»   » ‘బిగ్ బాస్’: ధనరాజ్, కత్తి కార్తీక ఔట్... ఆదర్శ్, శివబాలాజీ మీద బాంబ్!

‘బిగ్ బాస్’: ధనరాజ్, కత్తి కార్తీక ఔట్... ఆదర్శ్, శివబాలాజీ మీద బాంబ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో 'బిగ్ బాస్' విజయవంతంగా 40 రోజులు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ ఇంటి పోటీ దారులతో పాటు, ఆ షో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఊహించని మలుపులతో బిగ్ బాస్ షో సాగుతోంది. ఈ వీకెండ్ తారక్ హోస్ట్ షో మరింత రసవత్తరంగా సాగింది.

ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుండి ధనరాజ్, కత్తి కార్తీక ఔట్ అయ్యారు. ఇంటి సభ్యుల నామినేషన్ ప్రకారం..... అందరూ అర్చన, శివ బాలాజీ ఔట్ అవుతారని భావించారు. అయితే ప్రేక్షకుల ఓటింగు కారణంగా వారిద్దరూ సేఫ్ అయ్యారు. ప్రేక్షకుల ఓటింగ్ తక్కువగా ఉన్న కారణంగా ధనరాజ్, కార్తిక ఎలిమినేట్ అయినట్లు ఎన్టీఆర్ తెలిపారు.

శుభవార్త విన్న ధనరాజ్

శుభవార్త విన్న ధనరాజ్

‘బిగ్ బాస్' ఇంటి నుండి బయటకు వచ్చిన వెంటనే ధనరాజ్ శుభవార్త విన్నారు. ధనరాజ్ వచ్చిన వెంటనే వాళ్ల ఆవిడి బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఎన్టీఆర్ వెల్లడించారు. ఆయన భార్యతో మాట్లాడించారు. ధనరాజ్ మొహం సంతోషంతో వెలిగి పోయింది.

బిగ్ బాంబ్

బిగ్ బాంబ్

బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి పోటీదారు ఇంట్లోని ఒక సభ్యునిపై బిగ్ బాంబ్ వేసే అవకాశం ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ బాంబును ధనరాజ్... ఆదర్శ్ మీద ప్రయోగించారు. దీని ప్రకారం.... దీక్ష వేసే ప్రతి అడుగుకు ఆదర్శ్ కార్పెట్లు పరవాల్సి ఉంటుంది.

ధనరాజ్‌తో సెల్ఫీ

ధనరాజ్‌తో సెల్ఫీ

ధనరాజ్ బిగ్ బాస్ ఇంటిని వదిలి బయటకు వెలుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌ అతడితో కలిసి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా ధనరాజ్ మాట్లాడుతూ బిగ్ బాస్ ఇంట్లో చాలా నేర్చుకున్నాని, ఆ విషయాలు జీవితంలో ఎదగడానికి చాలా ఉపయోగ పడతాయని తెలిపారు.

కార్తీక ఔట్, అంతా షాక్

కార్తీక ఔట్, అంతా షాక్

ధనరాజ్ తర్వాత నెక్ట్స్ ఇంటి నుండి బయటకు వచ్చేది కత్తి కార్తీక అని చెప్పగానే అటు ఇంటి సభ్యులతో పాటు, ఇటు ప్రేక్షకలు షాకయ్యారు. అయితే కత్తి కార్తీక మొహంలో ఎలాంటి బాధ లేకుండా సంతోషంగా బయటకు వచ్చేసింది.

అనుభవాలను పంచుకున్న కార్తీక

అనుభవాలను పంచుకున్న కార్తీక

బిగ్ బాస్ ఇంట్లో ఈ 40 రోజుల పాటు గడిపిన అనుభవాలను కత్తి కార్తీక.... షో హోస్ట్ తారక్‌తో పంచుకున్నారు.

శివ బాలాజీ మీద టాయిలెట్ బాంబ్

శివ బాలాజీ మీద టాయిలెట్ బాంబ్

బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వెలుతున్న కత్తి కార్తీకకు బిగ్ బాంబ్ వేసే అవకాశం రావడంతో దాన్ని శివ బాలాజీ మీదకు ప్రయోగించింది. దీని ప్రకారం..... ఇంటి సభ్యులు అందరూ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతే శివ బాలాజీ తన టాయిలెట్ అవసరాలు తీర్చుకోవాల్సి ఉంటుంది.

శివ బాలాజీ టార్గెట్ ఎందుకంటే...

శివ బాలాజీ టార్గెట్ ఎందుకంటే...

శివ బాలాజీకి ఓపిక చాలా తక్కువ, కోపం ఎక్కువ.... అతడిలో పేషెన్స్ లెవల్ ఇంకా పెరగాల్సి ఉంది, అందుకే ఈ బాంబ్ అతడిపై వేసినట్లు కత్తికార్తీక వెల్లడించారు.

ఏడ్చేసిన కార్తీక

ఏడ్చేసిన కార్తీక

ఈ సందర్భంగా కత్తి కార్తీక తన కుమారుడి ఇన్నాళ్లు మిస్సయిన విషయాన్ని గుర్తు చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు.

సరదాగా సాగిన హోస్ట్ షో

సరదాగా సాగిన హోస్ట్ షో

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన శని, ఆది వారాలు బిగ్ బాస్ షో ఎంతో ఆసక్తిగా సాగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో రకరకాల గేమ్స్ ఆడిస్తూ సందడి సందడిగా ఈ షో సాగించారు ఎన్టీఆర్.

English summary
The house of Jr NTR-hosted TV show Bigg Boss Telugu witnessed double elimination this weekend and housemates like Dhanraj and Kathi Karthika have been evicted from the house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu