twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jabardasth బూతు షో.. అలాంటి షో రాకూడదని రామోజీరావు ప్రయత్నం చేశారు: సీనియర్ డైరెక్టర్

    |

    ప్రస్తుతం అత్యధిక రేటింగ్ అందుకుంటున్న రియాలిటీ షోలలో జబర్దస్త్ ఒకటి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దాన్ని కామెడీ షో అనడం కంటే బూతు షో అనడం బెటర్ అని చాలా మంది సినీ ప్రముఖులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఒక సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా ఆయన ఈటీవీ అధినేత రామోజీ రావు గారి గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఆ సినిమాలతో క్రేజ్

    ఆ సినిమాలతో క్రేజ్


    నాగార్జునతో 1987లో సంకీర్తన అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన గీత కృష్ణ మొదటి సినిమాతోనే నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుదేవాతో టైమ్ అనే సినిమా కూడా చేశారు. ఇక 2011లో సొంత నిర్మాణంలోనే ఆయన తెరకెక్కించిన కాఫీ బార్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీసెంట్ గా గీతాకృష్ణ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ గురించి ఎవరు ఊహించని విధంగా స్పందించారు.

    ఈటీవీ పడిపోయింది

    ఈటీవీ పడిపోయింది

    గీతకృష్ణ మాట్లాడుతూ.. జబర్దస్త్ అనేది ఒక బూతు షో రామోజీ రావు గారు సాధారణంగా ఈ టీవీ ని అలాగే ఈనాడు ను కూడా ఎంతో పవిత్రంగా చూసుకునే వారు. ఇలాంటి ట్రాష్ కూడా రాకూడదు అని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కాకపోతే ఇటీవల కాలంలో కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. దీంతో ఈ టీవీ కూడా కూడా ఆ టైమ్ లో నెంబర్ 10కి పడిపోయింది.. అని అన్నారు.

    బూతు షో

    బూతు షో


    ఈ డౌన్ ఫాల్ సమయంలోనే ఈ టీవీ మళ్ళీ నిలదొక్కుకునేల చేయఓని ఆ సమయంలోనే శ్యామ్ సుందర్ రెడ్డి అలాగే కొంతమంది కలిసి ఢీ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అలాగే మరికొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తో ఈటీవీ కి మంచి గుర్తింపును తీసుకువచ్చారు. అలాగే జబర్దస్త్ ను కూడా ఒక డిఫరెంట్ ఆకట్టుకోవడానికి క్రియేట్ చేశారు. కానీ ఇవ్వాళ అది బూతు షో అయిపోయింది.. అన్నారు.

     ఏమి చేయలేని పరిస్థితిలో

    ఏమి చేయలేని పరిస్థితిలో

    ఇది ఒక విధంగా చెప్పాలంటే జబర్దస్త్ పరమ బూతు షో. మళ్లీ దానికి జడ్జిల వెకిలి నవ్వులు. అలాంటి షోలు వచ్చినప్పుడు కూడా రామోజీ రావు గారు ఏమి చేయలేని పరిస్థితిలో చేతులెత్తేశారు. ఎందుకంటే దానివళ్లే మళ్ళీ ఈటీవీ అనేది సెకండ్ పొజిషన్ లోకి రావడానికి కారణం అయ్యింది. మొత్తానికి రామోజీరావు లాంటివారు ఏదైతే వద్దని అనుకున్నారో ఫైనల్ గా అదే ఈటీవీని ఒక స్టేజ్ లోకి తీసుకు వచ్చింది మాత్రం జబర్దస్త్.. అని గీతకృష్ణ అన్నారు.

    రోజాకు ఎంత ఇస్తారంటే..

    రోజాకు ఎంత ఇస్తారంటే..

    మంచి చెడు గురించి చెప్పాలి కాబట్టి నేను చెబుతున్నాను ఈ రోజుల్లో అలాంటి కంటెంట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. ఇక రోజా అలాంటి షోను చేయడంలో తప్పులేదు. ఎందుకంటే రోజుకు 50 వేలకు పైగానే డబ్బు రావచ్చు కాబట్టి ఒక అంతగా ఆదాయం వస్తోంది అంటే చేయడంలో తప్పులేదు అని అన్నారు. అలాగే రోజాగారు రాజకీయ నాయకురాలిగా చాలా బాగా మాట్లాడగలరు అని గీతకృష్ణ వివరణ ఇచ్చారు.

    English summary
    director geetha krishna sensational comments on jabardasth show
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X