Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బుల్లితెరపై యంగ్ యాంకర్ మ్యాజిక్.. క్రేజీ షో కోసం బ్రియాన్ లారా, ఇర్ఫాన్ పఠాన్
కరోనావైరస్ లాక్‌డౌన్ తర్వాత తెలుగు టెలివిజన్ రంగంలో షూటింగులు, కొత్త షోలు జోరందుకొన్నాయి. ఇప్పటికే హిట్లర్ గారి పెళ్లాం లాంటి సీరియల్ జీ తెలుగు టెలివిజన్‌లో ప్రారంభం కాగా, ఈటీవీలో నువ్వు రెడీ నేను రెడీ షో ప్రారంభానికి సిద్ధమైంది. ఈ టెలివిజన్ షో కోసం బ్రియాన్ లారా, ఇర్ఫాన్ ఖాన్ లాంటి క్రికెటర్లు ముందుకు రావడం ఆసక్తిగా మారింది. ఆగస్టు 20న ప్రారంభమైన ఈ షో గురించి..
Recommended Video

క్రేజీగా మొదలైన NRNR షో
నువ్వు రెడీ నేను రెడీ షో కోసం ప్రోమోలను ఆసక్తిగా రూపొందించారు. గురువారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఈ షో ప్రారంభమైంది. 100 శాతం వినోదం కూడిన కార్యక్రమాన్ని మిస్ చేసుకొండి. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటున్నందున్న చూసి ఎంజాయ్ చేయండి అంటూ మలెమాల టెలివిజన్ ప్రోమోలో పేర్కొన్నది.

యాంకర్ రవి, వింధా యాంకర్లుగా
నువ్వు రెడీ నేను రెడీ షోకు వింధ్యా మేడపాటి, రవి యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో ప్రారంభానికి ముందే తమ టాలెంట్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ప్రోమోలో ఒకరిపై ఒకరు వేసుకొన్న సెటైర్లు ప్రేక్షకుల్లో క్రేజ్‌ను పెంచాయి. దాంతో మరో వినోదభరితమైన షో ప్రేక్షకుల ముందుకు వస్తున్నదనే అభిప్రాయం కలిగింది.

బ్రియాన్ లారా, ఇర్ఫాన్ విషెస్
నువ్వ రెడీ నేను రెడీ షో సక్సెస్ కావాలంటూ దిగ్గజ క్రికెటర్లు బ్రియాన్ లారా, ఇర్ఫాన్ పఠాన్ విషెస్ అందించారు. బ్రియన్ లారా, ఇర్ఫాన్ ఖాన్ అందించిన శుభాకాంక్షలను తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వింధ్యా మేడపాటి షేర్ చేశారు. దీంతో ఈ షోపై క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిని పెంచుకొన్నారు.

స్టార్ స్పోర్ట్స్ తెలుగుకు హోస్ట్‌గా
ఇక యాంకర్ వింధ్యా మేడపాటి విషయానికి వస్తే... తెలుగు బుల్లితెరపైన ఇటీవల కాలంలో విశేషంగా రాణిస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో క్రికెట్ మ్యాచ్‌లకు కామెంటరీ, యాంకర్, హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ కారణంగానే పలువురు క్రికెటర్లతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయం కారణంగానే ఈ షోకు వారు అభినందనలు, శుభాకాంక్షలు అందిస్తున్నారు.