Dancee plus finale: ఓంకార్ కారణంగా కన్నీళ్లు పెట్టుకున్న మోనాల్... సంకేత్ సహదేవ్ విశ్వరూపానికి షాక్!
ఓంకార్ హోస్ట్ గా ఇటీవల కాలంలో మంచి రేటింగ్ అందుకుంటున్న టాప్ డ్యాన్స్ షో డ్యాన్సీ ప్లస్ మొత్తానికి తుది దశకు చేరుకుంది. షోపై ట్రోలింగ్స్ ఎంత వస్తున్నా కూడా వీక్షకులు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా గత కొన్ని వారాలుగా టిఆర్పీ కూడా అమాంతంగా పెరుగుతూ వస్తోంది. డ్యాన్సర్స్ వారి శక్తికి మించి ప్రదర్శనను కనబరుస్తూ మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక ఫైనల్ ఎపిసోడ్ లో సంకేత్ సహదేవ్ తన విశ్వరూపాన్ని చూపించగా మోనల్ మరోసారి కన్నీళ్లు పెట్టుకుంది.

అంతకు మించి అనేలా
గతంలో ఎన్నో రకాల డ్యాన్స్ షోలను ప్రజెంట్ చేసిన ఓంకార్ ఈసారి అంతకు మించి అనేలా స్టైలిష్ గా డ్యాన్సీ ప్లస్ షోను బుల్లితెరపైకి తీసుకువచ్చారు. షోలో బాబా భాస్కర్, రఘు మాస్టర్, యశ్వంత్, మోనాల్ గజ్జర్, ముమైత్ ఖాన్ న్యాయమూర్తులుగా వారి టాలెంట్ తో షోపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

సంకేత్ సహదేవ్ విశ్వరూపం
ఇక మొత్తానికి ఈ బిగ్గెస్ట్ షో తుది దశకు చేరుకోవడంతో ఫైనల్ ఎపిసోడ్ మొత్తానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఎక్కువగా యశ్వంత్ టీమ్‌లో సంకేత్ సహదేవ్ తన విశ్వరుపాన్ని కొత్తం స్టేజ్ పై చూపించినట్లు అర్ధమయ్యింది. రాయిని మాత్రం కంటే.. సాంగ్ తో అతడు వేసిన స్టెప్స్ అందరిని షాక్ కు గురి చేశాయి.

ఫైనల్ విన్నర్ అతనే అంటూ
సంకేత్ సహదేవ్ షో.మొదలైనప్పటి నుంచి కూడా ఒక సాంగ్ తరువాత మరొక సోంగ్ తో అంతకుమించి అనేలా పెర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఇక ఫైనల్ వరకు పోరాడి వచ్చిన అతని ప్రతిభకు అందరు ఫ్యాన్ అయిపోయారు. ఫైనల్ విన్నర్ అతనే అంటూ గత వారం నుంచే న్యూస్ వైరల్ అయ్యింది. ఫైనల్ ఎపిసోడ్ పెర్ఫామెన్స్ తో అతను మరో రేంజ్ కు వెళ్లాడనే చెప్పాలి.

ఓంకార్ వల్ల ఏడ్చేసిన మోనాల్
ఇక ప్రతి ఎపిసోడ్ లో మోనాల్ గజ్జర్ ఎదో ఒక విధంగా హైలెట్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్ తో ఎంతగా అకట్టుకుంటుందో అదే రేంజ్ లో కన్నీళ్లు పెడుతూ అంతకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓంకార్ ఆమెకు ఒక ఫొటో ఫ్రేమ్ చూపించడంతో ఎంతగానో ఎమోషనల్ అయ్యింది. బిగ్ బాస్ లో ఉన్నప్పటి కంటే ఈసారి మరింత ఎక్కువగా ఏడ్చినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











