For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దేత్తడి హారిక ఎలిమినేషన్ హై డ్రామా.. కానీ బిగ్‌బాస్ భారీ ట్విస్టు.. గంగవ్వ మరింత జోష్‌గా

  |

  బిగ్‌బాస్ ఇంటిలో రెండోవారం సరదాగా గడిచిపోయింది. ఇంటి నుంచి కల్యాణి బయటకు వెళ్లిపోయారు. అలాగే హారికను ఎలిమినేట్ చేశారు కానీ చివర్లో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకు ఈ వారం డబుల్ నామినేషన్ జరిగిందా? ఇంటిలో రెండో వారాంతంలో సరదాలు, సంబరాలు ఎలా సాగాయనే విషయాలు మీకోసం..

  అక్కినేని నాగేశ్వరరావు ఘన నివాళి

  అక్కినేని నాగేశ్వరరావు ఘన నివాళి

  సెప్టెంబర్ 20వ తేదీ దివంగత దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం కావడంతో బిగ్‌బాస్ వేదికపై ఒక లైలా కోసం పాటను ప్లే చేశారు. వేదిక మీద డ్యాన్సర్లు స్టెప్పులు వేస్తుండగా నాగ్ ఎంట్రీ ఇచ్చారు. తాను కూడా స్టెప్పులు వేస్తూ అలరించారు. ఆ తర్వాత ఆయన తన తండ్రిని గుర్తు చేసుకొన్నారు. ఏఎన్నార్ లైవ్స్ ఆన్ అంటూ ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత డైరెక్టుగా ఇంటి సభ్యులతో మాట్లాడుతూ కరాటే కళ్యాణి వేదిక మీదకు ఆహ్వానించారు.

  బిగ్‌బాస్‌ వేదికపైన నాగార్జునతో కల్యాణి, లైఫ్ జర్నీ

  బిగ్‌బాస్‌ వేదికపైన నాగార్జునతో కల్యాణి, లైఫ్ జర్నీ

  బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన కల్యాణి ఎమోషనల్‌గా మాట్లాడారు. తొలివారమే తిరుగు ముఖం పడుతానని అనుకొన్నాను. కానీ రెండోవారం వరకు రావడమే గ్రేట్. నా జర్నీకి నేను హ్యాపీ. నాకు మనస్తత్వానికి తగినట్టుగా ఉన్నాను. అదే నాకు మైనస్‌గా మారింది అని చెప్పారు. ఆ తర్వాత తన లైఫ్ జర్నీని చూసి భావోద్వేగానిక గురై కంటతడి పెట్టేసింది.

  వేదికపైన కల్యాణితో నాగ్

  వేదికపైన కల్యాణితో నాగ్

  కల్యాణితో నాగార్జున ఓ గేమ్ ఆడించారు. టాప్ 10లో టాప్ 5గురు.. బిలో 5 గురు ఎవరుంటారో చెప్పమని అడిగితే.. హారిక, అభిజిత్, పేర్లను పెట్టారు. ఆ తర్వాత బిగ్‌బాంబు వేసే ఛాన్స్‌ను కల్యాణికి నాగ్ ఇచ్చారు. ఎవరినైనా ఒకరిని వచ్చేవారం నామినేట్ చేయమని అడిగితే దేవీ నాగవళ్లిని నామినేట్ చేశారు. నాగవళ్లి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

  ఇంటి సభ్యులతో ఓ ఫన్నీ

  ఇంటి సభ్యులతో ఓ ఫన్నీ

  ఇంటి సభ్యులతో ఓ ఫన్నీ ఆట ఆడించారు. ఇద్దరు చొప్పున జట్లుగా చేసి పాట వస్తుంటే డ్యాన్స్ చేస్తూ అది ఆగిపోగానే ఎముక రూపంలో ఉన్న కర్రముక్కను అందుకోవాలి. ఎవరు అందుకొంటే వారు గెలిచినట్టు చేశారు. ఈ ఆటలో గంగవ్వ, అవినాష్, దివి, అరియానా ఆకట్టుకొన్నారు. గంగవ్వ డ్యాన్స్ బాగా చేసింది. అరియానా పోల్ డ్యాన్స్ చేసింది. అవినాష్ బెస్ట్‌గా ఆడినందుకు క్లీన్‌గా విజేతగా నిలిచారు.

  ఎలిమినేషన్‌లో ప్రక్రియలో

  ఎలిమినేషన్‌లో ప్రక్రియలో

  ఎలిమినేషన్‌లో ప్రక్రియలో అభిజిత్, మాస్టర్ రాజశేఖర్, సోహైల్ సేఫ్ కాగా, చివరిగా హారిక దేత్తడి, మోనాల్ గజ్జర్ మిగిలారు. వారిద్దరిలో ఎవరిని బయటకు పంపించాలన్న విషయం సెలబ్రిటీలే నిర్ణయిస్తారని ఫిట్టింగ్ పెట్టారు. రెండు జార్స్‌లో రెండు కలర్స్ పెట్టి.. కొన్ని గ్లాసుల్లో బ్లూ, గ్రీన్ కలర్స్ పెట్టారు. ఏ కలర్స్ గ్లాస్ నీళ్లు జార్‌లో పోస్టారో వాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్తారని గేమ్ రూల్ చెప్పారు. చివర్లో సమానంగా ఇద్దరి జార్స్‌లో గ్లాసులతో సమానంగా పోశారు. చివరగా ఇంటి నుంచి బయటకు వెళ్లే వ్యక్తిని నిర్ణయించే అవకాశం సుజాత చేతికి వచ్చింది. హారిక జార్‌లో కలర్ గ్లాస్ నీళ్లు పోయడంతో ఆమె బయటకు వెళ్లే జాబితాలోకి చేరిపోయారు.

  ఎలిమినేట్ అయిన హారిక దేత్తడితో

  ఎలిమినేట్ అయిన హారిక దేత్తడితో

  ఎలిమినేట్ అయిన హారిక దేత్తడితో ఇంటి సభ్యులందరూ సెల్ఫీ దిగారు. ఆ తర్వాత ఆమె సూట్‌కేసును ప్యాక్ చేసి బయటకు పంపించే సమయంలో నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. హారికను బయటకు పంపకుండా ఇంట్లోకి తీసుకొచ్చి.. ఎలిమినేట్ కాలేదని చెప్పారు. ఇంటి సభ్యులు నామినేషన్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని, అందుకే ఇలాంటి ఝలక్‌ ఇచ్చాను. ఇక నుంచి ఎవరు కూడా నామినేషన్‌ను సీరియస్‌గా తీసుకోకపోతే ఇలానే ఉంటుంది అని నాగ్ షాకిచ్చారు.

  English summary
  Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. On Day 14, Dettadi Harika Eliminated from Bigg Boss Telugu 4 after Karate Kalyani. But Bigg Boss given small twist, sent back to Bigg Boss house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X