Gunde Ninda Gudi Gantalu October 16th Episode: మాలేషియా మేక మామ మిస్టరీ.. రోహిణి గుట్టు రట్టు చేయబోతున్న బాలు!

courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్‌లో మనోజ్ తన షాప్‌లో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కస్టమర్లు ఉన్నా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారనే కారణంగా వారిని మందలిస్తూ, ఇకపై అందరూ నీట్‌గా డ్రెస్సింగ్‌తో కనిపించాలి. సేల్స్ బాయ్స్ ప్రెజెంటేషన్ తప్పక ఉండాలని హెచ్చరిస్తాడు. తన స్టైల్లోనే "డైలీ డ్రెస్సింగ్ పాటించకుంటే సాలరీ నుండి కట్ చేస్తా" అని చెప్పడంతో సిబ్బందికి షాక్ కలుగుతుంది. రోహిణి షాప్‌లో ఉన్నప్పుడు, "బిజినెస్‌లో కస్టమర్ సర్వీస్ ముఖ్యం, డ్రెస్సింగ్ కాదు" అని హెచ్చరిస్తుంది. ఇంతలో విద్య షాప్‌కి చేరుతుంది. సరదాగా మనోజ్‌పై సెటైర్లు వేస్తూ, "నీ ఐడియాలు సాలిడ్ కానీ కస్టమర్లు తక్కువే" అని కామెంట్ చేస్తుంది. ఈ సరదా సంభాషణలో టాపిక్ సీరియస్ అవుతుంది. మనోజ్ బయటికి వెళ్తాడు. విద్య రోహిణికి దేవుడి పటాన్ని గిఫ్ట్ ఇస్తూ, "రోజూ పూజ చేస్తే ధనాకర్షణ వస్తుంది" అంటుంది. రోహిణి నవ్వుతూ, "ఇంట్లో పూజ నేను చేయను, మీనా మాత్రమే చేస్తుంది" అని స్పందిస్తుంది. విద్య సలహా ఇస్తూ, "మీనా రమ్మంటూ పూజ చేస్తుంది" అని చెబుతుంది. రోహిణి వెంటనే ఫోన్ చేసి పూలు తీసుకురమ్మంటుంది.

దారిలో మీనా "మటన్ మాణిక్యం"ను చూశాక అతని వెంటపడుతుంది, కానీ మాణిక్యం వేగంగా తప్పించుకుంటూ పారిపోతాడు. తర్వాత మాణిక్యం షాప్‌లో రోహిణి దగ్గరకు చేరుతుంది. విద్య అతడిని దాచిపెడుతుంది. పూజ సమయంలో మీనా పూలు సమర్పిస్తూ, "నేను మలేషియా మామయ్యను చూశాను" అని చెబుతుంది. రోహిణి వెంటనే విషయాన్ని మేనేజ్ చేస్తుంది. అంతలోనే బాలు, రాజేష్ బీరువా కొనేందుకు వస్తారు. వారు మాణిక్యాన్ని దాచిన బీరువాను ఎంచుకోవడంతో రోహిణి, విద్యలు కంగారుగా మారుతారు. బాలు కోపంతో షాప్‌లో హంగామా చేసి బయటకు వెళ్తాడు. చివరిగా విద్య తాళం తీసి బీరువా తెరిస్తుంది. ఉక్కిరిబిక్కిరి అయిన మాణిక్యం, రోహిణిని నిలదీస్తూ "అబద్ధాలతో కళాకారులను మోసగించడం కరెక్ట్ కాదు " అని హెచ్చరిస్తాడు. ఇక మీనా మాణిక్యం గురించి ఆలోచనల్లో మునిగిపోతుంది. ఇక గురువారం (అక్టోబర్ 16) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu October 16th Episode
courtesy: Jiohotstar

"గుండె నిండా గుడిగంటలు" సీరియల్‌లో మరోసారి ఉత్కంఠ భరితమైన మలుపు చోటుచేసుకుంది. మేక మామ మాణిక్యం చుట్టూ తిరుగుతున్న రహస్యాలు రోజురోజుకూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మీనా అనుమానంతో బాలుకు కూడా కొత్త సందేహాలు వ్యక్తం అవుతాయి. ఆ అనుమానాలు తీర్చే క్రమంలో రోహిణి మరో చిక్కులో పడుతుంది. "మేక మామ రాజమండ్రిలోనే ఉన్నాడు!" తన కళ్లతో మాణిక్యాన్ని చూసిన మీనా, వెంటనే ఆ విషయం బాలుకి చెబుతుంది. " మాలేషియా మామ దుబాయ్‌లో లేడు.. రాజమండ్రిలోనే తిరుగుతున్నాడు. నన్ను చూసి కావాలని పారిపోయాడు!" అంటూ మీనా చెబుతుంది. ఆమె మాటలు విన్న బాలు కూడా తన పాత అనుమానాలను బయటపెడుతూ "రోహిణి మొదటి రోజు నుంచే ఏదో దాచిపెడుతోంది. ఆ రోజే మేక మామను ఫుల్‌గా తాగించి నిజం బయటకు తీయాలనుకున్నా, కానీ వాడు తప్పించుకున్నాడు," అంటాడు. ఈ మాటలు రోహిణి చెవిలో పడుతాయి. వెంటనే "ఈ అనుమానాన్ని మరింత పొడగించాలి" అనే ఆలోచనతో కొత్త ప్లాన్ వేస్తుంది.

మరుసటి రోజు మలేషియా మామయ్యతో వీడియో కాల్ చేసి ప్రభావతి ఫ్యామిలీలో మాట్లాడుతాడు. "అండర్ గ్రౌండ్ నుండి అప్పర్ గ్రౌండ్ కి రావడానికి కొంత టైమ్ పట్టింది.. ఈ మధ్య బిజినెస్‌లో బిజీగా ఉన్నాను. కొనడం, కోయడం... స్మాల్ పీస్, బిగ్ పీస్..." అని అంటాడు మామయ్య. ఈ మాటలు విన్నవారందరూ షాక్ అవుతారు. వెంటనే రోహిణి సర్దుబాటు చేస్తూ, "మామయ్య ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు అందుకే కొనడం కోయడం అని అన్నాడు" అంటూ కవరింగ్ చేయడం మొదలుపెడుతుంది. కానీ రవి మాత్రం వదలడు "అయితే ఆయన ఏ బిజినెస్ చేస్తున్నారో నీకు ఎలా తెలుసు? ఇప్పుడే కదా తొలిసారి ఫోన్ చేసారు?" అని ప్రశ్నిస్తాడు.

దాంతో మాణిక్యం వెంటనే స్పందిస్తూ "మా పాపకి ముందే మెసేజ్ పెట్టాను బాబు" అంటాడు. కానీ రవి "మీ మీద కేసు ఉందని అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు కదా... ఇప్పుడు ఇలా అప్పర్ గ్రౌండ్ కి ఎలా వచ్చారు?"అని ప్రశ్నిస్తాడు. మాణిక్యం అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తూ "నా మీద వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకున్నాను. అందుకే మళ్ళీ బయటికొచ్చాను. ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉన్నాను" అని అంటాడు. దీంతో శృతి వ్యంగ్యంగా "అక్కడ అండర్ గ్రౌండ్ ఏమైనా ఉన్నాయా?" అని అడుగుతుంది. ఇంతలో బాలు ఇంట్లోకి వచ్చి అందరూ వీడియో కాల్‌లో ఉన్నారని గమనిస్తాడు. ప్రభావతి ఫోన్ తీసుకుని "మీరు నిజంగానే దుబాయ్‌లో ఉన్నారా?" అని ప్రశ్నిస్తుంది. "ఇది ఏమైనా గ్రాఫిక్స్ అనుకున్నారా? నిజంగానే దుబాయ్‌లోనే ఉన్నాను," అని మాణిక్యం సమాధానం ఇస్తాడు.

ఆ తరువాత " రోహిణి నాన్న ఎప్పుడు వస్తారు?" అని ప్రశ్నిస్తుంది. "నెల రోజుల్లో విడుదల కాబోతున్నారు" అంటాడు మాణిక్యం. ఆ తరువాత మనోజ్ మేక మామతో మాట్లాడుతాడు. "మీ బిజినెస్ మూడు ముక్కలు ఆరు ఎముకల సాగిపోవాలి..." అంటూ మేక భాషలో శుభాకాంక్షలు చెబుతాడు. పైగా మరో ఐదు లక్షలు పంపిస్తానని మామ చెబుతాడు. ఇది విని ప్రభావతి, మనోజ్ ఇద్దరూ ఆనందంతో గంతేస్తారు. మేక మామ అతి చూసి.. బాలుకి అనుమానం వస్తుంది. వెంటనే బాలు ఫోన్ తీసుకుని "ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు మేక మామ?" అని ప్రశ్నిస్తాడు. "నా బ్యాక్ గ్రౌండ్‌లో కనిపించడం లేదా?" అని మాణిక్యం అహంకారంగా బదులిస్తాడు. "మీ ఫ్రంట్ గ్రౌండ్‌లో మాత్రం పొట్ట మాత్రమే కనిపిస్తోంది" అంటూ బాలు జోక్ వేస్తాడు.

బాలు మరింత క్లారిటీ కోసం "ఏ సిటీ లో ఉన్నారు?" అని అడుగుతాడు. "సిటీ పేరు ఉర్దూలో ఉంటుంది, మీకు అర్థం కాదు" అంటూ మామ డొంక తిరుగుడు సమాధానం చెబుతాడు. "లైవ్ లొకేషన్ పంపండి" అని బాలు డిమాండ్ చేయగానే "ఇక్కడ సిగ్నల్స్ కరెక్ట్ లేవు" అంటూ కాల్ కట్ చేస్తాడు మాణిక్యం. మాణిక్యం మరో 5 లక్షలు పంపిస్తాను అని చెప్పాగానే ప్రభావతి ఆనందం ఆకాశాన్నంటుతుంది. " నీ అత్తగారు ఎప్పుడైనా నీకు డబ్బు పంపించారా? " అంటూ బాలుని తిట్టిపోస్తుంది ప్రభావతి. దాంతో బాలు రియాక్ట్ అవుతూ "నాకు గుళ్ల ముందు లేదా అత్తగారి ఇంటి ముందు అడుక్కొని అలవాటు లేదు. నా కాళ్ల మీద నేనేం నిలబడి సంపాదిస్తా" అని గర్వంగా చెబుతాడు. తండ్రి సత్యం కూడా వత్తాసు పలుకుతాడు. దీంతో ప్రభావతి ముఖం ఒక్కసారిగా మాడిపోతుంది.

మీనా తన రూమ్‌లోకి వెళ్లి "నేను తప్పుగా అర్థం చేసుకున్నా, వాడు దుబాయ్‌లో ఉంటే నేను రాజమండ్రిలో చూసానని అనుకోవడం పొరపాటే" అంటుంది. బాలు మాత్రం "నువ్వు పొరపాటు చేయలేదు మీనా! వాడు రాజమండ్రిలోనే ఉన్నాడు. ఇది ఫేక్ కాల్. ఈ రోజుల్లో ఇక్కడ ఉండి చంద్రునిపై ఉన్నట్టు చూపించడం చిన్న విషయం కాదు. లొకేషన్ అడగగానే కాల్ కట్ చేశాడు కదా! రోహిణి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎన్నో విషయాలు దాచిపెడుతోంది. త్వరలోనే ఆమె గుట్టు రట్టు చేస్తా!" అని బాలు ఛాలెంజ్ విసురుతాడు.

మరోవైపు రోహిణి, మనోజ్‌ను కన్ఫ్యూజ్ చేస్తుంది. 'మీ మామయ్య సడెన్ గా ఫోన్ చేశారేంటీ? ' అని ప్రశ్నించగా.. ఫోన్ చేస్తే తప్పేంటి?" అని రోహిణి రివర్స్ అడుగుతుంది. మనోజ్ మాత్రం అనుమానంతో "ఆయనకు మన బిజినెస్ విషయం ఎవరు చెప్పారు?" అని ప్రశ్నిస్తాడు. "నేనే చెప్పాను" అని ధైర్యంగా చెబుతుంది రోహిణి. ఐదు లక్షలు వస్తున్నాయని చెబుతున్నాడని చెప్పగానే, మనోజ్ మళ్లీ కలల లోకానికి వెళ్తాడు. "మలేషియాలో కూడా బిజినెస్ మొదలుపెడదాం" అని ఊహల్లో విహరిస్తాడు. దీంతో రోహిణి వ్యంగ్యంగా "ముందు షాప్ ఓపెన్ చేయడం నేర్చుకో... బిజినెస్ డ్రీమ్స్ ఆపుకో!" అని షాక్ ఇస్తుంది.

తర్వాత రోహిణి, విద్యను కలిసి ప్లాన్ సక్సెస్ అయిందని చెబుతుంది. "ఇక ఎవరికీ మాణిక్యం మీద డౌట్ రాదు," అంటుంది. అయితే మాణిక్యం మాత్రం "ఎంత మేత పెట్టి పెంచుకున్న మేకనైనా బిర్యానీ కోసం కొట్టాల్సిందే. ఒక అబద్ధం కవర్ చేయడానికి మరో అబద్ధం చెబితే ఎప్పటికో ఒక రోజు దొరికిపోతాం," అని హెచ్చరిస్తాడు. దీంతో విద్య "అది నిజమే రోహిణి. ఎన్ని రోజులు ఇలా దాచిపెడతావు?" అని అడుగుతుంది. రోహిణి "మనోజ్ నా కంట్రోల్‌లో పూర్తిగా వచ్చేవరకు ఇలా మేనేజ్ చేయాలి. తర్వాత పిల్లలు పుడితే ఇక నా మాటే చెల్లుతుంది" అని తన పథకం చెబుతుంది.

ఇదిలా ఉండగా మరోవైపు శృతి, రవిని వీడియో చూపించి "నన్ను కూడా ఎత్తుకొని తిప్పు" అంటుంది. రవి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. "నువ్వు నన్ను ప్రేమించడం లేదనుకుంటా!" అంటూ ఎమోషనల్ డైలాగ్ వేస్తుంది శృతి. దాంతో రవి కూడా ఎత్తుకొని హాల్లో తిప్పుతాడు. ఇంతలో బాలు, మీనా హాల్లోకి వచ్చి చూసి "కాలికి దెబ్బ తగిలిందా?" అని అడుగుతారు. "లేదు అన్నయ్య... ప్రేమ చూపించాలంటే ఇలా ఎత్తుకొని మూడు రౌండ్లు వేయాలి" అంటాడు రవి. "మూడు రౌండ్లు ఏంటి... నేనైతే 30 రౌండ్లు వేస్తా!" అంటూ బాలు మీనాను ఎత్తుకొని తిరుగుతాడు. ఇద్దరిని చూసి మనోజ్, రోహిణి కూడా అదే రీతిగా ఫాలో అవుతారు. ముగ్గురు అన్నదమ్ములు తమ భార్యలను ఎత్తుకొని హాల్లో తిరుగుతుండగా రొమాంటిక్ మూడ్ నెలకొంటుంది.

ఈ సన్నివేశం మధ్యలో ప్రభావతి, సత్యం ఇంటికి చేరుకుంటారు. "ఇది ఇల్లు అనుకున్నారా? బెడ్‌రూమ్ అనుకున్నారా? ఇలా చేయడానికి సిగ్గు లేదా?" అని ప్రభావతి మీనాపై మండిపడుతుంది. "మీ కంటికి నేనే ఒకదాన్ని కనిపిస్తున్నానా? మిగతా వాళ్లు కనిపించడం లేదా?" అని దిమ్మ తిరిగే సమాధానం ఇస్తుంది మీనా. ఈ సమాధానం విన్న ప్రభావతి ముఖం ఒక్కసారిగా మాడిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X