Evaru Meelo Koteeswarulu షోలో రాజమౌళి, కొరటాల శివ..గట్టిగా వార్నింగ్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..అసలేం జరిగిందంటే
తెలుగు బుల్లితెరపైన కౌన్ బనేగా కరోడ్‌పతికి తెలుగు రూపం ఎవరు మీలో కోటీశ్వరుడు షో ఇటీవలే ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమై అనేక మంది ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. గత మూడు వారాలకుపైగా కొనసాగుతున్న ఈ షోకు మంచి ఆదరణ కాకుండా టీఆర్పీ కూడా దక్కుతున్నది. అయితే ఎన్టీఆర్ ఈ షోను తనదైన శైలిలో పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా వచ్చే వారం టెలికాస్ట్ కానున్న ఈ షోలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సెన్సేషనల్ డైరెక్టర్ మహేష్ బాబు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా తనకు అత్మీయులైన ఆ ఇద్దరితో ఎన్టీఆర్ ఆడిన ఆట ఎలా ఉందో మేరే చూడండి..

ఆరంభ వేడుకలో రాంచరణ్‌తో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఆరంభ వేడుకతోనే అదరగొట్టాడు. తన స్నేహితుడు, RRR చిత్రంలో సహ నటుడు, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో ఆడిన గేమ్ ఆసక్తికరంగానే కాకుండా మోస్ట్ టీఆర్పీ సాధించిన ఎపిసోడ్‌గా సాగింది. రెండు రోజులపాటు సాగిన ఈ షోలో ఆటనే కాకుండా ఇద్దరి జీవితాల్లో చోటుచేసుకొన్న ఎన్నో సంఘటనలను ప్రేక్షకులతో పంచుకొన్నారు.

జక్కన్న, కొరటాల శివకు స్వాగతం పలికిన ఎన్టీఆర్
ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మరో ఇద్దరు విశిష్ఠ ప్రముఖులు హాట్ సీట్‌పైకి రానున్నారు. ఒకరు తనకు హీరోగా అత్యంత ఇమేజ్ సంపాదించి పెట్టిన ఎస్ఎస్ రాజమౌళి కాగా, మరో వ్యక్తి తన కెరీర్‌లో భారీ విజయాన్ని అందించిన కొరటాల శివ. జక్కన అంటూ ముద్దుగా రాజమౌళిని పిలుచుకొనే ఎన్టీఆర్‌కు ఆయన ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక జనతా గ్యారేజ్ లాంటి మంచి సక్సెస్‌ను అందించిన కొరటాల శివకు కూడా మంచి రిలేషన్ ఉంది.

ఎన్టీఆర్‌ను ఆటపట్టించిన రాజమౌళి, కొరటాల శివ
తనకు ఎంతో ఆత్మీయులైన ఇద్దరు వ్యక్తులు, అలాగే కెరీర్‌కు ఎంతో మేలు చేసిన ప్రముఖులు రాజమౌళి, కొరటాల శివను తన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు ఆహ్వానించారు. వెల్‌కమ్ మై డియర్ ఫ్రెండ్స్ రాజమౌళి గారు, శివ గారు అంటూ స్వాగతం పలికారు. ఎన్టీఆర్ షో ప్రారంభించబోతుండగా.. రోల్ కెమెరా అని కొరటాల శివ అంటే.. సౌండ్, క్లాప్ ఇన్, యాక్షన్ అంటూ అని రాజమౌళి ఆటపట్టించారు. దాంతో నేను కశ్చన్ చదువుకొంటున్నాను సార్ అంటూ ఎన్టీఆర్ చెప్పబోతుండగా.. అవును నీకిది తెలుసా అంటూ ఎన్టీఆర్‌ను పట్టించుకోకుండా శివతో రాజమౌళి ముచ్చట్లలో పడిపోయారు.

అల్లరిగా, చిలిపిగా రాజమౌళి, కొరటాల శివ
ఎస్ఎస్ రాజమౌళి ఆటపట్టించడాన్ని తట్టుకోలేకపోయాడు. అవునా.. నీకి తెలుసా? అనవసరంగా ఈ సమాధానాన్ని తీసుకొన్నాం అంటూ ఆ ఇద్దరు మాట్లాడుకొంటుంటే.. ఎంత సేపు మీలో మీరు మాట్లాడుకొంటే.. టిక్ టిక్ ఏం వినిపిస్తుంది అని కోపగించుకొన్నారు. ఈ సందర్భంగా చిలిపిగా, అల్లరిగా ఈ షో సాగిందనే విషయాన్ని ప్రోమో చెప్పకనే చెప్పింది. దీంతో ఫుల్ ఎపిసోడ్ మాములుగా ఉండదు.. ఇక రచ్చే ఉండబోతున్నదనే స్పష్టమైంది.

లొకేషన్ నాది.. డైరెక్షన్ నాది.. అంటూ వార్నింగ్
ఇక రాజమౌళి, కొరటాల శివ చేసిన అల్లరి భరించలేక ఎన్టీఆర్ తన కంప్యూటర్ గురువుకు ఫిర్యాదు చేస్తూ.. వాళ్లిద్దరూ వాళ్లలో వాళ్లు మాట్లాడుకొంటున్నారు కాబట్టి.. ఆ క్వశ్చన్‌ను నేను తీసేయవచ్చా అంటూ ఎన్టీఆర్ అంటే.. అదేంటి? అంటూ రాజమౌళి, శివ అంటూ కనిపించారు. దాంతో ఆ ప్రశ్నను తీసేయండి.. మీరు అలా డిసైడ్ చేస్తారు అని ఎన్టీఆర్ అంటే.. అలా చేయకండి అంటూ వారిద్దరు బుజ్జగించారు. దాంతో ఈ లోకేషన్ నాది.. డైరెక్షన్ నాది.. నేనే బాస్ ఇక్కడ అంటూ కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళికి ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

రాజమౌళి, శివ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అంటే..
ప్రముఖ దర్శకులు కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో సెప్టెంబర్ 20వ తేదిన ప్రసారం కానున్నది. సోమవారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఈ ఎపిసోడ్ ప్రారంభం కానున్నది. తాజా ప్రోమో ఈ ఎపిసోడ్‌పై ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఇంకా ఈ ఇద్దరు దర్శకులు ఎన్టీఆర్‌ను ఎలా ఆటపట్టించారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











