Gunde Ninda Gudi Gantalu September 12th: మనోజ్ బెడ్‌రూం లాక్కున్న బాలు.. శృతితో ఐడియాతో మీనాతో ఏకాంతంగా
Photo Courtesy: JioHotstar
Gunde Ninda Gudi Gantalu: మీనా, బాలుల గొప్పదనం గురించి ఇంట్లో వాళ్లంతా మాట్లాడతారు. ప్రభావతి కూడా మాట్లాడాలని అందరూ పట్టుబట్టడంతో మీనాను మెచ్చుకుంటూ మాట్లాడుతుంది. ఆ తర్వాత బాలు, మీనాలు కూడా ఒకరి గురించి మరొకరు మాట్లాడతారు. మీ ఇద్దరి లాగే నేను, నా భర్త ఉండాలని కోరుకుంటున్నామని మౌనిక చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆమె మాటలతో మండిపడ్డ సంజూ వెంటనే ఇంటికి వెళ్దామని చెబుతాడు.
కారు దగ్గర సంజూ వేళ్లపై డోర్ వేస్తాడు బాలు. నా చెల్లెలు బాధపడితే నేను బాధపడతాను, నేను బాధపడితే నువ్వు రెట్టింపు బాధపడతావని వార్నింగ్ ఇస్తాడు. పెళ్లి రోజు కూడా బాలు మీనాలు మేడపైన పడుకోవడానికి వెళ్లడంతో సుశీల డార్లింగ్ మండిపడుతుంది. ఇద్దరు కోడళ్లు, ఇద్దరు కొడుకులను నువ్వు వేరు వేరుగా చూస్తున్నావని ప్రభావతిపై ఫైర్ అవుతుంది. ఇందులో అమ్మనాన్నల తప్పేం లేదని.. వాళ్ల ఆరోగ్యం కోసమే మేము మేడపైన పడుకుంటున్నామని చెబుతాడు బాలు. ఆ తర్వాత సత్యం దగ్గరికి వెళ్లిన సుశీల.. మేడపైన మరో రూమ్ కట్టించాలని ఇందుకు కావాల్సిన డబ్బు నేనే ఇస్తానని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 12వ తేదీ, 509వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మీనా దగ్గరికి శృతి వచ్చి గిఫ్ట్ తెచ్చానని చెబుతుంది. అదేంటీ అని మీనా అడగ్గా.. క్యాంపింగ్ టెంట్ అని అంటుంది శృతి. నువ్వు, బాలు మేడపై పడుకుంటున్నారు కదా అందుకే తెచ్చానని చెబుతుంది శృతి. ఇప్పుడు వర్షం వచ్చే సూచనలు ఏం కనిపించడం లేదు కదా వద్దులే అంటుంది. ఇది వర్షం వచ్చినప్పుడు వేసుకోవడానికే కాదు.. మేం ఊరేళ్లినప్పుడు నువ్వు, బాలు గొడుగు ఎందుకు పెట్టుకున్నారు అని శృతి ప్రశ్నించడంతో మీనా సిగ్గుపడుతూ తీసుకుంటుంది. శృతి ఇచ్చిన టెంట్ వేసుకుని బాలు, మీనాలు మేడపై కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
పెళ్లాం పిట్ట, మొగుడు పిట్ట ఊసులాడుకుంటుండగా ఉందని బాలు అనగా.. పాలు తీసుకురాలేదా అని ప్రశ్నిస్తాడు. చిలక , గోరింకల శోభనం కాదని.. కొద్దిరోజుల్లో మరో శోభనం వస్తుందన్న మాట అని అంటాడు బాలు. చాలా నైట్స్ వచ్చాయి, పోయాయని చెబుతుంది మీనా. మా అమ్మ విజిల్ ఊదడం వల్ల చాలా నైట్స్ వేస్ట్ అయ్యాయని అంటుంది. ఊళ్లో మనం గొడుగు వేసుకున్నాం గుర్తుందా అని మీనా అడుగుతుంది. ఎందుకు గుర్తులేదు.. ఆ రాత్రి మనకు మొదటి రాత్రిలా అనిపించిందని చెబుతాడు బాలు.
