బిగ్‌బాస్‌లోకి దివ్వెల మాధురి.... టచ్ చేయొద్దంటూ కంటెస్టెంట్స్‌కి దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరిక

బిగ్‌బాస్ తెలుగు 9 ఆసక్తికరంగా రోజురోజుకు సాగుతోంది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ మెగా రియాలిటీ షో 5వ వారం పూర్తి చేసుకుని 6వ వారంలోకి పూర్తి చేసుకోనుంది. 15 మంది కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ మొదలవ్వగా.... వీరిలో కామన్ మ్యాన్ కోటాలో ఆరుగురు సామాన్యులకు అవకాశం కల్పించారు. తొలివారం శ్రష్టి వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారంలో మర్యాద మనీష్, మూడో వారంలో ప్రియా శెట్టి, నాలుగో వారంలో హరిత హరీశ్ హౌస్‌ను వీడారు. బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫైనలిస్ట్‌ అయిన దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ సంఖ్య 12కు చేరుకుంది.

వైల్డ్ కార్డ్ ద్వారా ఆరుగురు ఎంట్రీ
5వ వారం బిగ్‌బాస్ హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు స్టార్ మా ముందు ప్రోమోల ద్వారా లీకులు ఇవ్వగా.. ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజలు హౌస్‌ను వీడటం దాదాపుగా ఖాయమైంది. దాంతో హౌస్‌లో కంటెస్టెంట్స్ సంఖ్య 10కి చేరుకుంటుంది. అయితే ఈ గ్యాప్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా భర్తీ చేయాలని బిగ్‌బాస్ నిర్వాహకులు ఫిక్స్ అయ్యారు. దీనిలో భాగంగా ఆదివారం బిగ్‌బాస్‌ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరగనున్నాయి. దీనిలో భాగంగా ఆరుగురు హౌస్‌లో అడుగుపెట్టనున్నట్లుగా పేర్లు తెరపైకి వస్తున్నాయి. వారు దివ్వెల మాధురి, రమ్య మోక్ష కంచర్ల, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ఆయేషా జీనత్.

Divvala Madhuri Entered in Bigg Boss Telugu 9 Duvvada Srinivas indirect warning to contestants

బిగ్‌బాస్‌లోకి దివ్వెల మాధురి
వీరిలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు దివ్వెల మాధురి.. ఎప్పుడు బిగ్‌బాస్ సీజన్ మొదలైనా ఖచ్చితంగా ఈవిడ బిగ్‌‌బాస్‌కి వెళ్తారని వార్తలు వస్తూనే ఉన్నాయి. తనకు బిగ్‌బాస్ నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని పలు ఇంటర్వ్యలలో మాధురి తెలిపారు. అయితే కుటుంబానికి, దువ్వాడ శ్రీనివాస్‌కు దూరంగా ఉండలేక ఆఫర్ తిరస్కరించినట్లు మాధురి చెప్పారు. కానీ ఈ సారి మాత్రం కనీసం వైల్డ్ కార్డ్ ద్వారా అయినా ఎంట్రీ ఇప్పించాలని బిగ్‌బాస్ టీమ్ గట్టిగా పట్టుకోవడంతో ఆమె ఓకే చెప్పేశారు. దీంతో దివ్వెల మాధురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఖరారైంది.

ఫ్యామిలీ వివాదాలతో పాపులర్
ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మాజీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలిగా దివ్వెల మాధురి పాపులర్ అయ్యారు. శ్రీనివాస్‌కు ఆల్రెడీ పెళ్లయి, పిల్లలు ఉన్నారు. అయితే మాధురితో ఆయన రిలేషన్‌తో శ్రీనివాస్‌కు, ఆయన భార్యకు మధ్య వివాదం చోటు చేసుకుంది. వీరి కుటుంబ తగాదాలు తీవ్ర చర్చనీయాంశమై మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక దివ్వెల మాధురికి కూడా గతంలోనే పెళ్లయి, పిల్లలు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ డ్యాన్స్, రీల్స్‌, ఇతర వీడియోలు చేస్తూ మాధురికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకున్నారు. అలాగే ఆమెకు శారీ స్టోర్ కూడా ఉండి, వ్యాపారంలోనూ సక్సెస్ అయ్యారు.

80 ఏళ్ల పెద్దలు నాకు సపోర్ట్
బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టనున్న నేపథ్యంలో దివ్వెల మాధురినీ మీడియా ఫోకస్ చేసింది. తాజాగా ఓ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ... మల్టీ టాస్కింగ్ అనేది ఉమెన్‌లో ఉన్న స్పెషాలిటీ. మనం శక్తి... ఏదైనా మేనేజ్ చేయగలం. రాజకీయాల్లో ఉండటం, ప్రజలతో ఎక్కువగా సంబంధాలు ఉండటం వల్లే బిజినెస్‌లోనూ సక్సెస్ అయ్యా. అందరూ ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రా నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు, బాగా ఆదరిస్తున్నారు. పొలిటికల్ లైఫ్ నుంచి బిజినెస్‌లోకి రావడం వల్ల నాకు ప్లస్ అయ్యిందని చెప్పుకోవాలి. 80 ప్లస్ ఉమెన్ నాకు సపోర్ట్ చేయడానికి వస్తున్నారు, నేను బాగుండాలని నా కోసం పూజలు చేస్తున్నామని చెబుతున్నారు మాధురి.

ఇంకొంత మందికి చేరువ అవుతా
బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి మోటీవ్ అంటూ ఏం లేదు.. కాకపోతే బిగ్‌బాస్ అనేది బిగ్గెస్ట్ ఫ్లాట్‌ఫాం, మంచి రియాలిటీ షో, ఇక్కడ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. దానిని మంచిగా మలచుకుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా మనం ఇచ్చే విధానాన్ని బట్టే ఉంటుంది. మనం మంచిగా ఉంటే పాజిటివ్‌గా ఉంటుంది. ఇంకొంత మందికి మనం దగ్గరవుతాం. బిగ్‌బాస్ టైటిల్ విన్నరైతే వచ్చే డబ్బును ఏం చేస్తారని కొందరు అడుగుతున్నారు.. టైటిల్ విన్నర్ అయినా, కాకపోయినా మేం చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. మాకు భగవంతుడు బాగానే ఇచ్చాడు. ఒకవేళ బిగ్‌బాస్‌లో వచ్చే ప్రైజ్ మనీ గెలిస్తే దానిని కూడా సేవా కార్యక్రమాలకే వినియోగిస్తాం. శ్రీనివాస్ గారిని, పిల్లలని బాగా మిస్ అవుతా. పిల్లల్ని అమ్మ చూసుకుంటుంది, సార్‌ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. నా పిల్లలు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు.. కాకపోతే చిన్నది మాత్రం ఏడుస్తోంది. మొన్నటి వరకు చిన్న దాని దగ్గరే ఉండొచ్చా.. వారానికి ఒకసారి శ్రీకాకుళం వెళ్లి, హైదరాబాద్ వచ్చేస్తానని దివ్వెల మాధురి తెలిపారు.

ఆమె జోలికి వెళ్లొద్దు
ఇక బిగ్‌బాస్‌లోకి దివ్వెల మాధురి వెళ్తుండటంతో దువ్వాడ శ్రీనివాస్ ఓ వీడియో రిలీజ్ చేశారు. మీ అందరికీ ఓ శుభవార్త.. ఇప్పటి వరకు బిగ్‌బాస్ ఒక లెక్క, ఈరోజు నుంచి బిగ్‌బాస్ మరో లెక్క. మీరందరూ చూడబోతున్నారు బిగ్‌బాస్ 2.0. .. ఎవరో తెలుసా? తాను ఎవరికీ ఎదురొచ్చినా వారికే ప్రమాదం, వారు తనకి ఎదురొచ్చినా వారికే ప్రమాదం. మరి ఆదివారం సాయంత్రం 9 గంటలకు చూసేద్దామా అంటూ వ్యాఖ్యానించారు. దీనిని బట్టి మాధురి జోలికి ఎవరూ రావొద్దని శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X