ఉండటంతో అన్నం స్పీడ్‌గా తినేస్తాడు. నా కూతురి కోసం ఇంత చేస్తున్న మీరు ఆ నిజం మాత్రం ఎందుకు చెప్పడం లేదని అడుగుతాడు కృష్ణమూర్తి. చెప్పే విషయమే అయితే ఎప్పుడో చెప్పేవాడినని రాజ్ బదులిస్తాడు. దాంతో కృష్ణమూర్తి మౌనంగా వెళ్లిపోతాడు. చలికి వణుకుతూ, దోమలు కుట్టుకుంటూ ఇబ్బందిపడుతున్న రాజ్‌కి దిండు, దుప్పటి తీసుకొచ్చి కప్పుతుంది కావ్య. కావ్య, రాజ్‌లను కలిపేందుకు కనకం ఓ ప్లాన్ వేసి దానికి మీ సాయం కావాలని అపర్ణకి ఫోన్ చేసి చెబుతుంది. ఇది విన్న రుద్రాణి.. మనం కూడా కనకం ఇంటికి వెళ్లాలని అక్కడ రాజ్ చేత మరోసారి కావ్యకి అబార్షన్ చేయించేలా ప్లాన్ చేస్తుంది.
అక్టోబర్ 21వ తేదీ 857వ ఎపిసోడ్‌లో..
ఉదయాన్నే తన ఇంటికి వచ్చిన దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తానికి కనకం స్వాగతం పలుకుతుంది. వాళ్లతో పాటు స్వరాజ్ కూడా రావడంతో కనకం మురిసిపోతుంది. మావయ్యని నేను నిద్ర లేపుపతానని దుప్పట్లో దూరతాడు పిల్లాడు. దాంతో ఉలిక్కిపడి లేచిన రాజ్... కావ్య ఇంటి ముందు దుగ్గిరాల ఫ్యామిలీ కనిపించడంతో షాక్ అవుతాడు. దీపావళి పండుగ జరుపుకుందామని వచ్చినట్లు అపర్ణ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఆ వెంటనే కావ్య వచ్చి రాజ్‌ను రెచ్చగొట్టడంతో నేను కూడా మీతో పాటే పండగ చేసుకుంటాను, కళావతిని సాయంత్రంలోగా ఇంటికి తీసుకెళ్లిపోతానని శపథం చేస్తాడు. కావ్యకి అబార్షన్ అయ్యేలా విష పదార్ధాలతో ప్రత్యేకంగా క్రాకర్స్ తయారు చేయించిన రుద్రాణి వాటిని స్వరాజ్ ద్వారా కాల్పించాలని అనుకుంటుంది. అయితే ఆ పిల్లాడు ఇచ్చిన షాక్‌తో రుద్రాణి, రాహుల్‌లు షాక్ అవుతారు. తాను తీసుకొచ్చిన బట్టల్ని వేసుకునేలా రాజ్‌ను రెచ్చగొడుతుంది కావ్య. పిల్లాడు మారాం చేయడంతో రాజ్ బజారుకి వెళ్లి క్రాకర్స్ తీసుకుని వస్తాడు. వాటిలో తాను తయారు చేయించిన క్రాకర్స్ కలిపేస్తుంది రుద్రాణి.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 22వ తేదీ 858వ ఎపిసోడ్‌లో..
దీపావళి కావడంతో అప్పూకి క్రాకర్స్ కాల్చాలని అనిపిస్తుంది. దాంతో కావ్య కోసం తయారు చేయించిన క్రాకర్స్ తీసుకుని కాలుస్తూ ఉంటుది. అది చూసి రాహుల్ - రుద్రాణి షాక్ అవుతారు. నువ్వు కావ్య మనసు మార్చాలంటే ఆవిడ లోపల వంట చేసుకుంటుందని, బయటికి తీసుకురమ్మని రాజ్‌ని రెచ్చగొడుతుంది రుద్రాణి. రాజ్ లోపలికి వెళ్లి కావ్యని బయటికి వచ్చి క్రాకర్స్ కాల్చమని చెబుతాడు. నా కడుపులో బిడ్డను ఎందుకు తీసేయమన్నారో చెబితేనే పండగ చేసుకుంటాను, మీతో పాటు ఇంటికి వస్తానని చెబుతుంది కావ్య. చెప్పేవాడినే అయితే ఎప్పుడో చెప్పేవాడినని అంటాడు రాజ్. రుద్రాణి తీసుకొచ్చిన క్రాకర్స్‌లోని విష పదార్ధాల దెబ్బకి అప్పూ కుప్పకూలిపోతుంది. ఆమెను పరీక్షించిన డాక్టర్.. క్రాకర్స్‌లో రసాయనాలు భారీగా కలిశాయని, కాస్త ఆలస్యం అయ్యుంటే కడుపులో బిడ్డ దక్కేది కాదని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. దాంతో రాజ్‌ని అందరి ముందు దోషిని చేస్తుంది రుద్రాణి. కడుపులో బిడ్డను తీసేయడానికి నాకు దొంగచాటుగా అబార్షన్ చేయించాలని అనుకున్నారు, జ్యూస్‌లో మందులు కలిపారు, ఇప్పుడు క్రాకర్స్‌తో బిడ్డను చంపాలని అనుకుంటున్నారా? అంటూ రాజ్‌ని నిలదీస్తుంది కావ్య. అలా చేయకపోతే నువ్వు చచ్చిపోతావని రాజ్ నోరుజారడంతో అంతా షాక్ అవుతారు.
అక్టోబర్ 23వ తేదీ 859వ ఎపిసోడ్‌లో..
నువ్వు 9 నెలలు బిడ్డను కడుపులో మోసి, బిడ్డకు జన్మనిస్తే చనిపోతావని కావ్యకు అసలు నిజం చెబుతుంది అప్పూ. నిన్ను కాపాడుకోవడం కోసం తన వారసుడిని సైతం చంపుకోవడానికి బావ గారు సిద్ధపడ్డాడని అంటుంది. నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలియక ఇంట్లో వాళ్లంతా నానామాటలు అంటున్నా వాటిని మౌనంగా భరించాడని చెబుతుంది అప్పూ. మేం ఎన్నోసార్లు నిజం చెప్పాలని అనుకున్నామని కానీ అన్నయ్య పడుతున్న కష్టాన్ని చూసి ఆగిపోయామని కళ్యాణ్ అంటాడు. రాజ్ గొప్పతనం, కావ్య కోసం తాను చేస్తున్న పనులు తెలియడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఫిదా అవుతుంది. నా కష్టం వృథా అయిపోయిందని, నా భార్యను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని రాజ్ బాధపడతాడు. కావ్య తన ప్రాణాలైనా ఇస్తుంది కానీ .. బిడ్డను మాత్రం చంపుకోదని ఇక నుంచి మనం కావ్యకే సపోర్ట్ చేయాలని, ఆమెకు డెలివరి అయ్యే వరకు కావ్యని, బిడ్డని కాపాడాలని రాహుల్‌తో చెబుతుంది రుద్రాణి. తమ కూతురి ప్రాణాల్ని కాపాడటానికి రాజ్ చేసిన త్యాగానికి కృష్ణమూర్తి, కనకంలు అల్లుడి కాళ్లు పట్టుకోబోతారు. ఇక మనం మనింటికి వెళ్లిపోదామని లగేజ్‌తో సహా వచ్చిన కావ్య రాజ్‌తో చెబుతుంది.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 24వ తేదీ 860వ ఎపిసోడ్‌లో..
