For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జబర్ధస్త్‌లో కొత్త రూల్: కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్.. టీమ్ లీడర్లకు షాకిచ్చిన నిర్వహకులు.!

  By Manoj Kumar P
  |

  బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న షోలలో 'జబర్ధస్త్' అన్నింటి కంటే ముందుంటుందని చెప్పడంలో సందేహం లేదు. దీనికి కారణం ఆ షో పదమూడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతుండడమే. పోటీగా ఎన్నో కామెడీ షోలు వచ్చినా జబర్ధస్త్‌కు మాత్రం ఏమాత్రం నష్టం జరగకపోగా.. ఇంకా ఎక్కువ టీఆర్పీ వస్తోంది. అయితే, అప్పుడప్పుడూ కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో షో నిర్వహకులు టీమ్ లీడర్లకు అదిరిపోయే షాక్ ఇచ్చారని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం.!

  Jabardasth Comedy Show Management New Rules To Comedians
  ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు వందల మంది

  ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు వందల మంది

  స్టాండప్ కామెడీ షోగా తెలుగు వారికి పరిచయం అయింది జబర్ధస్త్. ఈ షో వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, రైటర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వాళ్లంతా ఇప్పుడు స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. దీంతో టాలెంట్ ఉండి అవకాశాలు లేని ఎంతో మంది జబర్ధస్త్‌ను నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే అవకాశాలను అందుకుంటున్నారు.

  సక్సెస్‌తో పాటు వివాదాలూ చుట్టుముట్టాయి

  సక్సెస్‌తో పాటు వివాదాలూ చుట్టుముట్టాయి

  జబర్ధస్త్ షో ఎంతగా సక్సెస్ అయిందో.. అంతే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఈ షోలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే, ఆడవాళ్లను కించపరిచే విధంగా స్కిట్లు చేస్తున్నారని అన్నారు. ఆ సమయంలోనే జబర్ధస్త్‌ను నిషేదించాలని మహిళా సంఘాలు నిరసన కార్యక్రమాలు కూడా చేశాయి.

  వాళ్లంతా ఏం చేసినా.. జబర్ధస్త్‌నే అంటున్నారు

  వాళ్లంతా ఏం చేసినా.. జబర్ధస్త్‌నే అంటున్నారు

  సక్సెస్‌ఫుల్ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అందుకే వాళ్లంతా ఏం చేసినా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. దీంతో సదరు ఆర్టిస్టులు మంచి చేస్తే జబర్ధస్త్‌కు అనుకూలంగా... చెడుగా చేస్తే ఆ షోకు వ్యతిరేకంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా కూడా ఈ కామెడీ షో హైలైట్ అవుతోంది.

  టీమ్ లీడర్లకు షాకిచ్చిన షో నిర్వహకులు.!

  టీమ్ లీడర్లకు షాకిచ్చిన షో నిర్వహకులు.!

  జబర్ధస్త్‌లో కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని షో నిర్వహకులు సరికొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... జబర్ధస్త్‌లో చేస్తున్న టీమ్ లీడర్లు, ఆర్టిస్టులు అనుమతి లేకుండా ఈవెంట్లకు గానీ, మరో షోలకు గానీ వెళ్లకూడదట. అలాగే అసాంఘిక చర్యలకు పాల్పడకూడదట.

  కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్

  కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్

  అంతేకాదు, జబర్ధస్త్‌ను వీడి వేరు చానెల్‌కు వెళ్లాలనుకున్న వాళ్లు వెళ్లిపోవచ్చని చెప్పారట నిర్వహకులు. ఒకవేళ తర్వాత ఎప్పుడైనా వెళ్లిపోవడం కానీ, వేరే ఈవెంట్లలో గానీ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. అలాగే, ఏదైనా కేసుల్లో దొరికి జైలుకు వెళ్లాల్సి వస్తే.. వాళ్లను షో నుంచి బహీష్కరించనున్నారని సమాచారం.

  వాళ్లిద్దరూ చేసిన పనికి అందరికీ ఝలక్

  వాళ్లిద్దరూ చేసిన పనికి అందరికీ ఝలక్

  జబర్ధస్త్‌లో పని చేస్తున్న ఇద్దరు కమెడియన్లు దొరబాబు, పరదేశి ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ హైపర్ ఆది జట్టులో సభ్యులుగా చేస్తున్నారు. సెకెండ్ లీడ్‌గా ఉన్న ఆర్టిస్టులు ఇలాంటి పని చేయడం వల్లే షో నిర్వహకులు కొత్త నిబంధనను తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జబర్ధస్త్ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Tollywood actor Dawood reacted on Jabardasth comedian Dorababu's caught in prostitution sting in Visakhapatnam. Addressing the media, Dawood said that he is receiving a lot of calls from his well-wishers as he looks similar like Jabardasth comedian Dorababu and he asserted that he is not one who caught on police raids in Visakhapatnam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X