For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఆమె క్యారెక్టర్ మంచిది కాదు.. ఫైమా తల్లి వ్యాఖ్యలు.. ఎలిమినేషన్ హింట్ ఇచ్చారా!

  |

  తెలుగు బుల్లితెర మీద చాలా రకాల కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అయితే, అందులో అన్నీ సక్సెస్ కావడం లేదు. జనరంజకంగా సాగే కొన్ని షోలు మాత్రమే ఆదరణను అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి.

  ఇప్పటికే ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఆరో దాన్ని నడుపుకుంటోంది. ఇది చివరి దశకు చేరడంతో ఇప్పుడు ఫ్యామిలీ వీక్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హౌస్‌లోకి వచ్చిన ఫైమా తల్లి ఓ కంటెస్టెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

   అవన్నీ బీట్ చేయాలని ప్లాన్

  అవన్నీ బీట్ చేయాలని ప్లాన్

  భారీ అంచనాల నడుమ వచ్చిన ఆరో సీజన్‌ ఆరంభం నుంచే చాలా చప్పగా సాగింది. దీంతో బిగ్ బాస్ సక్సెస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షో నిర్వహకులు సరికొత్త వ్యూహాలతో ముందుకు వచ్చారు. వాటి అమలు ఫలితంగా షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. దీంతో ఈ సీజన్‌కు స్పందన క్రమంగా పెరుగుతోంది. ఇది బాగా ప్లస్ అవుతూనే ఉందని చెప్పాలి.

  జాకెట్ తీసేసిన జబర్ధస్త్ వర్ష: హాట్ షోలో గీత దాటేసి మరీ రచ్చ

  బీబీ కోచింగ్ సెంటర్ టాస్కు

  బీబీ కోచింగ్ సెంటర్ టాస్కు

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ప్రతి వారం రకరకాల టాస్కులు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే పన్నెండో వారానికి సంబంధించి 'బీబీ కోచింగ్ సెంటర్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో ఫైమా ఇంగ్లీష్ టీచర్‌గా, ఆది రెడ్డి డ్యాన్స్ మాస్టర్‌గా, శ్రీ సత్య మేకప్ టీచర్‌గా, రాజశేఖర్ సింగింగ్ టీచర్‌గా వ్యవహరించాలి. వీళ్లంతా గంట మోగినప్పుడల్లా మిగిలిన వాళ్లకు కోచింగ్ ఇస్తుండాలి.

  బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్

  బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్

  బిగ్ బాస్ షో ప్రతి సీజన్‌లోనూ చివర్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో అన్ని సీజన్లలోనూ ఇదే తరహాలో వాళ్లను తీసుకొచ్చారు. ఇక, ఆరో సీజన్‌కు సంబంధించి ఇప్పుడు అది జరుగుతోంది. మంగళవారం రాత్రి ఎపిసోడ్‌లో ఆది రెడ్డి భార్య, పాప.. రాజశేఖర్ మదర్‌లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు.

  బీచ్‌లో అందాల తెర తీసేసిన శ్రీముఖి: అక్కడ ఆకును అడ్డుగా పెట్టి మరీ!

  ఫైమా కోసం వచ్చిన మదర్

  ఫైమా కోసం వచ్చిన మదర్

  బుధవారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఫైమా వాళ్ల అమ్మ ఎంట్రీ ఇచ్చారు. మెయిన్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించిన ఆమెను చూసి అందరూ వెల్‌కం చెప్పారు. అంతేకాదు ఫైమా అయితే పరుగు పరుగున వెళ్లి తన తల్లిని గట్టిగా హత్తుకుంది. ఆ తర్వాత ఆమె అందరితో మాట్లాడి ఖుషీగా గడిపారు. ఇక, హౌస్‌లోని కొందరు ఆమె పాదాలకు నమస్కారం చేశారు.

  ఆమెపై ఫైమా తల్లి కామెంట్

  ఆమెపై ఫైమా తల్లి కామెంట్

  తన తల్లిని లోపలికి తీసుకెళ్లిన ఫైమా ఆట గురించి చెప్పమని అడిగింది. అప్పుడామె 'నువ్వు ఆట బాగానే ఆడుతున్నావు. కానీ, వెటకారం తగ్గించుకో. నువ్వు అలా ఉంటే జనాలకు నచ్చడం లేదు' అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత 'నువ్వు శ్రీ సత్యతో జాగ్రత్తగా ఉండు. ఆమె నీ ముందు ఒకలా వెనుక మరోలా మాట్లాడుతుంది. ఇనాయాతో బాగా కలిసి ఉండు' అని చెప్పారు.

  నాగశౌర్య కట్నం వివరాలు లీక్: అన్ని కోట్ల విలువైన కానుకలు.. అనూష పేరిట ఉన్న ఆస్తి ఎంతంటే!

  పాన్‌ను అలా వాడొద్దు అని

  పాన్‌ను అలా వాడొద్దు అని

  ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ గురించి కూడా ఆమె తల్లి మాట్లాడారు. 'నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది కదా.. దాన్ని నువ్వు ఉపయోగించో.. దాన్ని ఎవరికీ ఇవ్వొద్దు' అని చెప్పారు. దీంతో ఫైమా 'నాకు ఉపయోగం లేదంటే ఎవరికైనా వాడతా' అని బదులిచ్చింది. దీంతో ఆమె 'ఆ తప్పు మాత్రం చేయొద్దు.. పాస్‌ను నువ్వే వాడుకో' అని పదే పదే హెచ్చరిస్తూ ఈ విషయాన్ని చెప్పారు.

  ఎలిమినేషన్ హిట్ ఇచ్చారా

  ఎలిమినేషన్ హిట్ ఇచ్చారా

  గత ఎపిసోడ్‌లో ఫైమా మదర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గురించి పదే పదే తన కూతురిని హెచ్చరించడంతో.. ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చారా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఫైమా మదర్ తన కూతురు తప్పులను ఎత్తి చూపుతూ.. అందరి గురించి చక్కగా మాట్లాడుతూ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

  English summary
  Bigg Boss Telugu 6th Season was Running Successfully. Keerthi Bhat Did Shocking Words about Sri Satya Character in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X