ఉదయాన్నే కొడుకులు, కోడళ్లు బయటికి వెళ్తుండగా సత్యం అందరినీ పిలిచి ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెబుతాడు. ముగ్గురికి పెళ్లి చేశాను, నా బాధ్యత తీరిపోయిందని అనుకున్నాను.. కానీ నేను పొరపాటు చేసినట్లు మా అమ్మ చెప్పేవరకు తెలియలేదంటాడు సత్యం. నువ్వు పొరపాటున కూడా పొరపాటు చేయవని అంటాడు బాలు. అలాంటి పొరపాట్లు చేసేది ఇక్కడ ఒక్కరు ఉన్నారని బాలు అనగానే.. మనోజ్, ప్రభావతిలు భుజాలు తడుముకుంటారు.
ముగ్గురు కొడుకులకి మూడు గదులు కట్టించి నేను, మీ అమ్మ హాల్‌లో పడుకోవాలని అనుకున్నామని.. కానీ నా ఆరోగ్యం కోసం బాలు తన గది త్యాగం చేశాడని చెబుతాడు సత్యం. ఇప్పుడు వాళ్లిద్దరూ హాల్‌లో పడుకుంటున్నారని బాధపడతాడు. అందరికీ నెలల తేడాలోనే పెళ్లి జరిగిందని, ఏకాంతం కావాలని అంటుంది సుశీల డార్లింగ్. మధ్యలో ప్రభావతి మాట్లాడుతుండగా.. ఎక్కువ మాట్లాడితే నా కొడుకుని మా ఊరు తీసుకెళ్లిపోతానని వార్నింగ్ ఇస్తుంది. మేడపైన ఒక రూమ్ వేసుకోవాలని అనుకుంటున్నానని సత్యం చెప్పడంతో.. నేను వాటా ఇవ్వలేనని మనోజ్ చేతులెత్తేస్తాడు.
నా పెన్షన్ డబ్బుతోనే కట్టిస్తానని సత్యం చెబుతాడు. కట్టించాలని అనుకున్నప్పుడు ఓ కిచెన్, ఒక హాల్ కట్టిస్తే బాగుంటుందని శృతి చెప్పడంతో అప్పుడు అప్పు కోసం మనం ఈ ఇంటిని అమ్మేయాలని అంటాడు బాలు. అంత ఖర్చు నా కొడుకు భరించలేడని సత్యం చెప్పడంతో మా అమ్మకి చెబితే మా నాన్నతో కట్టిస్తుందని అంటుంది శృతి. అది నేను ఎప్పటికీ ఒప్పుకోనని అంటాడు సత్యం. ఆయన నీకు, రవికి వేరే చోట ఒక ఇల్లు కట్టిస్తానంటే నాకేం అభ్యంతరం లేదని, కానీ ఈ ఇంట్లో ఒక ఇటుక కొనాలన్నా నా పెన్షన్ డబ్బులే వాడతానని తేల్చి చెబుతాడు సత్యం.
ఈ వయసులో మీరు మా కోసం మీ పెన్షన్ డబ్బుల్ని ఇచ్చేస్తే ఎలా అని మీనా బాధపడుతుంది. ఆ రూం సంగతి మరిచిపో మేమే సర్దుకుంటామని చెబుతాడు బాలు. నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేనని అంటాడు సత్యం. నువ్వు ఎవరి దగ్గరా చేయి చాచితే నేను తట్టుకోలేనని చెబుతాడు బాలు. నువ్వు వయసుకు తగినట్లుగానే మాట్లాడాలని మనోజ్, ప్రభావతిలకు సుశీల వార్నింగ్ ఇస్తుంది. మా నాన్న సంపాదించేది నా కోసమేనని కట్టిస్తే ఏమవుతుందని శృతి అంటుంది.
