For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ హౌస్‌లోకి స్పెషల్ గెస్టుల ఎంట్రీ: ఆ బాధతో కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్లు.!

  |

  మూడేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు అసలైన మజాను రుచి చూపించడంతో పాటు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అన్న ట్యాగ్‌లైన్‌తో వచ్చిన దీనికి అన్ని భాషల కంటే ఎక్కువ స్పందన వస్తోంది ఇక్కడ. అందుకే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ సైతం సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లోకి స్పెషల్ గెస్టులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లను చూసిన తర్వాత కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వివరాలు మీకోసం.!

   టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది

  టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది

  తెలుగులో ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన అందుకుంటూ టాప్ షోగా పేరొందింది బిగ్ బాస్. ఈ క్రమంలోనే అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ కూడా అందుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లు ఇదే ఫలితాన్ని రాబట్టాయి. ప్రస్తుతం ప్రసారం అవుతోన్ననాలుగో సీజన్.. వాటన్నింటికీ మించిన రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా రికార్డులు బద్దలవుతున్నాయి.

  వాటన్నింటికీ మించిన కంటెంట్‌తో

  వాటన్నింటికీ మించిన కంటెంట్‌తో

  గత సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ నిర్వహకులు సరికొత్త వ్యూహాలతో ముందుకు వచ్చారని షో చూసే వారికి ఇట్టే అర్థం అయిపోతుంది. దీనికి కారణం మునుపటి సీజన్లలో కనిపించని ఎన్నో అంశాలు ఈ సారి ప్రసారం అవుతున్నాయి. బిగ్ బాస్‌ను అంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు వందకు వంద శాతం వినోదాన్ని పంచేందుకే షో నిర్వహకులు ప్రయోగాలు చేస్తున్నారు.

   ట్విస్టుల మీద ట్విస్టులతో షాక్‌లు

  ట్విస్టుల మీద ట్విస్టులతో షాక్‌లు

  నాలుగో సీజన్ విజయవంతంగా ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఇందులో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తుండడమే. గతంలో ప్రేక్షకుల అంచనాలకు తగినట్లే షో నడిచినట్లు అనిపించేది. అయితే, ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. దీంతో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకులు షోపై ఆసక్తిని కనబరుస్తున్నారు.

  కమాండో హౌస్‌గా మారిపోయింది

  కమాండో హౌస్‌గా మారిపోయింది

  ఇక, ఈ వారం లగ్జరీ, కెప్టెన్సీ పోటీదారుల టాస్కు మంగళవారం ఎపిసోడ్‌లో మొదలైంది. ఇందులో బిగ్ బాస్ ఇంటిని కమాండో హౌస్‌గా మార్చారు. ఇందులో ఒక్కో సౌండ్ వచ్చినప్పుడు కంటెస్టెంట్లు ఒక్కో పని చేయాల్సి ఉంటుంది. అలాగే, నాలుగు సార్లు బజర్లు మోగినప్పుడు నలుగురు సభ్యులు టాస్కులు చేశారు. వీరిలో ముగ్గురు విజయవంతంగా పూర్తి చేశారు.

  బిగ్ బాస్‌లోకి స్పెషల్ గెస్టుల ఎంట్రీ

  బిగ్ బాస్‌లోకి స్పెషల్ గెస్టుల ఎంట్రీ

  కమాండో హౌస్ టాస్క్ బుధవారం కూడా కొనసాగుతుందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ టాస్కులో విజయం సాధించిన ముగ్గురు కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్, అభిజీత్, దేత్తడి హారికల మధ్య కెప్టెన్సీ టాస్క్ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక, బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌ హౌస్‌లోకి ప్రత్యేకమైన అతిథులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

  Cheppina Evvaru Nammaru Lyrical Song Launch
  కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్లు.!

  కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్లు.!

  బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోయేది ఎవరో కాదు.. కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులే. అవును.. బుధవారం ఎపిసోడ్‌లో అఖిల్, హారిక, అభిజీత్‌ల మదర్స్ రాబోతున్నారు. అయితే, అప్పుడు ఆయా కంటెస్టెంట్లను ఫ్రీజ్ అవ్వవలసిందిగా బిగ్ బాస్ ఆదేశిస్తాడు. దీంతో లోపలికి వచ్చిన కుటుంబ సభ్యులతో పాటు కంటెస్టెంట్లు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

  English summary
  Akkineni Nagarjuna is an Indian film actor, producer, television presenter, and entrepreneur, who primarily works in Telugu-language films. He has also worked in some Hindi and Tamil language films. He has received nine state Nandi Awards, three Filmfare Awards South and a National Film Award-Special Mention.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X