Gunde Ninda Gudi Gantalu September 26th: రోహిణి కఠిన నిర్ణయం.. చింటూని బయటికి పంపే కుట్ర, బాలుకి అనుమానం

Photo Courtesy: JioHotstar

బాలు, మీనాకు రోహిణి కనిపించడంతో ఇంకా నువ్వు వెళ్లిపోలేదా అని అడుగుతారు. అన్ని వార్డుల్లో కెటిల్స్ పంచి పెట్టేసరికి చాలా ఆలస్యమైందని చెబుతుంది రోహిణి. ఆ బిడ్డను కూడా చూసి పెద్దావిడకు ధైర్యం చెప్పానిన అంటుంది. వాళ్లిద్దరికీ ఎవ్వరూ లేరని ఓ మేనత్త దుబాయ్‌లో ఉండి బాగా డబ్బు సంపాదిస్తోందని, నాకు కనుక దొరికితే కడిగి పారేస్తానని బాలు కోప్పడతాడు. ఆవిడకు ఏ ప్రాబ్లమ్ ఉందోనని వెనకేసుకొచ్చినట్లుగా మాట్లాడటంతో రోహిణిపై ఫైర్ అవుతాడు బాలు.

బాబుకు రెండ్రోజుల్లో కట్లు విప్పుతామని డాక్టర్ చెప్పడంతో వూళ్లో ఎక్కడైనా లాడ్జిలో ఉంటామని చెబుతుంది రోహిణి తల్లి. ఆ మాటలతో బాలు, మీనాలు మండిపడి.. మా ఇంటికి రమ్మని తీసుకెళ్తారు. రోహిణి తల్లిని, చింటూని ఇంట్లో చూసిన బాలు కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. దాంతో బాలు అందరికీ జరిగినదంతా చెబుతాడు. మీకే ఉండటానికి గది లేదు, వీళ్లని ఎక్కడ పెడతావని నిలదీస్తుంది ప్రభావతి. వాళ్లిద్దరూ నా గదిలో ఉంటారని రోహిణి చెప్పగా.. మనోజ్ కూడా ఓకే అంటాడు. భార్యాభర్తలిద్దరూ సడెన్‌గా మంచిగా మాట్లాడటంతో అంతా షాక్ అవుతారు. బెడ్‌పై చింటూని చూస్తూ బాధపడుతున్న రోహిణి దగ్గరికి ప్రభావతి వచ్చి వీళ్లద్దరినీ బయటకు గెంటేయడానికి ప్లాన్ చెప్పమని అడుగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 26వ తేదీ, 519వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 519 September 26th 2025 here is full story

Photo Courtesy: JioHotstar

ప్రమాదంలో గాయపడిన చింటూని మీనా అక్కున చేర్చుకుంటుంది. తన బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోపెట్టుకుంటుంది. మరోవైపు రోహిణి తన గతం ఎక్కడ తెలిసిపోతుందోనని టెన్షన్ పడుతుంది. తన కలలో తన కొడుకు చింటూ తన దగ్గరికి వచ్చి ఏడుస్తున్నట్లు, చింటూను ఓదార్చుతున్నట్టు, ఈ క్రమంలో తానే తన తల్లినని చెప్పినట్లు, ఈ విషయం తన భర్త విని షాక్ కావడం , తన అత్త ప్రభావతి వచ్చి రోహిణి నిలదీయడం వంటి ఘటనలు కలలోకి వస్తాయి. దీంతో ఒక్కసారిగా రోహిణి ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేస్తుంది. ఆ తర్వాత తన కొడుకు ఎలా ఉన్నాడు చూడడానికి మీనా రూమ్ కు వెళ్తుంది.

ఇంతలో బాబు సడన్ గా నిద్రలో నుండి లేస్తాడు. అమ్మ అమ్మ అంటూ ఏడుస్తుంటాడు. దీంతో కంగారుపడిన రోహిణి గదిలో నుండి పరుగున బయటికి వెళ్లి దాచుకుంటుంది. తనలో తాను బాధపడుతుంది. తన కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననీ బాధపడుతుంది. కనీసం మీనా లెక్క కూడా తన కొడుకును చూసుకోలేకపోతున్ననీ, ప్రమాదంలో దగ్గరకు చేరదీయలేకపోతున్నారని ఎమోషనల్ అవుతుంది రోహిణీ.

మరోవైపు.. వారు తన ఇంట్లో ఉంటే తన గతం ఇక్కడ బయటపడుతుందోనని భయపడుతుంది రోహిణీ. ఈ క్రమంలో వెంటనే తన ఫ్రెండ్ విద్యకు ఫోన్ చేసి జరిగిన విషయాలన్నిటిని పూసగుచ్చినట్లు చెబుతుంది. దీంతో విద్య వెంటనే రియాక్ట్ అవుతుంది. వాళ్లు అక్కడ ఉంటే నీ మనుగడకు ప్రమాదమనీ, వారిని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించమని సలహా ఇస్తుంది విద్య. తనకు ఆ విషయమే అర్థం కాక ఫోన్ చేశానని అసలు విషయం బయటపడుతుంది. దీంతో విద్య ఓ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ రోహిణికి కూడా నచ్చడంతో వెంటనే ఇంప్లిమెంట్ చేస్తుంది.

ఇక ప్లాన్ లో భాగంగా విద్య వెంటనే మీనాకు ఫోన్ చేసి తనకు సహాయం చేయాలని కోరుతుంది. మొదట అసలు విషయం చెప్పకుండా ఏదో విషయం మాట్లాడుతుంది. దీంతో కోపానికి వచ్చిన మీనా మ్యాటర్ ఏంటో చెప్పమని అడుగుతుంది. తన ఆఫీసులో పువ్వులు అల్లే కాంపిటీషన్ ఉందని, ఆ కాంపిటీషన్లో తాను పేరు ఇచ్చానని, ఆ పోటీలో పాల్గొనడానికి సహాయం చేయాలని విద్య ప్రాధేయపడుతుంది. తనకు వీలుకాదని, తనకు కావలసినవారు ఇంటికి వచ్చారని, వారిని విడిచి తాను ఎట్టి పరిస్థితుల్లో రాలేనని మీనా చెబుతుంది. కనీసం ఒక గంట సేపైనా తనకు నేర్పించాలని రిక్వెస్ట్ చేస్తుంది. అలా విద్య మాయమాటలకు మీనా పడిపోతుంది. సహాయం చేయడానికి వస్తానని మీనా మాట ఇస్తుంది.

మీనా బయటకు వెళ్లే సమయంలో బాలు ఎదురవుతాడు. ట్రిప్ కు వెళ్లలేదా? అని మీనా ప్రశ్నించగా తనకు ఇంకా ఎలాంటి ట్రిప్ రాలేదని, రాగానే వెళ్తానని సమాధానం ఇస్తాడు. తాను రోహిణి ఫ్రెండ్ విద్యకు సహాయం చేయడానికి వెళుతున్నానని మీనా అంటుంది. దీంతో బాలుకి అనుమానం వస్తుంది. ఇప్పుడు కాల్ చేయని విద్య నీకెందుకు ఫోన్ చేసిందని ఆరా ఇస్తాడు. ఎందుకైనా మంచిది అక్కడికి వెళ్లకపోవడమే బెటర్ అని, రోహిణి స్నేహితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని బాలు సూచిస్తాడు. కానీ, తాను విద్యకు మాట ఇచ్చానని ఇచ్చిన మాట ప్రకారం సహాయం చేయడానికి వెళ్తానని మీనా అంటుంది. సరే కానీ, తరచూ ఫోన్ చేయమని ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఇంటికి రమ్మని ఆర్డర్ వేస్తాడు బాలు. ఇలా మీనా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత రవి, శృతి లను కూడా తన ప్లాన్ లో భాగంగా రోహిణి వారిని బయటికి పంపిస్తుంది. ఇక మెయిన్ టార్గెట్ తన అత్తమ్మ ప్రభావతి. ఆమెను బయటికి ఎలా పంపించాలని తెగ ఆలోచిస్తుంది. చింటూ వాళ్ళ అమ్మమ్మ ఇంకో రోజులపాటు మన ఇంట్లోనే ఉంటారంటూ కట్టు కథ అల్లుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రభావతి వారిని తానే వెళ్లగొడతానని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీంతో రోహిణి అడ్డుపడి, వారిని బాలు ఇంటికి తీసుకువచ్చాడు. కాబట్టి ,మనం పంపిస్తే. గొడవవుతుందని, మళ్లీ వచ్చి గొడవ చేస్తాడని భయపడుతోంది రోహిణి. దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్రభావతి తన కోడలు సహాయం కోరుతుంది. ఎలాగైనా వారిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టమని చెబుతుంది ప్రభావతి.

దీంతో రెచ్చిపోయిన రోహిణి తాను దగ్గరుండి వారిని ఇంట్లో నుండి బయటకు పంపిస్తానని, ముందు తన అత్తమ్మ, మామయ్య ను కూడా ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని సూచిస్తుంది. ఈ ప్లాన్ లో భాగంగానే ప్రభావతి తన భర్త సత్యం దగ్గరికి వెళ్లి గుడికి వెళ్లారని, తాను మొక్కు తీర్చుకోవాలని చెబుతుంది. ఈ క్రమంలో బాలుని కూడా తమతో రమ్మని సత్యం కోరుతాడు. తనకు గుళ్ళు గోపురాలు తిరిగే టైం లేదని, మీరే వెళ్ళమని సలహా ఇస్తాడు. అయినా సడన్ గా గుడికి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తాడు. ఈ సమయంలో తన వదిన రోహిణి నువ్వెందుకు వెళ్లడం లేదని నిలదీస్తాడు. దీంతో ప్రభావతి రియాక్ట్ ఎవరి పనివారు చూసుకోమని బాలును అక్కడి నుండి పంపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X