»   » నోట్ చేసుకోండి : ‘బాహుబలి' మాటీవీలో ఎప్పుడంటే...

నోట్ చేసుకోండి : ‘బాహుబలి' మాటీవీలో ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ చిత్రం ఇప్పుడు బుల్లి తెరలను అలరించబోతోంది.

మాటీవిలో ఈ చిత్రాన్ని అక్టోబర్ 25, ఆదివారం సాయింత్రం 6 గంటలకు ప్రీమియర్ షో గా ప్రసారం చేయనున్నారు. ఓ రోజు ముందు అంటే అక్టోబర్ 24న సినిమా మేకింగ్ గురించి, ఇంటర్వూలు వగైరా రెండు గంటలుపాటు ప్రసారం చేస్తారు. బాహుబలి తో దసరా రేస్ లోకి మాటీవి ప్రవేశిస్తోంది.


ముందుగా మళయాళంలో ఈ సోమవారం అంటే అక్టోబర్ 4న ఆదివారం సాయింత్రం ఆరు గంటలకు కేరళలో Mazhavil Manorama ఛానెల్ లో ప్రసారం కానుంది.


 Date fixed :Baahubali on MAA TV

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తర్వాత దసరా,దీపావళిలకు హిందీలో సోనీ మాక్స్, తెలుగులో మాటీవీ వారు ఈ సినిమాను ప్రసారం చేయనున్నారు. ఈ సినిమా ప్రసార సమయంలో టీఆర్పీలు చాలా బాగుంటాయని ఆశిస్తున్నారు. ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద మొత్తాలను పెట్టి ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఛానెల్స్ వారు తీసుకోవటం జరిగింది.


విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.


తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.

English summary
On 25th October, Sunday, 6 pm, "Baahubali" 's first ever TV premiere will be screened on popular entertainment channel MAA TV. A day before, that is on October 24th, the film's making and interviews will be aired for nearly 2 hours.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu