Just In
Don't Miss!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అతడికి ముద్దు పెట్టిన హారిక: అందరూ చూస్తుండగానే.. లిప్‌స్టిక్ అంటుకునేలా ఇచ్చేసింది
సోషల్ మీడియా విభిన్నమైన వీడియోలు చేస్తూ.. భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను అందుకు యంగ్ సెన్సేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది దేత్తడి హారిక. అక్కడ వచ్చిన పేరుతో.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రియాలిటీ షోలో అద్భుతమైన ఆటతీరుతో ఔరా అనిపించిన ఈ అమ్మడు.. లవ్ ట్రాకుతో బాగా ఫేమస్ అయిపోయింది. ఇక, ఈ మధ్య మరో కంటెస్టెంట్‌తో చనువుగా ఉంటూ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌కు ముద్దు పెట్టి వార్తల్లో నిలిచింది. ఈ సారి అతడికి లిప్‌స్టిక్ అంటుకునేలా ఇచ్చి పడేసింది. ఆ సంగతులు మీకోసం!

స్టైలిష్‌గా ఎంట్రీ.. తనదైన మార్క్‌తో
దేత్తడి వీడియోల ద్వారా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టింది తెలుగమ్మాయి అలేఖ్య హారిక. స్టైలిష్ లుక్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. మొదటి రోజు నుంచే తన మార్క్ కనిపించేలా ప్రయత్నించింది. ప్రతి దానిలో తన పాత్ర ఉండేలా చూసుకుంది. అలాగే, హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరితోనూ కలిసిమెలసి ఉంటూ మంచి పేరు సంపాదించుకుంది.

ఆ రికార్డు మాత్రం దేత్తడి హారికదే
నాలుగో సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరిలోనూ దేత్తడి హారిక మంచి ఫైటర్ అని పేరు తెచ్చుకుంది. ప్రతి టాస్కులో వందకు వంద శాతం శ్రమను చూపిస్తూ దూసుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు అర్హత సాధించింది. బిగ్ బాస్ షో హిస్టరీలో ఇలా ఎవరికీ సాధ్యం కాలేదు. అంతటి గొప్ప ఆటతో ఈ సీజన్‌కు చివరి కెప్టెన్‌గా ఎంపికైంది.

అతడితో లవ్ ట్రాకుతో పాపులరిటీ
గేమ్ పరంగా ఆకట్టుకున్న దేత్తడి హారిక.. తోటి కంటెస్టెంట్ అభిజీత్‌తో లవ్ ట్రాకు నడుపుతూ హాట్ టాపిక్ అయిపోయింది. మొదట్లో అతడు మోనాల్ గజ్జర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగినా.. ఆ తర్వాత ఆమె దూరమయ్యాడు. ఆ సమయంలోనే హారిక అతడికి క్లోజ్ అయింది. అప్పటి నుంచి ఇద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా కలిసి తిరుగుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

టాప్-5లో చోటు... టైటిల్ రేసులో
పద్నాలుగు వారాల పాటు అద్భుతమైన ఆటతీరును కనబరిచిన దేత్తడి హారిక.. తుది ఐదుగురిలో చోటు దక్కించుకుంది. ఫలితంగా గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టబోతుంది. చిన్న టపకాయ్.. పెద్ద సౌండ్ అనేలా తాను వ్యవహరిస్తున్న తీరుకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లంతా ఆమెకు మద్దతుగా ఓట్లు వేశారు. పలువురు సెలెబ్రిటీలు సైతం హారికకు సపోర్ట్ చేశారు.

ట్రాకు తప్పుతుందా అనిపించేలా
మొదటి నుంచీ అభిజీత్‌తో ట్రాకు నడుపుతోన్న దేత్తడి హారిక... కొన్ని వారాలుగా అఖిల్ సార్థక్‌తో చనువుగా ఉంటోంది. అతడితో కలిసి తిరుగుతూ.. ముద్దులు పెడుతూ.. హగ్గులు ఇస్తూ విచిత్రమైన పనులు చేస్తోంది. దీంతో ఆమె ట్రాక్ తప్పుతుందా అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కారణంగానే హారికకు అభిజీత్ ఫ్యాన్స్ నుంచి మద్దతు లేకుండా పోయింది.

అతడికి ముద్దు పెట్టిన దేత్తడి హారిక
తాజాగా హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరికీ టీషర్ట్ ఇచ్చి.. వాటి మీద సదరు సభ్యుడిపై మిగిలిన వారందరూ తమ అభిప్రాయాన్ని చెప్పాలని బిగ్ బాస్ సూచించాడు. దీనికి అందరూ తమ తమ పనులు పూర్తి చేశారు. దేత్తడి హారిక మాత్రం అఖిల్ టీషర్ట్‌పై ‘నీ సోల్‌మేట్ త్వరలోనే నిన్ను కలుస్తుంది' అని రాసి.. లిప్‌స్టిక్ అంటుకునేలా అతడి వీపుపై ముద్దు పెట్టింది. దీంతో అంతా షాకయ్యారు.