»   » బిగ్ బాస్: కొత్త కెప్టెన్ దీక్ష, బలవంతులే టార్గెట్....

బిగ్ బాస్: కొత్త కెప్టెన్ దీక్ష, బలవంతులే టార్గెట్....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bigg Boss Telugu : Diksha Wins The captaincy For This Week

'బిగ్ బాస్' రియాల్టీ షో మరో మూడు వారాల్లో ముగియనున్న నేపథ్యంలో ఇంటి సభ్యుల మధ్య పోటీ తీవ్రతరం అయింది. ఇంట్లో గేమ్ బాగా ఆడుతూ బలవంతులుగా ఉన్న సభ్యులు... తమకు పోటీగా ఉన్న ఇతర సభ్యులను ఇంటి నుండి బయటకు పంపేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.

సోమవారం షోలో జరిగిన పరిణామాలు పరిశీలిస్తే..... ఎలిమినేషన్ నామినేషన్స్ సమయం వచ్చిపుడు తమకు పోటీగా ఉన్నవారిని నామినేట్ చేసిన వైనం కనిపించింది. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో హరితేజ, ప్రిన్స్, అర్చన, ఆదర్శ్, నవదీప్ నామినేట్ అయ్యారు.

కొత్త కెప్టెన్ దీక్ష

కొత్త కెప్టెన్ దీక్ష

కెప్టెన్‍‌గా ఉన్న ముమైత్ ఎలిమినేట్ అయి ఇంటి నుండి బయటకు వెళ్లడంతో కొత్త కెప్టెన్ ను ఎన్నుకోవడం తప్పనిసరైంది. కెప్టోన్సీ కోసం నవదీప్, దీక్ష పోటీ పడగా...... ఆదర్శ్, హరితేజ, శివ బాలాజీ సపోర్టుతో దీక్ష కొత్త కెప్టెన్‌గా ఎంపికైంది.

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు

నామినేషన్ ప్రక్రియలో దీక్ష.... ప్రిన్స్, అర్చనలను, అర్చన.... ఆదర్శ్, హరితేజలను, శివ బాలాజీ.... ప్రిన్స్, ఆదర్శ్‌లను, ఆదర్శ్.... నవదీప్, అర్చనలను, నవదీప్... హరితేజ, ప్రిన్స్, హరితేజ.... ఆదర్శ్, నవదీప్, ప్రిన్స్.... హరితేజ, నవదీప్‌లను నామినేట్ చేశారు.

బిగ్ బాస్ ఇంట్లో దెయ్యాలు

బిగ్ బాస్ ఇంట్లో దెయ్యాలు

సోమవారం షోను కాస్త వినోదాత్మకంగా సాగించేందుకు బిగ్ బాస్ ఈ సారి హారర్ కాన్సెప్టును ఎంచుకున్నారు. తొలుత దెయ్యాల రూపంలో ఇంటి సభ్యులను భయ పెట్టే ప్రయత్నం చేశారు.

దెయ్యాల టాస్క్

దెయ్యాల టాస్క్

తర్వాత ఇంటి సభ్యులను రెండు టీమ్ లుగా విడగొట్టి దెయ్యాల టాస్క్ ఆడించారు. ఇందులో ముగ్గురు దెయ్యాలుగా, ముగ్గురు మనుషులుగా చేశారు. దీక్ష ఆధ్వర్యంలో ఈ టాస్క్ జరిగింది. దెయ్యాల తమ పనులతో మనుషులను భయపెట్టాలి, మనషులు దెయ్యాలకు భయపడకుండా ఉండాలి. ఎవరు బాగా చేస్తే వారే విజేతలు. మంగళవారం విజేతలు ఎవరో తేలనుంది.

English summary
Paranormal Activities in Big Boss. Diksha wins the captaincy as majority of the contestants vote for her. Big Boss asks the contestants to vote out two contestants in order to exit the show. Later, paranormal activities take place.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu