Gunde Ninda Gudi Gantalu October 31th Episode: కవర్లు తారుమారు.. ప్రభావతి దొంగప్రేమ.. మీనా నగలు అమ్మిన మనోజ్..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్ లో ఆసక్తికర మలుపులు చోటుచేసుకున్నాయి. సొంత ఇంటి కల కోసం బాలు-మీనా దంపతులు రూపాయి రూపాయి పొదుపు చేస్తూ రాత్రింబవళ్ళూ కష్టపడతారు. కాళ్లు నొప్పిగా ఉన్నా విశ్రాంతి తీసుకోకుండా పని చేయాలని పట్టుదలగా ఉన్న బాలుకు, మీనా ప్రేమతో కాళ్లకు కాపడం పెడుతుంది. ఈ దృశ్యాన్ని గమనించిన ప్రభావతి, మొదట బాలు భార్య సేవలు చేయించుకుంటున్నాడని తప్పుడు అర్థం చేసుకుంటుంది.కానీ రవి వివరణతో భార్యాభర్తల మధ్య పరస్పర సహాయం సహజమని తెలుసుకుంటుంది. కానీ, ఆమెలోని ఈర్ష్య మాత్రం తగ్గదు.ఇంతలో సత్యం బాలు రూమ్‌కి వచ్చి ప్రేమతో తన కొడుకుకు విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తాడు. ఆ తరువాత ప్రభావతికి మూడు కోతుల బొమ్మలు గిఫ్ట్‌గా ఇస్తూ "చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు" అనే నీతి చెబుతాడు.
ఇదిలాఉంటే.. మనోజ్ వ్యాపారంలో నష్టపోయాడని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని ప్రభావతి షాక్ అవుతుంది.వ్యాపారంలో బ్లాక్‌మనీ స్కాంలో చిక్కుకుని నాలుగు లక్షలు పోగొట్టుకున్న మనోజ్, తన తల్లిని సహాయం చేయమని వేడుకుంటాడు. డబ్బులు ఇవ్వమని కాళ్లపై పడతాడు. మొదట ఆగ్రహించిన ప్రభావతి, చివరికి కుమారుడి కన్నీళ్లతో కరిగిపోతుంది. డబ్బు కోసం ఇంటి పత్రాలు అడిగిన మనోజ్‌కు నిరాకరించిన ప్రభావతి, చివరికి మీనా నగలు దొంగిలించాలనే ఆలోచనలో పడుతుంది. కొడుకువల్ల దొంగగా మారుతుంది. నగలు తీసుకుంటుండగా సత్యం గదిలోకి రావడంతో ప్రభావతి కంగారుపడుతుంది, కానీ సత్యం గమనించకపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది. ఒకవైపు బాలు-మీనా కలల ఇల్లు కోసం కష్టపడుతుండగా, మరోవైపు ప్రభావతి తన కుమారుడి తప్పిదం వల్ల కోడలి నగలను దొంగిలించాల్సిన పరిస్థితికి చేరుకుంటుంది. ఇక శుక్రవారం(అక్టోబర్ 31) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Courtesy: Jiohotstar
ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలో సత్యం రూమ్‌లోకి రాగానే ప్రభావతి ఒక్కసారిగా టెన్షన్‌కి గురవుతుంది. తాను నగల దొంగతనం విషయం బయటపడిందేమోనని ఆమె మనసులో భయం మొదలవుతుంది. కానీ సత్యం ఆ విషయాన్ని గమనించకపోవడంతో ఆమె ఊపిరి పీలుస్తుంది. చేతిలో ఉన్న కవర్‌ను చూసి "ఇది ఏంటి?" అని సత్యం ప్రశ్నిస్తాడు. దానికి ప్రభావతి తెలివిగా సమాధానమిస్తూ, "ఇది బ్లౌజ్ కుట్టించుకోవడానికి తీసుకెళ్తున్నాను. మనోజ్‌కి ఇవ్వబోతున్నాను" అని చెప్పేస్తుంది.అదంతా విన్న సత్యం సరదాగా "మనోజ్ బిజినెస్‌మెన్ కదా.. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తాడా?" అని అనగా ప్రభావతి తడబడి "దారిలోనే టైలర్ షాప్ ఉంది, అక్కడ ఇస్తాడంట" అంటూ అబద్ధంతో విషయం మార్చేస్తుంది. సత్యం ఏమీ అనకుండా బయటకు వెళ్లిపోతాడు.కానీ,కంగారు కంగారుగా బయటకు వస్తుంది.
ఇదే సమయంలో మార్కెట్ నుంచి మీనా ఇంటికి వస్తుంది. గుమ్మం ముందు బాలు తన కార్ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఆమెను గమనించి "ఇంత త్వరగా వచ్చావేంటి?" అని అడుగుతాడు. "మార్కెట్ దగ్గరనే కదా, అందుకే త్వరగా వెళ్లి త్వరగా వచ్చా. మీకోసం స్పెషల్ చేపలు తీసుకొచ్చా. వీటిని తింటే ఒళ్ళు నొప్పులు మాయం అవుతాయట" అని మీనా చెబుతుంది. అదంతా విన్న బాలు సరదాగా, "అన్నీ బాగానే ఉన్నాయి కానీ ముక్క పక్కన చుక్క ఉంటే బాగుంటుంది. అంటే మందు కూడా ఉంటే బాగుండేది" అని తన కోరికను చెబుతాడు. మీనా నవ్వుతూ "నాకు ఒకే . కానీ,మామయ్యను అడిగి చెబుతాను" అని ఆటపట్టిస్తుంది. బాలు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ, అదే సమయంలో అటుగా వస్తున్న ప్రభావతిని అనుకోకుండా డాష్ ఇస్తుంది మీనా.
ఈ డాష్‌తో కవర్లు తారుమారు అవుతాయి . నగల కవర్ మీనా దగ్గరికి పోతుంది, చేపల కవర్ ప్రభావతి చేతిలో పడుతుంది. ప్రభావతి ఆ విషయాన్ని గమనించకుండా చేపల కవర్ను మనోజ్‌కి ఇస్తూ "ఈ నగలను తాకట్టు పెట్టు.. కానీ అమ్మొద్దు. ఏమైనా తప్పు జరిగితే ఇంట్లో వాళ్ళందరూ కట్టేసి కొడతారు" అని హెచ్చరిస్తుంది. "సరే అమ్మా, జాగ్రత్తగా పెడతా" అని చెప్పి మనోజ్ వెళ్లిపోతాడు... కానీ అతనికి తెలీదు, తను పట్టుకున్నది నగల కవర్ కాదు చేపల కవర్ అని.
మనోజ్ మార్వాడీ జువెలరీ షాప్‌కి వెళ్ళగానే చేపల కవర్ వాసన మొదలవుతుంది. షాప్ ఓనర్ అసహనంగా "ఏది ఈ వాసన? షాప్ క్లీన్ చేయలేదా?" అని సిబ్బందిపై ఆగ్రహం చూపుతాడు. మనోజ్ కూడా అతిగా ప్రవర్తిస్తూ "ఇలా అయితే కస్టమర్లు రావరు" అని చెప్పేస్తాడు. ఆ సమయానికే ఓ కస్టమర్ " కంపు వాసన వస్తుంది" అంటూ షాప్ నుండి బయటకు వెళ్లిపోతాడు. తర్వాత మనోజ్ "నాకు నాలుగు లక్షలు కావాలి. బంగారం తాకట్టు పెట్టడానికి వచ్చాను" అంటాడు. "సరే, చూపించు బంగారం" అని ఓనర్ అడుగుతాడు. కవర్ విప్పి కింద వేస్తే... అవి చేపలు. ఓనర్ షాక్‌కి గురై "ఇంత వాసన నువ్వేనా! చేపలతో వచ్చి నా బిజినెస్ నాశనం చేశావు!" అంటూ గట్టిగా తిడతాడు. మనోజ్ చెమటోడ్చి, "కవర్లు తారుమారయ్యాయేమో.. " అని తలపట్టుకుంటాడు.
Gunde Ninda Gudi Gantalu October 27th Episode: కొత్త అవతారమెత్తిన బాలు.. అత్తను సవాలు చేసిన మీనా
అయితే.. ప్రభావతి వంటిల్లోకి వెళ్లగానే. అక్కడ ఓ కవర్ కనిపిస్తుంది. తన మనోజ్ కు ఇచ్చిన కవర్ ఈ కవర్ ఒక్కేటేనని గుర్తిస్తుంది. వెంటనే ఆ కవర్ ను ప్రభావతి తీసుకునీ, బయటకు వస్తుంది. ఎలాగైనా ఆ కవర్ ను మనోజ్ కు ఇవ్వాలని ఆలోచిస్తుంది. మరోవైపు మీనా వంట గదిలోకి రాగానే కవర్ కనిపించదు. దీంతో హాల్ లోకి వచ్చి.. "అత్తయ్య, చేపల కవర్ కనిపించడం లేదు. మీరు ఏమైనా తీసారా?" అని అడుగుతుంది. ప్రభావతి "నాకేం తెలియదు" అంటూ తప్పించుకోవాలని చూస్తుంది. ఆ సమయానికే సత్యం వచ్చి "ఏమైంది?" అని అడుగుతాడు. కవర్లు తారుమారయ్యాయని ప్రభావతి చెబుతుంది.
అప్పుడే ఇంటికి వచ్చిన బాలు "మీరు చెప్పిన టైలర్ షాప్ నాకు తెలుసు, కవర్ తీసుకెళ్లి ఇచ్చేస్తాను" అంటాడు. కానీ ప్రభావతి అంగీకరించదు. "మనోజ్ వస్తాడు, వాడికే ఇస్తాను" అని గట్టిగా చెబుతుంది. బాలు మాత్రం బలవంతంగా తన తల్లి నుంచి కవర్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు.
అప్పుడే మనోజ్ ఇంటికి చేరుకుంటాడు. "ఇదిగో మనోజ్ వచ్చాడు" అని ప్రభావతి కవర్ ను ఇస్తుంది. మనోజ్ చేపల కవర్ ను మీనాకు ఇస్తాడు.
మనోజ్ కవర్ తీసుకుని మళ్లీ నగల షాప్‌కి వెళ్తాడు. ఈసారి ఓనర్ వ్యంగ్యంగా "ఇప్పుడు చేపలే తెచ్చావా? లేక పీతలు?" అని ఆటపట్టిస్తాడు. దీంతో మనోజ్ చిర్రెత్తి "మీరు చూసేయండి, సార్. ఈసారి నిజమైన బంగారం తెచ్చా" అంటూ కవర్ను విప్పి కింద వేస్తాడు. కానీ ఈసారి నగల బదులు జాకెట్ పీసులు బయటపడతాయి. షాప్ ఓనర్ నవ్వుతూ "ఇది టైలర్ షాపా, లేక జువెలరీ షాపా?" అని అడుగుతాడు. మనోజ్ గందరగోళంలో పడిపోతాడు. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి మధ్యలో నగలు ఉంటాయి. ఊపిరి పీల్చుకుని వాటిని తీసి ఓనర్‌కి ఇస్తాడు.
జువెలర్ నగలను చూసి "ఇవి పాత మోడల్ నగలు,వీటికి రెండు లక్షలకే వస్తాయి" అని చెబుతాడు. మనోజ్ కంగారుపడి "సార్, నాకు నాలుగు లక్షలు కావాలి. నాకిప్పుడు డబ్బు అత్యవసరం" అని వేడుకుంటాడు. ఓనర్ చల్లగా "అమ్మితేనే ఇస్తాను, లేదంటే తీసుకెళ్లిపో" అని స్పష్టంగా చెబుతాడు. మనోజ్ అయోమయానికి గురవుతాడు. తల్లి మాట గుర్తుకొస్తుంది "తాకట్టు మాత్రమే పెట్టు, అమ్మొద్దు". కానీ, తన పరిస్థితిని చూసి "ఇప్పుడే డబ్బు కావాలి, అమ్మక తప్పదు" అని నిర్ణయం తీసుకుంటాడు. తన తల్లి నమ్మకాన్ని వమ్ము చేస్తూ నగలను అమ్మేస్తాడు మనోజ్.
ఇక ఇంట్లో మీనా వండిన చేపల కూర వాసనతో ఇంటి అంతా మురిసిపోతుంది. బాలు "ఇది కమ్మని వాసన కదా!" అంటూ తినడానికి రెడీ చేసుకుంటాడు. సత్యం కూడా తినడానికి సిద్ధమవుతాడు. కానీ ప్రభావతి మాత్రం టెన్షన్‌లో "మనోజ్ ఇంకా రాలేదు..." అంటూ బయట గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. కొద్ది సేపటికి మనోజ్ ఇంటికి వస్తాడు. చెమటలు కారుస్తూ, కంగారు పడుతూ. ప్రభావతి అతని ముఖాన్ని గమనించి ఏదో తేడా జరిగిందని అర్థం చేసుకుంటుంది. కానీ ఏమీ అడగలేకపోతుంది. మనోజ్ చేసిన తప్పు త్వరలోనే వెలుగులోకి వస్తుందన్న సూచనలతో ఎపిసోడ్ ముగుస్తుంది. వచ్చే ఎపిసోడ్‌లో మనోజ్ చేసిన పనికి ప్రభావతి ఎలా స్పందిస్తుందో, సత్యం ఆ విషయం తెలుసుకుంటాడా? బాలుకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.


Click it and Unblock the Notifications