Brahmamudi weekly roundup: తల్లి చెంతకు రేవతి.. రాజ్‌కి నిజం చెప్పిన కళ్యాణ్, మంచివాడిలా రాహుల్
Photo Courtesy: JioHotstar
రుద్రాణి అడ్డమైన ప్లాన్లు వేసి ఎట్టకేలకు ముసుగులో వచ్చింది రేవతి అని అందరికీ తెలిసేలా చేస్తుంది. ముసుగు తీయగానే రేవతిని నానామాటలు అంటూ దెబ్బిపొడుస్తుంది. దీంతో రేవతి ఎవరి వల్ల ఇలా ఇంటికి దూరమైందో నాకు తెలుసని ఇందిర అంటుంది. అక్కని క్షమించి దగ్గరికి తీసుకోవాలని రాజ్ బ్రతిమలాడతాడు. ముసుగులో వచ్చింది రేవతి అన్న విషయం నాకు తెలుసని అపర్ణ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దానిని ఇంటికి తెచ్చుకోవాలనుకున్నా నాకు అహం అడ్డొచ్చిందని కూతురిని దగ్గరికి తీసుకుంటుంది.
కావ్యకి నిజం ఎలా చెప్పాలో తెలియక అప్పూ- కళ్యాణ్‌లు తమలో తాము బాధపడతారు. నిజం చెబితే ఏం జరుగుతుందో అప్పూకి కల రావడంతో ఆమె మరింత ఎమోషనల్ అవుతుంది. ఆలస్యం చేస్తే వదిన ప్రాణాలకే ప్రమాదమని గ్రహించిన కళ్యాణ్.. రాజ్‌ని కారులో ఊరి చివరికి తీసుకెళ్లి నిజం చెబుతాడు. కళ్యాణ్ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. భార్యని, బిడ్డని నా ప్రాణాలు ఇచ్చైనా కాపాడతానని దేవుడి ముందు ప్రమాణం చేస్తాడు రాజ్. రేవతిని తీసుకెళ్లడానికి వచ్చిన జగదీష్ గుమ్మం దగ్గరే ఆగిపోవడంతో అతనిని అల్లుడిగా అంగీకరించి లోపలికి తీసుకొస్తారు అపర్ణ- సుభాష్. ఆస్తిని దక్కించుకోవడానికి మంచివాడిలా స్వప్న ముందు నటిస్తాడు రాహుల్. బిడ్డని, కావ్యని కాపాడటానికి ఎలాంటి ఆప్షన్ లేదని డాక్టర్స్ చెప్పడంతో రాజ్ రగిలిపోతూ ఆ కోపాన్ని తండ్రి మీద చూపిస్తాడు.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి సెప్టెంబర్ 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు .. 826వ ఎపిసోడ్ నుంచి 831 వరకు ఏం జరిగిందంటే?
సెప్టెంబర్ 15వ తేదీ 826వ ఎపిసోడ్‌లో..
రుద్రాణి చీటిల గేమ్‌లో భాగంగా ముందు స్వప్న - రాహుల్, కళ్యాణ్ - అప్పూ, ప్రకాశం - ధాన్యలక్ష్మీలు డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత రాజ్‌తో కావ్యకి ప్రపోజ్ చేయిస్తుంది రుద్రాణి. ఈ సందర్భంగా భార్య మీద తన ప్రేమను బయటపెడతాడు రాజ్. పెళ్లయిన నాటి నుంచి ఈ రోజు వరకు కావ్యను ఏడిపిస్తూనే ఉన్నానని, కానీ ఇకపై ఆమెకు కన్నీరు అంటే తెలియని ప్రపంచాన్ని ఇస్తానని చెబుతాడు. తాను జీవితంలో మొదటగా చూసి ఇష్టపడింది, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నది కావ్యని అని తెలుసుకుని రాజ్ మురిసిపోతాడు. ఇంట్లో వాళ్లంతా బాగా పర్ఫామెన్స్ చేశారని, ఇక రాధగారే మిగిలిపోయారని చెప్పి ఆమెకు చీటి ఇస్తుంది రుద్రాణి. అందులో డ్యాన్స్ చేయాలని రావడంతో నాకు రాదని రేవతి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ రుద్రాణి వదలకుండా నేను కూడా మీతో కలిసి డ్యాన్స్ చేస్తానని చెప్పి మధ్యలో ముసుగు లాగేస్తుంది. ముసుగు వెనుకాల రేవతి ఉండటంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రాధ పేరు చెప్పుకుని ఇంతసేపు నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావా? అని ఫైర్ అవుతుంది. దాంతో రాజ్, ఇందిరలు రుద్రాణిపై మండిపడతారు.
సెప్టెంబర్ 16వ తేదీ 827వ ఎపిసోడ్‌లో..
రేవతికి తప్పుడు సలహాలు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశావంటూ రుద్రాణిపై ఇందిర మండిపడుతుంది. అక్క తెలిసి తెలియక చేసిన తప్పుని క్షమించాలని తల్లిని బతిమలాడతాడు రాజ్. రేవతి గారు తల్లి ప్రేమను తిరిగి పొందాలని, పుట్టింటికి తిరిగి రావాలని ఆశపడుతున్నారని కావ్య కూడా అత్తగారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ముసుగు వేసుకుని వచ్చి ఇంట్లో వాళ్లని మోసం చేయాలని చూస్తే క్షమించాలా? అని రుద్రాణి మండిపడుతుంది. ముసుగులో వచ్చింది రేవతి అనే విషయం ముందే నాకు తెలుసని అపర్ణ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మొదట్లో తను చేసిన తప్పుకు కోపం వచ్చినా, తర్వాత కూతురు దూరమైందని బాధపడ్డానని చెబుతుంది అపర్ణ. రేవతిని క్షమించడానికి నాలోని అహం అడ్డొచ్చిందని, తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అంటుంది. ఆ మాటలతో తనను క్షమించాలని తల్లి పాదాలపై పడుతుంది రేవతి. ఆ తర్వాత స్వరాజ్, రేవతిని దగ్గరికి తీసుకుని మురిసిపోయింది అపర్ణ.

Photo Courtesy: JioHotstar
సెప్టెంబర్ 17వ తేదీ 828వ ఎపిసోడ్‌లో..
కావ్యకు అబార్షన్ చేయించాలన్న విషయాన్ని ఆమెకు చెప్పారా? లేదా? అని అప్పూ- కళ్యాణ్‌లను డాక్టర్ నిలదీస్తుంది. ఆలస్యం చేస్తే కావ్య ప్రాణాలకే ప్రమాదమని.. తల్లీబిడ్డా ఇద్దరూ దక్కరని డాక్టర్ చెప్పడంతో అప్పూ మరింత బాధపడుతుంది. రేవతి ఇంటికి తిరిగి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంబరాల్లో తేలిపోతుంది. అందరూ కలిసిపోవడంతో రుద్రాణి మాత్రం బాధపడుతూ, రగిలిపోతుంటుంది. ఇంతలో అప్పూ వచ్చి కావ్యకి డాక్టర్ చెప్పిన విషయం చెప్పడంతో రాజ్ సహా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఆ మాట వినగానే కావ్య స్పృహ తప్పి పడిపోతుంది. దాంతో ఉలిక్కిపడిన అప్పూ.. ఇదంతా కల అనుకుని వెంటనే అక్కని హత్తుకుని ఏడుస్తుంది. అన్నయ్య వదినలకి నిజం చెప్పాలని అప్పూతో కళ్యాణ్ అంటాడు. తనకు పుట్టబోయే బిడ్డతో పాటు కళ్యాణ్‌కు పుట్టబోయే బిడ్డకు కూడా రాజ్ బట్టలు కొని తీసుకొస్తాడు. అన్నయ్య బిడ్డపై పెంచుకుంటున్న ప్రేమను చూసి కళ్యాణ్ మరింత ఎమోషనలై కంటతడి పెడతాడు.
సెప్టెంబర్ 18వ తేదీ 829వ ఎపిసోడ్‌లో..
గుండెరాయిని చేసుకుని, ఎంత కష్టమైనా సరే ఈరోజు అన్నయ్యకి నిజం చెప్పాల్సిందేనని రాజ్‌ని బయటికి తీసుకెళ్తుండా కావ్య ఎదురవుతుంది. అన్నదమ్ములు ఎక్కడికి వెళ్తున్నారని.. ఇంత రాత్రిపూట బయటికి వద్దని, ఏదైనా ఉంటే ఇంట్లోనే మాట్లాడుకోవాలని చెబుతుంది. కళ్యాణ్ వినిపించుకోకపోవడంతో సరేనని అంటుంది. ఊరి చివర కారు ఆపి ముందు అప్పూ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్ ఉందని చెప్పి సొల్యూషన్ అడుగుతాడు. వెంటనే అబార్షన్ చేయించమని కళ్యాణ్‌తో చెబుతాడు రాజ్. అయితే వదినకి వెంటనే చేపించమని కళ్యాణ్ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ప్రాబ్లమ్ ఉంది వదినకేనని, అప్పూకి కాదని.. బిడ్డని, వదినని కాపాడమని ఏడుస్తాడు కళ్యాణ్. తన భార్య గర్భసంచిలో ప్రాబ్లమ్ ఉందని ఆలస్యమైతే బిడ్డతో పాటు కావ్య కూడా దక్కదని తెలుసుకున్న రాజ్ కుప్పకూలిపోతాడు. అన్నయ్యని ఓదార్చి కళ్యాణ్ ఇంటికి తీసుకెళ్తాడు. ఈ నిజాన్ని కావ్యకి ఎలా చెప్పాలో అర్ధం కాక దేవుడి దగ్గరికి వెళ్లి బాధపడతాడు రాజ్.

Photo Courtesy: JioHotstar
సెప్టెంబర్ 19వ తేదీ 830వ ఎపిసోడ్‌లో..
అక్క కడుపులో ప్రాబ్లమ్ గురించి, అబార్షన్ గురించి బావగారికి నిజం చెప్పావా? లేదా అని కళ్యాణ్‌ని అడుగుతుంది అప్పూ. ఏం జరగబోతుందోనని భార్యాభర్తలిద్దరూ టెన్షన్ పడతారు. ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉండగా.. రేవతి భర్త జగదీష్ ఇంటికి వస్తాడు. రేవతిని పెళ్లి చేసుకున్న సమయంలో జరిగిన అవమానం గుర్తొచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. అది గమనించిన ఇందిర.. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి అల్లుడివని చెబుతుంది. జగదీష్‌ని అల్లుడిగా అంగీకరించిన సుభాష్, అపర్ణలు అతనిని లోపలికి ఆహ్వానిస్తారు. ఇకపై అందరం కలిసే ఉందామని ఇందిర చెప్పడంతో ఆయన వచ్చింది నన్ను తీసుకెళ్లడానికి అని రేవతి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మీకు దగ్గరిలోనే ఉంటానని, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానని చెప్పి బయల్దేరుతుంది రేవతి. ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఉండటంతో తట్టుకోలేకపోతాడు రాహుల్. వెంటనే తల్లి దగ్గరికి వచ్చి దుగ్గిరాల ఇంటికి నేనే వారసుడినని, స్వరాజ్ కంపెనీకి అధినేతని అని నాకు మాయమాటలు చెప్పి ఏం చేయలేకపోయావని అంటాడు. ఇకపై నేనే రంగంలోకి దిగుతానని.. మంచివాడి ముసుగులో వీళ్లని నమ్మించి ఆస్తుల్ని కొట్టేస్తానని తల్లికి చెబుతాడు రాహుల్.
సెప్టెంబర్ 20వ తేదీ 831వ ఎపిసోడ్‌లో..
కావ్యని, బిడ్డను కాపాడుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని తెలుసుకోవడానికి కళ్యాణ్‌ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వస్తాడు రాజ్. కావ్యకి వెంటనే అబార్షన్ చేయకపోతే కష్టమని డాక్టర్ చెప్పడంతో రాజ్ రగిలిపోతాడు. మీరేమైనా దేవుడా? కనీసం ట్రై చేస్తానని కూడా చెప్పకుండా నా భార్య చనిపోతుందని అంటారా అంటూ గొడవ చేస్తాడు. నా భార్యను నేనే కాపాడుకుంటానని చెప్పి బయటికి వచ్చేస్తాడు. డాక్టర్‌కి కళ్యాణ్ సారీ చెప్పి అన్నయ్యని శాంతింపజేస్తాడు. నీ ఫ్రెండ్స్ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కదా? వాళ్లకి ఫోన్ చేసి విషయం చెప్పు.. కావాలంటే మన ఆస్తి మొత్తం ఇచ్చేద్దామని అడుగుతాడు రాజ్. నేను అన్ని ప్రయత్నాలు చేశానని మన చేతుల్లో ఏం లేదని కళ్యాణ్ బాధపడతాడు. దాంతో రాజ్ తనకి తెలిసిన డాక్టర్‌కి ఫోన్ చేసి పరిస్థితి వివరించగా.. అతను రిపోర్ట్స్ చూసి కావ్యని కాపాడటం నా వల్ల కాదని అంటాడు. ఉదయాన్నే స్వప్న దగ్గరికి వెళ్లిన రాహుల్.. నేను మూటలు మూసి డబ్బులు సంపాదించానని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. కంపెనీ వాళ్లు ఎంత ఫోన్ చేసినా రాజ్ లిఫ్ట్ చేయకపోవడంతో సుభాష్ నిలదీస్తాడు. కంపెనీ మూసినా పర్లేదని, నేను ఆఫీస్‌కి వెళ్లనని తండ్రి మీద అసహనం వ్యక్తం చేస్తాడు రాజ్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications










