Brahmamudi weekly roundup: రాజ్‌తో విడాకులకు కావ్య రెడీ.. సుభాష్‌కి గుండెపోటు, రుద్రాణికి గోల్డెన్ ఛాన్స్

Photo Courtesy: JioHotstar

రాజ్‌లో రోజు రోజుకు మొండితనం ఎక్కువ కావడంతో ఏం చేయాలో తెలియక కావ్యతో మాట్లాడతారు ఇందిర, అపర్ణ. ఆయన మనసులో ఏముందో, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో నేను కనుక్కుంటానని చెబుతుంది కావ్య. అబార్షన్‌కు కావ్య ఒప్పుకోకపోవడంతో టాబ్లెబ్స్ ద్వారా బిడ్డను తీసేయాలని రాజ్ అనుకుంటాడు. తెలిసిన మెడిసిన్ షాపులో అబార్షన్ టాబ్లెట్స్ తీసుకుని కావ్య తాగే జ్యూస్‌లో కలుపుతాడు. అయితే తన భార్యకు ఏం కాకూడదని గ్లాస్ మార్చేస్తాడు. కావ్యకి కిచెన్‌లో జ్యూస్ కనిపించడంతో టెస్ట్ చేయించగా అందులో అబార్షన్ టాబ్లెట్స్ కలిపినట్లు రిపోర్ట్ వస్తుంది.

ఈ విషయం గురించి డాక్టర్ మాత్రమే నిజం చెబుతుందని ఆమెను కలిసేందుకు రాజ్‌ను ఊరి చివరికి పంపి తను డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అయితే రాజ్‌కి కళ్యాణ్ ద్వారా కావ్య ఆసుపత్రికి వెళ్తున్నట్లు తెలియడంతో నాటకం ఆడి డాక్టర్‌ను కావ్య కలవకుండా చేస్తాడు. కళ్యాణ్ మీద కావ్యకి అనుమానం వచ్చి నిజం చెప్పమని నిలదీస్తుంది. అన్ని ప్రయత్నాలు వృథా కావడంతో రాజ్‌కి విడాకులు ఇస్తున్నట్లు నాటకం ఆడాలని నిర్ణయించుకుంటుంది. నాకు కడుపులోని బిడ్డే ముఖ్యమని అవసరమైతే మీకు విడాకులు ఇచ్చేస్తానని రాజ్‌కి తేల్చి చెబుతుంది కావ్య. మన వల్లే అక్కా బావ విడిపోయే పరిస్ధితులు వచ్చాయని అప్పూ, కళ్యాణ్‌లు బాధపడతారు.

Brahmamudi Telugu Serial Weekly roundup September 29th to October 4th episode Story

Photo Courtesy: JioHotstar

బ్రహ్మముడి సెప్టెంబర్ 29తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు .. 838వ ఎపిసోడ్ నుంచి 843 వరకు ఏం జరిగిందంటే?

సెప్టెంబర్ 29వ తేదీ 838వ ఎపిసోడ్‌లో..
వదినకు, ఇంట్లో వాళ్లకు త్వరగా నిజం చెప్పమని రాజ్‌తో చెబుతాడు కళ్యాణ్. కళ్యాణ్‌ను ఓ మెడికల్ షాపుకు తీసుకెళ్తాడు రాజ్. ఇది మా ఫ్రెండ్ షాపు అని డాక్టర్ పేరు చెప్పి అబార్షన్ ట్యాబ్లెట్స్ తీసుకురమ్మని చెబుతాడు. దాంతో కళ్యాణ్ వణికిపోతాడు కానీ అన్నయ్య మాట కాదనలేక లోపలికి వెళ్లి అబార్షన్ టాబ్లెట్స్ అడుగుతాడు. డాక్టర్ చెబితేనే టాబ్లెబ్స్ ఇస్తానని చెప్పడంతో రాజ్‌తో డాక్టర్ మాదిరిగా మాట్లాడించి టాబ్లెట్స్ సంపాదిస్తాడు కళ్యాణ్. అసలు రాజ్‌ ఎందుకు తనకు అబార్షన్ చేయించాలని అనుకుంటున్నాడో తెలుసుకోవడానికి ఇంటి నిండా పిల్లల పోస్టర్లు అంటిస్తుంది. ఇలా ఎందుకు చేస్తున్నావని ఇందిర అడగ్గా.. మీ మనవడు ఖచ్చితంగా ఇది చూసి నిజం చెబుతాడని అంటుంది. అప్పులే లోపలికి వచ్చిన రాజ్ తన బెడ్ రూంలో పిల్లల పోస్టర్లు చూసి ఎమోషనల్ అవుతాడు.

సెప్టెంబర్ 30వ తేదీ 839వ ఎపిసోడ్‌లో..
పిల్లల పోస్టర్లు ఎందుకు అంటించావని రాజ్ అడగ్గా.. పిల్లల్ని చూసైనా మీరు పిచ్చి ప్రయత్నాలు ఆపుతారని ఇలా చేస్తున్నానని అనడంతో కళ్యాణ్ బాధపడుతూ బయటికి వెళ్లిపోతాడు. ఇంతలో పనిమనిషి రత్తాలుని పిలిచి నాకు జ్యూస్ ఇచ్చే టైం అవుతుందని చెబుతుంది కావ్య. అది విన్న రాజ్.. కావ్యకి నేను జ్యూస్ ఇస్తానని పనిమనిషిని పంపించేస్తాడు. జ్యూస్‌లో అబార్షన్ ట్యాబ్లెట్స్ కలుపుతుండగా ఒక్కసారి ఆలోచించమని కళ్యాణ్ అంటాడు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో మీ వదినను కాపాడుకోవడానికి ఇంతకీ మించి మరో మార్గం లేదని రాజ్ తేల్చేస్తాడు. పనిమనిషి రత్తాలు కాకుండా రాజ్ రాజ్ జ్యూస్ ఇవ్వడంతో కావ్యకు డౌట్ వస్తుంది. వదిన జ్యూస్ తాగకుండా ఆపాలని అనుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు కళ్యాణ్. కానీ అప్పటికే కావ్య జ్యూస్ తాగేయడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. ఆ వెంటనే రాజ్‌ని బయటికి తీసుకెళ్లగా.. మీ వదినకి టాబ్లెట్స్ కలిపిన జ్యూస్ ఇవ్వలేదని, గ్లాస్ మార్చేశానని చెబుతాడు రాజ్.

Brahmamudi Telugu Serial Weekly roundup September 29th to October 4th episode Story

Photo Courtesy: JioHotstar

అక్టోబర్ 1వ తేదీ 840వ ఎపిసోడ్‌లో..
కొరియర్ తీసుకెళ్లడానికి బయటికి వచ్చిన కావ్యకు కిచెన్ రూమ్‌లో మరో జ్యూస్ గ్లాస్ కనిపించడంతో ఏం జరిగిందో తెలుసుకోవాలని ల్యాబ్‌కు పంపిస్తుంది. జ్యూస్‌లో అబార్షన్ టాబ్లెట్స్ కలిపారని ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. డాక్టర్ దగ్గరే అసలు నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. రాజ్ ఉంటే తనను ఆసుపత్రికి వెళ్లనివ్వడని ఊహించిన కావ్య.. ఇందిర ద్వారా పథకం వేస్తోంది. దీనిలో భాగంగా నాయనమ్మ తైలం కోసం రాజ్ ఊరు చివరన ఉన్న ఫాంహౌస్ దగ్గరికి వెళ్తాడు. కావ్య ఆసుపత్రికి బయల్దేరిన విషయం తెలుసుకున్న కళ్యాణ్.. వెంటనే ఈ విషయాన్ని రాజ్‌కి చెబుతాడు. దాంతో షాకైన రాజ్.. కళావతిని ఆపడానికి రకరకాల ప్లాన్లు వేస్తాడు.

