Just In
- 37 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నేను కూడా నీతో వచ్చేయనా: అభిజీత్‌పై ప్రేమను అలా బయటపెట్టిన దేత్తడి హారిక
సోషల్ మీడియాలో వినూత్నమైన వీడియోలతో ఎంతోగానో గుర్తింపును దక్కించుకుంది దేత్తడి హారిక. సమాజంలో జరుగుతోన్న అనే అంశాలపై ఫోకస్ చేసి వీడియోలు రూపొందించిన ఆమె సన్సేషన్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీని సొంతం చేసుకుని, బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టింది. అందులో తోటి కంటెస్టెంట్ అభిజీత్‌తో ట్రాక్ నడుపుతూ హాట్ టాపిక్ అవుతోంది. దీంతో వీళ్లిద్దరి పెళ్లి గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభిపై తనకున్న ప్రేమను మరోసారి బయట పెట్టింది దేత్తడి హారిక. ఆ వివరాలు మీకోసం!

సరైన సమయంలో అతడికి దగ్గరైంది
నాలుగో సీజన్ ఆరంభంలో మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాక్ నడిపాడు అభిజీత్. వీళ్లిద్దరూ బాగా క్లోజ్ అవుతారనుకున్న సమయంలో అనూహ్యంగా దూరమయ్యారు. అప్పుడు అతడు ఒంటరిగా ఫీల్ అయ్యాడు. సరిగ్గా ఆ సమయంలోనే దేత్తడి హారిక.. అభిజీత్‌కు దగ్గరైంది. అప్పటి నుంచి ఇద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వీళ్ల మధ్య లవ్ ఉందని ప్రచారం జరుగుతోంది.

దూరం పెడుతున్నాడని బిగ్ బాస్‌తో
బిగ్ బాస్ అనేది ఎవరికి వారే ఆడాల్సిన ఆట అని అందరికీ తెలిసిందే. అందుకు అనుగుణంగానే క్లోజ్ ఫ్రెండ్ కూడా ఒక్కోసారి కొట్టుకోవాల్సిన సమయం వస్తుంది. ఇలా ఓ టాస్కులో అభిజీత్‌ను ఒక టీమ్‌లో హారికను ఒక టీమ్‌లో ఉంచారు. అప్పుడు ఆమె ‘మమ్మల్ని ఎందుకు దూరం చేశావ్ బిగ్ బాస్. ఇద్దరినీ ఒకే టీమ్‌లో ఉంచొచ్చు కదా' అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

పక్కనే ఉంటూ అతడికి ధైర్యం చెప్పి
ఇక, ఈ సీజన్‌లో అభిజీత్‌ను కంటెస్టెంట్లు అందరూ టార్గెట్ చేసిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా అఖిల్, మోనాల్ వ్యవహారంలో అతడు బాగా ఫీలయ్యాడు. ఆ సమయంలో హారిక అతడికి అండగా నిలిచింది. ఎవరు ఏమనుకున్నా లైట్ తీసుకో అంటూ ధైర్యం చెప్పింది. అంతేకాదు, ప్రతి టాస్క్ సరిగా ఆడాలంటూ జాగ్రత్తలు చెబుతూ బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకుంది.

హారికను టూర్ తీసుకెళ్తానన్న అభి
బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చిన సమయంలో.. హారిక తరపున వాళ్ల మదర్ వచ్చారు. ఆ సమయంలో ‘ఆంటీ.. మీరు నాకో పర్మీషన్ ఇవ్వాలి. అదేమిటంటే.. బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత హారికను నేను ఒక దగ్గరకు తీసుకెళ్తా' అని కోరాడు. దీనికి ఆమె వెంటనే ఓకే చెప్పేశారు. అలాగే, తన కూతురిని చక్కగా చూసుకుంటున్నావని కితాబిచ్చారు.

అభి సీరియస్.. సారీ చెప్పి కలిసింది
షో ఆరంభం నుంచే హారిక - అభిజీత్ మధ్యలో మంచి బాండింగ్ ఏర్పడింది. వీళ్ల ఫ్రెండ్‌షిప్‌లో అతడే తరచూ ఏదో ఒక విషయంలో సీరియస్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఆమెనే ముందుగా స్పందించి సారీ చెబుతుంది. రెండు రోజుల క్రితం కూడా వీళ్ల మధ్య ఇదే తరహా పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు కూడా అభీ మాట్లాడే వరకు అతడిని వదిలి పెట్టలేదామె. దీంతో వీళ్లు మళ్లీ కలిశారు.

ప్రేమను అలా బయటపెట్టిన హారిక
తాజాగా జరిగిన నెంబర్ గేమ్ టాస్కులో అభిజీత్ వరస్ట్ పెర్ఫార్మర్ అయ్యాడు. దీంతో అతడిని జైల్లో పెడుతున్నట్లు ప్రకటించాడు బిగ్ బాస్. ఆ సమయంలో హారిక అస్సలు తట్టుకోలేకపోయింది. విలవిలా ఏడుస్తూ అలా కూర్చుండిపోయింది. ఆ తర్వాత జైల్లో ఉన్న అభితో ‘నేను కూడా ఇందులో నుంచి దూరి లోపలికి వచ్చేయనా' అని అడిగి అతడిపై తన ప్రేమను బయట పెట్టుకుంది.