»   » రక్తికట్టిన బిగ్‌బాస్.. భార్య కోసం ధన్‌రాజ్ కంటతడి.. హాట్ హాట్‌గా కొత్తభామ

రక్తికట్టిన బిగ్‌బాస్.. భార్య కోసం ధన్‌రాజ్ కంటతడి.. హాట్ హాట్‌గా కొత్తభామ

Written By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సీరియల్‌ను మంచిన కలహాలు, కలతలతో సాదాసీదాగా సాగుతున్న బిగ్‌బాస్‌లో సోమవారం కొత్త కోణం కనిపించింది. భావోద్వేగ సన్నివేశాలతోపాటు వినోదంతో బిగ్‌బాస్ కార్యక్రమాన్ని ఇంటిసభ్యులురక్తికట్టించారు. ముఖ్యంగా ధన్‌రాజ్ ఎమోషన్స్ బుల్లితెర ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసిందని చెప్పవచ్చు. ముందు నుంచి ఎన్టీఆర్ చెబుతున్నట్టుగానే బిగ్‌బాస్‌లో అనేక ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకోబోతున్నాయని అర్థమవుతున్నది. మొత్తానికి సోమవారం ధన్‌రాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.

స్విమ్మింగ్ పూల్‌లో దీక్షా పంత్

స్విమ్మింగ్ పూల్‌లో దీక్షా పంత్

వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించిన దీక్షా పంత్ స్విమ్మింగ్ పూల్‌లో దర్శనమిచ్చి ఇంటిసభ్యులకు షాక్ ఇచ్చింది. ఇంట్లో కొత్త సభ్యురాలిని చూసిన సెలబ్రీటీలు కొద్దిసేపు కంగారు పడ్డారు. ఆ తర్వాత ఆమెను ఇంటిలోకి ఆహ్వానించారు. దీక్షా పంత్‌ను కేవలం ధన్‌రాజ్ మాత్రమే గుర్తించడం విశేషం.

Bigg Boss Telugu: NTR Warning To DhanRaj
ఆకట్టుకొన్న ధన్‌రాజ్

ఆకట్టుకొన్న ధన్‌రాజ్

ప్రధానంగా బిగ్‌బాస్ 15వ రోజు ఎపిసోడ్‌లో తన భార్య మీద ప్రేమను వ్యక్తం చేసి ధన్‌‌రాజ్‌ వీక్షకులను ఆకట్టుకోవడం విశేషం. ధన్‌రాజ్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఏమైనా చెప్పాలనుకొంటున్నావా అని అడిగారు.

నా భార్యకు ఎనిమిదో నెల..

నా భార్యకు ఎనిమిదో నెల..

దాంతో నా భార్య ఎనిమిదో నెల గర్భంతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత తొలివారమే ఎలిమినేట్ అవుతానని అనుకొన్నా. కానీ రెండోవారం కూడా సక్సెస్ ఫుల్‌గా ఆటలో నిలిచాను.

బిగ్‌బాస్‌తో మనిషిని అయ్యాను..

బిగ్‌బాస్‌తో మనిషిని అయ్యాను..


బిగ్‌బాస్ ప్రస్తుతం నన్ను ఓ మనిషిలా మార్చింది. గర్భవతి అయిన భార్య సిరికి నేను అన్ని రకాల సేవలు చేయాలనుకొంటున్నాను. ఇక్కడ ఎంతో మందికి అన్ని రకాల సేవలు చేస్తునన్నాను. ఇక నా భార్యకు నేను అన్ని రకాలు సేవలు చేస్తాను. ఇప్పటివరకు నేను నా భార్యను పట్టించుకోలేదు. ఒక నా భార్యకు సర్వస్వం నేను అవుతా. అందుకు కారణం బిగ్‌బాస్ అని ధన్ రాజ్ ఉద్వేగానికి లోనయ్యాడు.

ధన్‌రాజ్ భార్య చేత ఓ వీడియో

ధన్‌రాజ్ భార్య చేత ఓ వీడియో

ధన్‌రాజ్ పరిస్థితిని అర్థం చేసుకొని భార్యతో ఓ వీడియో షూట్ చేయించి చూపుతామని చెప్పారు. అందుకు ధన్‌రాజ్ బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు. నీ భార్యకు ఏమైనా చెప్పాలనుకుంటే నీవు మాట్లాడే మాటలను షూట్ చేసి ఆమెకూ చూపుతాం అని బిగ్‌బాస్ చెప్పగా ధన్ రాజ్ సంతోషంలో మునిగిపోయారు.

సిరి ఆరోగ్యం బాగా చూసుకో..

సిరి ఆరోగ్యం బాగా చూసుకో..

సిరి నీవు సమయానికి ట్యాబ్లెట్లు వేసుకో. ఆరోగ్యం బాగా చూసుకో. సుక్కు నీవు అమ్మను ఇబ్బంది పెట్టకు. నేను త్వరలోనే వస్తాను. గర్భంలో ఉన్న చిట్టితల్లి నీవు ఈ ప్రపంచంలోకి వచ్చే సరికి నీకు ఓ గొప్ప ఫాదర్‌గా మారుతాను. నీ తండ్రి గొప్ప సెలబ్రిటీ అనే విధంగా కష్టపడుతాను అని ఏడ్చేశాడు.

మూగబోయిన కల్పన..

మూగబోయిన కల్పన..

మూడోవారంలో ప్రవేశించిన బిగ్‌బాస్‌లో జోష్‌లో ఉన్న కల్పన మూగబోయింది. మోస్తారుగా ఉన్న కార్తీక కత్తి ఓ స్టార్ సెలబ్రిటీగా అందరి మన్ననలు పొందుతున్నది. ఇక బిగ్‌బాస్ రేసులో ఉంటుందనుకొన్న అర్చన ఇక మధుప్రియగా మారుబోతున్నదా అనే అనుమానం కలిగుతున్నది. ప్రిన్స్ అఫైర్ అంశం గురించి బయట ప్రపంచం ఏమనుకుంటున్నదో అనే బెంగ మొదలైంది. బయటకు వెళ్లిన తర్వాత రిలేషన్స్ పాడుకాకూడదు అనే భయం ఆమెను వెంటాడుతున్నది.

కత్తి మహేశ్ డ్యాన్స్ అదరహో..

కత్తి మహేశ్ డ్యాన్స్ అదరహో..

ఇక చివర్లో ఇంట్లోకి వచ్చిన దీక్షాపంత్‌ను ఆహ్వానించేందుకు మగ సెలబ్రిటీలు చేసిన డ్యాన్స్ ఆకట్టుకున్నది. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలోని కమ్ టూ ద పార్టీ పాటకు చేసిన డ్యాన్స్ వీక్షకులను అలరించింది. మహేశ్ కత్తి వేసిన స్టెప్పులు ప్రత్యేకంగా అనిపించాయి. బట్టలిప్పిన ప్రిన్స్ తీరు కాస్తా ఓవరాక్షన్‌గా అనిపించింది.

English summary
Lot of surprises happend in 15th day of Telugu Version of Bigboss. Actor Deeksha Pant joined Biggboss house. Dhanraj gets emotiona by rembering the wife who is 8 months prengnant. End of the program, male celebrated welcomed Deeksha by doing a dance on popular song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu