For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగార్జునపై గీతూ సంచలన వ్యాఖ్యలు: ఆయన చెప్పబట్టే అలా.. బిగ్ బాస్ మోసం అంటూ!

  |

  హిందీలోకి చాలా ఏళ్ల క్రితమే వచ్చినా.. తెలుగులోకి చాలా ఆలస్యంగా పరిచయమైన షో బిగ్ బాస్. అయితేనేం.. లేటుగా వచ్చినా లేటెస్టుగా రేటింగ్‌లలో రికార్డులు సాధించిన ఈ కార్యక్రమం.. ఇండియాలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని ప్రసారం చేస్తున్నారు. ఇందులో గత వారం ఎలిమినేట్ అయిన గీతూ రాయల్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్, నాగార్జునలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  చిన్నగా మొదలై.. రసవత్తరంగా

  చిన్నగా మొదలై.. రసవత్తరంగా

  తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా బిగ్ బాస్ షో భారీ స్థాయిలో ఆదరణను అందుకుంటోంది. అందుకు అనుగుణంగానే ఆరో సీజన్‌కు కూడా సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఆరంభంలో దీనికి రేటింగ్ అంతగా రాలేదు. కానీ, క్రమంగా ఆట రసవత్తరంగా మారుతూ ఉండడంతో రెస్పాన్స్ దక్కించుకుంటోంది. దీంతో ఈ సీజన్ రేటింగ్‌ ఈ మధ్య క్రమంగా పెరుగుతోంది.

  పెళ్లైన కొత్తలోనే హీరోయిన్ పూర్ణకు షాక్: బయటపడిన భారీ మోసం.. తన భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్

  టైటిల్ ఫేవరెట్‌ గీతూ రాయల్

  టైటిల్ ఫేవరెట్‌ గీతూ రాయల్

  ఆరో సీజన్‌ కోసం కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్ బాస్ నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. మరీ ముఖ్యంగా పాపులర్ అయిన వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారు. ఇలా అందులో రాయలసీమ భామ గీతూ రాయల్ ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో టైటిల్ ఫేవరెట్ అనిపించుకుని అందుకు తగ్గట్లుగానే ఆడింది.

  9వ వారంలో గీతూ ఎలిమినేట్

  9వ వారంలో గీతూ ఎలిమినేట్


  బిగ్ బాస్ హౌస్‌లో తనదైన శైలి ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించుకుని.. టైటిల్ బరిలో నిలిచిన గీతూ రాయల్.. కచ్చితంగా ఫినాలేకు చేరుకుంటుందని అంతా అనుకున్నారు. కొందరైతే ఆమె గెలిచినా ఆశ్చర్యపోయేది లేదని అన్నారు. కానీ, అనూహ్యంగా గీతూ రాయల్ తొమ్మిదో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో హౌస్‌లోని వాళ్లంతా షాక్‌లో ముగినిపోయారు.

  హాట్ వీడియో వదిలిన ప్రగ్యా జైస్వాల్: వామ్మో ఇది మామూలు షో కాదుగా!

  వరుస ఇంటర్వ్యూలు, లైవ్‌లు

  వరుస ఇంటర్వ్యూలు, లైవ్‌లు


  బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత గీతూ రాయల్ తేరుకోలేకపోతోంది. అలాగే, ఆమె అభిమానులు కూడా నిరాశగానే ఉన్నారు. దీంతో ఆమెను షోలోకి మళ్లీ తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గీతూ రాయల్ మాత్రం వరుసగా ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా లైవ్‌లు ఇస్తూ తన అభిమానులను ఓదార్చుతూ, తనకు తాను ధైర్యం చెప్పుకుంటోంది.

  నాగార్జునపై గీతూ కామెంట్లు

  నాగార్జునపై గీతూ కామెంట్లు

  తాజాగా గీతూ ఓ వీడియో వదిలింది. అందులో 'నాగార్జున గారు నన్ను బాగా పొగిడేవారు. దీంతో నేను ఇంత తోపునా అని నాకే అనిపించేది. శని, ఆదివారాల్లో వచ్చే ఎపిసోడ్‌ దాదాపు 5 గంటలు జరిగేది. దాంట్లో నన్ను తెగ పొగిడేవారు. అలా నన్ను పొగిడిపొగిడి మునగ చెట్టు ఎక్కించేశారు. ఆ పొగడ్తలు చూసి నాకు తిరుగేలేదని అనుకున్నా. నేనే విన్నర్ అనుకున్నా' అని చెప్పింది.

  Yashoda Twitter Review: యశోదకు పాజిటివ్ టాక్.. ఆ సీన్స్‌లో అదరగొట్టిన సమంత

  చెట్టు ఎక్కించి పడేసినట్లుగా

  చెట్టు ఎక్కించి పడేసినట్లుగా


  ఆ తర్వాత గీతూ 'నాగార్జున గారు నన్ను పొగిడి పొగిడి మునగ చెట్టు ఎక్కించి చివర్లో కిందికి లాగేశారు. నేను ఎలిమినేట్ అయిన ఎపిసోడ్‌‌లో కూడా నన్ను ఆయన ఈ హౌస్‌లో మాస్క్ లేని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అని అన్నారు. హౌస్‌లో ఉన్న వాళ్లలో ఫైర్ వచ్చిందంటే అది గీతు వల్లే అని నాగార్జున అన్నారు. గీతు ఎప్పుడూ నిజమే చెప్తుంది' అని పేర్కొంది.

  అవన్నీ తీసేశారని ఆరోపణ

  అవన్నీ తీసేశారని ఆరోపణ


  ఇక, చివర్లో బిగ్ బాస్ టీమ్‌పై గీతూ 'బిగ్ బాస్‌కు నేనంటే ఇష్టం ఏమో.. అందుకే నన్ను ఏమీ అనలేదేమో అనుకున్నా. నేను ఏం చేసినా బిగ్ బాస్ వద్దనేవాడు కాదు. కానీ, నాకు సంబంధించిన చాలా కంటెంట్‌ను ఎడిటింగ్‌లో తీసేశారు. అది కూడా నాకు మైనస్ అయింది. మొత్తంగా నాగార్జున గారు, బిగ్ బాస్ టీమ్ నన్ను లేపి.. ఆ తర్వాత ముంచేశారు' అంటూ ఆరోపణలు చేసింది.

  English summary
  Bigg Boss Telugu 6th Season was Running Successfully. Geetu Royal Did Sensational Comments on Nagarjuna After Her Elimination.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X