»   »  'సోగ్గాడే చిన్ని నాయిన' శాటిలైట్ రైట్స్ రేటు సూపర్

'సోగ్గాడే చిన్ని నాయిన' శాటిలైట్ రైట్స్ రేటు సూపర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున ద్విపాత్రాభినయం చేసి విడుదలకు సిద్దంగా ఉన్న సినిమా 'సోగ్గాడే చిన్ని నాయిన'. సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కు సిద్దం అవుతున్న ఈ సినిమాకు సంబందించిన బిజినెస్ ఓ ప్రక్కన జరుగుతూండగా మరో ప్రక్కన భారీ రేటుకు చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. అందుతున్న సమాచారాన్ని బట్టి జెమినీ టీవి వారు ఆరున్నర కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. నాగార్జున సినిమాలకు టీవి మాధ్యమంలో మంచి క్రేజ్ ఉండటంతో ఈ మొత్తాన్ని పెట్టి జెమినీ వారు తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. 

ఇక చిత్రం ప్రమోషన్ లో భాగంగా... సినిమాలో అత్యంతా కీలక పాత్ర అయిన బంగార్రాజు క్యారక్టర్ కు సంబందించిన ఆత్మతో కూడివ టీజర్ ని వదిలారు. ఇక్కడ మీరు ఆ టీజర్ ని చూడవచ్చు..సినిమా గురించి నాగార్జున గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తొలిసారిగా ‘సోగ్గాడే చిన్నినాయనా' ఫుల్ కామెడీ చిత్రంలో తాను నటిస్తున్నానని, సోగ్గాడిగా, అమాయకుడిగా రెండు పాత్రల్లో తేడాలు ప్రేక్షకులకు నచ్చుతాయని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఇందులో ఘోష్ట్‌గా కనిపిస్తుందని, చనిపోయిన తర్వాత కొడుక్కుమాత్రమే కనబడే విచిత్రమైన ఆ పాత్రలో తాను నటించానని తెలిపారు.


 Gemini TV bags Nagarjuna's Soggade Chinni Nayana

ఈ సినిమాలో ఎ.ఎన్.ఆర్ వాడిన 1959 నాటి వాచీని వాడారు అక్కినేని వారసుడు. ఈ సినిమాలో బంగార్రాజు వాటిని వాడరు దానితో పాటు, పంచెకట్టుకు వన్నె తెచ్చిన నాగేశ్వరరావు గారు స్టైల్ ని కూడా నాగార్జున ఫాలో అవ్వడం బాగుందని నాగర్జున గతంలో హర్షాన్ని వ్యక్తం చేసారు.


ఫాదర్‌ క్యారెక్టర్‌ ఇందులో ఘోస్ట్‌గా కనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కొడుక్కి మాత్రమే కనబడే విచిత్రమైన క్యారెక్టర్‌ అది. ఈ పాయింట్‌ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌ అనిపించింది. వెంటనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. రెండు క్యారెక్టర్స్‌ను బేస్‌ చేసుకుని 'సొగ్గాడే చిన్ని నాయనా' అనే టైటిల్‌ పెట్టామని తెలిపారు నాగార్జున.


నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.


గతంతో ఎ ఎన్ ఆర్ చేసిన సినిమా శ్రీరామ రక్షని కొంచం అటు ఇటు చేసివట్టుగా ఉందీ సినిమా. పాత సినిమాలో అన్నదమ్మలుగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తండ్రీకొడుకులుగా మార్చారు డైరక్టర్. మి ఈ సినిమా ఏమేదకు విజయం సాదిస్తుందో చూడాలి.English summary
Gemini TV has bagged the satellite rights of this Nagarjuna’s upcoming film Soggade Chinni Nayana for a whopping amount of 6.5 Crores, which is very huge. Ramaykrishna and Lavanya Tripathi are the female leads. Directed by debutante Kalyan Kurasala, it has been certified U/A by the censor board.
Please Wait while comments are loading...