Gunde Ninda Gudi Gantalu September 30th:అబద్ధాల వలలో చిక్కుకున్న రోహిణి.. నిజం విని కన్నీరు పెట్టుకున్న చింటూ

Gunde Ninda Gudi Gantalu: విద్య ప్లాన్ ప్రకారం మీనాను ఇంటికొచ్చేలా చేసి పూలు అల్లడం నేర్పించమని అడుగుతుంది. కానీ మీనా త్వరగా వెళ్ళిపోతే రోహిణి పని పూర్తికాదు కాబట్టి, విద్య ఎక్కువసేపు ఉండేలా మాయమాటలు మాట్లాడి మీనాను పొగడ్తలతో ఇంప్రెస్ చేస్తుంది. మీనా తన అత్త గురించి గొప్పగా చెప్పడంతో విద్య ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో మీనా రోహిణి గురించి తెలిసే ప్రయత్నం చేస్తూ, విద్యకు ఫోటోలు చూపించమని అడగడం వల్ల విద్యకు అనుమానం వస్తుంది. మరోవైపు బాలు బయటకు వెళ్లగానే రోహిణి తన తల్లిపై కోపం చూపిస్తూ చింటూ విషయం బయటపడితే తన జీవితం నాశనం అవుతుందని బాధపడుతుంది. రోహిణి తల్లి కూడా తన ఆవేదనను చెబుతూ, చింటూని తాను తల్లిలా పెంచుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తుంది.

నువ్వు మాత్రం నీ సుఖం కోసం వాడిని దూరం చేస్తోందని రోహిణిని తన తల్లి విమర్శిస్తోంది. ఈ తగాదా మధ్య రోహిణి తన కొడుకును ఎప్పటికీ వదిలిపెట్టనని, ఏదోక రోజు తన భర్తకు నిజం చెబుతానని ఎమోషనల్ అవుతుంది. ఇదంతా చింటూ పై నుంచి వింటూ, కన్నీళ్లు పెట్టుకుంటూ కిందకు వచ్చి తనే తల్లిని అని రోహిణిని అడుగుతాడు. చివరగా రోహిణి కన్న కొడుకును గుండెలకు హత్తుకుంటూ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ సన్నివేశం మొత్తం తల్లి - కొడుకు బంధం, తల్లి చేసిన పొరపాటు వల్ల వచ్చిన సమస్యలు, అబద్ధాల వలన ఏర్పడే సంఘర్షణలను బలంగా చూపిస్తుంది. ఇక సెప్టెంబర్ 30వ తేదీ, 521వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 521 September 30 th 2025 here is full story

రోహిణి అత్త కాదు.. తన తల్లి అని తెలియడంతో చింటూ ఏడుస్తూ వెళ్లి రోహిణిని హత్తుకుంటాడు. 'ఎందుకమ్మా ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టావు?' అని ప్రశ్నించగా.. తప్పు చేశానంటూ రోహిణి బాధపడుతుంది. రోహిణి తల్లి సుగుణమ్మ కూడా ఆనందపడుతుంది. ఇన్ని రోజులకు చింటూ ప్రశ్నలకు సమాధానం దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తుంది. వెంటనే చింటూ ఇక్కడ తనకు నచ్చడం లేదనీ, వెంటనే ఇంటికి వెళ్లి పోదామని మారం చేస్తాడు. అలాగే తన స్కూల్లో పిల్లలు తనకు అమ్మలేదని తనని ఎగతాళి చేస్తున్నారని, వచ్చే అందరికీ నువ్వేనా అమ్మవారిని చెప్పాలని రిక్వెస్ట్ చేస్తాడు చింటూ. తాను అన్న పరిస్థితులలో రాలేనని చెబుతుంది. దీంతో సుగుణమ్మ ఎమోషనల్ అవుతూ.. 'కన్న కొడుకుతో అమ్మ అని పిలిపించుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు వాడిని నీ కొడుకు అని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తావు?' అని ప్రశ్నిస్తుంది.

'చూసావు కదా అమ్మ మీనా పరిస్థితి. మీనా ఎన్ని పనులు చేసిన మా అత్తయ్య ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాంటిది నేను కోటీశ్వరుడి కూతుర్ని కాదని, ఓ బిడ్డకు తల్లిని తెలిస్తే, వెంటనే కట్టుబట్టలతో నన్ను బయటకి గెంటిస్తోంది'అని బాధపడుతుంది రోహిణి. ఈ సమయంలో తన కొడుకును ఓ రిక్వెస్ట్ చేస్తుంది ఈ ఇంట్లో ఉండగా తనని అమ్మ అని పిలవద్దని చెబుతుంది. దీంతో చింటూ 'నేనేం తప్పు చేశాను అమ్మ' అంటూ బాధపడతాడు. 'నువ్వేం తప్పు చేయలేదు. ఇక్కడ అమ్మ అని పిలిస్తే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు' అని చెబుతోంది . అందుకు చింటూ అంగీకరిస్తూ. కానీ రేపు కట్లు విప్పే సమయంలో ముందు నిన్నే చూడాలని తన తల్లిని రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు రోహిణి కూడా అంగీకరిస్తుంది.

ఆ తర్వాత 'వెంటనే ఇక నుండి వెళ్లిపోండి. నేను హోటల్లో రూమ్ బుక్ చేశాను' అని చెబుతోంది. దీంతో షాక్ అయినా రోహిణి తల్లి బాలు, మీనాలకు చెప్పకుండా వెళ్ళిపోతే బాగోదని అంటుంది. అదేం అవసరం లేదు మీకోసమే వారందరినీ ఇంట్లో నుండి వెళ్లిపోండని చెబుతుంది. మరోవైపు బాలు ట్రిప్ క్యాన్సల్ కావడంతో ఇంటికి బయలుదేరుతాడు. మీనా కూడా విద్య ఇంటి నుండి బయలుదేరడానికి సిద్ధమవుతుంది, కానీ తినేసి వెళ్ళమని విద్యా రిక్వెస్ట్ చేస్తుంది. అలా విద్య, మీనా ఇద్దరు తింటూ తమ కుటుంబం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. 'మీ అత్తయ్య నిన్ను టార్చర్ చేస్తుంది కదా.. ఆమెపై నీకు కోపం రాదా ?'అని విద్య ప్రశ్నించగా.. 'ఎంతైనా నా భర్త తల్లి కదా.. ఆమెకు నన్ను అనే అధికారం ఉంటుంది. మిగతా ఇద్దరు కోడలు గొప్పింటి వాళ్ళు .. కాబట్టి నన్ను తేడాగా చూస్తుంది. ఇప్పుడైనా ఒళ్ళు మండితే నేను కూడా చురకలు అంటిస్తా 'అంటూ మీనా సెటైర్లు వేస్తోంది.

మీనా మాటలకు విద్య ఇంప్రెస్ అవుతుంది. తనని బాధ పెట్టిన వారిని కూడా క్షమించే గుణం మీనాకు ఉందని, ఆమెనుండి ఒక ఆడపిల్ల ఎంతో నేర్చుకోవచ్చు. రోహిణికి మీనాకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి అని తన మనసులో అనుకుంటుంది. మరోవైపు మీనా వచ్చేంతవరకు ఉంటామని చింటూ అనగా..'నేను మీ అమ్మను మీనా అమ్మనా? ' అని బెదిరిస్తుంది. ఇకనుండి మీనాతో మాట్లాడకూడదని చింటూకు వార్నింగ్ ఇస్తుంది. ఇంతలోనే బాలు ఇంటికి చేరుకుంటాడు. బయటికి వెళ్లడానికి సిద్ధమైన వారిని మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్తుంది రోహిణి. బాలు ఇంట్లోకి వచ్చి చింటూ ని పిలుస్తాడు. తనకోసం బిర్యానీ తీసుకోవచ్చా అని తినమని చెప్తాడు. ఇంతలో రోహిణి కనిపించగా.. పార్లరమ్మ ఇంట్లోనే ఉంది షాప్ కు వెళ్లలేదా ? అని అడుగుతాడు. 'నీకు ప్రతి విషయాన్ని చెప్పాలా ? 'అని ఎదురు మాట్లాడుతుంది. దీంతో బాలు సైలెంట్ అయ్యి అక్కనుండి వెళ్ళిపోతాడు.

ఇక బాలు తెచ్చిన బిర్యాని చింటూ కి పెడుతుంది రోహిణి. ముందే వెళ్లిపొమ్మని చెప్పాను మీరే ఆలస్యం చేశారంటూ తన తల్లి సుగుణపై రోహిణి ఫైర్ అవుతుంది. సరే చేసేది ఏం లేదు కాబట్టి ఒక రోజు ఇక్కడే ఉండి వెళ్ళండని చెబుతోంది. దీంతో చింటూ కూడా సంతోషించి 'నేను ఈరోజు మొత్తం మీతోనే ఉంటా అమ్మా' అని అంటాడు. దీంతో రోహిణి కోప్పడుతుంది మరోసారి ఇంట్లో తనని అమ్మ అని పిలవద్దని బెదిరిస్తుంది. అలా చేయాలంటే తనకు తినిపియ్యాలని చింటూ మారం చేస్తాడు. దీంతో రోహిణి అయీష్టంగానే తన కొడుకు తినిపిస్తుంది. ఈ విషయాన్ని అటుగా వెళుతున్న బాలు చూసి ఆశ్చర్యపోతాడు. 'పార్లరమ్మ అమ్మ అయ్యిందిగా 'అనేస్తాడు. తొలిసారి పార్లరమ్మలో అమ్మను చూస్తున్నాను అని ఇన్ డైరెక్ట్ గా రోహిణికి సెటైర్లు వేస్తాడు బాలు. మంచిగా ఉండడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తుంది రోహిణి. అదేం లేదు కానీ మొదటిసారిగా నీలో సాఫ్ట్ నెస్ చూస్తున్నారంటూ .. సైటర్ వేస్తాడు.

సరేలే త్వరగా తిని రమ్మని చింటూ కి చెప్పి నుండి బాలు వెళ్లిపోతాడు. బాలు అలా ఎందుకు మాట్లాడాడో అర్థం కాక రోహిణి షాక్ అవుతుంది. ఇక బాలు చింటూ తో సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలోనే మీనా ఇంటికి చేరుతుంది. మీనా రాగానే ఎలా ఉన్నావు? అంత బాగేనా? అంటూ కుశల ప్రశ్నలు అడుగుతాడు బాలు. కొత్తగా ఆడుతున్నావు ఏంటి అని ప్రశ్నించగా.. 'నువ్వు రోహిణి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చావు కదా.. ఏమైనా జరిగి ఉంటుందేమోనని'అడిగానని బాలు ఉంటాడు. నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలని.. ఇంతకీ బా చింటూ కి అన్నం తినిపించింది ఎవరో తెలిస్తే షాక్ అవుతావు అంటూ సస్పెన్స్ పెడతాడు. తాను ఎప్పుడూ చూడడానికి నిజంగా తొలిసారి రోహిణిలో అమ్మను చూశానని. చింటూ కి స్వయంగా రోహిణి తినిపించిందని చెబుతాడు.

ఇందులో ఆశ్చర్యమేముంది ప్రతి ఆడదానిలో అమ్మ తన ఉంటుందని బదిలీస్తోంది. ఇక మీనా చింటూ కి కళ్ళజోడు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. అలాగే చింటూ వల్ల అత్తయ్యతో మాట్లాడమని సుగుణమ్మకు మీనా చెబుతుంది. అయితే ఈ సమయంలో అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయలేదని, పనిలో బిజీగా ఉంటుందని బదిలిస్తుంది. సరేలే చింటూ కి కట్లు విప్పాక వారం రోజులు ఇక్కడనే ఉండమని మీనా చెబుతోంది. ఎక్కడ మీనా చెప్పిన మాటలకు అంగీకరిస్తారో అని తన చేతిలో ఉన్న గిన్నెను రోహిణి కింత పడేస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఈ సీరియల్ ముగుస్తుంది. అప్ కమింగ్ ఎపిసోడ్లో చింటూ సుగుణమ్మ ఇంట్లో నుండి వెళ్తూ ఉంటారు. మరోసారి ఇంటికి రావద్దని ప్రభావతి వారిని ఇస్తోంది. ఈ సమయంలో నానా మాటలు అనడంతో రోహిణి ప్రభావతి పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X