Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 హౌజ్‌లోకి కామనర్ శ్రీజా దమ్ము.. వైజాగ్ పిల్లా నోటికి తాళం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌజ్ లోకి ఈ సారి సెలబ్రెటీలతో పాటు కామనర్స్ కు కూడా నిర్వాహకులు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా వైజాగ్ కు చెందిన శ్రీజా దమ్ము హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె బిగ్ బాస్ అగ్నిపరీక్షకు ఎంపికైంది. అక్కడ నిర్వహించిన టాస్కుల్లో సత్తా చాటి కామనర్ విభాగంలో కంటెస్టెంట్ గా ఎంపికైంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున ఆమెకు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అయితే శ్రీజ దమ్మును కంటెస్టెంట్ గా అనౌన్స్ చేసేందుకు జ్యూరీగా నవదీప్ వచ్చారు.

నవదీప్ ఎంట్రీ ఇచ్చి శ్రీజా దమ్మును కామనర్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎంపిక చేశానని చెప్పారు. అందుకు కారణం ఆమెలో ఉన్న ఎనర్జీ లెవల్స్ అని చెప్పారు. ఎదుట ఎంతటి వారున్నా ఆమె తన మనస్సులో ఉన్నది బయటికి అనేస్తుంది. టపటప మాట్లాడేస్తూనే ఉంటుంది. తన వెర్షన్ వినిపించడంలో ముందుంటుంది. అందుకే శ్రీజ దమ్ము బిగ్ బాస్ హౌజ్ లో ఉంటే బాగుంటుందని అనిపించింది. ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్ష సమయంలో ఆమె శ్రీముఖిపైనే కౌంటర్ వేసింది. మరోవైపు ముగ్గురు జడ్జీలుగా ఉన్న మాపై కూడా చాలా దూకుడుగా మాట్లాడింది.

Commoner Srija Dammu Grand Entry to Bigg Boss Telugu Season 9

నా గురించి పూర్తిగా తెలుసుకోకుంటానే మీరు ఎలా జడ్జీ చేస్తారని చెప్పి షాకిచ్చింది. ఎవరైనా నార్మల్ గా జడ్జీలకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు. కానీ ఆమె ఏమాత్రం భయపడలేదు. ఇక శ్రీముఖిని కూడా నువ్వు మాట్లాడుతూ ఉంటే సర్దుకోవాల్సిందే అంటూ ధైర్యంగా కౌంటర్ వేయడం ఆమె రియాలిటీని తెలిపిందన్నారు. అందుకే ఆమెను ఎంపిక చేశానని తెలిపారు. ఇక శ్రీజ దమ్ము బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడం కరెక్ట్ అనిపించిందని నవదీప్ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఆమె పేరులోనే దమ్ము ఉంది. ఇక ధైర్యం కూడా పుష్కలంగానే కనిపిస్తోంది. ఆమె బిగ్ బాస్ హౌజ్ లో ఎంతలా అలరిస్తుందనేది చూడాలన్నారు. ఆ తర్వాత శ్రీజా దమ్ముకు 1 నిమిషం సమయం ఇచ్చి నీ గురించి చెప్పమని అనడంతో తన గురించి చాలా మంది ఎన్నో విమర్శలు చేశారని, అవన్నీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చానని చెప్పారు. ఇలాగే ఆడియెన్స్ సపోర్ట్ కూడా ఉండాలని చెప్పుకొచ్చారు.

ఇక శ్రీజా దమ్ము చేతిపై ఉన్న టాటూ గురించి నాగార్జున అడిగి తెలుసుకున్నారు. దాంతో ఆమె స్పందిస్తూ బిగ్ బాస్ తెలుగు అని టాటూ వేయించుకున్నానని చూపించింది. నాకు బిగ్ బాస్ అంటే అంత ఇష్టమని చెప్పింది. ఇక శ్రీజా దమ్ము వైజాగ్ లో పుట్టి పెరిగింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు. వారిది జాయింట్ ఫామిలీ. వైజాగ్ లోనే బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టింది. ఇన్ఫోసిస్, అసెంచర్ వంటి ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X