Just In
- 39 min ago
తెలుగులో ఆ హీరో అంటేనే ఇష్టమన్న రోజా: అలాంటి వాళ్ల వల్లే సినిమాలు చేయట్లేదంటూ!
- 1 hr ago
యంగ్ హీరో అమర్‌పై ఆరియానా ఆరోపణలు: ఏకంగా ఆమె ఇంటికెళ్లి రచ్చ.. నా ప్రాణం అంటూ అలా!
- 1 hr ago
ప్రముఖ నిర్మాతకు భారీ షాకిచ్చిన నమ్రత శిరోద్కర్: మీ భార్య మిస్టేక్ చేసిందంటూ మహేశ్ బాబుకు ట్వీట్
- 2 hrs ago
పోర్న్ స్టార్‌గా మారిన నోయల్ మాజీ భార్య: ఎస్తర్ నిర్ణయానికి షాకౌతోన్న సినీ ప్రియులు
Don't Miss!
- News
ఏపీ దెబ్బకు దిగొచ్చిన తమిళనాడు ... సంక్రాంతి సమయంలో బస్సుల వివాదం .. తెరపడిందిలా !!
- Automobiles
షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి
- Sports
India vs Australia: భారీ షాక్.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా!!
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అభిజీత్ సిస్టర్ అనడంపై దేత్తడి హారిక షాకింగ్ రియాక్షన్: తప్పు ఎవరిదో చెబుతూ ఎమోషనల్
బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు జరిగినా కనీసం ఒక్క జంటైనా పాపులర్ అవుతూ వస్తుంది. గతంలో లవ్ ట్రాకులు నడుపుతూ ఎన్నో జోడీలు హైలైట్ అయ్యాయి. ఇక, ఈ మధ్య ముగిసిన నాలుగో సీజన్‌లో సైతం అదే రీతిలో ఫేమస్ అయ్యారు అభిజీత్ - దేత్తడి హారిక. షో ఆరంభం నుంచే చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరూ లవర్ అని అంతా ఫిక్సైపోయారు. దీంతో 'అభిక' పేరును ఇరువురి ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో హారిక తనకు చెల్లి లాంటిదని షాకిచ్చాడు అభిజీత్. ఈ నేపథ్యంలో దేత్తడి బ్యూటీ తాజాగా దీనిపై స్పందించింది. ఆ వివరాలు మీకోసం!

ఒక్కసారిగా బాంబ్ పేల్చిన మిస్టర్ కూల్
బిగ్ బాస్ విజేతగా నిలిచిన తర్వాత ఫుల్ బిజీ అయిపోయాడు అభిజీత్. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హారికతో రిలేషన్ గురించి మాట్లాడాడు. ‘హారిక నా సిస్టర్ లాంటిదని చాలా సార్లు అన్నాను. కానీ, అది షోలో చూపించలేదు. అలా ఎందుకు చేశారో అర్థం కాలేదు. బయటకు వచ్చాక ఇది తెలిసి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి' అని అన్నాడు. దీంతో అంతా షాకైపోయారు.

అభిజీత్ వ్యాఖ్యలపై స్పందించిన హారిక
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేత్తడి హారిక కూడా ఫుల్ బిజీ అయిపోయింది. బుధవారం సాయంత్రం తన ఫ్యాన్స్‌తో లైవ్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ ‘అభిజీత్ మిమ్మల్ని సిస్టర్ అనడంపై స్పందన ఏమిటి' అని అడిగింది. దీనికి ఆమె షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చింది.

‘అభిక’ విషయంలో షాకైపోయానంటూ
నెటిజన్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.. ముందుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ‘అభిక' గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది హారిక అలేఖ్య. ‘బయటకు వచ్చిన తర్వాత అభిక అనే దాని మీద మీరందరూ చూపించిన ప్రేమకు నేను షాకైపోయాను. నేనసలు దాన్ని ఊహించలేదు. ఫ్యాన్స్ చేసిన పనికి నా మైండ్ ఎగిరిపోయింది' అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది అలేఖ్య హారిక.

బిగ్ బాస్ మా ఇద్దరికీ కనెక్షన్ కలిపాడు
అభిజీత్‌తో తనకు కనెక్షన్ ఎప్పుడు కుదిరిందో చెప్పింది హారిక. ‘హౌస్ లోపలికి వెళ్లేప్పుడు బిగ్ బాస్ కనెక్షన్ కలిపే గేమ్ పెట్టాడు. అప్పుడు నాకు షూ, అభికీ సాక్స్ వచ్చాయి. అలాగే, ఇద్దరికీ నీట్‌నెస్ ఉండాలి. ఇలా మా ఇద్దరికీ ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయి. అందుకే అభీకి నాకు మధ్య కనెక్షన్ అలా కుదిరింది. అదే 15 వారాలు పాటు కొనసాగించాం' అని ఆమె వివరించింది.
తప్పు ఎవరిదో చెబుతూ ఎమోషనల్
బిగ్ బాస్ యూనిట్ తమ విషయంతో చేసిన పనిని ప్రస్తావిస్తూ.. ‘లోపల వేరు బయట వేరుగా ఉంది. మా రిలేషన్ గురించి మీకు చూపించలేదేమో కానీ అభిజీత్ చెప్పింది నిజమే. వాళ్లు అలా చూపించడం వల్లే మీరందరూ అలా అనుకున్నారు. ఇందులో మాదీ మీది ఎవరిదీ తప్పులేదు. షో చూసి అలా డిసైడ్ అయ్యేలా చేశారు' అంటూ నిర్వహకులను పరోక్షంగా విమర్శించిదామె.

సిస్టర్ అంటే అలాంటి సిస్టర్ కాదని చెప్పి
ఇక, అభిజీత్ తనను సిస్టర్ అని కామెంట్ చేయడంపై ప్రత్యేకంగా స్పందించింది దేత్తడి హారిక. ‘అభిజీత్ నన్ను సిస్టర్ అన్నాడు. అంటే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే సిస్టర్ రిలేషన్ కాదు. మా ప్రేమ, కేరింగ్ వల్ల మీకలాంటి ఫీలింగ్ కలిగి ఉండొచ్చు. మేము ఇప్పటికీ ఫ్రెండ్స్‌గానే ఉన్నాం. ప్రస్తుతం హడావిడిలో ఉన్నాం. త్వరలోనే కలుద్దామని అనుకుంటున్నాం' అని చెప్పిందామె.