ఇన్నేళ్లు కష్టపడి ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండకుండా కొత్త ఖర్చు తలకెత్తుకోవడం నేను చూడలేనని అంటుంది సుశీల. ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని సత్యం అడుగుతాడు. రూమ్‌ని రోటేషన్ పద్ధతిలో ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు వాడుకోవాలని చెబుతుంది సుశీల. దానికి నేను ఒప్పుకోననని.. మీనా అంటే చిన్న గదిలో చాప వేసుకుని పడుకోవడం అలవాటని అంటుంది ప్రభావతి. నా ఇద్దరు కోడళ్లు కోటీశ్వరుల ఇంట్లో పుట్టారు.. వాళ్లెందుకు కింద పడుకోవాలని ప్రశ్నిస్తుంది. ఈ ఇంటికొచ్చాక కోటీశ్వరులని, లేనివాళ్లని తేడా చూపించొద్దని.. ఇదంతా ఒకే కుటుంబమని సుశీల గడ్డి పెడుతుంది. తొలి వారం మనోజ్- రోహిణిలు హాల్‌లో పడుకుంటారని చెబుతుంది.
మీనా కిచెన్‌లో వంట చేస్తుండగా సుశీల వచ్చి మీ అత్తకి కూడా పని చెప్పమని అంటుంది. నా ఇంట్లో వాళ్లు కష్టపడితే నేను చూడలేనని అంటుంది మీనా. రూమ్ కోసం మీరు పెట్టిన కండీషన్ వద్దని నేను ఎక్కడైనా పడుకుంటానని చెబుతుంది. నువ్వు, బాలు మేడ మీద పడుకుంటే పిల్లల్ని ఎప్పుడు కంటారని ప్రశ్నిస్తుంది సుశీల. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే రాత్రి ఇద్దరూ కలిసి పడుకోవాలని చెబుతుంది. మీ మొగుడిని గుప్పిట్లో పెట్టుకోవాలంటే అదే కరెక్ట్ టైం అని, ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే కాబట్టి నీదే పైచేయిగా ఉండాలని అంటుంది సుశీల. ఊరెళ్తున్నని చెప్పి బయల్దేరుతుంది.
తమ ఫర్నిచర్ షాప్‌ని ఫ్రెండ్స్‌కి చూపిస్తారు రోహిణి, మనోజ్. మీ ఆయన నిలకడగా బిజినెస్ చేయడం కష్టమేనని రోహిణి ఫ్రెండ్ సెటైర్లు వేస్తుంది. ఈ ఫ్రాడ్‌తో పాటు నీ గతం బయటపడకుండా జాగ్రత్తగా చూసుకోమని వార్నింగ్ ఇస్తుంది. ఫర్నిచర్ షాప్ ఓనర్ వచ్చి డీలర్‌షిప్ మార్చడానికి టైం పడుతుందని చెబుతాడు. ఇంతకీ షాప్‌కి ఏం పేరు పెడుతున్నారని రోహిణిని ఫ్రెండ్ అడుగుతుంది. మా అత్తయ్య పేరుతో ప్రభావతి ఫర్నిచర్స్ అని పెడతామని రోహిణి చెప్పడంతో .. ఆ పేరు నీకు, మీనాకు కలిసిరాలేదని చెబుతుంది. మనోజ్ మంచంపై పడుకోవడంతో రోహిణి వచ్చి హాల్‌లో పడుకోవడానికి పిలుస్తుంది రోహిణి. తన వల్ల కాదని మనోజ్ చేతులెత్తేస్తాడు. ఇంతలో బాలు వచ్చి తలుపులు బాదుతాడు. దీంతో మనోజ్ వచ్చి బాలుపై మండిపడతాడు. మేం ఇంట్లో ఉండాలా? వద్దా? అని సత్యంను రోహిణి అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











