నగ్న దేవత అంటూ బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ ఫోజులు.. పోలీస్ కేసు నమోదు!
స్వేచ్చా ప్రపంచంలో కొన్నిసార్లు సెలబ్రెటీస్ చేసే పనులు వివాదాలకు దారి తీస్తుంటాయి. ఫ్యాషన్ ప్రపంచంలో అందంతో ఆకర్షించాలని తపనపడే నటీమణులు ఎక్కువగా కాంట్రవర్సీ న్యూస్ లతో హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మిడియాలో కూడా ప్రముఖ బిగ్ బాస్ (7) కంటెస్టెంట్ ఓ వర్గం వారికి ఆగ్రహం తెప్పించేలా బోల్డ్ ఫొటోస్ తో షాకిచ్చింది.

సోఫియా హయత్..
సోషల్ మీడియాలో బిజీగా గడిపేవారికి సోఫియా హయత్ అంటే తెలియకుండా ఉండదు. బిగ్ బాస్ షోతో కూడా బాగానే క్రేజ్ అందుకుంది. అమ్మడు ఇచ్చే హాట్ స్టిల్స్ నిత్యం ఎదో ఒక కొత్త వివాదానికి దారి తీస్తుంటాయి. కాంట్రవర్సీ క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని హాట్ టాపిక్ అయ్యేలా చేయడం ఈ బ్యూటికి అలవాటే. ఇకపోతే రీసెంట్ గా సోఫియా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన బోల్డ్ ఫొటోస్ కూడా వివాదాలకు తెరలేపింది.
నేనే నగ్న దేవత..
తనకు తాను నగ్న దేవతగా ప్రకటించుకున్న సోఫియా హిందువులు పవిత్రంగా భావించే 'ఓం' ముందు బోల్డ్ స్టిల్స్ ఇచ్చింది. దాదాపు తన అందాలని మొత్తం హాట్ గా ప్రజెంట్ చేసిన సోఫియా ఓ వర్గం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఒక వ్యక్తి సోఫియా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చారు.

పోలీస్ కేసు..
సోఫియా హిందువుల మనోభావలని దెబ్బతీసేలా అవమానకరంగా ఫొటోలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ విధంగా హిందూ దేవతలను అవమాన పరిచేలా చేసిన సోఫియాపై చర్యలు తీసుకోవాలని హిందు నేషనలిస్ట్ రమేష్ సోలంకి ట్విట్టట్ ద్వారా ఆమెకు కౌంటర్ ఇచ్చారు.
Recommended Video

తప్పుగా అర్థం చేసుకోవద్దు..
సోఫియా హయత్ పోస్ట్ చేసిన ఫొటోలపై నెగిటివ్ కామెంట్స్ రావడంతో వెంటనే ఆమె సమాధానం ఇచ్చారు. తనకు హిందు ఇజం, ఇస్లాం అనే రెండు మతలపై గౌరవం ఉందని, పోస్ట్ చేసిన ఫోటోలను తప్పుగా అర్థం చేసుకోవద్దని అన్నారు. అలాగే నగ్నత్వాన్ని తప్పుగా బావించవద్దని సోఫియా వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











