Gunde Ninda Gudi Gantalu October 23th Episode:రోహిణి నిజస్వరూపం బట్టబయలు.. బాలును కొట్టిన సత్యం..

courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్‌లో మీనా కనిపించకపోవడంతో బాలు తీవ్రంగా కంగారు పడతాడు. ఆమెను వెతుకుతూనే ఉంటాడు కానీ ఎక్కడా కనిపించదు. ఇదే సమయంలో మీనా దారిలో పూలను క్లూలుగా వేసుకుంటూ వెళ్తుంది. ఆ పూలను అనుసరించి బాలు వెతకడానికి బయలుదేరుతాడు. రోహిణిని కిడ్నాప్ చేయకుండా పొరపాటున ఎర్ర చీరలో ఉన్న మీనాను కిడ్నాప్ చేస్తారు. దినేష్ రూమ్‌లోకి వెళ్లినప్పుడు మీనా కనిపించడంతో షాక్ అవుతాడు. "నేను ఎవరిని తీసుకురమ్మంటే, మీరు ఎవరిని తెచ్చారు!" అని ఆగ్రహంతో గ్యాంగ్‌పై కేకలు వేస్తాడు. వారు "ఇది రోహిణి కాదు, బాలు భార్య మీనా" అని చెబుతారు. దాంతో దినేష్ "సరే, ఇలాగైనా బాలుపై పగ తీర్చుకోవచ్చు" అని ఫిక్స్ అవుతాడు. మీనా ధైర్యంగా "నా భర్త వస్తే నీ కాళ్లు విరగొడతాడు, నన్ను విడిచిపెట్టు" అని హెచ్చరిస్తుంది. కానీ దినేష్ "రానివ్వు చూద్దాం" అంటూ సవాలు విసురుతాడు.

ఇంతలో బాలు అక్కడికి చేరుతాడు. రౌడీలు చుట్టుముట్టినా బాలు ఒక్కడే వారిని చితకబాదుతాడు. చివరికి వెనుకనుంచి దెబ్బతిని స్పృహ కోల్పోతాడు. తన భర్త గాయపడటంతో మీనా ఆవేశంతో తాళ్లు తెంచుకుని గ్యాంగ్‌పై దాడి చేస్తుంది. అమ్మవారిలా మారిన మీనా రౌడీలను ఓడిస్తుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. పోలీసులు సమయానికి చేరుకుని దినేష్‌ను అదుపులోకి తీసుకుంటారు. బాలు నిజం చెబుతాడు "దినేష్ అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేస్తాడు" అని. ఇదంతా విని రోహిణి తీవ్రంగా కుంగిపోతుంది. "నా తప్పిదం వల్ల మీనా కిడ్నాప్ అయింది" అని బాధపడుతుంది. విద్య దగ్గరకు వెళ్లి తన బాగోతం బయటపడిందనీ టెన్షన్ పడుతుంది, ఈ క్రమంలో తన అత్త ప్రభావతి ఫోన్ కాల్స్‌తో రోహిణి టెన్షన్ మరింత పెరుగుతుంది. ఇక గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 538 October 23th 2025 here is full story

courtesy: Jiohotstar

ఎపిసోడ్‌ మొదట్లోనే రోహిణి మనసులో ఎక్కడలేని ఆందోళన మొదలవుతుంది. తన విషయం ఎక్కడో బయటపడిందేమోనని టెన్షన్ పడుతుంది. అంతేకాకుండా ప్రభావతి, మనోజ్‌కి వరుస ఫోన్లు చేయడంతో " తన విషయం అంతా తెలిసిపోయిందేమో" అనే భయం మరింత పెరుగుతుంది. అప్పుడు విద్య ఆమెకు ధైర్యం చెబుతూ, "ఏం జరిగినా నువ్వే ముందుగా చెప్పు, నిజం దాచడం కంటే ఎదుర్కోవడం మంచిది" అని సలహా ఇస్తుంది. దీంతో రోహిణికి ఇంటికి బయలు దేరుతుంది.

ఇదిలా ఉండగా ప్రభావతి ఇంట్లో దీపావళి పూజ ఏర్పాట్లు జరుగుతుంటాయి. కానీ మీనా కనిపించకపోవడంతో ప్రభావతి మూడ్‌ మారిపోతుంది. "బాలు, నీ భార్య ఎక్కడ? పని తప్పించుకోవడానికి ఎక్కడికో వెళ్లి ఉంటుందేమో" అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. తాను మాత్రం పూజను ఆపబోనని, "నా ఇద్దరు కోడళ్లతోనే పూజ చేస్తాను, ఎవరికి వేచిచూడను" అని గట్టిగా అంటుంది. ఇంతలోనే బాలు, మీనా ఇంటికి చేరుకుంటారు. "వదిన వచ్చేసింది కదా, పూజ మొదలుపెట్టు" అని రవి అంటాడు. ప్రభావతి మాత్రం రోహిణి కోసం వేయిట్ చేస్తుంది. రోహిణి ఎక్కడ అని మనోజ్ ను అడుగుతుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని మనోజ్‌ను సూటిగా చెబుతుంది. కొద్దిసేపు ఆగుదాం అని మాట మార్చుతుంది.

సత్యం "రోహిణి పెద్దింటి కోడలు కాబట్టి ఆగుతున్నావా?" అని ప్రశ్నిస్తాడు. దీంతో బాలు రెచ్చిపోతూ "అన్ని కోడళ్లు సమానమే, ఎవరికీ తక్కువ, ఎక్కువ లేనే లేదు" అని గట్టిగా చెబుతాడు. అంతలోనే రోహిణి టెన్షన్‌తో ఇంటికి చేరుతుంది. హాల్‌లో బాలు అందరితో మాట్లాడుతుండగా "నా విషయం చెప్పేశాడు అనుకుంటా" అని గుండె దడపడుతుంది.

"పార్లరమ్మ పనిచేయడానికి వెళ్లారా? ఇదేనా ఘనకార్యం చేశారా? " అని పరోక్షంగా విమర్శించడంతో రోహిణికి చెమటలు పట్టిపోతుంది. మనోజ్‌ మధ్యలోకి వచ్చి "నా భార్య లేట్‌ అయితే పంచాయతీ పెట్టాలా?" అని కౌంటర్‌ ఇస్తాడు. బాలు కూడా "అయితే నా భార్య లేట్‌ అయితే పంచాయతీ పెట్టాలా?" అంటూ ప్రభావతిని నిలదీస్తాడు. ఈ గొడవను సత్యం సర్దిస్తూ "పండగ పూట గొడవ వద్దు, వెళ్లి రెడీ అవ్వండి" అని చెప్పి సీన్‌ను కూల్‌ చేస్తాడు.

తన విషయం బయటపడిందా లేదా అన్న అనుమానం రోహిణిని వెంటాడుతుంది. బాలు-మీనా రూమ్‌లో మాట్లాడుతుండగా రోహిణి దొంగచాటుగా వింటుంది. బాలు "అసలు విషయం చెప్పేస్తాను" అనడంతో ఆమె గుండె ఆగిపోతుంది. "దినేష్‌ గాడు నన్ను కిడ్నాప్‌ చేశాడు అని చెప్తారా? లేక నేను వాడిని కొట్టి పోలీసులకు అప్పగించానని చెప్తారా?" అని మీనా అంటుంది. "అవసరంలేని విషయం ఇది, మర్చిపోండి" అని మీనా చెప్పడంతో రోహిణి ఊపిరి పీలుస్తుంది. తన రహస్యం సేఫ్‌ అని నమ్మకంతో నెమ్మదిగా రిలాక్స్‌ అవుతుంది.

ఇంట్లో పూజ ప్రారంభమవుతుంది. పెద్ద కోడలు రోహిణి తోనే దీపం వెలిగించి ప్రభావతి పూజ మొదలుపెడుతుంది. కానీ మీనాను పూజలో కూర్చోనివ్వకుండా నానా ప్రయత్నాలు చేస్తుంది. "నేనే అన్ని పనులు చేశాను, పూజకు కావలసిన వస్తువులన్నీ సిద్ధంగా ఉన్నాయి" అని మీనా చెప్పడంతో బాలు పరిస్థితి అర్థం చేసుకుంటాడు. "కావాలనే మీనాను పూజలో లేకుండా చేస్తున్నావా?" అని బాలు ప్రభావతిని నిలదీస్తాడు. దీంతో ప్రభావతి సైలెంట్‌ అవుతుంది. తర్వాత అందరూ కలిసి లక్ష్మీ పూజ చేస్తారు. ఈ సమయంలో సత్యం తన కూతురు మౌనిక లేదని బాధపడుతుంటాడు.

పూజల తర్వాత టపాసులు కాల్చుకుంటూ అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఆ సంతోషాన్ని చెదరగొట్టడానికి శృతి తల్లి శోభ ఇంటికి చేరుతుంది. అందరికి దీపావళి శుభాకాంక్షలు చెబుతూ "నా కూతుర్ని పిలవలేదు, అందుకే నేనే వచ్చాను" అంటుంది. ఇంట్లో సంతోషంగా ఉన్న వాతావరణం చూసి అసూయతో కుళ్ళిపోతుంది. "ఇంత ఇరుకైన ఇంటిలో ఎలా ఉంటున్నారు? బెడ్‌రూమ్‌ గొడవల వార్తలు విన్నా..." అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. సత్యం కోపంతో "ఇన్ఫర్మేషన్‌ బాగానే తీసుకున్నారు కదా" అంటాడు.

శోభ తన పొగరును ప్రదర్శిస్తూ, "ఆరోజు మా ఆయన లోన్‌ ఇచ్చారు కనుకనే ఈ ఇల్లు ఉంది, లేదంటే" అంటూ ప్రభావతి కుటుంబాన్ని అవమానపరుస్తుంది. ఇంతటితో ఆగకుండా "మీరు పై అంతస్తు కట్టాలనుకుంటున్నారని విన్నా, నా వంతుగా ఐదు లక్షలు ఇస్తున్నాను" అని చెక్కు ఇస్తుంది. ప్రభావతి ఆ చెక్కు తీసుకోవాలని ముందుకెళ్తుంది కానీ బాలు సత్యం ముఖం చూసి ఆగిపోతుంది. బాలు సీరియస్‌గా "ఏంటమ్మా ఆగిపోయావ్‌, తీసుకో చెక్కు, ఐదు లక్షలతో మంచి రూమ్‌ కడితే శృతి వాళ్ల అమ్మనాన్న ఇక్కడే సంతోషంగా ఉంటారు కదా" అంటాడు. అందరూ షాక్‌ అవుతారు.

శోభా "మేమెందుకు ఉంటాం ఇక్కడ?" అని అడుగుతుంటే బాలు వెటకారంగా "ఇప్పుడే కదా అత్తయ్య మీరు మనమంతా ఒకే ఫ్యామిలీ అన్నారుగా!" అని కౌంటర్‌ ఇస్తాడు. విషయం పెద్ద గొడవకు దారి తీసేలా మారుతుంది. బాలు సైలెంట్‌గా ఉండమని సత్యం అంటాడు. "మీ ఆయన లోన్‌ ఇవ్వలేదు. నేను వేరే బ్యాంకులో లోన్‌ అప్లై చేసుకున్నాను. సర్వీస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా రెండు నెలలు తిప్పించాడు. పై అధికారికి ఫోన్‌ చేశాకే ఇచ్చాడు" అని సత్యం నిజాన్ని బయటపెడతాడు. దీంతో శోభ ముఖం చిన్నబోతుంది. అందరూ షాక్‌లో పడతారు. ఇంట్లోని వాతావరణం మళ్ళీ టెన్షన్‌తో నిండిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X