»   »  60 ఏండ్ల వయసులో కాలుజారితే.. డాక్టర్ గురువారెడ్డి డ్యాన్స్ సూపర్

60 ఏండ్ల వయసులో కాలుజారితే.. డాక్టర్ గురువారెడ్డి డ్యాన్స్ సూపర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మనిషి వ్యాధిగ్రస్తుడైతే వైద్యం చేసేది డాక్టర్లు. అయితే వైద్యులందరిలో సన్‌షైన్ హాస్పిటల్స్ అధినేత ఏవీ గురువారెడ్డిది ఓ ప్రత్యేకతమైన వ్యక్తిత్వం. ఆయన మనిషికే కాదు.. మనసుకు కూడా వైద్యం చేస్తారు. డాక్టర్‌గానే కాకుండా ఆయన బహుముఖ ప్రఙ్ఞాశాలి. సాహిత్యంలోనూ గురువారెడ్డికి మంచి పట్టు ఉంది. సమకాలీన సినిమాపై మంచి అవగాహన ఉంది. ఓ ఏడాది క్రితం ఆయన రూపొందించిన ఓ షార్ట్ ఫిలిం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 వైద్యుడే కాదు.. బహుముఖ ప్రఙ్ఞాశాలి.

వైద్యుడే కాదు.. బహుముఖ ప్రఙ్ఞాశాలి.

అనుక్షణం వైద్యవృత్తిలో బిజీగా ఉండే పిల్లా నీవులేని జీవితం అంటూ గబ్బర్ సింగ్ చిత్రంలోని పాటను ఆయన తనలోని ప్రతిభను చాటుకోవడానికి తన భార్యతో కలిసి ఓ షార్ట్ ఫిలింను షూట్ చేశారు. ఆ వీడియో య్యూట్యూబ్‌లోనే కాకుండా వాట్సప్ గ్రూప్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది. పలువురికి మంచి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 కుర్ర హీరోలకు దీటుగా.. డాన్స్, స్టెప్పులు

కుర్ర హీరోలకు దీటుగా.. డాన్స్, స్టెప్పులు


‘60 ఏండ్ల వయస్సులో కాలు జారితే నేను వైద్యం చేస్తాను. 16 ఏండ్ల తర్వాత అమ్మాయిలు కాలుజారితే మా ఆవిడ వైద్యం చేస్తుంది' అని హాస్యోక్తి విసరడం ఆయన సమయస్ఫూర్తికి నిదర్శనం. ఈ వీడియోలో ఆయన వేసిన స్టెప్పులు ఏ కుర్ర హీరోకు తక్కువేమి కాదు. ఆయన చూపిన ఈజ్ చాలా బాగుందని పలువురు ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనా వ‌ృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూనే ప్రవృత్తిని కొనసాగించడం కొందరికే చెల్లుతుంది. అందులో ప్రముఖ వైద్యుడు గురువారెడ్డిది ప్రత్యేకమైన జీవన శైలి అని చెప్పుకోవచ్చు.

సన్‌షైన్ హాస్పిటల్ చీఫ్‌గా

సన్‌షైన్ హాస్పిటల్ చీఫ్‌గా

ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన భారతీయ వైద్యుల్లో డాక్టర్ ఏవీ గురువారెడ్డి ఒకరు. ఆయన అసలు పేరు అన్నపరెడ్డి వెంకట గురువారెడ్డి. ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రిప్లేస్‌మెంట్ (మోకాళ్ల మార్పిడి) నిపుణుడు. సన్‌షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్‌స్టిట్యూట్ సన్‌షైన్ హాస్పిటల్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా, చీఫ్‌గా బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఈ హాస్పిటల్‌కు హైదరాబాద్‌లో మంచి పేరు ఉంది. గురువారెడ్డి ఏడాదికి 4 వేల మోకాళ్ల మార్పిడి చికిత్స నిర్వహిస్తారు.

 సాహిత్యం, సినిమాలపై ఎనలేని ఆసక్తి

సాహిత్యం, సినిమాలపై ఎనలేని ఆసక్తి


వైద్య వృతి తర్వాత సాహిత్య రంగంతోనూ గురువారెడ్డి మమేకమవుతుంటారు. వీలు చిక్కినప్పుడల్లా పలు సాహిత్య సభలకు ఆయన హాజరవుతుంటారు. సన్‌షైన్ హాస్పిటల్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. పలు పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు.

English summary
Doctor Guruva Reddy's Short Video viral in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu