Gunde Ninda Gudi Gantalu October 6th Episode: మీనా ఆత్మహత్య చేసుకుందా? ఆ లెటర్ లోని రహస్యం ఏంటి?

courtesy: Jiohotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో బాలు సరదాగా వేసిన జోక్ మీనా గుండెల్లో కత్తిలా గుచ్చుకుంది. "అన్నయ్య పెళ్లి చేసుకుంటే తమ్ముళ్లు జాగ్రత్తగా ఉండాలి.. ఇక బతుకు బస్టాండ్" అన్న బాలు మాటలు మీనా మనసును తీవ్రంగా గాయపరిచాయి. బాలు నిజంగా తనను ప్రేమిస్తున్నాడని నమ్మిన మీనా ఒక్కసారిగా మనసు విరిగిపోగా, కోపంతో వంటగదిలోకి వెళ్లిపోయింది. ఈ పరిస్థితిని అదునుగా భావించిన ప్రభావతి, "బాలు ప్రేమతో పెళ్లి చేసుకోలేదు.. నాన్న భయానికి బలవంతంగా పెళ్లి చేశాడు" అంటూ మీనాను మరింత కించపర్చుతుంది. దీంతో మీనా బాలు, ఇంటి పనుల మీద ఘాటుగా మాట్లాడి వంట చేయనని ప్రకటించింది. "మీనా ఎప్పుడో చచ్చిపోయింది... నేను దెయ్యం" అంటూ గదిలోకి వెళ్లిపోయి అందరిని షాక్‌కు గురి చేసింది.

తర్వాత బాలు మీనాను ఓదార్చే ప్రయత్నం చేసినా, "మనసులో లేనిదే మాట బయటకు రాదు" అని మీనా ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో బాలు కూడా కోపంగా స్పందించాడు. ఇదే సమయంలో మీనా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో బాలు మరింత ఆందోళన చెందాడు. ఇంతలో ప్రభావతి కాఫీ సీన్‌లో కూడా బాలుని రెచ్చగొట్టి, "పోయి నీ పెళ్లాన్ని అడుగు" అని కౌంటర్ ఇచ్చింది. రవి, శ్రుతి కూడా మీనా గైర్హాజరు గురించి ప్రశ్నించడంతో ఇంట్లో టెన్షన్ మరింత పెరిగింది. చివరగా బాలు మీనా పుట్టింటికి ఫోన్ చేసి సుమతిని అడుగుతాడు. కానీ "అక్క ఇక్కడకు రాలేదు బావా" అని సుమతి చెప్పడంతో బాలు షాక్ అవుతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 525 October 6 th 2025 here is full story

courtesy: jiohotstar

మీనా కనిపించకపోవడంతో బాలు .. మీనా చెల్లెకి ఫోన్ చేసి.. 'మీ అక్కయ్యకి ఫోన్ ఇవ్వు' అని ఆర్డర్ వేస్తాడు. 'అక్క అక్కడ ఉంటే.. నేను ఎలా ఫోన్ ఇవ్వాలి' అంటూ వంగ్యంగా సమాధానం ఇస్తుంది. 'మీనా ఇక్కడ లేదు కాబట్టి ఫోన్ చేసి అడుగుతున్నా? అని బాలు అంటాడు. దీంతో ఒకసారిగా మీనా చెల్లి కంగారుపడుతుంది. 'అక్క ఎటు వెళ్ళింది? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ? అంటూ బాలుపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఈ విషయాన్ని మీనా తల్లి పార్వతి వింటుంది. బాల్ ఫోన్ పెట్టేయగానే అసలు ఏం జరిగిందని ఆరాతీస్తుంది. అక్కయ్య ఇంట్లో లేదని బావ ఫోన్ చేశాడంటూ చెప్తుండగా.. ఇందులోనే మీనా తమ్ముడు శివ కూడా వింటాడు. అక్కకు ఏమైనా జరిగిందా? అంటూ ప్రశ్నిస్తాడు. అక్కయ్య కనిపించడం లేదని పార్వతి అనడంతో'బాలు బావనే ఏదో చేసి ఉంటాడు. తాగేసి వచ్చి అక్కతో గొడవ పడి ఉంటాడు' అంటూ బాలుని ఇష్టం వచ్చినట్లు తిడతాడు శివ.

ఇక మరోవైపు.. రోహిణి తన ప్రతిభా పాటవాలతో వింత వంటలను చేసిపెడుతుంది. ఆ ఆ వంట తినలేక శృతి, రవి ఇబ్బంది పడతారు. మనోజ్ మాత్రం అద్భుతంగా ఉందంటూ తన పెళ్ళాన్ని పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఇక ప్రభావతి మాత్రం తినలేక.. మింగలేక.. ఇబ్బంది పడుతుంది. ఇంతలోనే సత్యం ఇంటికి చేరుకుంటాడు. తినడానికి రండి అని.. సత్యాన్ని పిలుస్తుంది ప్రభావతి. ఇంట్లో కోడలు కనిపించడం లేదు. కనీసం బాధ్యత కూడా లేదా అంటూ ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు సత్యం. 'మీనా నాకేమైనా చెప్పి వెళ్లిందా? ఎప్పుడో వెళ్లాల్సింది.. ఇప్పుడు వెళ్ళింది' అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. తల్లి మాటలకు రవి తినకుండానే వెళ్ళిపోతాడు. తన అన్నయ్య బాలు దగ్గరికి వెళ్లి.. వదిన కోసం వెతుకుదాం.. నేను కూడా వస్తాను'అంటాడు. 'లేద్రా రాజేష్ వస్తున్నాడు వాడితో కలిసి మీనా కోసం వెతుకుతాను'అని బాలు కంగారుగా ఇంట్లో నుండి వెళ్లిపోతాడు.

ఇలా రాజేష్ సహాయంతో మీనా ను వెతకడానికి బాలు వెళ్తాడు. తనకు తెలిసిన వారి ఇంటికి, పూల కొట్లలకు వెళ్లి.. మీనా గురించి ఆరా తీస్తాడు బాలు. కానీ, వారెవరు మీనాకు కనిపించలేదని, ఇటు రాలేదని, తమ వద్దకు రాలేదని బదిలిస్తారు. మీనా కోసం వెతికి వెతికి బాలు అలసిపోతాడు. ఇక దారిలో గుడి కనిపిస్తే.. అక్కడికి ఆగి.. ఇకపై మీనాను పల్లెతి ఒక్క మాట కూడా అనను. మీనా అంటే నా ప్రాణం.. అని దేవునికి మొక్కుకుంటూ బాధపడతాడు ఎలాగైనా మీనా ఇంటికి వచ్చేలా చూడమని ఆ దేవుని ప్రార్థిస్తాడు బాలు. ఈ సమయంలో మీ నాపై బాలుకి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది.

ఇదిలా ఉంటే.. ప్రభావతి తనకి ఏం పట్టనట్లుగా తాపీగా ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటుంది. సత్యం మాత్రం కంగారు కంగారుగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. 'ఎందుకలా తిరుగుతున్నారు .. వెళ్లి తినండి 'అని అంటుంది. దీంతో సత్యానికి ఎక్కలేని ఆగ్రహం వస్తుంది. ఇంట్లో కోడలు కనిపించడం లేదు కనీసం బాధ్యత లేదా అని ప్రశ్నిస్తాడు. 'అది ఇకపై ఇంటికి రాదూ.. బాలుపై కోపంతో ఇంట్లో నుండి వెళ్లిపోయింది' అంటూ వెటకారంగా ప్రభావతి బదిలిస్తుంది. బాలుని మీనా అసలు విడిచిపెట్టదని, వారికి ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమని, కారు ను కొనివ్వడానికి మీనా ఎంత ప్రయత్నించిందో మర్చిపోయావా.? అలాగే బాలు కూడా మీ నాకు స్కూటీని కొనివ్వడానికి ఎంతలా ప్రయత్నించాడో ఝ ఆ విషయాన్ని కూడా మర్చిపోయావా.. డేగ నుండి కోడి తన పిల్లలను కాపాడుకున్నట్లు.. వాడు నీ నుండి మీనాను అనుక్షణం రక్షిస్తూ ఉన్నాడని బదిస్తాడు. కనీసం మీనా కోసం.. ఎవరికైనా ఫోన్ చేసావని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు సత్యం. దీంతో ప్రభావతి మీనాక్షికి ఫోన్ చేస్తుంది. నేను అక్కడికి వచ్చిందా అని ప్రశ్నించేలోపే ఇంట్లో వాలిపోతుంది మీనాక్షి.

ఇక మీనాక్షి రావడంతో సత్యం, రవి అక్కనుండి వెళ్లిపోతారు. మీనాక్షి ఎంట్రీతో ప్రభావతి ఇంట్లో సీన్ మొత్తం మారిపోతుంది. అసలేం జరిగిందని ప్రభావతిని అడుగుతుంది. దీంతో జరిగిన విషయాన్ని పూసకొచ్చినట్లు ప్రభావతి చెబుతోంది. కథ విన్న మీనాక్షి.. అసలు నీకు నోరు ఆగదా? వాడు ఏదో అన్నాడు. నువ్వు దానికి వత్తాసు పలికాలా.. అత్త తిట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్లు.. నువ్వు అన్న మాటలు భరించలేక మీనా ఇంట్లో నుండి వెళ్లిపోయింది'అని మీనాక్షి గుండబద్దలు కొడుతుంది. ఆ మాటలు విన్న రోహిణి కంగారుపడుతుంది. 'మీ ముగ్గురికి ఉంటుంది.. మీ ముగ్గురు కలిసే కదా మీనాను ఎగతాళి చేసింది' అనగానే.. మీనాకు మేము ఏమైనా మొగుడ్ని వదిలేసి వెళ్లిపొమ్మని చెప్పామా ? 'అంటూ ప్రభావతి తనకేం తెలియనట్లు మాట్లాడుతుంది.

'అనవసరంగా అరవకు వెళ్లి గృహహింస చట్టం కింద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందేమో.. నువ్విలా అరుస్తుంది కోడల్ని ఆరళ్ళు పెడుతున్నావేమోనని అరెస్ట్ చేసి అవకాశం ఉంటుంది. మీ ముగ్గురిని తీసుకెళ్తారు. మీపై కచ్చితంగా కేసు పెట్టి ఉంటుంది' అంటూ మీనాక్షి భయపడుతుంది. తమకు ఎలాంటి సంబంధం లేదని రోహిణి మనోజ్ అక్కడి నుండి వెళ్లిపోతారు. 'చూసావా.. నీకు ఇలాంటి వాళ్లే నచ్చుతారు. పోలీస్ కేసు అనగానే వాళ్లకు ఏం తెలియనట్లు ఇకనుండి వెళ్ళిపోయారు ఇక నీకు జైలు శిక్ష తప్పదు.. సమాజంలో నీ పరువు మొత్తం పోతుంది. కోడల్ని హింసించావు అంటూ పేపర్లలో టీవీలలో వార్తలు వస్తాయి. అత్తగారి పోరు భరించలేక గృహిణి ఆత్మహత్య అంటూ పెద్ద పెద్ద స్టోరీలు నీ మీద వస్తాయి. ఇక సభ్య సమాజం నిన్ను వెలిస్తుంది నిన్ను రాళ్లతో కొడుతుంది నీ పరువు మొత్తం పోతుంది' అంటూ మీనాక్షి ప్రభావతికి తన ప్యూచర్ చూస్తుంది.

'నువ్వు అలాంటి మాటలు చెప్పి భయపెట్టకు .. అది కొమ్ములు తిరిగిన మగవాళ్ళని రాళ్లతో కొట్టి భయపెట్టించింది. అలాంటి పిరికి పనులు మీనా అసలు చేయదు..' అని ప్రభావతి తనకు తాను ధైర్యం చెప్పుకుంటుంది. 'మీనా ఆత్మహత్య చేసుకోపోతే బాగానే ఉంటుంది.. కానీ ఏదైనా చేసుకుంటే మాత్రం నీ ఫ్యూచర్ .. ఇకపై నీకు జైలు శిక్షనే. చర్లపల్లి జైలో.. ఖమ్మం జైలో..' అంటూ భయాందోళనలకు గురిచేస్తుంది. అంతటితో ఆగకుండా.. 'ఇంటిల్లో చాకిరీ చేసి, గంపడు మందికి వండిపెట్టి నీకు సపార్వాలు చేస్తున్న కోడల్ని నానా హింసలు పెట్టావు కదా.. ఒకవేళ మీనా ఏదైనా లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుండి వెళ్లిపోయిందా ? ఏమైనా సూసైడ్ గిట్ల చేసుకుందాం? అంటూ లేనిపోని అనుమానాలను మీనాక్షి వ్యక్తం చేస్తుంది. దీంతో ప్రభావతి మరింత కంగారు పడుతుంది.

వెంటనే వాళ్ళిద్దరూ కలిసి మీనా రూమ్ లో వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో శృతి, రోహిణి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి మీనా రూమ్ లోకి వెళ్తారు. వాళ్ళని చూడగానే మీనాక్షి కంగారుపడుతుంది. 'మీరేం చేస్తున్నారు' అని ప్రశ్నించగా.. మీనా ఏమైనా సూసైడ్ నోట్ రాసిపెట్టి ఉంటుందా అని అనుమానంతో రూమ్ వెతుకుతున్నామని, మీరు కూడా వెతకండని మీనాక్షి చెబుతుంది. దీంతో అందరూ ఏమైనా క్లూ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటారు ఈ సమయంలో శ్రుతికి ఒక లెటర్ కనిపిస్తుంది. ఇగో లెటర్ అనగానే... ప్రభావతి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అయితే ఆ ఉత్తరంలో ఏం రాసింది? నిజంగానే మీ నా ఆత్మహత్య చేసుకుందా? ఇంట్లో నుండి వెళ్లిపోయిందా? అనేది మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X