For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డ్రంక్ అండ్ డ్రైవింగులో పట్టుబడ్డ బిగ్ బాస్ బ్యూటీ, ట్విట్టర్లో మీడియాపై ఫైర్!

  |

  బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 కంటెస్టెంట్, కొరియోగ్రాఫర్, నటి గాయిత్రి రఘురామ్ అప్పట్లో రియాల్టీ షోకు సంబంధించిన కొన్ని వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా మారారు. తాజాగా ఆమె మరో వివాదంలో ఇరుకున్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో గాయిత్రిపై పోలీస్ కేసు బుక్ అయినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ విషయమై కొన్ని తమిళ దిన పత్రికల్లో వార్తలు రావడం గమనార్హం.

  అయితే ఈ వార్తలను గాయిత్రి ఖండించారు. పోలీసులు తనను ఆపిన మాట వాస్తవమే కానీ, తాను మద్యం సేవించలేదంటూ..... తనదైన వాణి వినిపించారు. తమిళ మీడియా కథనాలు ఏమిటి? గాయిత్రి ఏం చెబుతోంది? ఓ లుక్కేద్దాం.

   మద్యం సేవించి పట్టుబడిన గాయిత్రి

  మద్యం సేవించి పట్టుబడిన గాయిత్రి

  తమిళ పత్రిక కథనం ప్రకారం... చెన్నై సిటీ అడయార్ ప్రాంతంలోని సత్య స్టూడియో సమీపంలో పోలీసులు శనివారం(నవంబర్ 24) ఆమె వాహనం ఆపారని, బ్రీత్ టెస్ట్‌కు సహకరించాలని అడగ్గా... మద్యం సేవించినట్లు గాయిత్రి ఒప్పుకున్నారని, టెస్ట్ తర్వాత ఆమె మద్యం సేవించినట్లు ప్రూవ్ అయినట్లు తెలుస్తోంది.

  అక్కడ పార్టీకి వెళ్లి వస్తూ..

  అక్కడ పార్టీకి వెళ్లి వస్తూ..

  ఎంసీఆర్ నగర్లో సినీ సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన పార్టీలో గాయిత్రి పాల్గొని వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆమెను ఆపగానే అక్కడున్నవారు జనాలు ఆమెను ఫోటోలు, వీడియోలు తీయడం ప్రారంభించారట.

  పోలీసులను రిక్వస్ట్ చేసిన గాయిత్రి

  పోలీసులను రిక్వస్ట్ చేసిన గాయిత్రి

  పోలీసులకు తన కారు సీజ్ చేయడానికి అనుమతి ఇవ్వడంతో పాటు తనను ఇంటి వద్ద డ్రాప్ చేయాలని గాయిత్రి పోలీసులను రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక కానిస్టేబుల్ ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేసినట్లు పత్రిక కథనం.

  కేసు బుక్ అయింది

  కేసు బుక్ అయింది

  అనంతరం కారు సీజ్ చేసి సెక్షన్ 185 ( డ్రంక్ అండ్ డ్రైవింగ్) మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం కేసు బుక్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు ఆమెకు రూ. 3500 ఫైన్ వేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

  ఈ వార్తలను ఖండించిన గాయిత్రి

  ఈ వార్తలను ఖండించిన గాయిత్రి

  అయితే ఈ వార్తలపై గాయిత్రి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తన వెర్షన్ వినిపించడంతో పాటు... మీడియా తనను కావాలని టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ‘‘పోలీసులు నన్ను ఆపిన సమయంలో నా వద్ద డ్రైవింగ్ లైసెన్సుతో పాటు ఇతర పత్రాలు లేవు. నేను వేరే హ్యాండ్ బ్యాగ్ తేవడంతో ఇలా జరిగింది. ట్రాపిక్ పోలీసు నాతో పాటు వచ్చి డాక్యుమెంట్స్ చెక్ చేశారు. ఆ పోలీస్ చేసిన పనిని నేను అభినందిస్తున్నారు. ఇందులో ఎలాంటి వివాదానికి తావు లేదు. ఆయన నాకు అభిమాని కూడా కావడంతో సెల్ఫీ తీసుకున్నారు.'' అని తెలిపారు.

  నేను మద్యం సేవించి ఉంటే...

  ‘‘కారు నేనే నడుపుకుంటూ వచ్చాను. నేను మద్యం సేవించి ఉంటే పోలీసువారు నన్నుకారు నడపనిచ్చేవారు కాదు కదా. దయచేసి దీనిపై అనవసర కథలు అల్లడం ఆపండి''అంటూ గాయిత్రి ట్వీట్ చేశారు.

  English summary
  According to a report in a leading daily, traffic police stopped Gayathri Raghuram vehicle near Sathya Studio, Adyar on Saturday (November 24). When she was asked to take the breath test, Gayathri had confessed that she is under the influence of alcohol and the test proved positive as well. However, Gayathri took to Twitter to share her side of the story. She also wrote, "I did not have license other documents with me and it was in my different handbag. Traffic police came with me to check the documents. I, in fact, appreciated their work there was no quarrel he spoke about my father and he was in fact fan of me we took a selfie. I drove the car. If I was drunk they wouldn't have let me drive my car again. Stop cooking stories. (sic)"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X