Brahmamudi weekly roundup: చిచ్చుపెట్టిన రుద్రాణి.... ధాన్యలక్ష్మీ వీరంగం, ఇల్లు వదిలి వెళ్లిపోయిన కావ్య
Photo Courtesy: JioHotstar
కావ్య- రాజ్‌ల గొడవల గురించి ఆలోచిస్తూ నీ కోడలు సరిగా తినడం లేదని ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి. దీంతో కోడలికి టైంకి తినమని, రెస్ట్ తీసుకోమని చెబుతుంది ధాన్యలక్ష్మీ. తాను ఏం చేసినా భర్త నిజం చెప్పకపోవడంతో రాజ్‌ని బెడ్ రూం నుంచి బయటికి గెంటేస్తుంది కావ్య. సుభాష్, ప్రకాశంలు కూడా వారి భార్యల దెబ్బకి హాల్‌లో వచ్చి పడుకుంటారు. ఇంట్లో రోజు రోజుకు గొడవలు ఎక్కువ అవుతుండటంతో దాని గురించే ఆలోచిస్తున్న అప్పూని బయటికి తీసుకెళ్లమని కళ్యాణ్‌తో చెబుతుంది ధాన్యలక్ష్మీ. రాజ్- కావ్యలు విడాకుల కోసం కోట్లాడుకుంటూ ఉండటంతో అప్పూ కళ్లు తిరిగిపడిపోతుంది. దాంతో ధాన్యలక్ష్మీ పెద్ద గొడవ చేస్తుంది. మేం ఇంట్లో ఉండాలా వద్దా అని రాజ్‌ని అడగ్గా... మిమ్మల్ని ఆపనని సమాధానం చెబుతాడు రాజ్. దాంతో మనవడిని లాగిపెట్టి కొడతాడు సీతారామయ్య. ఇంట్లో జరిగిన గొడవతో లెటర్ రాసి ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్లిపోతుంది కావ్య. ఆమెను ఇంటికి తిరిగి తీసుకెళ్దామని రాజ్ వస్తే తిట్టి పంపించేస్తుంది.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు .. 844వ ఎపిసోడ్ నుంచి 849 వరకు ఏం జరిగిందంటే?
అక్టోబర్ 6వ తేదీ 844వ ఎపిసోడ్‌లో..
విడాకులు విషయం గురించి మరోసారిఆలోచించమని కావ్యకి నచ్చచెబుతుంది అప్పూ. నేను నాటకం ఆడుతున్నానని చెబితే.... విషయం రాజ్‌కి తెలిసిపోతుందని భయపడ్డ కావ్య తన చెల్లెలిని తిట్టి పంపించేస్తుంది. అప్పూ ఏడుస్తుండటం చూసిన రుద్రాణి.. ఈ విషయాన్ని ధాన్యానికి చెప్పడంతో ఆమె కావ్యని నానామాటలు అంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన గొడవతో అప్పూకి కళ్యాణ్ భోజనం తీసుకెళ్లి తినిపిస్తాడు. దుగ్గిరాల వారి గురించి నలుగురు నానామాటలు అంటూ ఉండటంతో సీతారామయ్య కుమిలిపోతాడు.. మనవడిని పిలిపించి క్లాస్ పీకుతాడు. రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో ఏ ఒక్కరూ భోజనం వడ్డించరు.
అక్టోబర్ 7వ తేదీ 845వ ఎపిసోడ్‌లో..
ఎవరూ భోజనం వడ్డించకపోవడంతో తనే వడ్డించుకుని తింటాడు రాజ్. తర్వాత నిద్రపోవడానికి బెడ్ రూమ్‌కి వెళ్లగా.. కావ్య బయటికి వెళ్లిపోమని చెబుతుంది. మీరు మన బిడ్డని ఎందుకు వద్దు అనుకుంటున్నారో నిజం చెప్పే వరకు హాల్‌లోనే పడుకోమని చెబుతుంది కావ్య. కొడుకు హాల్‌లో పడుకోవడం చూసిన అపర్ణ.. సుభాష్‌ని కూడా బయటికి గెంటేస్తుంది. ఇంతలో ప్రకాశం కూడా హాల్‌లోకి వచ్చి... నీ ఒక్కడి వల్ల ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదని క్లాస్ తీసుకుంటారు. ఏ కారణం లేకుండా కావ్య - రాజ్‌లు విడిపోబోతున్నారని తెలిసి అప్పూ ఏడుస్తుంది. ఇది చూసిన రుద్రాణి ఈ అవకాశాన్ని వాడుకుని ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టాలని అనుకుంటుంది. వెంటనే తన ప్లాన్ అమలు చేస్తుంది. రుద్రాణి చెప్పుడు మాటలు విన్న ధాన్యలక్ష్మీ రగిలిపోతుంది.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 8వ తేదీ 846వ ఎపిసోడ్‌లో..
రోజురోజుకు కోడలు నీరసంగా, డల్‌గా మారిపోవడంతో అప్పూని తీసుకుని బయటికి వెళ్లమని కళ్యాణ్‌తో చెబుతుంది. అమ్మ నిన్న బయటికి తీసుకెళ్లమని చెప్పిందని, నువ్వు రాకపోతే మళ్లీ ఇంట్లో గొడవ చేస్తుందని భయపెట్టడంతో అప్పూ సరేనని అంటుంది. రాజ్ మనసులో నిజం రాబట్టాలని విడాకులకు ఏర్పాట్లు చేయమని లాయర్‌తో ఫేక్ కాల్ మాట్లాడుతుంది కావ్య. గేటు దగ్గర బయటికి వెళ్తూ ఆ మాటలు విన్న అప్పూ ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. కావ్య- రాజ్‌లు గొడవ పడుతూ ఎదురవ్వడంతో అప్పూ బాధపడుతూ వచ్చేసిందని చెబుతుంది రుద్రాణి. విడాకుల గురించి రాజ్- కావ్యల మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో అప్పూ కళ్లు తిరిగి కిందపడిపోతుంది. నీ వల్లే అప్పూకి ఈ పరిస్ధితి వచ్చిందని, కావ్యను ఈడ్చిపారేస్తుంది ధాన్యలక్ష్మీ. అప్పూకి స్ట్రెస్ బాగా పెరిగిపోయిందని ఇది ఇలాగే కొనసాగితే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ వార్నింగ్ ఇవ్వడంతో కళ్యాణ్, ధాన్యలక్ష్మీలు షాక్ అవుతారు. నా వల్లే అప్పూకి ఈ పరిస్ధితి వచ్చిందని కళ్యాణ్‌కు ఒంటరిగా రాజ్ క్షమాపణలు చెబుతాడు.
అక్టోబర్ 9వ తేదీ 847వ ఎపిసోడ్‌లో..
కళ్యాణ్ - రాజ్ మాట్లాడుకుంటూ ఉండా రాజ్‌కి డాక్టర్ ఫోన్ చేసి ఇంకెంత కాలం ఆలస్యం చేస్తారు? ఆల్రెడీ 5వ నెల వచ్చేస్తుందని ఇక అబార్షన్ చేయించడం కుదరదని చెబుతుంది. అబార్షన్ చేయించడం ఇంకా ఆలస్యమైతే కావ్య ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించడంతో రాజ్ బాధపడతాడు. ఇంట్లో గొడవల గురించి అప్పూ ఆలోచిస్తుండటంతో ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి. దాంతో రగిలిపోయిన ధాన్యం ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. రాజ్- కావ్యల కారణంగా నా కోడలు తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుందని వీళ్లు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సరే లేకపోతే నా భర్తని, కొడుకుని, కోడలిని తీసుకుని వెళ్లిపోతానని వార్నింగ్ ఇస్తుంది ధాన్యం. అయితే నేను మిమ్మల్ని ఆపనని రాజ్ అనడంతో సీతారామయ్య మనవడిని లాగిపెట్టి కొడతాడు. వాళ్లని బయటికి వెళ్లిపోమంటావా? కుటుంబాన్ని ముక్కలు చేస్తావా? అని మండిపడతాడు. ఏం జరిగినా సరే కళావతి కడుపులో బిడ్డ నాకు అక్కర్లేదని తన నిర్ణయాన్ని తేల్చి చెబుతాడు రాజ్.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 10వ తేదీ 848వ ఎపిసోడ్‌లో..
అక్క బావలు విడిపోతారని అప్పూ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. ఇంతలో కళ్యాణ్ జ్యూస్ తీసుకుని వస్తాడు. నువ్వు జ్యూస్ తాగకపోతే మా అమ్మ మళ్లీ గొడవ చేస్తుంది.. అసలు ఇంట్లో ఇంత పెద్ద రచ్చ జరగడానికి కారణం నువ్వేనని అంటాడు. నువ్వే కనుక టైంకి భోజనం చేసి, రెస్ట్ తీసుకుంటే ఈ పరిస్ధితి ఇక్కడి వరకు వచ్చేది కాదని అంటాడు. ఏం జరిగినా రాజ్ నిజం చెప్పకపోవడంతో కావ్య సంచలన నిర్ణయం తీసుకుంటుంది. తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని తన గురించి ఎవ్వరూ వెతకొద్దని లెటర్ రాసి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఉదయాన్నే కావ్య రాసిన లెటర్ చూసిన అపర్ణ తన కొడుకుపై రంకెలు వేస్తుంది. కావ్య సూట్‌కేస్ తీసుకుని నేరుగా పుట్టింటికి రావడంతో కనకం, కృష్ణమూర్తిలు షాక్ అవుతారు.
అక్టోబర్ 11వ తేదీ 849వ ఎపిసోడ్‌లో..
కావ్య హఠాత్తుగా ఇంటికి రావడంతో కనకం, కృష్ణమూర్తిలు షాక్ అవుతారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి అపర్ణకి ఫోన్ చేస్తుండగా కనకం దగ్గరి ఫోన్ లాగేస్తుంది కావ్య. నా కోడలు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని చెబుతుంది అపర్ణ. తను ఎక్కడుందో నాకు బాగా తెలుసని నేను వెళ్లి తీసుకొస్తానని చెబుతాడు రాజ్. కావ్య టిఫిన్ చేస్తుండగా రాజ్ ఇంటికి వచ్చి మండిపడతాడు. చెప్పాపెట్టకుండ వచ్చేస్తే ఇంట్లో వాళ్లు టెన్షన్ పడుతున్నారని అంటాడు. మీరు నిజం చెబితేనే నేనే మీ వెంట వస్తానని కావ్య తేల్చేస్తుంది. దాంతో రాజ్ కోపంగా తిరిగి వెళ్లిపోతాడు. అసలు కావ్య - రాజ్ మధ్య ఏం జరిగిందో తెలియక కృష్ణ మూర్తి, కనకంలు టెన్షన్ పడతారు. అప్పూకి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయదు. దీంతో స్వప్నకి కాల్ చేస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications










