Gunde Ninda Gudi Gantalu August 27th: సంజూతో మీనా గొడవ.. బాలు ఉగ్రరూపం
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 26వ తేదీ 496వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఎట్టకేళలకు మీనా తన భర్త బాలు తాగుబోతు కాదని నిరూపిస్తుంది. బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లి బాలు అసలు వీడియోను సీసీ ఫుటేజీ ద్వారా సాధిస్తుంది. ఆ తర్వాత బాలుకు ఆ వీడియో చూపించి మీరు తప్పు చేయలేదని ఈ వీడియోనే తెలియజేస్తుందని అంటుంది. అంతే కాదు ఆ వీడియోను కూడా మీనా పోలీసులకు చూపించి, అసలు సూత్ర ధారుడు గుణ అని చెప్పి బాలును తప్పిస్తుంది. నిజానిజాలు కూడా తేలిపోవడంతో పోలీసులు బాలు కారును, లైస్సెన్స్ ను తిరిగి ఇచ్చేస్తారు. గుణను పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తారు. ఇక బాలు ఆ కారును తీసుకొని పోలీస్టేషన్ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు.
ఇదే సయంలో శివ పోలీస్ స్టేషన్ కు వస్తాడు. శివను పోలీస్ స్టేషన్ లో చూసిన మీనా, బాలు, రవి మండి పడుతారు. నీ సొంత అక్క భర్తను మోసం చేసిన, పరువు తీయాలని ప్రయత్నం చేసినా నువ్వు ఆ గుణ గాడి కోసం పోలీస్ స్టేషన్ కు ఎలా వచ్చావురా అని ప్రశ్నిస్తుంది. అసలు గుణగాడితో తిరగవద్దని ఎన్ని సార్లు చెప్పినా కూడా నువ్వు వినిపించుకునేలా లేవు కదా అని మండి పడుతుంది. ఇంకోసారి నిన్ను వాడితో చూస్తే మాత్రం అస్సలు ఊరుకోనని మీనా హెచ్చరిస్తుంది. ఇక బాలు మాత్రం శివ గురించి మనం పట్టించుకోవడం మానేస్తేనే మంచిదని అంటాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోతారు. ఇక మరోవైపు మౌనికాను సంజూ టార్చర్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మీనా సంజూ ఇంటికి వెళ్తుంది. మౌనికాను సంజూ కొట్టబోతుంటే మీనా సంజూ చేయి పట్టుకొని అడ్డుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 27వ తేదీ 497 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బాలు కారును పోలీసులకు పట్టించింది, డ్రైవింగ్ లైసెన్స్ ను క్యాన్సిల్ అయ్యేలా చేసింది మౌనికా భర్త అని మీనాకు తెలిసిపోతుంది. పూల ఆర్డర్ ఇచ్చిన సమయంలో ఒక పోలీసు అధికారి ఈ విషయాన్ని మీనాకు తెలియజేస్తాడు. దాంతో మీనా రగిలిపోతుంది. వెంటనే సంజూను కడిగేయాలని, అసలు బాలుపై ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నాడని ప్రశ్నించేందుకు వెంటనే సంజూ ఇంటికి వెళ్తుంది. అయితే అప్పటికే మౌనికా బాలు, మీనాల వివరణ ఇచ్చే వీడియోను చూస్తుంది. మొత్తానికి తన అన్నయ్య సేఫ్ అయ్యాడని సంతోషిస్తుంది. అసలు బాలు అన్నయ్యపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ఆలోచిస్తుంది. తన భర్త సంజూనే ఇలా చేశాడని, ఒకసారి పోలీస్ ఆఫసీర్ తో కారు, లైసెన్స్ అని మాట్లాడటం విని స్పష్టం చేసుకుంటుంది. వెంటనే వెళ్లి సంజూను నిలదీస్తుంది. మా అన్నయ్య నిర్దోషి అని తేలిపోయింది. ఎవరో మా అన్నయ్యపై బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ మా అన్నయ్యకు ఏం కాలేదు. వాళ్ల కుళ్లి బుద్ధికి మా అన్నయ్య తగిన సమాధానం చెప్పారని అంటుంది. దాంతో సంజూకు కోపం వస్తుంది. మీ అన్నయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నేనే అనే సంగతి నీకు తెలిసిపోయిందా? అని మౌనికాను సంజూ ప్రశ్నిస్తాడు.
అవును తెలిసి పోయిందని మౌనికా అంటుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తావే మీ అన్నయ్యకు చెబుతావా? అని బెదిరిస్తూ మౌనికాను కొట్టబోతాడు. ఇదే సమయంలో మీనా వచ్చి సంజూ చేయిని అడ్డుకుంటుంది. సంజూను వెనక్కి నెట్టి తిరిగి కొట్టేందుకు చేయి లేపుతుంది. దాంతో షాక్ అవుతాడు. ఇక మీనా సంజూకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నీ గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది. మా ఆయనపై కుట్ర చేసింది నువ్వే అని తెలిసింది. అంతే కాదు నువ్వు మౌనికాను దినదిన ఎంతలా టార్చర్ చేస్తున్నావో కూడా తెలిసిపోయిందని మీనా అంటుంది. ప్రస్తుతానికి నాకు మాత్రమే తెలిసిందే. ఇక నా భర్త బాలుకు తెలిస్తే మాత్రం నిన్ను అస్సలు బతకనివ్వడని హెచ్చరిస్తుంది. మౌనికా మౌనంగా నీతో ఉన్నంత వరకే నీ ఆటలు సాగుతాయని, మౌనికా నీ జీవితంలో నుంచి వెళ్లిపోతే మాత్రం నీ డబ్బు, పవర్ ఏమీ చేయలేవని చెబుతుంది. దాంతో సంజూ మౌనంగా ఉండిపోతాడు. ఇక మౌనికాకు ధైర్యం చెప్పి మీనా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత బాలుతో ఇక్కడ జరిగిన విషయాన్ని చెప్పదు. ఇదే సమయంలో మనోజ్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోని వస్తాడు.
ఇక ఇంట్లో వాళ్లందరినీ బయటికి పిలిచి తన కారును చూపిస్తారు మనోజ్ రోహిణి. ఈ క్రమంలో ప్రభావతి ఉప్పొంగి పోతుంది. మనోజ్ ను ఆకాశానికి ఎత్తుతుంది. మనోజ్ ఎప్పటికైనా కార్లలో తిరిగే స్థాయికి వస్తాడని నాకు తెలుసు అని అంటుంది. ఇక బాలు మాత్రం బిజినెస్ చేయాల్సిన డబ్బులతో కారు ఎందుకు కొన్నావురా అని అడుగుతాడు. పైగా ఆ కారు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగిందని రీడింగ్ చూసి షాక్ అవుతాడు. అసలు ఈ కారుకు ఎన్ని లక్షలు ఖర్చు చేశావురా అని బాలు మనోజ్ ను ప్రశ్నిస్తాడు. దాంతో మనోజ్ 4.5 లక్షలు అని చెబుతాడు. మోసపోయావుగా అని బాలు మనోజ్ కు షాక్ ఇస్తాడు. ఈ కారుకు 2.5 లక్షల కంటే ఎక్కువ పెట్టాల్సింది కాదని అంటాడు. ఏ వస్తువుకు ఎంత ఖర్చు చేయాలనేది తెలియని నువ్వు ఇంకా ఎలాంటి బిజినెస్ చేస్తావని ప్రశ్నిస్తాడు బాలు. మేం మంచి బిజినెసే చేస్తామని రోహిణి అంటుంది. ఇక ఆ తర్వాత అందరు కలిసి సెల్ఫీ దిగి ఇంట్లోకి వెళ్తారు. మనోజ్ తమ్ముళ్లు బాలు, రవికి బీర్ పార్టీ ఇస్తాడు. ఇక ప్రోమోలో తన చేయబోయే బిజినెస్ కు అమ్మ పేరు పెట్టకూడదని మనోజ్ అంటాడు. ఆ మాటలను బాలు రికార్డ్ చేసి మనోజ్ కు ఊహించని షాక్ ఇస్తాడు. అమ్మకు వినిపిస్తానని హెచ్చరిస్తాడు. ఈ సందర్భంగా తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











