»   » ఆ షో టెలీకాస్ట్ ని అడ్డుకున్నది చిరంజీవే.... ఎందుకంటే..

ఆ షో టెలీకాస్ట్ ని అడ్డుకున్నది చిరంజీవే.... ఎందుకంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున హోస్ట్ గా ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోను ఈ సారి మెగాస్టార్ చిరంజీవి చేత చేయించాలని మాటీవీ యాజమాన్యం యోచిస్తోంది. ఇప్పటి దాకా నాగ్ మూడు సీజన్లు చేశారు..నాలుగో సీజన్ డిసెంబర్ 12 నుంచి మొదలుకాబోతోంది. దీనికి హోస్ట్ గా నాగ్ కు బదులు చిరు చేస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. నాగ్ వద్దన్నారో లేక చిరు ఆసక్తి చూపారో తెలీదు గానీ నెక్స్ట సీజన్ మాత్రం చిరు చేయడం ఖాయం అయింది.

మూడో సీజన్ లో ఓ గెస్ట్ గా చిరంజీవి ఎంఇకె లో పాల్గొన్నారు. చిరు కోసం టైమింగ్స్ కూడా మార్చారు. సోమవారం నుంచి గురువారం దాకా ప్రతీరోజూ రాత్రి 8-30 గంటలకే ఇది ప్రసారమవుతుంది. అయితే ఈ షో ఎప్పుడో మొదలు కావల్సి ఉన్నా వాయిదా వేస్తూ వస్తున్నారు.కొన్ని ఎపిసోడ్ లు షూట్ అయ్యక కూడా ఎందుకు ఈ షో ప్రసారం చేకుండా ఆపారూ అన్నది అందరికీ వచ్చిన అనుమానం... అయితే ఇలా డిలే అవ్వటానికి చిరు నే అన్నది లేటెస్ట్ టాక్. ఇంతకీ మెగాస్టార్ ఈ షో ని ఎందుకు ఆపారూ అంటే....

Chiranjeevi strategy to Telecast Meelo evaru koteeswarudu after Khaidi Is Working Well

ఎన్నో ఏళ్ల తర్వాత తనని తెరపై చూడ్డానికి అందరిలోనూ విపరీతమైన ఎక్సైట్ మెంట్ ఉంటుందని చిరంజీవికి తెలుసు. అయితే ఖైదీ రావటానికి ముందే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో బుల్లితెరపై రోజూ కనిపించేస్తూ ఉంటే అప్పటి వరకూ సినిమా మీద ఉన్న క్రేజ్ తప్పకుండా తగ్గుతుంది. దాని ఎఫెక్ట్ 'ఖైదీ నంబర్ 150' కలెక్షన్లపై పడుతుంది... దీన్ని ముందు గానే ఊహించిన మెగా స్టార్ కావాలనే సినిమా వచ్చెంత వరకూ ఈ షో టెలీకాస్ట్ కాకుండా ఆపారట.

అందుకే ఇటు తన సినిమాకీ, అటు తన టీవీ షోకి రెండిటికీ కలిసి వచ్చేలా ముందుగా సినిమా రిలీజ్ అయిన తర్వాతే షో ప్రసారం మొదలు పెట్టాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. అందులోనూ ఖైదీ నెం 150 అంచనాలని మించిన విజయాన్ని అందుకోవటం తో ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా మంచి టీఆర్పీలని సాధించగలుగుతుంది. ఇలా చిరంజీవి సూచనలు బాగుండడంతో ఆ కార్యక్రమం టెలికాస్ట్ కొద్ది రోజులు హోల్డ్లో పెట్టారట మాటీవీ యాజమాన్యం. ఖైదీ ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో త్వరలోనే ఈ షో ప్రసారం మొదలు కానుంది. చిరంజీవికి దక్కిన ఘన స్వాగతాన్ని చూసి మా టీవీ యాజమాన్యం కూడా సంబరపడిపోతోందట. అంతేకదా మరి ఎప్పటికప్పుడు మారెస్ లెక్కలని బట్టే నడవాలి మరి

English summary
Chiranjeevi suggested to delay telecasting Meelo Evaru Koteeswarudu new seres after khaidi no 150 is out
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu