Just In
- 23 min ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 40 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 56 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 1 hr ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
Don't Miss!
- Finance
దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్‌లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు
- News
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగబాబు, తాను జబర్ధస్త్‌ను వీడడం వెనుక అసలు రహస్యం చెప్పేసిన చమ్మక్ చంద్ర.!
బుల్లితెరపై వస్తున్న షోలలో అత్యంత ప్రజాదరణ పొందింది ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న జబర్ధస్త్. దాదాపు ఏడేళ్లుగా ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. అందుకే జబర్ధస్త్ చాలా ఫేమస్ అయిపోయింది. ఈ షో ద్వారా పాపులర్ అయిన వాళ్లలో చమ్మక్ చంద్ర ఒకడు. జబర్ధస్త్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఆయన గురించి మాట్లాడుకునేలా ప్రభావం చూపిస్తున్నాడు.
షో ఆరంభం నుంచి కొనసాగిన చంద్ర.. ఇటీవల జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పేసి, నాగబాబుతో సహా మరో ఛానెల్‌లో ప్రసారం అవుతున్న షోకు వెళ్లిపోయాడు. తాజాగా దీని వెనుక అసలు రహస్యాన్ని రివీల్ చేశాడతను. ఇంతకీ చంద్ర ఏం చెప్పాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే....

అందరిలో చంద్ర ప్రత్యేకం.. కారణం ఇదే
జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన చమ్మక్ చంద్ర.. ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీనికి కారణం అతడు చేసే స్కిట్లలో ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా ఉండడమే. ఈ ఒక్క కారణంతోనే చంద్రకు భారీ క్రేజ్ వచ్చింది. అలాగే, స్కిట్టు స్కిట్టుకు తనకంటూ ప్రత్యేకమైన మేనరిజాన్ని చూపిస్తుంటాడు. దీంతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు.

అక్కడ కూడా బాగా మెరుస్తున్నాడు
చంద్ర.. టీవీ షోలకే పరిమితం అవలేదు. సినీ రంగంలోనూ అతడు తన మార్క్‌ను చూపించాడు. ‘అ ఆ', ‘అరవింద సమేత', ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ', ‘రాజా ది గ్రేట్', ‘టాక్సీవాలా' సహా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచాడు. ఇక, వెంకటేష్ నటించిన ‘బాబు బంగారం' అనే సినిమాలోనైతే లేడీ గెటప్ వేసి ఓ పాటకు డ్యాన్స్ కూడా చేశాడు. ఇది అప్పట్లో హైలైట్ అయింది.

అలా వెళ్లాడు.. ఇలా తిరిగి వచ్చాడు
కొద్ది రోజుల క్రితం జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ వస్తున్న నాగబాబు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన వెళ్లిన సమయంలో షో నుంచి చమ్మక్ చంద్ర కూడా తప్పుకున్నాడు. దీనిపై మాట్లాడుతూ కొత్తదనం కోసం బ్రేక్ తీసుకున్నానని అప్పుడు చెప్పుకొచ్చాడు. తర్వాత రెండు వారాలకే జబర్ధస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతడితో పాటు కిర్రాక్ ఆర్పీ కూడా ఇదే పని చేశాడు.

ఈ సారి మొత్తానికే వెళ్లిపోయాడు
జబర్ధస్త్‌ను వీడిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు మరో చానెల్‌లో ప్రసారం అవుతున్న ‘అదిరింది' అనే కామెడీ షోలోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా పాత జబర్ధస్త టీమ్ లీడర్లు ధన్‌రాజు, వేణు బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. అలాగే, వీరితో పాటు చమ్మక్ చంద్ర కూడా ఓ టీమ్‌ను లీడ్ చేస్తున్నాడు. అతడితో ఆర్పీ కూడా జబర్ధస్త్ నుంచి వచ్చేశాడు.

అసలు రహస్యం చెప్పేసిన చమ్మక్ చంద్ర.!
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు చంద్ర ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా నాగబాబు, తాను జబర్ధస్త్‌ను వీడడం వెనుక అసలు రహస్యం చెప్పేశాడు. ‘జబర్ధస్త్‌కు డైరెక్టర్లుగా పని చేసిన నితిన్, భరత్ వేరే చానెల్‌కు వెళ్లారు. ఆ సమయంలో వాళ్లు నాగబాబు గారిని నన్ను హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేశారు. దీంతో మేము కూడా జబర్దస్త్‌ను వీడాము. అంతేకానీ, గొడవలు.. రెమ్యూనరేషన్ వంటివి కారణం కాదు' అని చెప్పాడు.

మల్లెమాల వాళ్ల రియాక్షన్ ఇదే
జబర్ధస్త్ నిర్మాణ సంస్థ మల్లెమాలకు ఈ విషయం చెప్పగానే మంచిగానే రియాక్ట్ అయ్యారని చంద్ర వెల్లడించాడు. ‘నాగబాబు సార్, నేను వెళ్లి షో నుంచి తప్పుకుంటున్న విషయాన్ని మల్లెమాల వాళ్లకు చెప్పాం. దీనికి వాళ్ల పాజిటివ్‌గానే స్పందించారు. మీ కంఫర్ట్ మీరు చూసుకోండి సార్ అని మంచిగానే చెప్పారు. ఇప్పటికీ మాతో టచ్‌లోనే ఉన్నారు' అని చంద్ర తెలిపాడు.