‘జబర్దస్త్‌ను వదిలేయలేదు.. వాళ్లే పంపించారు.. తిరిగి వస్తామంటే’
కమెడియన్ గా ధన్ రాజ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. 1999 నుంచి ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. తన టాలెంట్ ను రుజువు చేసుకుంటూ వస్తున్నారు. 25 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమలో ఉంటూ కమెడియన్ గా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను వెండితెరపై అలరిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 70 వరకు చిత్రాల్లో కమెడియన్ గా అలరించడం విశేషం. కానీ ధన్ రాజ్ కు తెలుగు పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. స్టార్ కమెడియన్ గా ఎదిగారు. తనకంటూ చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది.
జబర్దస్త్ కామెడీ షో 2013లో ప్రారంభం అవ్వగా మొదటి సారిగా టీమ్ లీడర్ గా ఎంపికైన వారిలో ధన్ రాజ్ కూడా ఒకరు కావడం విశేషం. అలా జబర్దస్త్ కామెడీ షో వేదికపై 2013 నుంచి 2017 వరకు 4 ఏళ్ల వరకు తన కామెడీ స్కిట్స్ తో అలరించారు. ఆ తర్వాత జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయారు. ఇక ధన్ రాజ్ వెళ్లిపోవడానికి అసలు కారణం ఏంటనే దానిపై తాజాగా స్పందించారు. ఆయన ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో వివరించారు. ధన్ రాజ్ మాట్లాడుతూ..

'అలీ టాకీస్ షోకు వేణు, నన్ను యాంకర్లు చేయమని అడిగారు. ఇక ఎంతకాలం ఆర్టిస్ట్ లు చేస్తామని చేద్దామని అనుకున్నాం. కానీ జబర్దస్త్ నిర్వాహకులు, మల్లెమాలకు ఒక విషయం చెబుదామని అన్నాను. అందుకు వేణు సరేనని అన్నారు. నేను ఇదే విషయాన్ని శ్యామ్ ప్రసాద్ గారి అమ్మాయి మేడమ్ గారితో చెప్పాను. జబర్దస్త్ కు, ఆ షోకు డేట్స్ విషయంలో సమస్య ఏమీ రాదని చెప్పాను. కానీ మేడమ్ ఒక మంచి మాట చెప్పారు. ఎప్పుడైనా టీవీ రంగంలో ఎక్ల్సూజివ్ నెస్ ఉంటుంది. మీరు ఇక్కడ కనిపించడం, అక్కడ కనిపించడం బాగుండదు.
కావాలంటే మీరు అక్కడ షో చేసి, ఆ తర్వాత ఇక్కడికి రండి అని వారే పంపించారు. కానీ అక్కడి వెళ్లి కేవలం 24 ఎపిసోడ్స్ పూర్తయ్యాక షో ముగిసిపోయింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేసి తిరిగి జబర్దస్త్ కు వచ్చాం. కానీ అప్పటికే మేం చేసిన తప్పు అర్థమైంది. మేం ఇద్దరం టీమ్ లీడర్లుగా ఉండి సడెన్ గా వెళ్లిపోవడంతో వాళ్లకు చాలా సమస్యగా మారింది. ఆ సమయంలోనే సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ లు, రాకింగ్ రాకేష్ లకు టీమ్ లీడర్లుగా అవకాశం ఇచ్చారు. ఇదంతా తెలిసికా మళ్లీ అవకాశం అడగలేకపోయాం. ఇక కామెడీలో అన్ని రకాల స్కిట్లు చేశాం. జనాలకు కూడా బోర్ కొట్టే వరకు చేయడం సరికాదనిపించింది.
వాళ్లు బోర్ కొట్టి మనల్ని పంపించే ముందే.. మనమే వెళ్లిపోవడం గౌరవంగా ఉంటుంది. ఇక జబర్దస్త్ షోకు ముందు, ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాను. జబర్దస్త్ షో ద్వారా నా సినిమాలకు కూడా ప్రొడ్యూస్ చేసుకోగలగను. జబర్దస్త్ షో ద్వారా నాకు మంచి పేరు వచ్చింది. నేనైతే ఎప్పుడూ జబర్దస్త్ కామెడీ షోను మానేయాలని అనుకోలేదు. మొదట 13 ఎపిసోడ్స్ అని ప్రారంభమై ఇన్నేళ్లు కొనసాగుతూ వచ్చింది. జబర్దస్త్ లో 70 స్కిట్లు చేశాను. ప్రస్తుతం సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నాను.' అని చెప్పారు. ఇక ధన్ రాజ్ చివరిగా డైరెక్టర్ గా, నటుడిగా రామం రాఘవం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


Click it and Unblock the Notifications











