»   »  రూల్స్ క్రాస్ చేశావ్, గెట్ ఔట్... బిగ్‌బాస్ షోలో ధన్ రాజ్ మీద ఎన్టీఆర్ ఆగ్రహం!

రూల్స్ క్రాస్ చేశావ్, గెట్ ఔట్... బిగ్‌బాస్ షోలో ధన్ రాజ్ మీద ఎన్టీఆర్ ఆగ్రహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్ బాస్ ప్రారంభంలోనే షోను హోస్ట్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమెడియన్ ధనరాజ్ మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ పోటీదారులను పరిచయం చేద్దామని ఎన్టీఆర్ సిద్ధమవ్వగానే నలుగురు వ్యక్తులు తట్టా, బుట్టా వేసుకుని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యారు. వారిని చూసి షాకైన ఎన్టీఆర్ ఎంటి ఇదంతా? ఎవరు మీరంతా అని వారిపై అగ్రహం వ్యక్తం చేసే లోపే అన్నా అన్నా అంటూ కమెడియన్ ధనరాజ్ ఎంట్రీ ఇచ్చాడు.

తాను పిలవకుండానే షో లోకి ఎందుకు వచ్చావ్ అంటూ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తట్టా బుట్టా ఏంటి? అని ఎన్టీఆర్ ప్రశ్నించడంతో 70 రోజుల పాటు బిగ్ బాస్ ఇంట్లో ఉండాలి కదా, అందుకే ఆవకాయ్ పచ్చడి, సున్నుండలు, బొబ్బట్లు తీసుకొచ్చానని ధనరాజ్ చెప్పడంతో ఇలాంటివన్నీ హౌస్ లోకి అనుమతించరని ఎన్టీఆర్ మండి పడ్డారు.

రూల్స్ క్రాస్ చేశావ్, గెట్ ఔట్

రూల్స్ క్రాస్ చేశావ్, గెట్ ఔట్

నేను పిలవకుండా హౌస్ లోకి ఎంటరవ్వడంతో పాటు, ఈ తట్టా బుట్టా వేసుకుని లోనికి వెళ్లాలని ప్రయత్నించావ్.... నువ్వు రూల్స్ క్రాస్ చేశావ్, నీకు ఈ షోలో అనుమతి లేదు, గెట్ ఔట్ అంటూ ఫైర్ అయ్యాడు ఎన్టీఆర్. దీంతో ధనరాజ్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడే ప్రయత్నం చేశాడు.

Bigg Boss Telugu : List Of Celebrities Participating In NTR's Bigg Boss Show
జస్ట్ ఫన్ క్రియేట్ చేసేందుకే..

జస్ట్ ఫన్ క్రియేట్ చేసేందుకే..

అయితే ఎన్టీఆర్, ధనరాజ్ మధ్య జరిగిన కాన్వర్జేషన్ అంతా జస్ట్ ఫన్ క్రియేట్ చేసేందుకు కావాలని చేసిందే. అయితే ఫన్ క్రియేట్ చేసే క్రమంలో వీరిద్దరూ కాస్త ఓవర్ చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

బిగ్ బాస్ డబ్బుతో ఇల్లు కొంటాను

బిగ్ బాస్ డబ్బుతో ఇల్లు కొంటాను

తాను ఈ బిగ్ బాస్ షో ఒప్పుకోవడానికి కారణం మా ఆవిడే. ఆమెకు ఇల్లు గిఫ్టుగా ఇస్తానని మాటిచ్చాను. ఎంతకష్టమైనా చివరి వరకు ఉండి విజేతగా నిలుస్తానని, మా ఆవిడకు గిఫ్టు ఇస్తానని ధనరాజ్ ధీమా వ్యక్తం చేశాడు.

బిగ్‌బాస్ హౌస్‌లో బ్రతకడం ఎలా? తెలంగాణ సింగర్ మధు ప్రియ ఉద్వేగం!

బిగ్‌బాస్ హౌస్‌లో బ్రతకడం ఎలా? తెలంగాణ సింగర్ మధు ప్రియ ఉద్వేగం!

హౌస్‌లోకి ప్రవేశించగానే సింగర్ మధు ప్రియ ఉద్వేగానికి లోనయ్యారు. హౌస్‌లోకి ప్రవేశించే ముందు ఆమె మాట్లాడుతూ.... ఈ షోలోకు ఎప్పుడు వెళ్తానా? ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ ఉండేదని తెలిపింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Comedian DhanRaj Fantastic Entry to BiggBoss Telugu Show. Jr NTR's Bigg Boss Telugu is said to be the most expensive TV show ever produced in Telugu. A massive house has been constructed at more than 10,000 square feet area, which has been equipped with 60 cameras.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu