Brahmamudi weekly roundup: కావ్యకు దొంగచాటుగా అబార్షన్.. రాజ్‌కు గుండెకోత, మంచోడిలా రాహుల్

Photo Courtesy: JioHotstar

ఆవేశంలో తండ్రిని అనరాని మాటలు అన్నందుకు రాజ్‌కి కావ్య చీవాట్లు పెడుతుంది. భార్య క్లాస్ పీకడంతో తప్పు తెలుసుకున్న రాజ్.. సుభాష్ కాళ్ల మీద పడతాడు. కంపెనీని, దుగ్గిరాల వారి ఆస్తిని దక్కించుకోవడానికి ఇకపై మంచివాడిగా నటిస్తానని రుద్రాణితో కలిసి కుట్ర చేస్తాడు రాహుల్. ఆలస్యం చేస్తే వదిన మనకి దక్కదని ఏదో ఒక నిర్ణయం తీసుకోమ్మని రాజ్‌కు కళ్యాణ్ చెబుతాడు. కళ్యాణ్ మాటలతో భయపడ్డ రాజ్.. కావ్యని టెస్టులు చేయించి బిడ్డ కండీషన్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రికి తీసుకెళ్తాడు.

కావ్యకి తెలియకుండా అబార్షన్ చేయనని రాజ్‌తో డాక్టర్ చెబుతుండగా కావ్య విని కోపంగా ఇంటికి వచ్చేస్తుంది. నా బిడ్డను మీ అబ్బాయి చంపాలని చూస్తున్నాడని కావ్య ఇంట్లో పంచాయతీ పెడుతుంది. పెద్దమ్మకి, పెదనాన్నకి అయినా నిజం చెప్పమని రాజ్‌కి కళ్యాణ్ సలహా ఇస్తాడు. నిజం చెబితే ఏం జరుగుతుందో కలగన్న రాజ్.. తన ప్రయత్నాలను మానుకుంటాడు. రాజ్‌తో మాట్లాడి కావ్య అబార్షన్‌ను ఆపుదామని రాహుల్ తన కుటుంబ సభ్యులతో అంటాడు. దీనిపైనే రాజ్‌ను ప్రశ్నించగా.. నాకు ఎవ్వరూ సలహాలు ఇవ్వొద్దని వార్నింగ్ ఇస్తాడు. నీకు నేను కావాలా? బిడ్డ కావాలా? తేల్చుకోమని రాజ్ అడగ్గా.. నాకు మీ కన్నా నా బిడ్డే ముఖ్యమని కావ్య తేల్చేస్తుంది.

Brahmamudi Telugu Serial Weekly roundup September 22nd to September 27th episode Story

Photo Courtesy: JioHotstar

సెప్టెంబర్ 23వ తేదీ 833వ ఎపిసోడ్‌లో..
రాజ్‌ను ఓదార్చిన సుభాష్.. అసలు నా మీద అరవడానికి ఏదో బలమైన కారణం ఉందని అదేంటో చెప్పాలని కొడుకుని అడుగుతాడు. కానీ రాజ్ చెప్పకుండా బాధపడుతూ వెళ్లిపోతాడు. కావ్య అబార్షన్ గురించి తాడోపేడో తేల్చుకోవడానికి కళ్యాణ్‌ని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తాడు రాజ్. అక్కడ ఓ వ్యక్తి తన భార్యకు ఇష్టం లేకుండా అబార్షన్ చేయిస్తున్నట్లు తెలుసుకుని అతనితో గొడవపడతాడు రాజ్. పిల్లల్ని పోషించలేనప్పుడు నీ భార్యకు కడుపు ఎందుకు చేశావ్? అసలు నీలాంటి వాళ్లు జైళ్లో ఉండాలని రాజ్ వాగ్వాదానికి దిగుతాడు. ఇదంతా చూసిన కళ్యాణ్.. రాజ్‌కి నచ్చజెప్పి ఆ వ్యక్తికి సారీ చెబుతాడు. నువ్వు ఇలాగే లేట్ చేస్తే వదిన కూడా దక్కదని.. కనీసం వదిననైనా బతికించు అంటాడు కళ్యాణ్. ఆఫీస్ పనుల్ని రాజ్ పక్కనపెట్టడంతో నేను కంపెనీ బాధ్యతలు తీసుకుంటానని రాజ్‌ని అడుగుతాడు రాహుల్. దాంతో అతనికి చీవాట్లు పెట్టి పంపిస్తాడు రాజ్.

సెప్టెంబర్ 24వ తేదీ 834వ ఎపిసోడ్‌లో..

అన్ని దారులు మూసుకుపోవడంతో భార్యను ఎలాగైనా బతికించుకోవాలని అనుకున్న రాజ్.. కావ్యకి తెలియకుండా అబార్షన్ చేయించడమే పరిష్కారమని ఓ నిర్ణయానికి వస్తాడు. హాయిగా నిద్రపోతున్న భార్య దగ్గరికి వెళ్లి ఆమె కడుపు తడుముతూ బాధపడతాడు. ఇంతలో కావ్య లేచి నాకు బిడ్డ కన్నా మీరే ఎక్కువ అని చెబుతుంది. బిడ్డకు ఏమైనా అవుతుందని భయంగా ఉందని రాజ్ అనగా.. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే బిడ్డను కాపాడుకుంటానని చెబుతుంది కావ్య. భార్య మాటలకు బాధపడ్డ రాజ్.. నేను ఏ తప్పు చేసినా నన్ను వదిలి వెళ్లొద్దని ఆమె దగ్గర మాట తీసుకుంటాడు. రాహుల్‌ను సీఈవో ఛైర్‌లో కూర్చోబెట్టేందుకు ఇదే మంచి సమయమని భావించిన రుద్రాణి.. దుగ్గిరాల ఫ్యామిలీతో గొడవకు దిగుతుంది. కావ్యకి కొన్ని టెస్టులు చేయించి తీసుకొస్తానని రాజ్ బయల్దేరుతుండగా అపర్ణ తీసుకొచ్చిన హారతి ఆరిపోతుంది. దాంతో ఏదో కీడు జరగబోతోందని అపర్ణ భయపడుతుంది. కావ్యకు చెప్పకుండా అబార్షన్ చేయించడం సరికాదని కళ్యాణ్‌పై అప్పూ కోప్పడుతుంది.

సెప్టెంబర్ 25వ తేదీ 835వ ఎపిసోడ్‌లో..
డాక్టర్ దగ్గరికి వెళ్లిన రాజ్ గతంతో మీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించానని ఆమెకు క్షమాపణలు చెప్పి.. కావ్యకు తెలియకుండా అబార్షన్ చేయమని అడుగుతాడు. ఎంత చెప్పినా అలా చేయడం చట్ట విరుద్ధమని, రేపు మీ భార్య కోర్టుకు వెళితే నా ప్రాక్టీస్‌తో పాటు ఈ హాస్పిటల్‌ను కూడా బ్యాన్ చేస్తారని వార్నింగ్ ఇస్తుంది డాక్టర్. ఏ ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటానని, కావాలంటే ఇంతకంటే పెద్ద హాస్పిటల్ కట్టిస్తానని చెప్పినా డాక్టర్ ససేమీరా అంటుంది. దాంతో మీ కాళ్లు పట్టుకుంటానని రాజ్ వెళ్లబోతుండగా కావ్య ఇదంతా చూసి షాక్ అవుతుంది. నా బిడ్డ ప్రాణాలు తీయడానికి నాకు మాయమాటలు చెప్పి తీసుకొస్తారా అంటూ భర్తపై మండిపడి ఇంటికి వచ్చేస్తుంది. కావ్య- రాజ్‌లు గొడవ పడటంతో ఏం జరిగిందోనని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడతారు. మీ అబ్బాయి నా కడుపులోని బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నాడని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup September 22nd to September 27th episode Story

Photo Courtesy: JioHotstar

సెప్టెంబర్ 26వ తేదీ 836వ ఎపిసోడ్‌లో..
నేనంటే నీకు ఇష్టం ఉంటే.. భర్తగా నా నిర్ణయాన్ని నువ్వు గౌరవించేట్లయితే రేపటికల్లా నువ్వు అబార్షన్ చేయించుకోవాలని తేల్చిచెబుతాడు రాజ్. దాంతో ఇంట్లో వాళ్లంతా రాజ్‌కి చీవాట్లు పెడతారు. రాజ్‌ను చెడ్డవాడిగా ముద్రవేసి ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేస్తారు రాహుల్- రుద్రాణి. అందరి చేత ఇన్ని అవమానాలు పడొద్దని వదిన అబార్షన్ గురించి నిజం చెప్పమని రాజ్‌‌తో అంటాడు కళ్యాణ్. రాజ్ ప్రవర్తన గురించి అపర్ణ - సుభాష్‌లు బాధపడుతుంటారు. ఇంతలో రాజ్ తన తల్లిదండ్రుల వద్దకి వెళ్లడంతో అపర్ణ కోపంతో ఊగిపోతుంది. అసలు ఏమైంది రా నీకు? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావని మండిపడుతుంది. నేను బిడ్డను చంపకపోతే.. కావ్య చనిపోతుందని రాజ్ జరిగినదంతా చెప్పడంతో సుభాష్, అపర్ణలు షాక్ అవుతారు. నా బిడ్డ పోయినా పర్లేదని, కళావతిని కాపాడుకోవాలని అబార్షన్ చేయించాలని అనుకున్నానని చెప్పడంతో రాజ్‌ను పట్టుకుని అపర్ణ ఏడుస్తుంది. ఇందిర, కావ్యలు రాజ్ తీరు గురించి మాట్లాడుకుంటూ ఉండగా.. అపర్ణ వచ్చి అబార్షన్ చేయించుకోకపోతే నువ్వు చనిపోతావని చెబుతుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ నా బిడ్డకు ఊపిరి పోస్తానని కావ్య తేల్చి చెబుతుంది.

సెప్టెంబర్ 27వ తేదీ 837వ ఎపిసోడ్‌లో..
నువ్వు మాకు కావాలని.. రాజ్‌ని, నీ బిడ్డని, మా అందరినీ వదిలేసి చనిపోతావా అంటూ కావ్యని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బతిమలాడతారు. మీరేం చెప్పినా సరే నా బిడ్డను చంపుకోవడానికి నేను ఒప్పుకోను, వాడు నాకు కావాలంటూ కావ్య స్పృహ తప్పిపడిపోతుంది. నిజం చెబితే జరగబోయేది తలచుకుని రాజ్ ఉలిక్కిపడతాడు, ఎప్పటికీ ఈ నిజం చెప్పకూడదని అనుకుంటాడు. రాజ్ నిర్ణయం గురించి ఇంట్లో వాళ్లంతా మాట్లాడుకుంటూ ఉండగా.. రాజ్ మనసు మార్చడానికి ట్రై చేద్దామని, అవసరమైతే వాడి కాళ్లు పట్టుకుంటానని రాహుల్ చెబుతాడు. ఉదయాన్నే కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ వస్తాడు. చెప్పినట్లుగానే కావ్య అబార్షన్ గురించి రాజ్‌తో మాట్లాడతాడు రాహుల్. నేను తీసుకున్న నిర్ణయం నుంచి తప్పుకోనని తేల్చిచెబుతాడు రాజ్. నీకు బిడ్డ కావాలా? నేను కావాలా తేల్చుకోవాలని కావ్యని అడగ్గా.. నాకు మీ కన్నా నా బిడ్డే ముఖ్యమని కావ్య చెప్పడంతో రాజ్ కోపంతో ఊగిపోతాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X