అక్టోబర్ 2వ తేదీ 841వ ఎపిసోడ్‌లో..
కావ్యని ఆపడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో రాజ్ టెన్షన్ పడతాడు. అయితే డాక్టర్ దగ్గర పనిచేసే ఓ నర్స్ రాజ్‌కి ఫోన్ చేయడంతో ఆమెను సాయం కోరతాడు. హాస్పిటల్‌కి వెళ్లిన కావ్యను చాలాసేపు వెయిట్ చేయిస్తుంది నర్స్. తనకంటే వెనుక వచ్చినవారు ముందుగానే డాక్టర్‌ని కలవడంతో నర్స్‌ని కావ్య నిలదీస్తుంది. కావ్య మేడంని ఎక్కువసేపు ఆపలేకపోతున్నానని త్వరగా రమ్మని రాజ్‌కి నర్స్ చెబుతుంది. నేను పటాన్ చెరుకి దగ్గరలో ఉన్నానని రాజ్ చెప్పడంతో మా డాక్టర్ గారి అత్తారింటికి దగ్గరలో ఉన్నారని, హాస్పిటల్ చాలా దూరమని నర్స్ టెన్షన్ పడుతుంది. దాంతో రాజ్‌కి ఓ ఐడియా వచ్చి వెంటనే డాక్టర్ గారి అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్తాడు. డాక్టర్ గారి అత్తగారిని కట్టేసి, నగలు దోచుకుంటున్నట్లుగా నాటకం ఆడి ఆమెను హాస్పిటల్ నుంచి వచ్చేలా చేస్తాడు రాజ్. అత్తగారింటిలో రాజ్‌ని చూసి షాక్ అవుతుంది డాక్టర్. హాస్పిటల్‌లో డాక్టర్ గారు నిజం చెప్పకపోవడంతో కావ్య నిరాశపడుతుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి వదిన డాక్టర్‌ని కలవలేదు కదా అని అంటాడు.. అది విని కావ్య షాక్ అవుతుంది

Brahmamudi Telugu Serial Weekly roundup September 29th to October 4th episode Story

Photo Courtesy: JioHotstar

అక్టోబర్ 3వ తేదీ 842వ ఎపిసోడ్‌లో..
నేను హాస్పిటల్‌కి వెళ్లిన విషయం, డాక్టర్‌ని కలవని విషయం కవిగారికి ఎలా తెలిసింది? అని ఆలోచిస్తుంటుంది కావ్య. రాజ్ గారు ఎందుకు అబార్షన్ చేయించాలని అనుకుంటున్నారో? ఎందుకు బిడ్డను వద్దు అనుకుంటున్నారో? కవిగారికి తెలిసే ఉంటుందని అనుకుంటుంది. చీకట్లో బాణం వేసి నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. వెంటనే వెళ్లి నువ్వు, మీ అన్నయ్య కలిసి ఆడుతున్న డ్రామా గురించి నాకు తెలిసిపోయిందని కావ్య అనడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. వీరి మాటల్ని విన్న రాజ్.. కావ్యకి ఏం తెలియదని, నువ్వు ఓపెన్ కావొద్దని సైగలు చేయడంతో కళ్యాణ్ అలర్ట్ అవుతాడు. సుభాష్ ఫ్రెండ్ ఒకరు ఇంటికొచ్చి తన కూతురి శ్రీమంతానికి ఆహ్వానించి.. రాజ్ - కావ్యల మధ్య జరుగుతున్న గొడవల గురించి జనం నానారకాలుగా మాట్లాడుకుంటున్నారని చెబుతాడు. మీ కుటుంబం పరువుని నవ్వుల పాలు చేయొద్దని హితవు చెబుతాడు. దాంతో సుభాష్, అపర్ణలు రాజ్ మీద కేకలు వేస్తారు.

అక్టోబర్ 4వ తేదీ 843వ ఎపిసోడ్‌లో..
మీ ఇద్దరు గొడవలు పడి దుగ్గిరాల ఇంటి పరువును నడిబజారులో పడేస్తున్నారని రాజ్‌పై సీరియస్ అవుతాడు సుభాష్. ఈ కుటుంబాన్ని ఎక్కడో నిలబెట్టిన వాడే, పరువు తీస్తున్నాడని కొడుకుని నానామాటలు అంటాడు. నువ్వు బిడ్డను తీసేస్తావా? లేదా? అని కావ్యని ఫైనల్‌గా అడుగుతాడు. అక్కడి వరకు వస్తే నాకు బిడ్డే కావాలని, మీకు విడాకులైనా ఇచ్చేస్తానని తేల్చిచెబుతుంది. ఆ మాటలతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. మనం ఏం చేయకుండానే కావ్య, రాజ్‌లు విడిపోతున్నారని ఈ గొడవని ఇలాగే పెంచి ఈ ఇంటిని ముక్కలు చేసి ఆస్తిని దక్కించుకోవాలని రుద్రాణి, రాహుల్ ప్లాన్ చేస్తారు. ఇంట్లో జరుగుతున్న గొడవలతో సుభాష్‌కి గుండెపోటు వస్తుంది. సమయానికి అపర్ణ ఉండటంతో అతను సేవ్ అవుతాడు. అక్కకి నిజం చెప్పకపోవడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదని, అక్కా- బావ విడిపోతారని కళ్యాణ్‌ దగ్గర అప్పూ బాధపడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X