For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ షాక్.. కరాటే కల్యాణి అవుట్, భోరున ఏడ్చిన అమ్మా రాజశేఖర్

  |

  బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో రెండో వారాంతంలో భావోద్వేగాలు నెలకొన్నాయి. హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులందరికీ క్లాస్ పీకారు. ఇంటి సభ్యుల్లో తమకు నచ్చని వారిని జీరోగా, నచ్చిన వారిని హీరోగా చెబుతూ బిగ్‌బాస్ టాస్క్ ఆడారు. హీరో, జీరో టాస్క్‌లో చాలా గందరగోళం నెలకొన్నది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొన్నారు. దివి, లాస్య మధ్య ఘాటుగా వాగ్వాదం జరిగింది. రెండోవారాంతంలో డబుల్ నామినేషన్‌లో ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..

  నేను ఇంటి నుంచి పోను అంటూ గంగవ్వ

  నేను ఇంటి నుంచి పోను అంటూ గంగవ్వ

  గంగవ్వ ఆరోగ్యం బాగు పడటంతో హుషారుగా కనిపించారు. దివి, గంగవ్వ, అఖిల్ కూర్చొని కులాసాగా మాట్లాడుకొన్నారు. నీ ఆరోగ్యం బాగుపడింది కాబట్టి బయటకు పోతానని అనకు. నీ గేమ్ నీవు ఆడు అని దివి, అఖిల్ సూచించారు. అందుకు సమాధానంగా లేదు.. ఇప్పుడు బయటకు వెళ్లే అవకాశమే లేదు. నిన్న, మొన్న నాకు అలా అనిపించింది. ఆరోగ్యం సహకరించకపోవడంతో అలా ఫీలయ్యానని గంగవ్వ చెప్పారు.

  కరాటే కల్యాణి వర్సెస్ లాస్య

  కరాటే కల్యాణి వర్సెస్ లాస్య

  ఇక మరోసారి లాస్య, కరాటే కల్యాణి మధ్య కిచెన్‌లో గొడవ మొదలైంది. తనకు సంబంధం లేకున్నా కిచెన్ వద్ద పనులు చేయడంపై కొందరు అభ్యంతరం తెలిపారు. అప్పుడు నాకు ఇష్టమని నేను అలా చేస్తున్నాను. తప్పితే నాకు మరో ఉద్దేశం లేదు. మీరు అలా అంటే నేను భోజనం కూడా చేయను. నేను వంట చేసినప్పుడు కొందరు రకరకాలుగా కామెంట్ చేశారని కల్యాణ్ గొడవ పడ్డారు.

  హీరో.. జీరో టాస్క్‌తో నాగ్

  హీరో.. జీరో టాస్క్‌తో నాగ్

  హోస్ట్ నాగార్జున వేదికపై నుంచి ఇంటి సభ్యులతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. నాగార్జున కనిపించగానే ఇంటి సభ్యులు హ్యాపీగా పలకరిస్తే స్పందించలేదు. ఆ తర్వాత మీరు ఎలిమినేషన్ ప్రక్రియలో ఆడి తీరు బాగా లేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మీలో అసలు గేమ్ బయటపెడుతాను. మీతో హీరో జీరొ గేమ్ ఆడిపిస్తాను అంటూ నాగార్జున అన్నారు.

  అమ్మా రాజశేఖర్, గంగవ్వ హీరోలుగా.. జీరోలుగా

  అమ్మా రాజశేఖర్, గంగవ్వ హీరోలుగా.. జీరోలుగా

  హీరో, జీరో టాస్క్‌లో ఇంటి సభ్యుల్లో ఒకరిని హీరోగా, మరొకరిని జీరోగా చూపించాలి. హీరోను తీసుకొచ్చి కూర్చొపెట్టాలి. ఇంటిలో ఉండటానికి వీలు లేని వ్యక్తిని మెడపట్టి గేట్ దాటించాలి. వారి ఎందుకు హీరో, జీరో అనే విషయాన్ని చెప్పాలి. అలా ఎక్కువ మంది అమ్మా రాజశేఖర్‌ను, గంగవ్వను హీరోగా ఎంపిక చేశారు. ఎక్కువ శాతం కుమార్ సాయిని జీరో చూపించారు.

  అమ్మా రాజశేఖర్ భోరున ఏడ్చి.. వెళ్లిపోతానంటూ

  అమ్మా రాజశేఖర్ భోరున ఏడ్చి.. వెళ్లిపోతానంటూ

  హీరో, జీరో టాస్క్‌ను లాస్య ప్రారంభించి అమ్మా రాజశేఖర్ జీరో, ఆయన చీప్‌గా జోకులు వేస్తున్నారు. కొన్నిసార్లు జోకులకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాకుండా దివితో టాస్క్ ఆడేటప్పుడు కడుపులో దిండి పెట్టి నెట్టాడు అనగానే అమ్మా రాజశేఖర్ ఎమోషనల్ అయ్యాడు. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించండి అంటూ వేడుకొన్నారు. కింద పడి రెండు చేతులు జోడించి వేడుకొంటూ నన్ను బయటకు పంపించండి అని కంటనీరు పెట్టుకోగా ఇంటి సభ్యులందరూ సముదాయించారు.

  Bigg Boss Telugu 4: Noel sean Demands Sorry From Bigg Boss
  కరాటే కల్యాణి అవుట్

  కరాటే కల్యాణి అవుట్

  బిగ్‌బాస్‌లో రెండవ వారం డబుల్ ఎలిమినేషన్స్ ఉంటాయని హోస్ట్ నాగార్జున షాకిచ్చారు. తొమ్మిది మంది నామినేట్ అవ్వగా తొలుత గంగవ్వను గేమ్ నుంచి సేఫ్ చేశారు. ఇంకా ఎనిమిది మంది మిగిలి ఉండగా, కరాటే కల్యాణిని ఇంటి నుంచి బయటకు పంపించారు. కరాటే కల్యాణి ఇంటి నుంచి వెళ్లిపోతూ నన్ను వెన్నుపోటు పొడిచారు. నేను స్ట్రయిట్‌గా మాట్లాడుతాను అందుకే నాకు ఇన్ని సమస్యలు అంటూ కరాటే కల్యాణి అన్నారు. ఇంటి సభ్యుల్లో మోనాల్, నోయల్ కంటతడి పెట్టారు.

  English summary
  Bigg Boss Telugu Season 4: Bigg Boss Telugu season started in high note as host of King Nagarajuna. On Day 13, Karate Kalyani eliminated from the house. This week double nominations to go happen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X