కావ్యని ఎలా కాపాడుకోవాలా? అని దుగ్గిరాల ఫ్యామిలీ ఆలోచిస్తుంటుంది. ఇంతలో కావ్య అందరికీ కాఫీలు, టీలు ఇస్తూ సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది కావ్య. నువ్వు త్వరలో చనిపోతావన్న నిజం తెలిశాక ఎలా సంతోషంగా ఉంటున్నావని అపర్ణ, ఇందిరలు బాధపడతారు. నువ్వు మాకు కావాలి అని అందరూ అడగ్గా.. నాకు మాత్రం నా ప్రాణాల కంటే నా బిడ్డే ముఖ్యమని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. ఆ మాటలు విన్న రాజ్.. నేను మీ అందరికీ నిజం చెప్పనిది ఇందుకే, చెబితే కావ్య ఇలాగే బిహేవ్ చేస్తుందని ముందే తెలుసని అంటాడు. నీ బిడ్డ కోసం మా అందరినీ, దుగ్గిరాల కుటుంబాన్ని చీకట్లో వదిలి వెళ్లొద్దని, మనసు మార్చుకోమని కావ్యకు చెబుతాడు సీతారామయ్య. మీరు ఎంతో జీవితాన్ని చూశారు? ఊపిరి పోసుకోని ఓ పసి ప్రాణాన్ని తీసేసుకోమ్మని ఎలా చెబుతారని పెద్దాయనని ప్రశ్నిస్తుంది కావ్య. నీ కోసమే బతుకుతున్న రాజ్ జీవితం గురించి ఆలోచించమని చెప్పి వెళ్లిపోతాడు సీతారామయ్య. కావ్యని అబార్షన్‌కు ఒప్పించాలని దుగ్గిరాల ఫ్యామిలీ నిరాహారదీక్షకు దిగుతుంది. అటు రాహుల్‌ని ఓ అమ్మాయి తన అందంతో ట్రాప్ చేసి దుగ్గిరాల వారి ఆస్తి కొట్టేయాలని భర్తతో కలిసి ప్లాన్ చేస్తుంది.
అక్టోబర్ 25వ తేదీ 861వ ఎపిసోడ్‌లో..
కావ్య అబార్షన్ చేయించుకునేందుకు ఇంట్లో వాళ్లు ఆమె చేతితో ఏం ఇచ్చినా తీసుకోకూడదని నిర్ణయించుకుంటారు. కావ్య వచ్చి ప్రసాదం ఇవ్వగా ఎవ్వరూ తీసుకోరు. దాంతో నేను మీ కోసం పెసరట్టు ఉప్మా, వడలు, పూరీలు చేశానని కావ్య చెప్పడంతో ఇందిర, ప్రకాశంలు టెంప్ట్ అవుతారు. దాంతో అపర్ణ వాళ్లని కంట్రోల్ చేస్తుంది. మీరు తగ్గే వరకు నేను కూడా తగ్గేదే లేదని వెళ్లిపోతూ కావ్య కళ్లు తిరిగి పడిపోతుంది. ఆమె నాటకాలు వేస్తుందని ఎవరూ పట్టించుకోరు.. అయితే ఎంతకీ కావ్య లేవకపోడంతో దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతూ కళావతిని ఆసుపత్రిలో చేరుస్తుంది. కంగారు పడాల్సింది ఏం లేదని బీపీ ఎక్కువైందని చెబుతుంది డాక్టర్. కావ్యను కాపాడుకోవాలంటే అబార్షన్ ఒక్కటే మార్గమని ఇందిర చెప్పడంతో రాజ్‌తో పాటు కుటుంబం మొత్తం ఓకే అంటుంది. కావ్య స్పృహలో లేనప్పుడే అబార్షన్ చేయమని డాక్టర్‌ను కోరగా.. ఆమె ససేమిరా అంటుంది. ఇంతలో కావ్య రిపోర్ట్ చూసిన డాక్టర్.. ఇకపై కళావతికి ఏం జరగదని, ఆమె హ్యాపీగా బిడ్డను కనొచ్చని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











